
కఠిన చట్టం తీసుకొచ్చిన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం
క్వీన్స్‌ల్యాండ్: హత్య, తీవ్ర దాడి, దోపిడీల వంటి 13 నేరాలకు పాల్పడినట్లు రుజువైతే 10 ఏళ్ల బాలలకు సైతం పెద్దలకు మాదిరిగానే శిక్షలు వేసేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రం చట్టం చేసింది. హత్య నేరానికైతే కనీసం 20 ఏళ్లు ఎటువంటి పెరోల్ లేకుండా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముంది. గతంలో ఇది గరిష్టంగా పదేళ్లే ఉండేది. క్వీన్స్‌ల్యాండ్‌లో గత 14 ఏళ్లలో పిల్లల నేరాలు సగానికి సగం తగ్గినట్లు గణాంకాలు చెబుతు న్నాయి.
2022 నుంచి నేరాల రేటు స్థిరంగా కొనసా గుతోంది. అయితే, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్వీన్స్‌ల్యాండ్ జైళ్లలోనే ఎక్కువ మంది పిల్లలుండటం గమనార్హం. పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతుండటంపై ప్రజాగ్రహం వ్యక్తమవు తున్నందు వల్లే చట్టాలను కఠినతరం చేశామని, దీనివల్ల నేరాలు తగ్గుతాయని ఆశిస్తు న్నామని ప్రభుత్వం అంటోంది. అయితే, నేరాలు తగ్గడం అంటుంచి పెరిగే ప్రమాదముందని నిపుణు లు ఆందోళన చెందుతున్నారు. ఇది చిన్నారుల మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలకు భంగకరమని ఐరాస పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment