బంజారాహిల్స్: గుండెపోటుతో పదేళ్ల బాలుడు మృతి చెందాడు. యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో ఉండే రాజయ్య పాత ఇనుము, ప్లాస్టిక్ సామా న్లు, పేపర్ల దుకాణం నడిపించుకుంటూ జీవిస్తున్నాడు. ఆయన కొడుకు దేవీ శైలేష్ (10) చీకటి మామిడి గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు ఈ నెల 11న హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. 2 రోజులుగా తనకు గుండెనొప్పి వస్తోందని ఏడవసాగాడు. ఆదివారం నొప్పి విపరీతంగా రావడంతో ప్రైవే ట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూనే గుండెపోటుతో శైలేష్ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment