ten years child
-
పెద్దల మాదిరిగానే పదేళ్ల పిల్లలకూ జైలు శిక్షలు
క్వీన్స్‌ల్యాండ్: హత్య, తీవ్ర దాడి, దోపిడీల వంటి 13 నేరాలకు పాల్పడినట్లు రుజువైతే 10 ఏళ్ల బాలలకు సైతం పెద్దలకు మాదిరిగానే శిక్షలు వేసేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రం చట్టం చేసింది. హత్య నేరానికైతే కనీసం 20 ఏళ్లు ఎటువంటి పెరోల్ లేకుండా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముంది. గతంలో ఇది గరిష్టంగా పదేళ్లే ఉండేది. క్వీన్స్‌ల్యాండ్‌లో గత 14 ఏళ్లలో పిల్లల నేరాలు సగానికి సగం తగ్గినట్లు గణాంకాలు చెబుతు న్నాయి. 2022 నుంచి నేరాల రేటు స్థిరంగా కొనసా గుతోంది. అయితే, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్వీన్స్‌ల్యాండ్ జైళ్లలోనే ఎక్కువ మంది పిల్లలుండటం గమనార్హం. పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతుండటంపై ప్రజాగ్రహం వ్యక్తమవు తున్నందు వల్లే చట్టాలను కఠినతరం చేశామని, దీనివల్ల నేరాలు తగ్గుతాయని ఆశిస్తు న్నామని ప్రభుత్వం అంటోంది. అయితే, నేరాలు తగ్గడం అంటుంచి పెరిగే ప్రమాదముందని నిపుణు లు ఆందోళన చెందుతున్నారు. ఇది చిన్నారుల మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలకు భంగకరమని ఐరాస పేర్కొంది. -
జీరో యాంగిల్ నుంచి గోల్ కోట్టిన పదేళ్ల బాలుడు
-
గుండెపోటుతో పదేళ్ల బాలుడి మృతి
బంజారాహిల్స్: గుండెపోటుతో పదేళ్ల బాలుడు మృతి చెందాడు. యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో ఉండే రాజయ్య పాత ఇనుము, ప్లాస్టిక్ సామా న్లు, పేపర్ల దుకాణం నడిపించుకుంటూ జీవిస్తున్నాడు. ఆయన కొడుకు దేవీ శైలేష్ (10) చీకటి మామిడి గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఈ నెల 11న హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. 2 రోజులుగా తనకు గుండెనొప్పి వస్తోందని ఏడవసాగాడు. ఆదివారం నొప్పి విపరీతంగా రావడంతో ప్రైవే ట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూనే గుండెపోటుతో శైలేష్ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు. -
రాజధాని నిర్మాణం కోసం.. స్కేటింగ్ చేస్తున్న పదేళ్ల చిన్నారి
ప్రకాశం (ఒంగోలు): ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం స్కేటింగ్ చేస్తూ నిధులు సేకరిస్తుందో ఓ చిన్నారి. అందులో భాగంగా తిరుపతి నుంచి బయలుదేరిన చిన్నారి అకుల ఏషా(10) గురువారం ఒంగోలు పట్టణానికి చేరుకుంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.