హత్య కేసుల్లో నేరస్తులను కనిపెట్టడానికి ఫోరెన్సిక్ బృదం ఇచ్చే రిపోర్టు అత్యత కీలకమైనది. కొన్ని నేరాల్లో మృతదేహాలు పూర్తిగా పాడైపోయిన స్థితిలో దొరకడంతో బాధితుల తోపాటు నిందితులను కూడా గుర్తించడం కష్టమవుతోంది. అలాంటి సందర్భాల్లో కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా కేసును పరిష్కరించాలి అనే దిశగా ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఫోరెన్సిక్ బృదం ఒక సరికొత్త అధ్యయనానికి సిద్ధమైంది.
అందుకోసం ఆస్ట్రేలియాలో ఒక ప్రదేశంలో సూట్‌కేసుల్లో దాదాపు 70 మృతదేహాలను కుళ్లిపోయేలా వదిలేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అవి డికంపోజ్ అవుతాయి. మరణించిన ఎన్ని రోజులకు శరీరం కుళ్లిపోతూ మార్పులు మొదలవుతుంది, అనేదాన్ని బట్టి ఎన్ని రోజలు ఇలా పడి ఉందని అనేది అంచనా వేయడం వంటివి కనుగొంటారు.
అంతేగాక నేరస్తులు హత్య చేసి తాము దొరక్కుండా ఉండేందుకు మృతేదేహాన్ని దాచి ఉంచడం లేదా నాశనం చేసేందుకు వారి చేసే ప్రయోగాల్లో మృతదేహం స్థితిని అధ్యయనం చేయడం వంటివి చేస్తారు. పైగా హత్య చేసినప్పటి నుంచి తరలించే సమయంలో సెకండరీ క్రైమ్‌ని అంచన వేయగలుగుతారు. హత్య చేసిన తర్వాత నిందితులు ఏయే ప్రాంతాల్లో ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు వంటివి కూడా కనుగొంటారు.
ఈ పరిశోధన నేరస్తుడిని ట్రేస్ చేసి మరింత సమాచారాన్ని అధికారులకు అందించేందుకు ఉపకరిస్తుంది. అందుకోసమే పరిశోధకులు సూట్‌కేసులలో వివిధ జంతువుల కళేభరాలను ఉంచి వాటిలో వస్తున్న మార్పులను అంచనా వేస్తున్నారు. నేర పరిశోధకులకు ఈ అతి పెద్ద ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు.
MU’s resident bug whisperer @doc_magni has provided a fascinating look inside suitcases used to hide murder victims, and the role played by the insects trapped within.
— Murdoch University (@MurdochUni) August 31, 2022
Read about her first-of-its kind experiment in @ConversationEDU ➡️ https://t.co/U93ZD7g1x4#forensics #CSI pic.twitter.com/dgAmeFElHe
Comments
Please login to add a commentAdd a comment