forensic expert
-
ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి అదే కారణమా.. రైల్వే అధికారులు ఏం చెప్పారంటే!
సాక్షి,యాదాద్రి/బీబీనగర్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఎస్–4లో షార్ట్ సర్క్యూట్‌తోనే అగ్ని ప్రమాదం జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయపల్లి– పగిడిపల్లి మధ్యన శుక్రవారం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలుకు జరిగిన అగ్ని ప్రమాదంపై రైల్వే అధికారులు శనివారం ఉన్నత స్థాయి విచారణ చేపట్టారు. రైల్వే శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ విభాగం సిబ్బంది బోగీలకు కింది భాగంలో గల బ్యాటరీలను క్షుణంగా పరిశీలించారు. బ్యాటరీల ద్వారా షార్ట్‌సర్క్యూట్ తలెత్తివుండవచ్చని అనుమానిస్తున్నారు. సిగరెట్ తాగి ప్రయాణికులు ఎవరైనా టాయిలెట్లలో పడివేయడంతో అగ్గి రాజుకుందా అన్న కోణంలో విచారణ చేయగా అలాంటి ఆనవాళ్లు లేనట్లు అధికారులు ఒక స్పష్టతకు వచ్చారు. విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేశారు. 32విభాగాల అధికారుల విచారణ ఘటనపై 32 విభాగాలకు చెందిన రైల్వే, రాష్ట్ర పోలీస్ అధికారులు విచారణ ప్రారంభించారు. బీబీనగర్ రైల్వేస్టేషన్లో ఉంచిన కాలిపోయిన బోగీలను శనివారం సుమారు 50 మంది అధికారులు పరిశీలించారు. ఎస్–4 బోగీతో పాటు కాలిపోయిన అన్ని బోగీల బ్యాటరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. రిజర్వేçషన్ బోగీల్లో సెల్‌ఫోన్ చార్జింగ్ సాకెట్లలో ఏమైనా స్పార్క్ వచ్చిందా, లేక రైలు చక్రాల కింద నిప్పు రవ్వలు లేచి బోగీ అంటుకుందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కాగా, కాలిపోయిన బోగీల్లో అధికారులకు బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. అవి కాలిపోయి నల్లగా మారాయి. అలాగే లాప్టాప్, సెల్ఫోన్లు, సెల్‌ఫోన్ చార్జర్లు కాలిపోయి కన్పించాయి. -
ఫలక్‌నుమా ప్రమాదానికి కారణం అదే.. ఫోరెన్సిక్ నిపుణుల గుర్తింపు!
సాక్షి, హైదరాబాద్: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం ఉదయం మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు ఏడు బోగీలు దగ్ధమయ్యాయి. ఇక ప్రయాణికులంతా దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాద కారణాలపై సందేహాలు ఇంకా నివృత్తి కావాల్సి ఉంది. క్లూస్ టీం చెబుతున్నట్లు.. షార్ట్‌సర్క్యూటేనా, ప్రయాణికుల్లో ఎవరిదైనా నిర్లక్ష్యమా, కుట్రకోణం ఏమైనా ఉందా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాద ఘటనపై క్లూస్ టీం దర్యాప్తు ముగిసింది. ప్రమాదంపై క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కాలిపోయిన బోగీలను ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించింది. ఎస్-4 బోగోలోని బాత్రూమ్ వద్ద పొగలు వ్యాపించినట్టు నిర్ధారణ చేశారు. ఎస్-4 బోగీలోని మంటలు ఇతర బోగీలకు వ్యాపించినట్టు తెలిపారు. బోగీలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఫోరెన్సిక్ నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. క్లూస్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ‘మోదీజీ.. గవర్నర్ తమిళిసైకు ఆ విషయం చెబితే బాగుండేది’ -
ఏపీ ఫోరెన్సిక్ మాజీ డైరెక్టర్ మృతి
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ శివ కుమార్ రాజు (74) విజయవాడలోని డీవీ మేనర్ హోటల్లో శుక్రవారం రాత్రి మృతి చెందటం కలకలం సృష్టించింది. అయితే, ఆయనది సాధారణ మృతిగానే ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు పోలీసులు. హైదబాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న శివకుమార్.. ఓ కేసు విషయంలో ఇటీవలే విజయవాడకు వచ్చారు. శనివారం ఉదయం ఎన్నిసార్లు ఫోన్ చేసినా, బెల్ కొట్టినా రెస్పాన్స్ రాకపోవడంతో అనుమానించిన హోటల్ సిబ్బంది మరో తాళంచెవితో లోపలికివెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నారు శివకుమార్. హోటల్ సిబ్బంది అందించిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని క్లూస్ సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సాధారణ మృతిగానే ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి.. కేసుగా నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ.. 5 పెద్ద విమానాల టేకాఫ్ చేసేలా విస్తరణ -
వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..
తన ప్రేమను కాదందన్న అక్కసుతో మానవ మృగంలా మారిపోయి యువతిని దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. కత్తిలో నరికి అత్యంత దారుణంగా అమాయకురాలిని పొట్టన పెట్టుకున్నాడు. ఉన్మాదిలా మారి తమ కూతురి ప్రాణం బలిగొన్న రాక్షసుడిని ఉరి తీయాలని హతురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ క్రైం: ప్రేమోన్మాది గుబ్బల వెంకట సూర్యనారాయణ చేతిలో హతమైన కాదా దేవికపై జరిగిన దాడి అత్యంత పాశవికమైనదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. కాకినాడ జీజీహెచ్‌లో దేవిక మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి నివేదిక ప్రకారం.. దేవికను నిందితుడు కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో ఆమె ముఖం, మెడ భాగాల్లో లోతైన గాట్లు పడ్డాయి. సూర్యనారాయణ ఆమె కాలర్ బోన్లో కత్తి దింపి ఎడమ వైపునకు చీల్చేశాడు. రెండువైపులా నరకడంతో మెడలోని రక్తనాళాలు పూర్తిగా తెగిపోయాయి. దేవిక మరణానికి అదే కారణమని గుర్తించారు. విచక్షణారహితంగా కత్తితో పొడుస్తూండటంతో దేవిక రెండు చేతులూ అడ్డం పెట్టి రక్షించుకునే ప్రయత్నం చేసింది. అయితే అంతకు మించిన బలంతో అతడు కత్తితో పొడవడంతో దేవిక రెండు మోచేతుల పైభాగాల్లో లోతైన గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఎడమ చేతి ఎముకను సత్యనారాయణ నరికేశాడు. ఆమె రెండు భుజాలు శరీరం నుంచి వేరు పడ్డాయి. ఎడమ భుజానికి ఆధారమైన హ్యూమరస్ ఛిద్రమైంది. అక్కడి ఎముకలో సైతం కత్తి దిగింది. కత్తి నేరుగా మెడలో దించిన ఆనవాళ్లున్నాయి. దేవిక శరీరంలో మొత్తం 15 బలమైన గాయాలున్నట్టు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆ రాక్షసుడిని ఉరి తీయాలి చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం చేసుకుంటుందనుకుంటే ఇలా దారుణంగా హత్యకు గురవుతుందని ఊహించలేదని దేవిక కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తమ వద్దే పెరిగి, చదువుకుంటోందని, ఉద్యోగం వస్తే కళ్లలో పెట్టుకుని చూసుకుంటుందని అనుకుంటే దేవుడు అన్యాయం చేశాడంటూ దేవిక అమ్మమ్మ బోరున రోదించింది. అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటుందని హైదరాబాద్‌లో తాము నిశ్చింతగా ఉంటే కిరాతకుడి చేతిలో తమ కూతురు బలైపోయిందని దేవిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తెని హత్య చేసిన రాక్షసుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. (క్లిక్: ప్రేమోన్మాది ఘాతుకం.. పట్టపగలే నడిరోడ్డుపై కిరాతకం) దేవిక కుటుంబానికి ప్రభుత్వం అండ: మంత్రి చెల్లుబోయిన వేణు రామచంద్రపురం/కె.గంగవరం: ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన కాదా దేవిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడి ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కరప మండలం కూరాడలో హత్యకు గురైన కాదా దేవిక తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను మంత్రి వేణు కె.గంగవరంలో ఆదివారం సాయంత్రం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ఆటవికంగా హత్యకు పాల్పడిన హంతకుడిపై ప్రభుత్వం తర్వతగతిన విచారణ పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు ప్రస్తావించకూడదని, ప్రతి ఒక్కరూ ఇలాంటి దుశ్చర్యలను ఖండించాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, కె.గంగవరం మండల విప్ కొప్పిశెట్టి లక్ష్మణ్, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు నరాల ఏడుకొండలు, వైఎస్సార్సీపీ నాయకుడు పంపన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి..
హత్య కేసుల్లో నేరస్తులను కనిపెట్టడానికి ఫోరెన్సిక్ బృదం ఇచ్చే రిపోర్టు అత్యత కీలకమైనది. కొన్ని నేరాల్లో మృతదేహాలు పూర్తిగా పాడైపోయిన స్థితిలో దొరకడంతో బాధితుల తోపాటు నిందితులను కూడా గుర్తించడం కష్టమవుతోంది. అలాంటి సందర్భాల్లో కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా కేసును పరిష్కరించాలి అనే దిశగా ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఫోరెన్సిక్ బృదం ఒక సరికొత్త అధ్యయనానికి సిద్ధమైంది. అందుకోసం ఆస్ట్రేలియాలో ఒక ప్రదేశంలో సూట్‌కేసుల్లో దాదాపు 70 మృతదేహాలను కుళ్లిపోయేలా వదిలేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అవి డికంపోజ్ అవుతాయి. మరణించిన ఎన్ని రోజులకు శరీరం కుళ్లిపోతూ మార్పులు మొదలవుతుంది, అనేదాన్ని బట్టి ఎన్ని రోజలు ఇలా పడి ఉందని అనేది అంచనా వేయడం వంటివి కనుగొంటారు. అంతేగాక నేరస్తులు హత్య చేసి తాము దొరక్కుండా ఉండేందుకు మృతేదేహాన్ని దాచి ఉంచడం లేదా నాశనం చేసేందుకు వారి చేసే ప్రయోగాల్లో మృతదేహం స్థితిని అధ్యయనం చేయడం వంటివి చేస్తారు. పైగా హత్య చేసినప్పటి నుంచి తరలించే సమయంలో సెకండరీ క్రైమ్‌ని అంచన వేయగలుగుతారు. హత్య చేసిన తర్వాత నిందితులు ఏయే ప్రాంతాల్లో ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు వంటివి కూడా కనుగొంటారు. ఈ పరిశోధన నేరస్తుడిని ట్రేస్ చేసి మరింత సమాచారాన్ని అధికారులకు అందించేందుకు ఉపకరిస్తుంది. అందుకోసమే పరిశోధకులు సూట్‌కేసులలో వివిధ జంతువుల కళేభరాలను ఉంచి వాటిలో వస్తున్న మార్పులను అంచనా వేస్తున్నారు. నేర పరిశోధకులకు ఈ అతి పెద్ద ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు. MU’s resident bug whisperer @doc_magni has provided a fascinating look inside suitcases used to hide murder victims, and the role played by the insects trapped within. Read about her first-of-its kind experiment in @ConversationEDU ➡️ https://t.co/U93ZD7g1x4#forensics #CSI pic.twitter.com/dgAmeFElHe — Murdoch University (@MurdochUni) August 31, 2022 (చదవండి: ఫిరంగి పరిమాణంలో గుడ్లు... డైనోసార్లలో మరోజాతి) -
పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్నాడు!!
Prisoner declared dead doctors wakes up: వైద్యులు కొంతమందిని కచ్చితంగా చనిపోతాడు అని నిర్ధారించిన తర్వాత కూడా బ్రతికి బట్టకట్టగలిగిన వాళ్లను చూశాం. పైగా వైద్యులు ఇది మిరాకిల్ లేదా దేవుడు చేసిన అద్భుతం అని చెబుతుండటం గురించి విన్నాం. కానీ ఒక వ్యక్తి చనిపోయాడని నిర్ధారించుకుని పోస్ట్ మార్టం చేయాలని సమయాత్తమవుతుండగా ఆ వ్యక్తి మేల్కొంటే ఎవ్వరైనా భయపడిపోవడం సహజం. అచ్చం అలాంటి సంఘటనే స్పెయిన్‌లో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...స్పెయిన్‌లో విల్లాబోనాలోని అస్టురియాస్ సెంట్రల్ పెనిటెన్షియరీలో ఉన్న గొంజాలో మోంటోయా జిమెనెజ్ అనే ఖైదీ అనారోగ్యానికి గురైయ్యాడు. దీంతో అతనిని ఓవిడోలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెడిసిన్‌కు తరలించారు. అయితే ఆన్-డ్యూటీ వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుడు జిమెనెజ్ చనిపోయినట్లు ధృవీకరించారు. ఈ మేరకు ఖైదీ చనిపోయినట్లు ప్రకటించినప్పుడు వర్తించే ప్రామాణిక ప్రియాన్ విధానంలో భాగంగా అతని కుటుంబానికి తెలియజేశారు. అంతేకాదు అతని శరీరం సైనోసిస్ సంకేతాలను చూపించిందని, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చర్మం రంగు మారిందని వైద్యులు నివేదికలో పేర్కొనడం గమనార్హం. అయితే జిమెనెజ్ పోస్ట్‌మార్టం చేసేందుకు అతని శరీరంపై ప్రణాళిక బద్ధంగా నిర్వహించాల్సిన కోతల తాలుకా పెన్ గుర్తుల కూడా ఉన్నాయి. కానీ ఇంతలో జిమెనెజ్ వింతగా అరుస్తూ మేల్కొన్నాడు. దీంతో వైద్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. ఈ మేరకు ఆ వ్యక్తిని మరొక ఆస్ప్రతికి తరలించి తగిన వైద్యం అందించారు. ప్రసుత్తం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని స్పానిష్ జైలు అధికారులు తెలిపారు. (చదవండి: ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్ క్యూబ్!!) -
జోస్ అలుకాస్‌లో 30 కిలోల బంగారం, వజ్రాల నగలు చోరీ!
తిరువొత్తియూరు: వేలూరులో ప్రముఖ నగల దుకాణం గోడకు కన్నం వేసి రూ. కోట్లు విలువ చేసే బంగారం, వజ్రాల నగలను చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. వేలూరు జిల్లా వేలూరు తోటపాలెం ప్రాంతంలో జోస్ అలుకాస్ నగల దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి వ్యాపారం పూర్తయిన తరువాత ఉద్యోగులు దుకాణానికి తాళం వేసి వెళ్లారు. బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఉద్యోగులు దుకాణం తెరిచి లోపలకు వెళ్లగా.. ఆ సమయంలో రాక్లలోని నగలు అన్ని అదృశ్యమైనట్లు గుర్తించా రు. వేలూరు నార్త్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాగిలాలతో తనిఖీ చేపట్టి, సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు. చదవండి: ట్రావెల్ బస్సు చోరీకి యత్నం.. ఇలా దొరికిపోయాడు! -
60 ముక్కలుగా శరీరం, పరిశీలించేందుకు రెండు రోజులు
పురుషులు మాత్రమే పనిచేయగలరనే ఫోరెన్సిక్ విభాగంలో మహిళగా ఆమె రికార్డు సాధించింది. ఎంచుకున్న పనిని ఏళ్లుగా సమర్థంగా నిర్వర్తించడంతో పాటు అందమైన ప్రకృతిని తన కెమరా కన్నుతో పట్టేస్తోంది డాక్టర్ గీతారాణి గుప్తా. మధ్యప్రదేశ్ ఫోరెన్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏకైక మహిళగానే కాదు, 32 ఏళ్ల వైద్య వృత్తిలో 9,500 మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన రికార్డు కూడా డాక్టర్ గీతారాణి గుప్తా సొంతం. 63 ఏళ్ల వయసులోనూ భోపాల్‌లోని మెడికో లీగల్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్‌గా విధులను నిర్వహిస్తున్నారు. మగవాళ్లే చేయగలరు అనే విభాగంలో పనిచేయడంతో పాటు, రికార్డు సృష్టించిన గీతారాణి గుప్తా ఇన్నేళ్ల వైద్యవృత్తిలో తన అనుభవాలను ఆమె ఇటీవల పంచుకున్నారు. ఇప్పటికీ మధ్యప్రదేశ్‌లో ఫోరెన్సిక్ మెడిసిన్‌లో ఎం.డి చేసిన ఏకైక మహిళగా గీతారాణి పేరే ఉంటుంది. తను పుట్టి పెరిగిన వాతావరణం, ఎంచుకున్న మెడికల్ విభాగం, వృత్తి అనుభవాలతో పాటు, అభిరుచులనూ తెలియజేశారు. కళ్ల ముందు కదలాడే కథలు ‘‘ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనే అయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. అది అంత దారుణమైనది. 60 ముక్కలుగా కట్ అయి ఉన్న ఉన్న ఒక శరీరం పోస్ట్ మార్టం కోసం షాజాపూర్ నుండి వచ్చింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, బోర్‌వెల్‌లో వేశారు హంతకులు. పోలీసులు మృతదేహాన్ని, వెలికి తీసి తరలించడానికే మూడు రోజులు పట్టింది. దీన్ని పరీక్షించడానికి నాకు రెండు రోజులు పట్టింది. నాలుగేళ్ల క్రితం, మూడు నాలుగు ముక్కలు చేసిన పుర్రె, అస్థిపంజరం తీసుకొచ్చారు. ఇది పరీక్షించడం ఓ సవాల్ అయ్యింది. పుర్రెను పరీక్షించినప్పుడు, బుల్లెట్ పుర్రెలో చిక్కుకున్నట్లు కనుక్కున్నాను. అతని కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఎన్ని కేసులు... ప్రతీ రోజూ మృతదేహాల మీద పరీక్షలే. ఏకైక మహిళగా తొలి అడుగు మా నాన్నగారు ఉపాధ్యాయుడు. నేను కూడా మెడికల్ కాలేజీలో లెక్చరర్ కావాలనుకున్నాను. అంతే పట్టుదలగా చదివాను. ఫోరెన్సిక్ విభాగంలో లెక్చరర్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దానికి నా వయస్సు రెండు నెలల 8 రోజులు ఎక్కువ. లెక్చరర్‌గా వెళ్లకుండా ఈ విభాగంలో చేరిపోయాను. అలా ఫోరెన్సిక్ మెడిసి¯Œ లో ఎమ్‌డి చేసిన రాష్ట్రంలో తొలి మహిళా వైద్యురాలిని అయ్యాను. పీహెచ్‌డి చేయాలనుకున్నాను. కానీ, ప్రభుత్వ పనికి అంతరాయం కలిగించడం నాకిష్టం లేదు. అందుకే, ఎంచుకున్న వృత్తిలో అలాగే కొనసాగాను. మాటలు రాని క్షణాలు నా మొదటి రోజు ఉద్యోగంలో నేను గమనించిన విషయం.. నోరు, ముక్కుపై క్లాత్ అడ్డుపెట్టుకొని మృతదేహాన్ని చూడటానికి ఆ కుటుంబసభ్యులు వచ్చినప్పుడు మనిషి చనిపోయాక ఇక విలువ లేదని అర్ధం చేసుకున్నాను. ఆ క్షణంలో మాటలు రాకుండా అలాగే ఉండిపోయాను. మొదటిరోజే 20 మృతదేహాలను చూశాను. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేకపోయాను. కాని నా మనస్సుకు తెల్లవార్లు బలంగా ఉండాలంటూ నాకు నేను నచ్చజెప్పుకుంటూ గడిపాను. ఇది నాకు అంతర్గత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తరువాత ఇక నేను నా విధిని నిర్వర్తిస్తున్నాను అనే అనుకున్నాను. అలా ఆ ఏడాది 20 మృతదేహాలకు పోస్టుమార్టం చేశాను. ఎంపీ మెడికల్ లీగల్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆఫీసర్‌గా 1989లో ఎంపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపిపిఎస్సి) నుంచి ఎంపిక చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నా పని శవపరీక్ష. ఇదే కాకుండా మెడికో లీగల్ కేసుల పరిష్కారానికి కోర్టుకు హాజరు కావడం. ఖాళీ సమయంలో ఫోటోగ్రఫీ.. ఫోరెన్సిక్ విభాగంలో శవపరీక్ష ఛాయాచిత్రాలను తీయిస్తూ ఉండేవాళ్లం. ఆ ఫొటోలను పరిశీలించడానికి ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ రాకేశ్ జైమిని, ప్రశాంత్ సక్సేనా ఫోటోగ్రఫీని నేర్పించారు. అలా ఫొటోగ్రఫీ నా అభిరుచిగా మారిపోయింది. నేను ఒంటరిగా ఉంటాను. కానీ, నాకు నచ్చిన అన్ని పనులు చేస్తాను. మరో నచ్చిన పని లాంగ్ డ్రైవింగ్. నా దగ్గర కారు, ల్యాప్‌టాప్, కెమెరా ఉన్నాయి. జంతువులు, పక్షుల ఫోటోలు తీయడానికి సిటీ నుంచి అడవుల వరకు దూరంగా వెళ్లిపోతాను. ఎంపిక మనది అవ్వాలి.. నేను ప్రతి రంగంలో అమ్మాయిలు రాణిస్తున్నారు. పురుషు ఆధిపత్య సమాజంలో మహిళలు చోటు సంపాదిస్తున్నారు. అమ్మాయిలూ ధైర్యంగా ఉండండి. సవాళ్లను స్వీకరించి ముందుకు సాగండి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఈ ఎంపికను మీరే చేసుకోండి. ఏదో ఒక అభిరుచిని మీలో ఎప్పుడూ ఉంచుకోండి. అది మిమ్మల్ని నిరంతరం జీవించేలా చేస్తుంది’’ అని నవతరం అమ్మాయిలకు వివరిస్తారు డాక్టర్ గీతారాణి గుప్తా. -
లైంగికదాడి బాధితులకు సత్వర వైద్యం
సాక్షి, అమరావతి: లైంగికదాడికి గురైన బాధితులెవరైనా ఆస్పత్రికి వస్తే.. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సత్వరమే చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి అన్ని బోధనాస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితులు ఏ సమయంలో వెళ్లినా డాక్టర్లు అందుబాటులో లేరనే సమస్య ఉత్పన్నం కాకూడదని, 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండేలా ఆస్పత్రి సూపరింటెండెంట్ చూసుకోవాలని ఆదేశించారు. బోధనాస్పత్రులకు వచ్చే లైంగిక దాడుల బాధితుల వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని కూడా సూచించారు. సీఎం వైఎస్ జగన్ ఇలాంటి బాధితుల కోసం తాజాగా ‘దిశ’ చట్టం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. బాధితులు వైద్యపరీక్షల కోసం ఆస్పత్రులకు వస్తే వారికి ఇబ్బంది కలగకుండా తక్షణమే వైద్యపరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లుగానీ, పోలీసు కేసులతో సంబంధం లేకుండా బాధితురాలు ఆస్పత్రికి వచ్చిన వెంటనే గైనకాలజిస్టు్టతోపాటు, ఫోరెన్సిక్ నిపుణులు అందుబాటులో ఉండి, నమూనాలు సేకరించి, ఆ నివేదికను పోలీసులకు అందజేస్తారు. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఇలాంటి బాధితుల కోసం బోధనాస్పత్రిలో ప్రసూతి వార్డుకు అనుబంధంగా ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, అవసరమైతే ఇన్‌పేషెంటుగా చేర్చి వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకుంటారు. ఒక మానసిక వైద్య నిపుణుడు, న్యాయనిపుణుడు కూడా అందుబాటులో ఉండి, వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు. బాధితురాలి నుంచి సేకరించిన రక్తనమూనాలను పరీక్షించి 6 గంటల్లోగా నివేదిక ఇస్తారు. వైద్యపరీక్షల్లో అంతరాయం ఉండదు బాధితురాలు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చిందంటే పోలీసు కేసులు, ఎఫ్ఐఆర్ లాంటివేవీ అడగకూడదు. వచ్చిన వెంటనే వారి స్టేట్మెంట్ తీసుకుని వైద్యపరీక్షలు నిర్వహించి ఆ నివేదికను పోలీసులకు ఇవ్వాలి. అదే రోజు ఫోరెన్సిక్ రిపోర్టు రాదు కాబట్టి పెండింగ్ ఎఫ్ఎస్ఎల్ అన్నే పేరుతో డాక్టరు నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేస్తారు. ప్రతి బోధనాస్పత్రిలో దీనికోసం ప్రత్యేక భవనాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే నెల్లూరులో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాం. – డా.కె.వెంకటేష్, వైద్య విద్యాసంచాలకులు -
ఆడపిల్ల అని చంపేశారు
రాయపర్తి: రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని గొంతులో వడ్ల గింజ వేసి రెండ్రోజుల పసిగుడ్డును చంపేశారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కేశవాపురం శివారు ఎర్రకుంట తండాలో మం గళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. తండాకు చెందిన భూక్యా సాలమ్మ, లచ్చు నాయక్‌కు నలుగురు కుమార్తెలు, కుమారుడు తిరుపతి ఉన్నారు. తిరుపతికి మమతతో వివాహం జరిపించారు. వీరికి గత ఏడాది ఆడపిల్ల పుట్టింది. ఈ నెల 4న రెండో కాన్పులోనూ మమత మళ్లీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీకూతుళ్లు క్షేమంగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. అయితే.. మళ్లీ ఆడపిల్ల పుట్టిందని అక్కసుతో భూక్యా సాలమ్మ, లచ్చునాయక్లు ఈ నెల 7వ తేదీన పాప గొంతులో వడ్ల గింజ వేసి చంపారు. ఎవరికీ తెలియకుండా తమ పొలంలో మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే.. అసలు విషయం బయటకు పొక్కడంతో బాలల సంరక్షణాధికారి మహేందర్ రెడ్డి ఆధ్వర్యాన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించి అవశేషాలను ల్యాబ్‌కు తరలించారు. -
రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం
సాక్షి, గురజాల: పురిటినొప్పులతో బాధపడుతూ రెండేళ్ల కిందట గురజాలలోని శ్రీకాంత్ నర్సింగ్ హోంలో తల్లీబిడ్డ మృతి చెందారు. మృతురాలి తల్లిదండ్రులు తమ బిడ్డకు అప్పట్లో సరైన వైద్యం అందించడంలో డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని... అందువల్లే తల్లీబిడ్డ మృతి చెందారని ఇటీవల రాష్ట్ర మానవహక్కుల కమిషన్, ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు పోలీసు, ఇతర ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేశారు. మాడుగుల గ్రామానికి చెందిన గనిపల్లి శ్యామ్ రెండో కుమార్తె మాచర్ల శిరీషా రెండోసారి గర్భం దాల్చడంతో 2017 మే నెల 26వ తేదీన గురజాల శ్రీకాంత్ నర్సింగ్ హోంలో చేర్పించారు. వైద్యం చేసే క్రమంలో తల్లీ బిడ్డ మృతి చెందారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబసభ్యులు మృతదేహాలను మాడుగుల శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. అప్పట్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం 10 రోజుల నుంచి మృతురాలి కుటుంబీకులు మాచర్ల శిరీషా, ఆమెకు పుట్టిన బిడ్డ మరణంపై అనుమానం ఉందని ఫిర్యాదులు చేశారు. దీంతో సీఐ ఓ.దుర్గాప్రసాద్, తహసీల్దార్ షేక్ గౌస్‌బుడేసాహేబ్ సమక్షంలో బుధవారం గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ రమేష్‌బాబు, డాక్టర్ శివకామేశ్వరావు తల్లీబిడ్డ ఖననం చేసిన చోటు తవ్వకాలు చేపట్టి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం వివరాలను నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలకృష్ణ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, మృతురాలి బంధువులు పాల్గొన్నారు. -
శవాలతో సావాసం!
ట్రావెలింగ్‌ను బాగా ఇష్టపడే అమలాపాల్ ఇటీవల హాస్పిటల్స్ చుట్టూ తెగ తిరుగుతున్నారు. ముఖ్యంగా హాస్పిటల్లో ఆమె ఎక్కడికి వెళుతున్నారంటే? శవాలను భద్రపరిచే మార్చురీలోకి అట. ఇదంతా ఆమె కథానాయికగా నటిస్తున్న నెక్ట్స్ తమిళం చిత్రం ‘కడవేర్’ కోసమే. ఈ సినిమాలో ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ పాత్రలో నటిస్తున్నారు అమలపాల్. పాత్ర ప్రిపరేషన్లో భాగంగానే ఆమె హాస్పిటల్స్‌కి వెళ్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంతో అనూప్ ఫణిక్కర్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇంకా స్పెషల్ ఏంటంటే.. ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు అమలాపాల్. సోమవారం షూటింగ్ ఆరంభమైంది. కేరళ పోలీస్‌శాఖకు చెందిన ఫోరెన్సిక్ సర్జన్ బి. ఉమాదతాన్ నిజజీవితంలో ఎదురైన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది. ‘‘ఈ సినిమాలో పాథాలజిస్ట్‌గా నటిస్తున్నాను. మర్డర్‌మిస్టరీ నేపథ్యంలో ఉంటుంది. నేనింతవరకు ఇలాంటి పాత్ర చేయలేదు. చాలెంజింగ్‌గా అనిపిస్తోంది. చాలా రీసెర్చ్ చేస్తున్నాను. ఇంటర్నెట్లో బాగా వెతికాను. ఉమాదతాన్తో కూడా మాట్లాడాను’’ అని అన్నారు. అంటే ఈ పాత్ర కోసం అమలా పాల్ శవాలతో సావాసం చేస్తున్నారన్నమాట. ఇక నిర్మాతగా మారడం గురించి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ నా దగ్గరకు 4 ఏళ్ల క్రితం వచ్చింది. అనూప్ అండ్ టీమ్ గత మూడేళ్లుగా వర్క్ చేస్తున్నారు. డిఫరెంట్‌గా ఉండే ఇలాంటి సినిమాలను నిర్మించాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలో నేను సంపాదించినదాన్ని ఇండస్ట్రీలోనే పెడుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చారు అమలాపాల్. -
సాధారణ రసాయనాలతోనే భారీ విధ్వంసం
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధం ఆర్డీఎక్స్ను ఉగ్రమూకలు వాడలేదని భావిస్తున్నారు. ఈ దాడిలో ఆర్డీఎక్స్‌కు బదులు ఎరువుల తయారీకి ఉపయోగించే సాధారణ రసాయనాలను ఉపయోగించి భారీ పేలుడుకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని చెబుతున్నారు. ఘటనా స్ధలం నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరిశీలించిన మీదట ఎన్ఐఏ, ఎన్‌ఎస్‌జీలకు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు పేలుడుకు వాడిన రసాయనాలపై వివరిస్తూ ఉగ్రవాదులు ఈ భీకర దాడిలో ఆర్డీఎక్స్ వాడలేదని చెప్పుకొచ్చారు. భారీ పేలుడు కోసం ఎరువుల తయారీకి ఉపయోగించే రసాయనాలతో పాటు ఇనుప ముక్కలు, ఇతర పదార్ధాలను కలిపి ధ్వంస రచన సాగించారని ప్రాధమిక ఆధారాలతో వెల్లడవుతోందని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్డీఎక్స్ వంటి అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధం వాడకుండా ఇంతటి భీకర దాడికి ఉగ్రమూకలు పాల్పడటం విస్తుగొలుపుతోంది. భద్రతా దళాల కన్నుగప్పి స్ధానిక మార్కెట్లో సులభంగా లభించే రసాయనాలతోనే భారీ పేలుడుకు అవసరమైన పరికరాన్ని ఉగ్రవాదులు రూపొందించారని నిపుణులు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి తెగబడిన జైషే ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్ మృతదేహాన్ని నిశితంగా పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు ఈ అంచనాకు వచ్చారు.పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. -
నటి ఆత్మహత్య కేసులో సంచలన మలుపు
-
నటి ఆత్మహత్య కేసులో సంచలన మలుపు
ముంబై: బాలీవుడ్ నటి జియా ఖాన్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లూ జియా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే డిఫెన్స్ వాదనను అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ నిపుణులు తప్పుపట్టారు. జియాది ఆత్మహత్యకాదు.. హత్యే అయి ఉండొచ్చని లండన్ కు చెందిన జేసన్ పేన్ జేమ్స్ ఫోరెన్సిక్ సంస్థ వాదిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ రూపొందించిన రిపోర్టును జియా తల్లి రబియా అమిన్ బుధవారం ముంబై హైకోర్టులో దాఖలు చేయనున్నారు. దీంతో దాదాపు విచారణ పూర్తికావచ్చిన కేసుపై మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ఫోరెన్సిక్ రిపోర్టులో ఏముందంటే.. జియా ఖాన్ కింది పెదవిపై బలమైన గాయం ఉంది. ఉరివేసుకున్నాక ఊపిరి ఆడని స్థితిలో ఆమే తన పెదవిని కొరుక్కొని ఉంటుందని ముంబై పోలీసులు కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ రిపోర్టులో పేర్కొన్నారు. కానీ నిజానికి ఆ గాయం బలమైన వస్తువు లేదా బలంగా ఒత్తడం వల్లే అయిందని పేన్ జేబ్స్ అంటోంది. అంతేకాదు.. జియా ఖాన్ మెడపై, కింది దవడల వద్ద కనిపించిన మచ్చలు.. చున్నీ ఒత్తిడ వల్ల ఏర్పడినవి కావని పేర్కొంది. అసలేం జరిగింది? అరంగేట్రంలోనే 'నిషబ్ద్'లో అమితాబ్ బచ్చన్‌తో కలిసి రొమాన్స్ పండించి, అనతికాలంలోనే క్రేజీ స్టార్ గా ఎదిగిన జియా ఖాన్.. 2013, జూన్ లో ముంబై జుహులోని తన అపార్ట్ మెంట్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించారు.ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలీవుడ్ వెటరన్ నటుడు ఆదిత్యా పాంచోలి తనయుడు సూరజ్ పాంచోలి- జియాల మధ్య పీకల్లోతు ప్రేమాయణం నడిచింది. ఇద్దరూ గొడవ పడిన సందర్భంలో సూరజ్.. జియాను చంపేశాడనే ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. కేసు తీవ్రత దృష్ట్యా బాంబే హైకోర్టు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఒక దశలో సూరజ్ పాంచోలీని అరెస్ట్ చేసి విచారించారు. ప్రస్తుతం బెయిల్ పై ఉంటోన్న సూరజ్ పలు సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇంకా విచారణ పూర్తికాని ఈ కేసులో జియా తల్లి బుధవారం దాఖలుచేయనున్న తాజా పిటిషన్ ఎలాంటి మలుపులకు దారితీస్తుందో చూడాలి.