punishments
-
పెద్దల మాదిరిగానే పదేళ్ల పిల్లలకూ జైలు శిక్షలు
క్వీన్స్‌ల్యాండ్: హత్య, తీవ్ర దాడి, దోపిడీల వంటి 13 నేరాలకు పాల్పడినట్లు రుజువైతే 10 ఏళ్ల బాలలకు సైతం పెద్దలకు మాదిరిగానే శిక్షలు వేసేందుకు ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రం చట్టం చేసింది. హత్య నేరానికైతే కనీసం 20 ఏళ్లు ఎటువంటి పెరోల్ లేకుండా జీవితకాల జైలు శిక్ష పడే అవకాశముంది. గతంలో ఇది గరిష్టంగా పదేళ్లే ఉండేది. క్వీన్స్‌ల్యాండ్‌లో గత 14 ఏళ్లలో పిల్లల నేరాలు సగానికి సగం తగ్గినట్లు గణాంకాలు చెబుతు న్నాయి. 2022 నుంచి నేరాల రేటు స్థిరంగా కొనసా గుతోంది. అయితే, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్వీన్స్‌ల్యాండ్ జైళ్లలోనే ఎక్కువ మంది పిల్లలుండటం గమనార్హం. పిల్లలు కూడా నేరాలకు పాల్పడుతుండటంపై ప్రజాగ్రహం వ్యక్తమవు తున్నందు వల్లే చట్టాలను కఠినతరం చేశామని, దీనివల్ల నేరాలు తగ్గుతాయని ఆశిస్తు న్నామని ప్రభుత్వం అంటోంది. అయితే, నేరాలు తగ్గడం అంటుంచి పెరిగే ప్రమాదముందని నిపుణు లు ఆందోళన చెందుతున్నారు. ఇది చిన్నారుల మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలకు భంగకరమని ఐరాస పేర్కొంది. -
అండగా ఆదిశక్తి
మహిళలపై గృహ హింస, లైంగిక వేధింపులు.. అమ్మాయిల పట్ల ఆకతాయిల ఆగడాలు, ర్యాగింగ్ భూతం బాలికలపై వికృత చేష్టలు.. ఇలాంటి వాటికి చాలా వరకు మహిళలు బలయ్యాకగానీ స్పందన, న్యాయం జరిగేది కాదు. ఇదంతా గతం. మగువలు బాధితులుగా మారక ముందేరక్షణ ఛత్రంగా నిలవాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆకాంక్ష. ఆ ఆలోచనల్లో నుంచే అలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తూ ఆయన సంధించిన పాశుపతాస్త్రం ‘దిశ’ అన్ని సమస్యలకూ ఒక్కచోటే పరిష్కారం లభించేలా రూపొందించిన ఈ యాప్ మన ఆడపిల్లల రక్షణ ‘దిశ’గా ప్రయోగించిన ఆగ్నేయాస్త్రం. అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. వారికి తక్షణ భరోసాగా పోలీసుల అభయహస్తం.. ఆపత్కాలంలో దిశ యాప్‌లోని బటన్ నొక్కితే.. మహిళలకు నిశ్చింతే.. సత్వర సాయమే కాదు.. దిశ పోలీసు స్టేషన్లతో సత్వర న్యాయమూ.. –సాక్షి, అమరావతి సీఎం జగన్ మది నుంచి పుట్టిన ‘దిశ’ అక్కచెల్లెమ్మలు ఆపదలో ఉన్నామంటే చాలు క్షణాల్లో పోలీసులు చేరుకుని భద్రత కల్పించే వ్యవస్థ ఏర్పడాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన. అందులో నుంచి పుట్టిందే దిశ మొబైల్ యాప్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ప్రవేశపెట్టిన దిశ మొబైల్ యాప్ మహిళల భద్రతకు పర్యాయపదంగా మారింది. మగువలకు అనుక్షణం రక్షణగా నిలిచే దిశ యాప్, దిశ పోలీసు స్టేషన్లు ఒక నూతన విప్లవానికి శ్రీకారం చుట్టాయి. యావత్ దేశానికి ఇవి దిక్సూచిగా నిలిచాయి. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దిశ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు... నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరు కుని రక్షణ కవచంలా నిలుస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ‘దిశ’కు జాతీయస్థాయిలో ఎన్నో ప్రశంసలు దక్కాయి. అవార్డులు వరించాయి. ఎన్నో రాష్ట్రాలు ఈ వ్యవస్థను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. రికార్డు స్థాయిలో 1.50 కోట్ల డౌన్లోడ్లు 2020 డిసెంబర్ 15న అందుబాటులోకి వచ్చిన దిశ యాప్ ఫోన్లో ఉందంటే మహిళలు నిశ్చింతగా ఉన్నట్టే. ఈ యాప్‌ను ఇంతవరకు కోటీ 50 లక్షల 10 వేల 15 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కేవలం డౌన్‌లోడ్‌తోనే ఆగిపోకుండా కోటీ 29 లక్షల 8 వేల 530 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఓ మొబైల్ యాప్ డౌన్లోడ్, రిజిస్ట్రేషన్లలో దేశంలో దిశ యాప్‌దే రికార్డు కావడం విశేషం. ఆపదలో ఉన్నామని దిశ యాప్‌కు సమాచారం ఇస్తే పట్టణాలు, నగరాల పరిధిలోనైతే 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాలైతే 10 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దిశ యాప్ ద్వారా ఇంతవరకు 10 లక్షల 80 వేల 454 ఎస్ఓఎస్ కాల్ రిక్వెస్ట్‌లు వచ్చాయి. కొత్తగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి, రెండుసార్లు ఎస్ఓఎస్ బటన్ నొక్కి చూస్తారు. వాటిని మినహాయిస్తే పోలీసు చర్యలు తీసుకునే కాల్స్ 31,607 ఉన్నాయి. వీటన్నింటికీ పోలీసులు తక్షణం స్పందించి ఘటన స్థలానికి చేరుకుని తగిన న్యాయం అందించారు. దిశ యాప్‌లో సగటున రోజుకు 250 కాల్స్ వస్తున్నాయి. దశ‘దిశ’లా నిఘా లైంగిక వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను జియో మ్యాపింగ్ చేశారు. లైంగిక దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్న 2 లక్షల 17 వేల 467 మంది నేర చరితుల డేటా బేస్ రూపొందించి వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తున్న 1,531 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్లు, లైంగిక వేధింపులకు పాల్పడిన 2,134 మందిపై షీట్లు తెరిచారు. నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలు సత్వరం సేకరించేందుకు అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో ఫోరెన్సిక్ లాŠయ్బ్లు ఏర్పాటు చేశారు. తిరుపతి, విశాఖపట్నంలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీలు నిర్మిస్తున్నారు. గతంలో ఫోరెన్సిక్ నివేదికకు మూడు నాలుగు నెలలు పడితే.. ప్రస్తుతం 48 గంటల్లోనే వస్తున్నాయి. చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ప్రథమం దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఇంతవరకు 3,009 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా సరే.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని 2019 డిసెంబర్లో ప్రవేశపెట్టారు. దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 60 రోజుల్లోపే ఏకంగా 96.07 శాతం కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ నిర్దేశించిన మేరకు 60 రోజుల్లో చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అక్కచెల్లెమ్మల రక్షణకు దిశ పోలీస్ స్టేషన్లు ♦ దిశ యాప్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రభుత్వం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 8 పోలీస్ స్టేషన్లను త్వరలో ఏర్పాటు చేయనుంది. ♦ మహిళలకు హెల్ప్ డెస్క్, వెయిటింగ్ హాల్, కౌన్సెలింగ్ రూమ్, వాష్ రూమ్స్, క్రచ్–ఫీడింగ్ రూమ్‌లతో ఈ పోలీస్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో దిశ పోలీస్ స్టేషన్లకు ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది. ♦ ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు ఏర్పాటు చేశారు. ♦ పోక్సో కేసుల విచారణకు 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ♦ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలు ♦ 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. నేరం సంభవించిన ప్రాంతానికి తక్షణం చేరుకోవడానికి వీటిని అందుబాటులోకి తెచ్చారు. 60 రోజుల్లోనే దర్యాప్తు 2020 నుంచి ఇప్పటివరకు 7,070 పోక్సో కేసులకు సంబంధించి 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తయ్యింది. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమే. జాతీయ స్థాయిలో ప్రశంసలు దిశ వ్యవస్థకు ఇంతవరకు 19 జాతీయస్థాయి అవార్డులు లభించాయి. నీతి ఆయోగ్, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ బాలల కమిషన్ తదితర సంస్థలు దిశ వ్యవస్థను కొనియాడాయి. నేరం చేస్తే శిక్ష ఖాయం మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పోక్సో కేసులు నమోదు చేయడమే కాకుండా దోషులకు సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు. ఇంతవరకు 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. మరో 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇంకో 27 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది. -
దశ దిశలా రక్షణ
మహిళలకు రక్షణ, భద్రతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఆపదలో ఉన్నవారిని నిమిషాల వ్యవధిలోనే రక్షించడానికి దిశ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఆపత్కాలంలో ఉన్నప్పుడు దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు... నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళలను రక్షిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చేస్తున్నారు. ఈ క్రమంలో దిశ వ్యవస్థకు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఎన్నో రాష్ట్రాలు దీన్ని తమ ప్రాంతాల్లోనూ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దిశ యాప్‌ను ఆవిష్కరించి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. – సాక్షి, అమరావతి ♦ చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఓ బాలికను ఓ యువకుడు∙కిడ్నాప్ చేసి అత్యాచారానికి యత్నించాడు. అతడి ఇంట్లో నుంచి బాలిక అరుపులు వినిపించడంతో సమీపంలో ఉన్న ఓ వ్యక్తి దిశ యాప్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఆ బాలికను రక్షించి యువకుడిని అరెస్ట్ చేశారు. ♦ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళపై ఆమె భర్త మద్యం మత్తులో గొడ్డలితో దాడి చేశాడు. ఆమె వెంటనే అంటే సాయంత్రం 6.39 గంటలకు దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించారు. పోలీసులు 6.41 గంటలకే అంటే కేవలం రెండు నిమిషాల్లోనే అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి కాపాడారు. ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ♦ సమీప బంధువు మోసగించడంతో విజయవాడలో ఓ మహిళ అర్ధరాత్రి 12.53 గంటలకు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన బిడ్డను కాపాడాల్సిందిగా ఆమె తల్లి దిశ యాప్ ద్వారా పోలీసులకు విన్నవించారు. కమాండ్ కంట్రోల్ సిబ్బంది 12.55 గంటలకు విజయవాడ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు 12.58 నిమిషాలకే అంటే కేవలం 5 నిమిషాల్లోనే బాధిత మహిళ నివాసానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ♦ ఎన్టీఆర్ జిల్లా నవులూరుకు చెందిన ఓ మహిళ పరీక్ష రాసేందుకు వెళ్లిన తన 15 ఏళ్ల కుమార్తె ఇంటికి తిరిగి రాలేదని దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఓ యువకుడు ఆ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లినట్టు గుర్తించిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆ బాలిక ఆచూకీ తెలుసుకుని ఆమె తల్లి వద్దకు చేర్చారు. యువకుడిపై కేసు నమోదు చేశారు. ♦ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 19 ఏళ్ల యువతిని ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి తనతో తీసుకువెళ్లాడు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా వ్యభిచారం చేయాల్సిందిగా వేధించసాగాడు. దాంతో ఆ యువతి పొరుగింటివారి సహాయంతో దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించింది. పోలీసులు వెంటనే ఆ నివాసానికి చేరుకుని యువతిని రక్షించి యువకుడిని అరెస్ట్ చేశారు. చార్జ్షీట్ల నమోదులో దేశంలోనే ప్రథమ స్థానం.. దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఇప్పటివరకు 3,009 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇక పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా సరే జీరో ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని 2019 డిసెంబర్లో ప్రవేశపెట్టారు. అలాగే దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 60 రోజుల్లోపే ఏకంగా 96.07 శాతం కేసుల్లో చార్జ్షీట్లు దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర హోం శాఖ నిర్దేశించిన మేరకు 60 రోజుల్లో చార్జ్షీట్ల నమోదులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం విశేషం. 2020 నుంచి ఇప్పటివరకు 7,070 పోక్సో కేసులకు సంబంధించి 96 శాతం కేసుల్లో 60 రోజుల్లోనే దర్యాప్తు పూర్తవ్వడం గమనార్హం. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమే. అక్కచెల్లెమ్మల రక్షణకు పటిష్ట వ్యవస్థ.. ♦ దిశ యాప్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా ప్రభుత్వం 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. మరో 8 పోలీస్ స్టేషన్లను త్వరలో ఏర్పాటు చేయనుంది. ♦ మహిళలకు హెల్ప్ డెస్క్, వెయిటింగ్ హాల్, కౌన్సెలింగ్ రూమ్, వాష్ రూమ్స్, క్రచ్–ఫీడింగ్ రూమ్‌లతో ఈ పోలీస్ స్టేషన్లను నెలకొల్పారు. ఈ క్రమంలో దిశ పోలీస్ స్టేషన్లకు ఐఎస్వో సర్టిఫికెట్ లభించడం విశేషం. ♦ ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులను ఏర్పాటు చేశారు. ♦ పోక్సో కేసుల విచారణకు 19 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. ♦ పెట్రోలింగ్ కోసం 900 ద్విచక్ర వాహనాలు, 163 బొలెరో వాహనాలను సమకూర్చారు. ♦ 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను ప్రభుత్వం సమకూర్చింది. నేరం సంభవించిన ప్రాంతానికి తక్షణం చేరుకోవడానికి వీటిని అందుబాటులోకి తెచ్చింది. ♦ లైంగిక వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాలను జియో మ్యాపింగ్ చేసింది. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన నేర చరిత్ర ఉన్న 2,17,467 మంది నేర చరితుల డేటా బేస్ రూపొందించి వారి కదలికలపై నిఘా పెట్టింది. మహిళలను ఆన్లైన్ వేధింపులకు గురి చేస్తున్న 1,531 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్లు, లైంగిక వేధింపులకు పాల్పడిన 2,134 మందిపై షీట్లు తెరిచింది. ♦ నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలను సత్వరం సేకరించేందుకు అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో ఫోరెన్సిక్ లాŠయ్బ్లను ఏర్పాటు చేసింది. తిరుపతి, విశాఖపట్నంలలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీలను నిరి్మస్తోంది. గతంలో ఫోరెన్సిక్ నివేదిక వచ్చేందుకు మూడు నాలుగు నెలల సమయం పట్టేది. కానీ ప్రస్తుతం కేవలం 48 గంటల్లోనే నివేదికలు వస్తున్నాయి. నేరానికి పాల్పడితే కఠిన శిక్షే.. దర్యాప్తు పూర్తి చేయడమే కాదు దోషులకు న్యాయస్థానాల ద్వారా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. 2019 తర్వాత మహిళలపై నేరాలకు పాల్పడేవారిపై శిక్షలు విధించడం పెరిగింది. పోలీసులు ప్రాధాన్యత కేసులుగా తీసుకున్నవాటిలో ఇప్పటివరకు 85 కేసుల్లో దోషులకు కోర్టులు శిక్షలు విధించాయి. మరో 10 కేసుల్లో న్యాయస్థానాల్లో విచారణ కొనసాగుతోంది. ఇంకో 27 కేసుల్లో దర్యాప్తు జరుగుతోంది. జాతీయస్థాయిలో.. అద్భుతమైన పనితీరుతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న దిశ వ్యవస్థకు ఇప్పటివరకు 19 జాతీయస్థాయి అవార్డులు లభించడం విశేషం. నీతి ఆయోగ్, జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సు, జాతీయ మహిళా కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, జాతీయ బాలల కమిషన్ తదితర సంస్థలు దిశ వ్యవస్థను కొనియాడాయి. రికార్డు స్థాయిలో 1.46 కోట్ల డౌన్లోడ్లు దిశ యాప్ ఫోన్లో ఉందంటే మహిళలు నిశ్చింతగా ఉన్నట్టే. అందుకే ఈ యాప్‌ను ఇప్పటివరకు 1,46,99,012 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కేవలం డౌన్‌లోడ్‌తోనే ఆగిపోకుండా 1,27,06,213 మంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు. ఓ మొబైల్ యాప్ డౌన్లోడ్, రిజి్రస్టేషన్లలో దేశంలో దిశ యాప్‌దే రికార్డు కావడం విశేషం. ఆపదలో ఉన్నామని దిశ యాప్‌కు సమాచారం ఇస్తే పట్టణాలు, నగరాల్లో 5 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 10 నిమిషాల్లోపే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. దిశ యాప్ ద్వారా ఇప్పటివరకు 10,80,454 ఎస్‌వోఎస్ కాల్ రిక్వెస్ట్‌లు వచ్చాయి. కొత్తగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు పరీక్షించడానికి ఒకటి రెండుసార్లు ఎస్‌వోఎస్ బటన్ నొక్కి చూస్తారు. అటువంటివి కాకుండా పోలీసులు చర్యలు తీసుకోదగ్గవి 31,541 కాల్స్ ఉన్నాయి. ఈ కాల్స్ అన్నింటికీ పోలీసులు తక్షణం స్పందించి ఘటన స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకున్నారు. దిశ యాప్ ద్వారా సగటున రోజుకు 250 కాల్స్ రావడం ఈ వ్యవస్థ పట్ల మహిళల్లో ఏర్పడిన భరోసాకు నిదర్శనం. దోషులకు సత్వరం శిక్షలు మహిళలు, బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై పోక్సో కేసులు నమోదు చేయడమే కాకుండా దోషులకు సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు. దిశ పోలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటు ద్వారా కేసుల దర్యాప్తు, నేర నిరూపణ ప్రక్రియ పక్కాగా సాగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
నేర నిరూపణలో సాంకేతికత పెరగాలి
సాక్షి, హైదరాబాద్: నేరస్తులకు శిక్షలు పడేలా నేర నిరూపణలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. ఈ మేరకు సిబ్బందికి అవగాహన పెంచాలని కోరారు. డీజీపీ కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో హైకోర్టు అడ్వొకేట్ జనరల్ బి.శివప్రసాద్, ఇతర ప్రభుత్వ ప్లీడర్లతో పలు అంశాలపై చర్చించారు. సమీక్షలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ లీగల్ కె.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడు నెలలకోసారి ఈ తరహా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. -
ఉగ్రుడైన ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏం చేశాడంటే..
ప్రపంచం ఫోకస్ అంతా గత కొన్నివారాలుగా ఉక్రెయిన్ పరిణామాలపైనే ఉంటోంది. ఈ తరుణంలో కొరియా దేశాలు ఏం చేస్తున్నాయన్న? ఆసక్తి కొందరిలో ఉంది. అయితే ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో అప్రమత్తమైన ఈ దాయాది దేశాలు తమ తమ అణ్వాయుధాలకు పదును పెట్టుకుంటున్నాయట. ఈ తరుణంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హాజరైన ఓ ఈవెంట్‌కి ఎక్కడో దూరంగా తూటా పేలగా.. కోపంతో కిమ్ జోంగ్ ఉన్ కఠిన శిక్షలు అమలు చేశాడు. డెయిలీ నార్త్ కొరియా కథనం ప్రకారం.. ఫిబ్రవరి 16-18 తేదీల మధ్య సౌత్ హాంగ్యోంగ్ ప్రావిన్స్‌లో మిలిటరీ కమిటీ సమావేశాలు జరిగాయి. అదే టైంలో యోన్పోలోని హమ్జు కౌంటీలోని Greenhouse Farmలో Groundbreaking Ceremony కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్ హాజరు కావాల్సి ఉంది. దీంతో 17, 18 తేదీల్లో రెండురోజుల పాటు లాక్‌డౌన్‌తో కట్టడి చేసేసింది అక్కడి మిలిటరీ. అంతేకాదు కమ్యూనికేషన్ వ్యవస్థల కట్టడితోపాటు దారులన్నింటిని మూసేసి భద్రతను కట్టుదిట్టం చేసేసింది. సరిగ్గా కిమ్ ఈవెంట్లో పాల్గొంటుండగా.. హమ్జూ కౌంటీ పొరుగునే ఉన్న చోంగ్ప్యోంగ్ కౌంటీ సిన్సాంగ్ స్టేషన్ ఆర్మీ సెక్యూరిటీ విభాగంలో దగ్గర కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కమాండర్ల మధ్య గొడవ చిలికి చిలికి గాలి వానగా మారింది. ఆ ఘర్షణలో ఒకరు.. ఇంకొకరిని కాల్చి చంపేశారు. అదే రోజు సాయంత్రం విషయం బయటకు పొక్కింది. కిమ్ లాంటి సుప్రీం లీడర్ పర్యటిస్తున్న వేళ.. ఇలాంటి ఘటన జరగడంపై నార్త్ కొరియా మిలిటరీ సీరియస్ అయ్యింది. దీంతో సదరు సెక్యూరిటీ బేస్.. స్వీయ విమర్శలతో కూడిన ఓ క్షమాపణ లేఖ రాసి ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కిమ్ ఊరుకుంటాడా? వెంటనే ఆ మిలిటరీ బేస్ చీఫ్‌ను తొలగించి.. ఏడేళ్ల బానిస శిక్షను అమలు చేయాలని ఆదేశించాడు. అంతేకాదు ఈ ఘటనలో జోక్యం చేసుకున్న మరో ఇద్దరు సైనికులను యోంగ్వాంగ్ కౌంటీ పొలాల్లో కూలీలుగా జీవితాంతం బతకాలంటూ శిక్ష విధించాడు. ఇక కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని అదేరోజు రాత్రి అరెస్ట్ చేసినట్లు సమాచారం. కిమ్ జోంగ్ ఉన్లాంటి గొప్ప లీడర్ హాజరైన కార్యక్రమానికి అతి సమీపంలో కాల్పులకు తెగబడినందుకు.. ఉద్రిక్త పరిస్థితులను రేకెత్తించినందుకుగానూ ఆ వ్యక్తికి మరణ శిక్షను విధించారు. ఇలాంటి ఘటనను దాచి పెట్టే ఆస్కారం ఉన్నా.. అధ్యక్షుడి మీద గౌరవంతో బయట పెట్టినందుకు మిలిటరీ కమిటీని పొగడ్తలతో ముంచెత్తింది నార్త్ కొరియా సెంట్రల్ కమిటీ. అక్టోబర్ నెలలో వీలైతే ముందుగానే ఆ వ్యక్తిని కాల్చి చంపడం ఖాయమని డెయిలీ నార్త్ కొరియా కథనం ప్రచురించింది. -
కోర్టు ధిక్కరణ కేసుల్లో.. తెలంగాణ హైకోర్టు వినూత్న తీర్పులు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు సమాజ సేవ చేసేలా సామాజిక శిక్షలు విధిస్తూ హైకోర్టు వినూత్న తీర్పులు ఇస్తోంది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూనే సంబంధిత అధికారులను సమాజ సేవలో భాగస్వామ్యం చేస్తోంది. ఆయా అధికారులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ బెనిఫిట్స్ పొందడంలో ఇబ్బంది తలెత్తకుండా సామాజిక సేవ చేయాలనే షరతులతో అంతకుముందు వారికి విధించిన జరిమానా, జైలు శిక్షను రద్దు చేస్తోంది. వారి తప్పును తెలుసుకొని మళ్లీ కోర్టు ఆదేశాల అమలులో జాగరూకతతో వ్యవహరించేలా చేస్తోంది. ఇలాంటి సేవకు అధికారులు సైతం ఆనందంగా ముందుకొస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుల్లో కొన్ని. అనాథలకు బోధన చేయండి.. వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా 2015లో విధులు నిర్వహించిన సమయం (ప్రస్తుతం నల్లగొండ జిల్లా కలెక్టర్)లో కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ప్రశాంత్ జే.పాటిల్‌కు సింగిల్ జడ్జి రూ.2 వేలు జరిమానా విధించారు. కోర్టు ఆదేశాల అమలులో జాప్యానికి క్షమాపణ కోరుతూ పాటిల్ అప్పీల్ దాఖలు చేసుకున్నారు. ఈ అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం.. నల్లగొండ జిల్లాలో ని ఏదైనా ఒక అనాథ శరణాలయంలో ఆరు నెలలపాటు వారంలో 2 గంటలు చిన్నారులకు విద్యను బోధించాలనే షరతుతో సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. ఆకతాయికి గాంధీలో పారిశుధ్య పనులు.. సామాజిక శిక్షలు విధించడం 2010లో జస్టిస్ బి.చంద్రకుమార్ తీర్పులతో మొదలయ్యింది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సదరు యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ మంజూరు చేస్తానని, అయితే గాంధీ లాంటి ఆస్పత్రిలో నెల రోజులపాటు కొన్ని గంటలు పారిశుధ్య పనుల్లో పాల్గొనాలని షరతు విధించారు. భోజనం ఏర్పాటు చేయండి.. వరంగల్ జిల్లా జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా పనిచేసి పదవీ విరమణ చేసిన సంధ్యారాణికి సర్వీసులో ఉన్న సమయంలో ఓ తీర్పు అమలులో జాప్యానికి సింగిల్ జడ్జి రూ.2 వేలు జరిమానా విధించారు. అయితే 2019లో తాను పదవీ విరమణ చేశానని, ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్నానని.. సింగిల్ జడ్జి తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ సంధ్యారాణి అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి విధించిన శిక్షను రద్దు చేస్తామని, అనాథ శరణాలయంలో ఉండే వారికి ఉగాది, శ్రీరామనవమి పండులకు ఉచితంగా పంచభక్ష పరమాన్నాలతో కూడిన భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 20 మందికి వారంపాటు ఇఫ్తార్ ఇవ్వండి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సయ్యద్ యాసీన్ ఖురేషీ సింగిల్ జడ్జి ఆదేశాలను అమలు చేయడంలో కొంత జాప్యం చేశారు. దీంతో జడ్జి ఆయనకు రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ జరిమానాను ఆయన జీతం నుంచి వసూలు చేయాలని, అలాగే ఆయన సర్వీసు రికార్డులో శిక్షను నమోదు చేయాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఖురేషీ దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ హిమకోహ్లీ ధర్మాసనం విచారించింది. గతంలో ఎటువంటి కోర్టుధిక్కరణ కేసులు ఎదుర్కొలేదని, తీర్పు అమలులో జాప్యానికి భేషరతుగా క్షమాపణలు కోరుతున్నారని.. సింగిల్ జడ్జి తీర్పుతో ఆయనకు పదోన్నతుల్లో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం సింగిల్ జడ్జి విధించిన శిక్షను రద్దు చేస్తామని పేర్కొంది. అయితే ఈ కేసు విచారణ సమయంలో రంజాన్ మాసం ఉండటంతో.. ఖురేషీ తన ఇంటికి సమీపంలోని మసీదు దగ్గర ఉపవాస దీక్ష విరమించే వారికి వారం రోజులపాటు 20 మందికి తగ్గకుండా ఇఫ్తార్ ఇవ్వాలని షరతు విధించింది. -
కట్టుదిట్టంగా దిశ చట్టం
బాలలపై అత్యాచారాలకు లేదా లైంగిక వేధింపులకు పాల్పడినా, వారిని పోర్నోగ్రఫీ కోసం వినియోగించుకున్నా ఐపీసీ సెక్షన్లతో పాటు ‘పోక్సో’ చట్టంలోని సంబంధిత సెక్షన్లను చేర్చి కేసులు దాఖలు చేస్తారు. ‘పోక్సో’ చట్టం కింద నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష మొదలుకొని మరణశిక్ష వరకు విధించే అవకాశాలు ఉంటాయి. తెలంగాణరాష్ట్రంలోని శంషాబాద్ శివార్లలో 2019, నవంబరు 27న జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ గ్యాంగ్ రేప్, హత్య ఘటనతో దేశం షాక్‌కి గురైంది. మహిళల భద్రత మీద మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే ఆందోళన దేశమంతా మొదలైంది. దేశంలో మిగతా రాష్ట్రాలు స్పందించకపోయినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ‘దిశ’ పేరుతో ఓ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదమూ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా దేశమంతా ప్రశసంలు పొందిందీ చట్టం. ఏపీ దిశ చట్టంలోని ముఖ్యాంశాలు : ►కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిర్భయ చట్టం ప్రకారం నిర్భయ కేసులో దోషికి జైలు, మరణదండన శిక్షగా విధిస్తుండగా ఆంధ్రప్రదేశ్ ‘దిశ’ చట్టం.. దోషికి కచ్చితంగా మరణదండన విధిస్తోంది. ►నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు పూర్తయితే మరో రెండు నెలల్లో శిక్ష పడాలి. అంటే మొత్తం 4 నెలల్లో దర్యాప్తు, న్యాయ ప్రక్రియ పూర్తికావాలి. కాని ఏపీ దిశ చట్టంలో దానిని 4 నెలల నుంచి 21 రోజులకు కుదించారు. లైంగికదాడి నేరాల్లో స్పష్టమైన, తిరుగులేని ఆధారాలు లభించినట్టయితే.. వారం రోజుల్లో పోలీసు దర్యాప్తు, 14 రోజుల్లోపే న్యాయ ప్రక్రియ పూర్తయి 21 రోజుల్లోపే దోషికి శిక్ష పడాలి. ►లైంగిక దాడి సంఘటనల్లో మాత్రమే కాకుండా పిల్లలపై జరిగే లైంగిక నేరాలన్నింటికీ కూడా శిక్షల్ని పెంచారు. కేంద్రం చేసిన ‘పోక్సో’ చట్టం ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలు, లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులకు కనీసం మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఏపీలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు. ►లైంగికదాడి నేరాలకు మాత్రమే కాకుండా పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడిన వారి విషయంలోనూ కేంద్రం విధించిన ఒక ఏడాది గడువుకు బదులు... దర్యాప్తును ఏడు రోజుల్లో పూర్తి చేసి, న్యాయ ప్రక్రియ 14 పనిదినాల్లో పూర్తిచేసేలా చట్టానికి సవరణ చేశారు. ►మెయిల్స్, సోషల్ మీడియా వంటి డిజిటల్ మాధ్యమాల్లో ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే మొదటి తప్పుకు రెండేళ్లు, ఆ తర్వాత తప్పుకు 4 ఏళ్లు శిక్ష విధించేలా ఐపీసీలో 354 (ఇ) అనే కొత్త సెక్షన్‌ను చేర్చారు. ►లైంగిక దాడులకు సంబంధించి 376 సెక్షన్లో సవరణ తెచ్చి, కచ్చితమైన సాక్ష్యాధారాలతో నిందితులు దోషులుగా తేలితే వారికి మరణశిక్ష విధించే వెసులుబాటు కల్పించింది. ►‘నిర్భయ’ చట్టం ప్రకారం లైంగిక నేరాలపై తీర్పు వెలువడటానికి నాలుగు నెలలుగా ఉన్న వ్యవధిని 21 పని దినాలకు కుదించింది. ►ఐపీసీ 354 సెక్షన్లో కొత్తగా 354–ఎఫ్, 354–జీ సబ్సెక్షన్లను చేర్చి, పిల్లలపై అత్యాచారం కాని ఇతర లైంగిక నేరాలకు యావజ్జీవ శిక్ష విధించేందుకు వెసులుబాటు కల్పించింది. ►మహిళలు, పిల్లలపై జరిగిన నేరాల సత్వర విచారణకు దేశంలో కొన్ని చోట్ల తప్ప ఇంకెక్కడా ప్రత్యేక కోర్టులు లేవు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, పిల్లలపై జరిగిన నేర విచారణలో జాప్యం లేకుండా.. రాకుండా వేగంగా విచారణ జరిగి దోషికి శిక్షపడేలా చేస్తాయి ఈ ప్రత్యేక కోర్టులు. రేప్, గ్యాంగ్‌రేప్, యాసిడ్ దాడులు, సోషల్ మీడియా ద్వారా వేధించడం, అసభ్యంగా చూపించడం వంటి నేరాలతోపాటు , పోక్సో పరిధిలోని అన్ని నేరాలనూ ఈ ప్రత్యేక కోర్టుల్లో విచారణ జరిగేలా చేశారు. ►ఈ నేరాలపై దోషులు పైకోర్టుకు వెళ్లి అప్పీలు చేసుకునే గడువును కూడా కేంద్ర ప్రభుత్వం చట్టంలో ఉన్న ఆరు నెలల కాలాన్ని, ఏపీ పరిధిలో 45 రోజులకు తగ్గించారు. ►మహిళలు, పిల్లలపై జరిగే నేరాల సత్వర విచారణ, శిక్షల విధింపు కోసం ప్రత్యేక పోలీసు బృందాల్ని, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లని, ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర చట్టాల్లో ఇప్పటి వరకూ ఎటువంటి ఏర్పాట్లు లేవు. అయితే జిల్లా స్థాయిల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ స్పెషల్ పోలీస్ టీమ్స్‌ను ఇందుకోసం ఏర్పాటు చేసేందుకు ఏపీ దిశ చట్టం ద్వారా వీలు కల్పించారు. అలాగే ప్రతి ప్రత్యేక కోర్టుకు, ప్రత్యేకంగా పబ్లిక్‌ప్రాసిక్యూటర్లని నియమించుకునే అవకాశాన్ని ఇస్తూ ఈ చట్టాన్ని చేశారు. ►మహిళలు, పిల్లలపై జరిగే నేరాల నమోదుకు కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ రిజిస్ట్రీని పెట్టింది. అయితే, ఆ రిజిస్ట్రీ ద్వారా డిజిటల్ పద్ధతిలో డేటా బేస్ ఉన్నప్పటికీ జరిగిన నేరాలు, దాంతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు వంటి వివరాలను బహిర్గతం చేసే అవకాశం లేదు. అంటే, ఏ నేరస్తుడు ఏ నేరం చేశాడన్న వివరాలు ప్రజలకు తెలిసే అవకాశం లేదు. అటువంటి డిజిటిల్ రిజిస్ట్రీని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడంతోపాటు ఈ నేరాలకు సంబంధించిన వివరాలు అన్నింటినీ ప్రజలందరికీ అందుబాటులో ఉంచడంద్వారా నేరస్తుల వివరాలు బహిర్గతం చేయబోతున్నారు. తక్షణ చర్యలు ఇవి... ►ప్రభుత్వం తక్షణ చర్యల్లో భాగంగా... రాష్ట్రంలో 18 మహిళా పోలీస్ స్టేషన్లను సమన్వయం చేసేందుకు, దిశ చట్టం అమలును పర్యవేక్షించేలా ఒక ఐపీఎస్ అధికారిని నియమించారు. ►మరిన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ►మహిళలు, బాలలపై లైంగిక నేరాల సత్వర విచారణకు వీలుగా నిధులు మంజూరు చేశారు. ►విశాఖపట్నం, తిరుపతి ఫోరెన్సిక్ ప్రయోగశాలల్లో డీఎన్ఏ, సైబర్ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ►గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న రాష్ట్ర స్థాయి ఫోరెన్సిక్ ప్రయోగశాలలోని డీఎన్ఏ, సైబర్ విభాగాల్ని మరింత పటిష్ఠం చేయనున్నారు ►డయల్ 100, 112లకు సంబంధించి ఒకే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి దాన్ని ‘దిశ కంట్రోల్’ రూంగా పిలవనున్నారు. అంతేకాదు డయల్ 100, 112లను కలిపి ఒకే టోల్ ఫ్రీ నెంబర్‌గా తెచ్చేందుకు కసరత్తూ జరుగుతోంది. ►దిశ యాప్ కోసం కోటి 26 లక్షల రూపాయలను వినియోగించనున్నారు. ►ప్రతి వన్ స్టాప్ సెంటర్‌కు ఒక మహిళా ఎస్సై పోస్టు మంజూరు చేశారు. ►ప్రత్యేక కేసుల విచారణ సందర్భంగా అదనపు విధులు నిర్వర్తించే మహిళా పోలీసుస్టేషన్ సిబ్బందికి 30 శాతం ప్రత్యేక భత్యం చెల్లించనున్నారు. ►ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించనున్నారు. ►2020 జనవరి నెలాఖరు నాటికి అన్ని జిల్లాల్లోని బోధనాసుపత్రిల్లో దిశా ప్రత్యేక కేంద్రాలు, దిశా మహిళా పోలీస్ స్టేషన్లు, దిశా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దిశకు యంత్రాంగం ఏపీ దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది. స్త్రీ. శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, కర్నూల్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారిణి దీపికాలను స్పెషల్ ఆఫీసర్లుగా అపాయింట్ చేసింది. సైబర్ మిత్ర ఏపీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘సైబర్ మిత్ర’ పేరుతో వాట్సాప్ నెంబర్ 9121211100కు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దిశ చట్టం తెచ్చిన ప్రభుత్వం మహిళలకు సత్వర న్యాయం, రక్షణ కోసం ప్రత్యేకంగా దిశ మొబైల్ అప్లికేషన్(యాప్)ను తేనుంది. -
అడ్మిన్లు జర పైలం !
షేర్లు.. లైకుల కోసం ఇష్టమొచ్చింది పోస్టు చేస్తామంటే.. ఎన్నికల వేళ నడువదు! అత్యుత్సాహభరిత పోస్టులు పెట్టి బరిలో ఉన్న అభ్యర్థులపై అవాకులు చెవాకులు పేల్చితే.. ఊచలు లెక్కించాల్సిందే! జరిమానాలు కట్టాల్సిందే! ‘నా గ్రూప్‌లో నేను షేర్ చేస్తే ఏమౌతుందిలే’ అన్న నిర్లక్ష్యం అసలే వద్దు.. ఒకవేళ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు!అందుకే.. ఉన్నతాధికారులు సైతం ‘మేమన్నీ చూస్తున్నాం..’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేసే వారికి సుతిమెత్తని హెచ్చరికలూ జారీ చేస్తున్నారు. కాబట్టి, అడ్మిన్లూ.. జర పైలం మరే! గత ఎన్నికల్లో.. సామాజిక మాధ్యమాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు పెడుతున్న సందేశాలు ఈమధ్య చాలానే వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సోషల్ మీడియాలో వివాదాస్పద పెట్టడంతో, ప్రత్యర్థులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలపై ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు సంఘటనలున్నాయి. పార్టీలకు సంబంధం ఉన్న వారితోపాటు పార్టీలకు సంబంధం లేని వారు సైతం కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు ఎక్కువగా సాగుతుండటంతో అధికారులు సైతం ఈ పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని గ్రూపుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఉండి మరీ పరిశీలిస్తున్నారు. ఎవరైననా సైబర్ నిబంధనలకు విరుద్ధంగా పోస్టు పెడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కోకొల్లలు. ఇలాంటి చర్యలపై చట్టలు సైతం కఠినంగా ఉన్నాయి. అంతేకాకుండా.. అశ్లీల సమాచారం, ఫొటో మార్ఫింగ్, తప్పుడు సమాచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేస్తే ఇన్ఫర్మేమేషన్ టెక్నాలజీ యాక్ట్–2000 ప్రకారం సెక్షన్ 67 కింద జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు. అదే నేరం రెండోసారి పాల్పడినట్లు గుర్తిస్తే పదేళ్ల జైలుపాటు రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. పోస్టులు పెట్టే అడ్మిన్లతోపాటు వాటిని షేర్ చేసే వారిని కూడా ఒక్కోసారి బాధ్యులను చేసే అవకాశముంది. అడ్మిన్ బాధ్యతలు.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలకు చట్ట ప్రకారం ఆయా గ్రూప్‌లకు సంబంధించిన అడ్మిన్లే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్‌లో ఉండే ప్రతీ సభ్యుడు కచ్చితంగా అడ్మిన్‌కు తెలిసి ఉండేలా చూసుకోవాలి. అపరిచితులను గ్రూప్‌లో చేర్చుకోవద్దు. ఎవరైనా గ్రూప్ సభ్యులు అభ్యంతరకరంగా ప్రవర్తించినా.. వివాదస్పద పోస్టులు, కామెంట్లు చేసినా.. ఆ సభ్యుడిని వెంటనే తన గ్రూప్ నుంచి తొలగించడం ఉత్తమం. అడ్మిన్‌తోపాటు గ్రూప్‌లోని సభ్యులు వివాదాస్పద పోస్టులు చేస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారని తెలుసుకోవాలి. ఇవి పెట్టొద్దు.. షేర్ చేయొద్దు.. విద్వేషాలు రెచ్చగొట్టే విషయాలు తప్పుడు సమాచారం, తెలియని అంశాలు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ఓ వర్గాన్ని బాధించే కార్టూన్సు -
ఎన్నికల చట్టాలు ఇవే.. ఉల్లంఘిస్తే శిక్షే
సాక్షి, సిటీబ్యూరో : లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు కొద్దిరోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యం దేశంలోని చట్టాల గురించి అవగాహన అవసరం. మన ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలే కీలకం. ఎన్నికల నియమావళిని రూపొందించి పకడ్బందీగా అమలు చేయడానికి ఎన్నికల కమిషన్ పని చేస్తోంది. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువగా కేసులు నమోదు చేస్తుంటారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలో అనేక సెక్షన్లు ఉన్పప్పటికీ ఎక్కువగా ఎన్నికల సమయంలో కొన్నింటిని ఎక్కువగా నిబంధనలు అతిక్రమించిన పార్టీలు, వ్యక్తులపైన ప్రయోగిస్తుంటారు. ఆ చట్టాలేమిటో.. శిక్షలు ఏమిటో ఓసారి తెలుసుకుందాం. ఆర్పీ యాక్ట్ 123 : లంచగొండితనం, అనుచిత ఒత్తిడి, మతం, జాతి, కులం, సంఘం లేదా భాషా ప్రాతిపదికపై వర్గాల పౌరుల మధ్య ద్వేషాన్ని, శత్రుత్వాన్ని పెంపొందిస్తే శిక్షకు అర్హులు. ఆర్పీ యాక్ట్ 125 : ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించినట్లయితే మూడేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేయవచ్చు. ఆర్పీ యాక్ట్ 126 : ఎన్నిక సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులవుతారు. అందుకు రెండేళ్లు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఆర్పీ యాక్ట్ 127 : ఎన్నికల సమావేశంలో అల్లర్లు చేస్తే యూఎస్ 42 సీఆర్పీసీ ప్రకారం వారికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 2 వేలు జరిమానా లేదా రెండూ విధింవచ్చు. ఆర్పీ యాక్ట్ 127 అ: ఎవరైనా తన పేరు చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రిస్తే ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 128 : బహిరంగంగా ఓటేస్తే మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 130 : పోలింగ్ బూత్‌కు 100 మీటర్ల లోపల ప్రచారం చేయొద్దు. ప్రచారం చేస్తే రూ. 250 జరిమానా విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 131 : పోలింగ్ బూత్‌కు సమీపంలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సామగ్రిని స్వాధీనపరచుకుంటారు. మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 132 : ఓటేసే సమయంలో నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే మూడు నెలలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 133 : ఓటర్లను పోలింగ్ బూత్ వద్దకు చేరవేసేందుకు వాహనాలు సమకూరిస్తే శిక్షార్హులు. మూడు నెలలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 134 : ఎన్నికల సందర్భంగా అధికార దుర్వినియోగం చేస్తే శిక్షార్హులే. రూ. 500 వరకు జరిమానా ఉంటుంది. ఆర్పీ యాక్ట్ 134 అ : ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల పోలింగ్ ఓట్ల లెక్కింపు ఏజెంట్‌గా వ్యవహరిస్తే శిక్షార్హులు. మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 135 : బ్యాలెట్ పత్రం, ఈవీఎం అపహరిస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ. 500జరిమానా లేదా రెండు అమలు చేస్తారు. ఆర్పీ యాక్ట్ 135 అ: ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి పోలింగ్ బూత్ స్వాధీనం పరచుకుంటే ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండూ విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 135 ఆ : ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల రోజు వేతన సెలవు మంజూరు చేస్తే రూ.5 వేలు వరకు జరిమానా విధిస్తారు. ఆర్పీ యాక్ట్ 135 ఇ : పోలింగ్ ఓట్ల లెక్కింపు రోజు మద్యం అమ్మకం, పంపిణీ నేరం. ఆరు నెలలు జైలు రూ. 2 వేలు జరిమానా విధిస్తారు. -
ప్రలోభాలకు తప్పదు శిక్ష
సాక్షి, కాజీపేట:నామినేషన్ల ఉపసంహరణల పర్వం పూర్తయింది. బరిలో ఉండేదెవరో తేలిపోయింది. దీంతో ప్రచారం ఊపందుకోవడంతో జిల్లాలో ఎన్నికల వేడి మొదలైంది. మద్యం, డబ్బుల పంపిణీతో పాటు కుల రాజకీయాలు చేయడంలో నాయకులు తలమునకలైపోయారు. దొరికితే దొంగ అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ సిబ్బంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నించే పార్టీలు, నాయకులకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల కమిషన్ కఠిన నిర్ణయాలు అమలుచేస్తుంది. ఎన్నికల్లో ఎవరైనా జాతి, మత, కుల, భాష, సమాజం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొడితే సెక్షన్ 125 ఆర్పీ చట్టం 1851, 153ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, జరిమాన విధిస్తారు. ఇచ్చినా.. తీసుకున్నా.. ఓటుకోసం మద్యం, డబ్బులు, ఇతర వస్తువులు ఇచ్చినా తీసుకున్నా ఇద్దరు నేరస్తులే. సెక్షన్ 171 బీ, 171 ఈ, 171 హెచ్ ప్రకారం లంచంగా పరిగణించి ఏడాదికాలం పాటు జైలు శిక్ష విధిస్తారు. ఈ ఎన్నికల్లో నిఘా కళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఓటర్లు, నాయకులు అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రలోభాలకు లొగకుండా ఓటర్లు నీతి, నిజాయితీ కలిగిన నాయకులనే ఎన్నుకోవాలి. ప్రలోభాలకు గురిచేస్తూ పట్టుబడితే భారీమూల్యం తప్పదని గుర్తుపెట్టుకోవాలి. -
ఇవీ సెక్షన్లు.. తప్పదు యాక్షన్!
సాక్షి, కల్వకుర్తి టౌన్ : అసెంబ్లీ ఎన్నికల సందడి జోరందుకుంది. అభ్యర్ధులు ప్రచారంలో తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్ధులు, నాయకులు, కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరించినా, ఎన్నికల నియమావళి, నిబంధనలను అతిక్రమించినా శిక్ష తప్పదని చట్టాలు చెబుతున్నాయి. ఆయా సెక్షన్ల ప్రకారం దండనలు, జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఇంతకీ సెక్షన్లు ఏం చెబుతున్నాయి, అసలు ఆ సెక్షన్లు ఏమిటనే విషయాలు మీ కోసం.. ఎన్నికలు.. చట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్ధలో పాలకులను ఎన్నుకోవడానికి ఎన్నికలు ప్రధాన భూమిక పోషిస్తాయి. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎక్కువ కేసులు నమోదు చేస్తుంటారు. ప్రచారంలో పార్టీ అభ్యర్ధులు నాయకులు,కార్యకర్తలు అదుపుతప్పి వ్యవహరిస్తే దండన తప్పదు. సామాన్య పౌరులు సైతం ఫిర్యాదు చేసినా పోలీసులు కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పక్రియలో నామినేషన్ల పక్రియ, పరిశీలన, ఉపసంహారణ అంతా పూర్తయింది. ప్రస్తుతం అంతర్జాలంలో ఎన్నికల చట్టాలు, నిబంధనలను గురించి వెతకటం ప్రారంభించారు. సెక్షన్ 125 జాతి, మతం, కులం, సంఘం, భాషను రెచ్చగొట్టేలా వ్యవహరించటం, ఒత్తిడికి లోను చేస్తే ఈ సెక్షన్ కింద ఫిర్యాదు చేయొచ్చు. 125 సెక్షన్ ప్రకారం ఎన్నికల సందర్భంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందిస్తే మూడేళ్ల పాటు జైలుశిక్ష లేదా జరిమానా, లేదంటే రెండింటినీ విధించవచ్చు. సెక్షన్ 126 ఎన్నికల సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తే శిక్షార్హులు. దీనికి రెండేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తారు. సెక్షన్ 128 బహిరంగంగా ఓటు వేస్తే మూడు నెలల జైలు శిక్ష లేదా జరిమానా. సెక్షన్ 129 ఎన్నికలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది పోలీసులు పోటీ చేసే అభ్యర్ధికి సహకరించినా, ప్రభావం కలిగించిన శిక్షార్హులు. దీనికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 131 పోలింగ్ కేంద్రానికి సమీపంలో నియమాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే, ఏ పోలీస్ అధికారి అయినా ఆ సామాగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు. దీనికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించబడుతుంది. రెండు కూడా విధించవచ్చు. సెక్షన్ 133 ఎన్నికల సందర్భంగా ఓటర్లను పోలీంగ్ కేంద్రానికి చేరవేసేందుకు వాహనాలను సమకూర్చినా, అద్దెకు తీసుకున్నా శిక్షార్హులే. దీనికి గాను మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించవచ్చు. సెక్షన్ 132 ఓటరు ఓటు వేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలుశిక్ష లేదా జరిమానా విధించవచ్చు. సెక్షన్ 134 అధికార దుర్వినియోగానికి పాల్పడితే అందుకుగాను శిక్షార్హులే. దీనికి గాను రూ.500 జరిమానా విధించవచ్చు. సెక్షన్ 134 అ ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల ఏజెంట్ కానీ పోలింగ్ ఏజెంటుగా కానీ ఓట్ల లెక్కింపు సందర్భంగా గానీ ఏజెంటుగా వ్యవహరిస్తే వారు శిక్షార్హులు. అందుకు 3 నెలల జైలుశిక్ష లేదా జరిమానా. సెక్షన్ 127 ఎన్నికల సమావేశం సందర్భంగా ఎలాంటి అల్లర్లకు పాల్పడినా, పోలీస్ అధికారి అయినా ఆ వ్యక్తులను అరెస్టు చేయవచ్చు. దీనికి ఆరునెలల జైలు శిక్ష లేదా రూ.2 వేల జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 130 పోలింగ్ స్టేషన్ వద్ద 100 మీటర్ల లోపల ప్రచారం నిర్వహించకూడదు. దీనికి జరిమానా విధించబడుతుంది. సెక్షన్ 135 పోలింగ్ కేంద్రం నుండి బ్యాలెట్ పేపరు, ఈవీఎం యంత్రం అపహారిస్తే వారు శిక్షార్హులు. దీనికి గాను ఏడాది పాటు జైలుశిక్ష,, రూ,500 జరిమానా విధించబడును. సెక్షన్ 134 ఆ పోలీస్స్టేషన్ల పరిసర ప్రాంతాలకు మారణాయుధాలతో వెళ్లడం శిక్షార్హం. దీనికి గాను ఏడాది పాటు జైలుశిక్ష రూ.,500 జరిమానా విధిస్తారు. సెక్షన్ 49పీ ఒక వ్యక్తి ఓటు మరో వ్యక్తి ఓటు వేస్తే పోలింగ్ అధికారి సదరు ఓటరు 49పీ సెక్షన్ ప్రకారం తన ఆధారాలు చూపాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ సదరు ఓటరుకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. సెక్షన్ 135 ఈ పోలింగ్ కౌటింగ్ రోజున మద్యం విక్రయించటం, మద్యం, డబ్బు ఇవ్వడానికి ఆశ చూపటం నేరం. దీనికి గాను 6 నెలల జైలుశిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో నో సెల్ఫీ సాక్షి, కల్వకుర్తి టౌన్ / అచ్చంపేట : సాంకేతిక పెరుగుతున్నా కొద్దీ వయసు తారతమ్యం లేకుండా సమయం, సందర్భం లేకుండా ప్రతి ఒక్కరు సెల్ఫీలపై మోజు పడుతున్నారు. అదే అలవాటులో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎవరైనా ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించటం కుదరదు. ఒకవేళ ఎవరూ చూడటం లేదని, సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీలు పూర్తిగా నిషేధం. నిబంధనలను విరుద్ధంగా చూపిస్తూ ఓటు వేసినట్లుగా గుర్తిస్తే అధికారులు వెంటనే ఎన్నికల సంఘం ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 49 ఎం(ఓటు రహస్యం) బహిర్గతం నియమం కింద బయటకు పంపిస్తారు. వేసిన ఓటును సెక్షన్ 17–ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. అయితే, రూల్ నెంబర్ 49 ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయడానికి 18 ఏళ్లు దాటిన సహాయకులను వెంట తీసుకువెళ్లొచ్చు. కానీ సహాయకుడు అంధులైన ఓటరు ఓటును బహిరంగ పర్చనని నిబంధన 10లో ధృవీకరించాల్సి ఉంటుంది. -
టెన్నిస్‌లో పురుషులకే ఎక్కువసార్లు శిక్ష
లాస్ ఏంజిల్స్: టెన్నిస్ క్రీడలో ఇప్పటిదాకా మహిళల కంటే పురుషులకే ఎక్కువ శిక్షలు, జరిమానాలు పడ్డాయని ఓ నివేదికలో తేలింది. గ్రాం డ్‌స్లామ్ టోర్నీల్లో గత 20 ఏళ్లలో ఆటగాళ్లకు 1517 సార్లు జరిమానాలు విధిస్తే... క్రీడాకారిణిలకు కేవలం 535 సార్లు మాత్రమే జరిమానాలు విధించినట్లు గణాంకాల ద్వారా వెల్లడైంది. 1998 నుంచి 2018 వరకు గ్రాండ్‌స్లామ్ టోర్నీ లను పరిశీలించగా 3 రెట్లు అధికంగా పురుషులకే శిక్షలు పడ్డాయని ఆ నివేదిక పేర్కొంది. ఆటగాళ్లు, క్రీడాకారిణిలు అసహనంతో చేసిన తప్పిదాలకు ఎవరెన్నిసార్లు శిక్షలకు గురయ్యారనే లెక్కలు కూడా ఉన్నాయి. కోర్టులో రాకెట్లను బద్దలు కొట్టిన సందర్భంలో పురుషులు 649 సార్లు, మహిళలు 99 సార్లు పాయింట్ల కోతకు గురయ్యారు. అనుచితంగా నోరు పారేసుకున్న ఘటనల్లో పురుషులు 344 సార్లు, మహిళలు 140 సార్లు, క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించిన ఘటనల్లో పురుషులు 287 సార్లు, మహిళలు 67 సార్లు శిక్షకు గురయ్యారు. గత వారం యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో నయోమి ఒసాకా (జపాన్)తో మ్యాచ్ సందర్భంగా సెరెనా విలియమ్స్ ఒక్కసారిగా సహనం కోల్పో యిన సంగతి తెలిసిందే. చైర్ అంపైర్‌ను దూషించడంతో ఆయన అంతే తీవ్రంగా స్పందించి ఆమెకు పాయింట్ల కోత పెట్టారు. పురుషులు ఇలా చేస్తే అలాగే శిక్షించేవారా అని ఆమె గద్దించింది. సమానత్వం కోసం పోరాడుతున్నానని చెప్పుకొచ్చింది. సెరెనా నోరు పారేసుకోవడం ఇదేమి మొదటి సారి కాదు. 2009లో లైన్ విమెన్‌పై విరుచుకుపడింది. ఈ ఏడాది ఇండియన్ వెల్స్ టోర్నీలో మీడియా సమావేశంలో ఓ విలేకరిపై అసహనం ప్రదర్శించింది. -
శిక్షలకు చెల్లు చీటీ!
గుంటూరు, సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) లో విధి నిర్వహణ కత్తిమీద సాము. బస్సు డిపో నుంచి బయటకు తీసినప్పటి నుంచి మళ్లీ లోపలికి తీసుకెళ్లేవరకు కార్మికులకు క్షణక్షణం పరీక్షలాంటిదే. చార్జీల వసూళ్లలో ఒక్క రూపాయి తగ్గినా, తనకు తెలియకుండా బస్సుకు చిన్న గీత పడినా శిక్షలు పెద్దవిగా ఉండేవి. చిన్న తప్పిదాలకు పెద్ద శిక్షలు పడడంతో కార్మికులతో పాటు కుటుంబసభ్యులూ మానసికంగా క్షోభను అనుభవించేవారు. ఇదంతా గతం. ప్రస్తుతం యాజమాన్యం కార్మికుడు ఆరు తప్పులు చేసినా శిక్షలు వేయకుండా వెసులుబాటు కల్పించింది. చిన్నచిన్న పొరపాట్లకు శిక్షలు వేయకుండా పాయింట్లు కేటాయిస్తుంది. ఆరు తప్పిదాల వరకు ఇంక్రిమెంట్లలో కోత విధించడం, ఏడు తప్పుల తర్వాత విధుల నుంచి తొలగిస్తారు. నిర్ణీత పాయింటు ముగిసిన తర్వాత శిక్షలు అమలు చేస్తారు. కార్మికులకు శిక్షలు తగ్గిస్తూ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు విడుదల చేసిన ఉత్తర్వులపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు శిక్షల విధింపులో మార్పులు తీసుకొచ్చినా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీసీలో తప్పిదాలు,శిక్షలు ఇలా... n బస్సు కండక్టర్ విధి నిర్వహణలో వచ్చిన నగదును అధికారులకు అప్పజెబుతారు. ఈ సమయంలో ఒక్క రూపాయి తక్కువ వచ్చినా సస్పెండ్ లేదా విధుల నుంచి తొలగిస్తారు. n బస్సు డ్రైవర్ తప్పిదం లేకపోయినా కొన్ని సందర్భాల్లో ప్రాణహాని జరుగుతుంది. ఇలాంటి కేసుల్లోనూ తన తప్పిదం లేకపోయినా కార్మికులను సస్పెండ్ చేయడం, విధుల నుంచి తొలగించడం చేస్తున్నారు. n డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అనవసరంగా> కార్మికులకు శిక్షలు వేస్తున్నారు. బ్రీత్ అనలైజర్ యంత్రం సరిగ్గా పనిచేయకపోవడం వలన మద్యం తాగినట్టు చూపుతోంది. ఇలాంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. ఈ తప్పులకు కార్మికులను విధుల నుంచి పక్కన పెట్టడం, ఇంక్రిమెంట్లలో కోత విధిస్తున్నారు. n బస్సు ప్రయాణం సమయంలో విడి భాగాలు పనిచేయకపోయినా, టైరు పగిలిపోయినా కార్మికులకు శిక్షలు అమలు చేస్తున్నారు. తమ ప్రమేయం లేకపోయినా బాధ్యులను చేయడం సరికాదని చెబుతున్నారు. ఈ శిక్షకు వేతనంలో ఇంక్రిమెంట్లో కోత విధిస్తున్నారు. n బస్సు ప్రయాణించే సమయంలో టైరు పగిలితే అజాగ్రత్తగా వ్యవహరించారంటూ రూ.500 వసూలు చేస్తున్నారు. n నిర్దేశించిన కేఎంపీఎల్ సాధించకపోతే జిల్లా కేంద్రానికి శిక్షణ నిమిత్తం పంపుతున్నారు. n స్పీడ్ బ్రేకర్ల ద్వారా బస్సు విడిభాగాలు దెబ్బతింటే ఇంక్రిమెంట్లు, ఇన్సింటివ్లో కోత విధిస్తున్నారు. n సమయపాలన పాటించకపోయినా శిక్షలు అమలు చేస్తున్నారు. శిక్షల తగ్గింపుతోమానసిక ప్రశాంతత ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లుగా విధులు నిర్వహించడం కొంత కష్టంతో కూడుకున్న పనే. కొన్ని సందర్భాల్లో చిన్నపాటి తప్పులకు కూడా శిక్షలు తప్పవు. శిక్షలు వేయడం వలన కార్మికులు మానసికంగా క్షోభ అనుభవిస్తారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఒత్తిడి ఆందోళన, ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. మనస్ఫూర్తిగా పనిచేయవచ్చు. ముఖ్యంగా కార్మికులకు భద్రత ఉంటుంది. –జి.నాగేంద్రప్రసాద్,ఆర్టీసీ ఆర్ఎం, గుంటూరు -
బిగ్‌బాస్‌లో ఈరోజంతా ‘కెవ్వు కేకే’నా?
రోజురోజుకు రసవత్తరంగా మారుతున్న బిగ్‌బాస్ సీజన్2 షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బుధవారం జరిగిన షోలో రెండు టీమ్‌లు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో పోటీపడటం ఆసక్తికరంగా మారింది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు నిన్నంతా బిగ్‌బాస్ హౌస్‌లో కథంతా డబ్బు చుట్టే జరిగింది. ఆ డబ్బును చేజిక్కించుకుని కంటెస్ట్‌గా గెలవాలని తేజస్వీ, కంటెస్టెంట్‌తో పాటు తన టీమే గెలవాలని కౌశల్ టీం ఆడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. చివరగా కంటెస్టెంట్‌గా తేజస్వీ గెలవగా.. కౌశల్, సామ్రాట్ టీమ్స్‌లో కౌశలే విజయం సాధించాడు. గెలిచినందుకు వీరిద్దరికి బిగ్‌బాస్ అభినందనలతో పాటు, ఓ ప్రత్యేకమైన ఓటు హక్కును బహుమతిగా ఇచ్చాడు. సందర్భం వచ్చినప్పుడు ఆ ఓటు హక్కు గురించి వివరిస్తానని బిగ్‌బాస్ వారికి తెలిపాడు. ఇక నేటి షోలో ఇంటి సభ్యులందరూ హుషారుగా ఉన్నట్టున్నారు. కెవ్వు కేక సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ.. కేక పుట్టిస్తున్నారు. బిగ్‌బాస్ హౌజ్‌లో రూల్స్‌ను పాటించడం లేదనీ, ఈ విషయంపై ఓ ఇద్దరిని బిగ్‌బాస్ శిక్షిస్తున్నాడంటూ ఓ ప్రోమోను విడుదల చేశారు. మరి ఆ ఇద్దరు ఎవరో, వారికి విదించిన శిక్షలేమిటో తెలియాలంటే నేటి కార్యకమ్రాన్ని వీక్షించాల్సిందే. -
కుంబ్లేను రంగంలోకి దించిన ఐసీసీ
లండన్: బాల్ ట్యాంపరింగ్, స్లెడ్జింగ్ తదితర పరిణామాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. తప్పులు చేసే క్రీడాకారులకు జరిమానా, చిన్న చిన్న శిక్షలతో సరిపెట్టకూడదని నిర్ణయించింది. ఈ మేరకు భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే నేపథ్యంలో ఓ కమిటీని నియమించింది. ఐదు రోజులపాటు జరిగిన కీలక సమావేశాల వివరాలను గురువారం ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్సన్ మీడియాకు వెల్లడించారు. ‘బాల్ ట్యాంపరింగ్, ఇతర తప్పిదాలకు చిన్న చిన్న శిక్షలు విధించటం వల్లే క్రీడాకారులకు భయం లేకుండా పోతుంది. అవే తప్పులు పునరావృతం అవుతున్నాయి. ప్రత్యర్థులంటే ఆటగాళ్లకి గౌరవం లేకుండా పోతోంది. స్లెడ్జింగ్ పేరుతో మైదానంలో దురుసు చేష్టలకు దిగుతున్నారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. వాటిని శిక్షలు విధించినా ప్రయోజం కనిపించటం లేదు. అందుకే ఇక మీద ఉపేక్షించే ప్రసక్తే లేదు. అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఓ కమిటీని నియమించాం. ప్రస్తుతం ఉన్న నియమావళిని, పెనాల్టీ..శిక్షల తీరును ఇది స్థూలంగా అధ్యయనం చేసి కొత్త ప్రతిపాదనలను సమర్పిస్తుంది. జూన్ 27, జూలై 3వ తేదీల్లో డబ్లిన్‌లో నిర్వహించబోయే సమావేశాల్లో వాటిని సమీక్షించి అమలులోకి తెస్తాం’ అని రిచర్డ్ సన్ తెలిపారు. ఆస్ట్రేలియా ఆటగాళ్ల బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం.. బంగ్లాదేశ్-శ్రీలంక నిదాహాస్ ట్రోఫీ సందర్భంగా నెలకొన్న పరిణామాలపై ఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. -
చుక్కేస్తేనే డ్రైవింగా? డిసెంబర్లోనే అధికం!
ఐటీ సిటీ డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో దూసుకుపోతోంది. సాయంత్రం కాగానే బార్లు, పబ్బులు కిటకిటలాడిపోతుండగా, చీకటిపడేకొద్దీ మందుబాబులు మత్తులో డ్రైవింగ్ చేస్తూ వారితో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రంకెన్ డ్రైవ్ కేసులు తగ్గడం లేదు, ఇంకా పెరుగుతూనే వస్తున్నాయి. సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీ రోడ్లపై మందుబాబులు రెచ్చిపోతున్నారు. తాగి వాహనాలను నడుపుతూ కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. ఇలా ఏకంగా గతేడాది 73,741 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర పోలీసు విభాగం చరిత్రలో ఇదొక రికార్డు. 2016తో పోలిస్తే 25 శాతం అధికంగా కేసులు పెరిగాయి. పోలీసు శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా మందుబాబులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తాం, జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. మందు తాగాక క్యాబ్‌లలో ఇంటికెళ్లాలని, డ్రైవర్ సహాయం తీసుకోవాలని పోలీసు శాఖ మార్గదర్శకాలు సూచిస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఆశ్చర్యకరంగా అధిక సంఖ్యలో స్కూల్ బస్సులు, అంబులెన్సుల డ్రైవర్లు సైతం మద్యం సేవించి పోలీసులకు దొరికిపోతున్నారు. డిసెంబర్లోనే అత్యధిక కేసులు... మూడేళ్లుగా డిసెంబర్ నెలలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కొత్త సంవత్సరం ఊపుతో మద్యం వినియోగం భారీగా పెరుగుతోంది. 2017లో నమోదైన కేసుల్లో 10,517 ఒక్క డిసెంబర్ నెలలో నమోదైనవే. 2016, డిసెంబర్లో 6,666 మంది, 2015 డిసెంబర్లో 9,461 మంది పట్టుబడ్డారు. ఇక డిసెంబర్ 30వ తేదీన నమోదయ్యే కేసుల సంఖ్య మరొక ఎత్తు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఆ రోజు మద్యం అమ్మకాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2016 డిసెంబర్ 30న 1,090 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 2017 డిసెంబర్ 1,187 కేసులు రికార్డు చేశారు. కేసులు 2015 : 62,576 2016 : 59,028 2017 : 73,741 కఠిన శిక్షలు ఉంటేనే మార్పు బెంగళూరు అదనపు ట్రాఫిక్ కమిషనర్ ఆర్.హితేంద్ర మాట్లాడుతూ.. 2017లో రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ‘ఇప్పటివరకు ఇదే అత్యధికం. తనిఖీలను విస్తృతంగా చేపట్టడం వల్ల ఇంత భారీ మొత్తంలో కేసులు వెలుగుచూశాయి. నిందితుల డ్రైవింగ్ లైసెన్సులను రవాణా శాఖ రద్దు చేస్తేనే వారిలో పరివర్తన వచ్చే అవకాశముంది. పట్టుబడితే రూ. 2 వేల జరిమానా కట్టి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మూడు నెలల తర్వాత తిరిగి లైసెన్స్ తెచ్చుకుంటున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తేనే మార్పు వస్తుంది’. -
ముంబై పేలుళ్ల కేసు: దోషులకు శిక్షలు ఖరారు
సాక్షి,న్యూఢిల్లీ: ముంబై అల్లర్ల కేసులో దోషులకు టాడా ప్రత్యేక కోర్టు గురువారం శిక్షలు ఖరారు చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అబూ సలేంకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. సలేంతోపాటు మరో నలుగురికి కూడా కోర్టు శిక్షలు ఖరారు చేసేసింది. అండర్ వరల్డ్ డాన్, గ్యాంగ్ స్టర్ అయిన సలేంను పోర్చుగల్ నుంచి భారత్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడి చట్టాల్లో మరణశిక్ష లేకపోవటంతో ఒప్పందం ప్రకారం ఇక్కడ కూడా సలేంకు అలాంటి శిక్ష విధించే అవకాశం లేకుండా పోయింది. మరో ఇద్దరు దోషులు తెహీర్ మర్చంట్, ఫెరోజ్ ఖాన్ లకు తీవ్ర ఆరోపణల దృష్ట్యా మరణ శిక్షలను ఖరారు చేసేసింది. కరీముల్లా ఖాన్ కు యావజ్జీవ శిక్ష, రియాజ్ సిద్ధిఖీకి 10 ఏళ్ల శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. కేసు ప్రధాన సూత్ర ధారి ముస్తఫా దోసాతోపాటు మరో ఆరుగురిని దోషిగా తేలుస్తూ కోర్టు ఈ యేడాది జూన్ 16న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వంపై యుద్ధం, కుట్రపూరిత నేరం తదితర ఆరోపణలు వీరిపై రుజువయ్యాయి. కానీ, ముస్తఫా గుండెపోటుతో జైల్లోనే మృతి చెందాడు. నిందితులో చాలా మట్టుకు మరణ శిక్ష ఖాయమని కేసు వాదిస్తున్న న్యాయవాది దీపక్ సాల్వీ తీర్పు వెలువడటానికి ముందు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తనపై ఉన్న మిగతా కేసుల దృష్ట్యా తనని ఢిల్లీ జైలుకు తరలించాలని సలేం టాడా కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. దోషులు ఎవరేం చేశారంటే... ముస్తఫా దోసా: భారత్‌కు ఆర్డీఎక్స్ను తీసుకురావటంలో క్రియాశీలకంగా వ్యవహరించాడు. దీంతోపాటుగా కొందరు యువకులను పాకిస్తాన్‌కు పంపి ఆయుధాల వినియోగంలో శిక్షణనిప్పించాడు. అబూ సలేం: ఆయుధాలను గుజరాత్‌నుంచి ముంబైకి తరలించాడు. ఈ కేసులో దోషిగా శిక్ష పూర్తిచేసుకున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు కూడా 1993 జనవరి 16న సలేం ఏకే 56 ఆయుధాలతోపాటు 250 రౌండ్ల బుల్లెట్లు, కొన్ని గ్రనేడ్లను అందించాడు. తిరిగి జనవరి 18న సంజయ్‌దత్ ఇంటికొచ్చి వీటిని అబూసలేం తీసుకెళ్లాడు. తాహిర్ మర్చంట్: పాకిస్తాన్‌కు ఉగ్ర శిక్షణకు వెళ్లాల్సిన యువకులను గుర్తించి వారిని రెచ్చగొట్టాడు. భారత్‌లో అక్రమంగా ఆయుధ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు నిధులను సేకరించాడు. ఫిరోజ్ అబ్దుల్ ఖాన్: ఆయుధాలను తీసుకోవటంలో కస్టమ్స్ అధికారులు, ఏజెంట్లతో మాట్లాడి.. వాటిని జాగ్రత్తగా అనుకున్న లక్ష్యాలకు చేర్చాడు. దీంతోపాటుగా వ్యూహాల్లో భాగస్వామిగా ఉన్నాడు. గతేడాది మే చివర్లో విచారణ సందర్భంగా అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమయ్యాడు. రియాజ్ సిద్దిఖీ: అబూసలేం ఆయుధాలు తరలించేందుకు వాహనాన్ని సమకూర్చటంతోపాటుగా పలు సందర్భాల్లో దోషులకు సహాయంగా వెళ్లాడు. కరీముల్లా ఖాన్: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో దాచిన ఆయుధాలు, డిటోనేటర్లు, గ్రనేడ్లను సరైన వ్యక్తులకు చేరవేయటంలో కీలకంగా వ్యవహరించాడు. దుబాయ్ మీదుగా పాకిస్తాన్‌కు వెళ్లి ఆయుధ శిక్షణ పొందాడు. టైమ్‌లైన్: 12 మార్చి, 1993: గంట వ్యవధిలో 13 చోట్ల బాంబులు పేలి 257 మంది మృతి, 713 మందికి గాయాలు. 19 ఏప్రిల్, 1993: ఏకే–56 రైఫిల్‌ను, 9ఎంఎం పిస్టల్‌ను, తుటాలను అక్రమంగా కలిగి ఉన్నాడనే అభియోగంపై సినీనటుడు సంజయ్‌దత్ అరెస్టు. 15 రోజులకే బెయిల్‌పై విడుదల. 4 నవంబరు 1993: ముంబై క్రైంబ్రాంచ్ ప్రాథమిక చార్జిషీట్ దాఖలు. 189 మందిపై అభియోగాలు. 117వ నిందితుడిగా సంజయ్‌దత్. 19 నవంబరు 1993: ఈ కేసు సీబీఐకి అప్పగింత. 10 ఏప్రిల్ 1994: 26 మందిని నిర్దోషులుగా తేల్చిన టాడా కోర్టు. ఏప్రిల్ 1995 – సెప్టెంబరు 2003: టాడా కోర్టులో విచారణ. అప్రూవర్లుగా మారిన నిందితులు మహ్మద్ జమీల్, ఉస్మాన్ జానకనన్. జూన్ 13 2003: అబూసలేం, ముస్తఫా దోసా సహా ఏడుగురు నిందితులను ప్రధాన కేసునుంచి వేరుచేసి.. విచారణ జరపాలని కోర్టు నిర్ణయం. సెప్టెంబరు 12, 2006: టాడా కోర్టు తీర్పు. యాకూబ్ మెమన్‌తో సహా 12 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు 31 జులై, 2007: సంజయ్‌దత్‌కు ఆరేళ్ల జైలుశిక్ష 21 మార్చి 2013: యాకూబ్ మెమన్‌కు మరణశిక్షను ఖరారు చేసిన సుప్రీం. మరో 10 మంది మరణశిక్ష.. యావజ్జీవ కారాగారశిక్షగా మార్పు. 29 జులై, 2015: యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. 30 జులై, 2015: నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో యాకూబ్ మెమన్‌కు ఉరి అమలు 25 ఫిబ్రవరి, 2016: సత్ప్రవర్తన కారణంగా 8 నెలల శిక్ష తగ్గి జైలునుంచి సంజయ్‌దత్ విడుదల. 16 జూన్, 2017: అబూసలేంతో సహా మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చిన టాడా కోర్టు. 07, సెప్టెంబర్, 2017: ముస్తాఫా చనిపోవటంతో మిగిలిన దోషులకు శిక్షలు ఖరారు చేసేసింది. -
ముంబై కేసు: నిందితులకు శిక్షలు ఖరారు
-
ముంబై పేలుళ్ల కేసు.. జడ్జిమెంట్ డే
ముంబై: మారణహోమం సృష్టించి వందల మంది ప్రాణాలను బలితీసుకున్న ముంబై పేల్లుళ్ల కేసు నిందితులకు శిక్షలు ఖరారు చేసేందుకు టాడా(ఉగ్ర కార్యకలపాల నిరోధక చట్టం) ప్రత్యేక న్యాయస్థానం సిద్ధమయ్యింది. గ్యాంగ్ స్టర్ అబూ సలేంతో సహా ఐదుగురికి సెప్టెంబర్ 7న శిక్షలు ఖరారు చేయనున్నట్లు సమాచారం. పేలుళ్ల కేసులో ఆరుగురిని నిందితులుగా పేర్కొంటూ జూన్ 16, 2017న కోర్టు తీర్పు వెలువరించింది. ముస్తఫా డొస్సా, అబూ సలేం, కరీముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ మరియు తహీర్ మర్చంట్లను దోషులుగా పేర్కొంటూ మరో నిందితుడు అబ్దుల్ ఖయ్యూమ్ ను నిర్దోషిగా పేర్కొంది. అయితే శిక్షలు మాత్రం ఖరారు చేయకపోవటంతో వాదనలు ఇంకా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొద్ది రోజులకే జూన్ 28న ప్రధాన దోషి ముస్తఫా డొస్సా గుండెపోటుతో మృతి చెందాడు. ఇక మిగిలిన వారి శిక్షలు ఖరారు చేసేందుకు సెప్టెంబర్ 7న ముహుర్తం ఖరారైందని తెలుస్తోంది. నేరపూరిత కుట్ర, ప్రభుత్వం వ్యతిరేకంగా యుద్ధానికి పిలుపునివ్వటం, హత్య నేరాలు వారిపై రుజువు అయ్యాయి. తుది తీర్పు సమయంలో దోషుల శిక్ష విషయంలో క్షమాగుణం ప్రదర్శించకుండా కఠిన శిక్షలు ప్రాసిక్యూషన్ కోరింది కూడా. ముస్తాఫాతో సహా నలుగురికి మరణశిక్షలు, అబూతోపాటు రియాజ్ కు జీవిత కాల ఖైదు విధించాలని విజ్నప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి శిక్షలు విధించబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. మార్చి 12,1993 న జరిగిన పేలుళ్లలో సుమారు 275 మంది ప్రాణాలు బలితీసుకున్న ఈ మారణకాండపై తుదితీర్పు 2300-2400 పేజీలతో కోర్టు సిద్ధం చేయటం విశేషం. -
దేశంలో డ్రగ్స్ శిక్షలు
-
'నిర్భయ'తో 'అభయ'మేది?
దేశ రాజధానిలో 2012 డిసెంబర్లో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతంతో యావత్ భారతావనీ గళం విప్పింది. ఢిల్లీ వీధులు దద్దరిల్లే స్థాయిలో జరిగిన ఉద్యమంతో కంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు వర్మ కమిటీని ఏర్పాటు చేసింది. ఆపై దీన్ని పట్టించుకోని కేంద్రం ఆ కమిటీ సిఫార్సుల్ని పొందుపరచకుండా ‘ఉరి’తో కూడిన ఆర్డినెన్స్‌ను అమలులోకి తెచ్చింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పార్లమెంట్లో చర్చించి నిర్భయ చట్టం తీసుకువచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి అమలులోకి వచ్చిన ఈ యాక్ట్‌లో ప్రత్యేకించి ఏర్పాటు చేసినవంటూ పెద్దగా లేవు. అప్పటికే ఐపీసీలో ఉన్న యాసిడ్ దాడులు, ఆత్మగౌరవానికి, స్త్రీ తత్వానికి భంగం కలిగించడం, అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి మహిళా సంబంధిత నేరాలను క్రోడీకరించి ఒకే గొడుకు కిందికి తెస్తూ విస్తృత పరిచింది. ఒక్కో సెక్షన్ కు ఎ,బి,సి,డి, ఇ... ఇలా క్లాజ్లు చేరుస్తూ విపులీకరించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి, నిందితుల్ని కఠినంగా శిక్షించడానికి ఇది ఉపకరిస్తుందని కేంద్రం ప్రకటించింది. అధికారులకూ తెలియని అంశాలెన్నో.. నిర్భయ చట్టంలో ఉన్న కీలకాంశాలపై సాక్షాత్తు పోలీసు అధికారులకే అంతగా అవగాహన ఉండట్లేదు. ఫలితంగా దీని పరిధిలోకి వచ్చే కేసుల్ని సైతం మూస ధోరణిలోనే పాత సెక్షన్ల కిందే నమోదు చేస్తున్నారు. ‘నిర్భయ’లో ఉన్న మూడు అత్యంత సున్నితాంశాల కారణంగా దీని కింద నమోదయ్యే కేసుల్లో శిక్షలు పడే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో వైద్యుల నివేదిక సైతం న్యాయస్థానం లో ఆధారంగా మారుతుంది. ఈ కేసుల దర్యాప్తును రెండు నెలల్లోగా పూర్తి చేసి అభియోగపత్రం దాఖలు చేయాల్సి ఉంటుంది. న్యాయస్థానం సైతం దీని విచారణను ఆరు నెలల్లో పూర్తి చేసి తీర్పు ఇవ్వాలి. సాధారణ కేసుల్లో నిందితులకు ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ అనే అంశం కలిసి వచ్చి నిర్దోషులుగా బయటపడుతుంటారు. అయితే నిర్భయ చట్టం కింద నమోదైన కేసులకు మాత్రం ఇది వర్తించదు. బాధితురాలు చెప్తోంది కాబట్టి కచ్చితంగా నేరం చేసి ఉంటాడనే అంశం పరిగణలోకి వస్తుంది. సాంకేతికంగా దీన్ని ప్రిజెమ్షన్ అంటారు. వీటివల్ల ఈ కేసుల్లో శిక్షల శాతం పెరిగి మరొకరు నేరం చేయడానికి భయపడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నా... అవగాహన లేమి కా రణంగా అనేక కేసులు ‘నిర్భయ’ కింద నమోదు కావట్లేదు. ఇవన్నీ పట్టేదెవరికి? కేంద్ర ప్రభుత్వం అత్యంత శక్తివంతమైందని చెప్పుకున్న నిర్భయ చట్టం అమలులోకి వచ్చినప్పటికీ రోజు రోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘నిర్భయ’పై అవగాహన కల్పించడంలో సర్కారు విఫలం కావడమైతే... మరో కారణం మిగిలిన అంశాలను పట్టించుకోకపోవడం. కేవలం ఓ చట్టాన్ని తీసుకురావడం ద్వారా కుటుంబ, సామాజిక తదితర పరిస్థితుల్లో పూర్తి మార్పు తీసుకురావడమనేది దుర్లభం. ఇవి మారాలంటే సమస్యని లోతుల నుంచి అధ్యయనం చేసి దానికి, పునరావృతం కావడానికి కారణాలను గుర్తించాలి. వాటిని సాధ్యమైనంత వరకు వేళ్లతో సహా పెకిలించి వేయడానికి ప్రయత్నం చేయాలి. మహిళలు, యువతులపై అఘాయిత్యాలకు ప్రధానంగా ఎనిమిది కారణాలు ఉంటున్నాయని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. చట్టం తీసుకువచ్చి చేతులు దులుపుకున్న యంత్రాంగాలు ఈ కీలకాంశాలను పట్టించుకుని మార్పు కోసం ప్రయత్నం చేయకపోవడం కూడా నిర్భయ తర్వాత కూడా అనేక మంది బలికావడానికి కారణంగా మారుతున్నాయి. ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉండాలి.. కేవలం అఘాయిత్యాలు మాత్రమే కాదు స్నేహం, ప్రేమ పేరిట ఆడపిల్లల్ని లోబరుచుకుని, మోసం చేసి, బ్లాక్‌మెయిల్‌కు దిగి వారి జీవితాలతో ఆటలాడటం నిత్యకృత్యంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు రావాలి అంటే ప్రతి స్థాయిలోనూ అది చోటు చేసుకోవాలి. ప్రాథమికంగా ప్రతి ఒక్కరి ఇంటి నుంచే ప్రారంభం కావాలి. ఏదైనా ఉదంతం జరిగినప్పుడు మాత్రం అంతా రోడ్లపైకి వచ్చి తమ వాణి వినిపిస్తున్నారు. ఆ తర్వాత ఆ విషయాన్ని, అవసరమైన మార్పు చేర్పుల్ని మర్చిపోతున్నారు. ఫలితంగానే అఘాయిత్యాల పరంపర కొనసాగుతోంది. అయితే ఎవరికి వారు తమ ఇళ్లల్లో పిల్లలపై శ్రద్ధ పెట్టి పెంచాలి. ఆడపిల్లల్ని గౌరవించడం, మహిళలతో మర్యాదగా ప్రవర్తించడం, సమాజంలో వారికి ఉండాల్సిన సముచిత స్థానం తెలియజేస్తూ సభ్యత, సంస్కారాలు నేర్పించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరిగిన తర్వాత బాధపడేకంటే... జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శిక్షలు ఇలా ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడి చేసి గాయపరిస్తే ఐపీసీ సెక్షన్ 326-ఎ ప్రకారం పదేళ్లు లేదా జీవిత ఖైదు, జరిమానా ఉద్దేశపూర్వకంగా యాసిడ్ దాడికి ప్రయత్నిస్తే ఐపీసీ సెక్షన్ 326-బి ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా స్త్రీ తత్వానికి భంగం కలిగించేలా, అవమానించేలా, దౌర్జన్యం/ బలప్రయోగం చేస్తే ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం ఏడాది నుంచి ఐదేళ్ల వరకు శిక్ష, జరిమానా లైంగిక వేధింపులు (ఫోన్ ద్వారా అయినా), అశ్లీల చిత్రాలు చూపించడం చేస్తే ఐపీసీ సెక్షన్ 354-ఎ ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా దౌర్జన్యం/బలప్రయోగం ద్వారా వివస్త్రను చేస్తే ఐపీసీ సెక్షన్ 354-బి ప్రకారం మూడు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా స్త్రీల రహస్యాంగాలను చాటుగా చూసినా, ఫొటోలు తీసినా ఐపీసీ సెక్షన్ 354-సి ప్రకారం ఏడాది నుంచి ఏడేళ్ల జైలు దురుద్దేశంతో స్త్రీని భౌతికంగా కానీ, ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా కానీ పదేపదే వెంబడిస్తే ఐపీసీ సెక్షన్ 354-డి ప్రకారం ఐదేళ్ల జైలు, జరిమానా మహిళల్ని అక్రమ రవాణా చేసి వ్యభిచారం చేయిస్తే ఐపీసీ సెక్షన్ 370 ప్రకారం ఏడు నుంచి పదేళ్ల జైలు, జరిమానా ఒకరి కంటే ఎక్కువ మందిని/మైనర్‌ను అక్రమ రవాణా చేసి వ్య భిచారం చేయిస్తే గరిష్టంగా 14 ఏళ్లు లేదా జీవితఖైదు విధిస్తారు {పభుత్వ ఉద్యోగి లేదా పోలీసు అధికారి అక్రమ రవాణాకు పాల్పడితే మరణించే వరకు జీవిత ఖైదు అక్రమ రవాణాకు గురైన వారిని వ్యభిచారంలోకి దింపితే ఐపీసీ సెక్షన్ 370-ఎ ప్రకారం ఐదు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376 ప్రకారం ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష లేదా చనిపోయే వరకు జీవిత ఖైదు అత్యాచారం కారణంగా లేదా గాయపరిచిన కారణంగా సదరు మహిళ చనిపోతే ఐపీసీ 376-ఎ ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా మరణించే వరకు జీవిత ఖైదు న్యాయబద్ధంగా విడిపోయి వేరుగా నివసిస్తున్న భార్యను బలాత్కరిస్తే ఐపీసీ సెక్షన్ 376-బి ప్రకారం రెండు నుంచి ఏడేళ్ల జైలు, జరిమానా అధికారాన్ని వినియోగించి మహిళలను లొంగదీసుకుంటే ఐసీపీ సెక్షన్ 376-సి ప్రకారం ఐదు నుంచి పదేళ్ల జైలు, జరిమానా మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే ఐపీసీ సెక్షన్ 376-డి ప్రకారం 20 ఏళ్ల జైలు లేదా చనిపోయే వరకు జీవితఖైదు ఒకటి కంటే ఎక్కువ సార్లు అత్యాచారం చేస్తే ఐపీసీ సెక్షన్ 376-ఇ ప్రకారం మరణించే వరకు జీవితఖైదు మహిళల్ని అల్లరిపెట్టి అవమానపరిస్తే ఐపీసీ సెక్షన్ 509 ప్రకారం మూడేళ్ల జైలు, జరిమానా అఘాయిత్యాలకు ప్రధాన కారణాలివి.. 1. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం 2. విదేశీ సంస్కృతి మోజులో యువత దారి తప్పడం 3. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సరైన సత్సంబంధాలు లేకపోవడం 4. మత్తుమందులు, వ్యసనాలకు బానిసైన యువకులు 5. సినిమా, మాస్ మీడియాల్లో మితిమీరుతున్న అశ్లీల ప్రభావం 6. మహిళల్ని వ్యాపార వస్తువుగా చిత్రీకరిస్తున్న ప్రకటనలు 7. చదువుకునే వయస్సులో తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఆకర్షణ, ప్రలోభాలకు లోను కావడం 8. విపత్కర పరిస్థితుల్లో యువతులు, మహిళలు ఆత్మవిశ్వాసం కోల్పోవటం -
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ :ర్యాగింగ్ పేరిట ఇతరుల జీవితాలతో ఆటలాడుకోవద్దని, ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం కఠిన శిక్షలు పడే అవకాశాలున్నాయని జిల్లా ఎస్పీ మోహన్‌రావు అన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యూనివర్సిటీ లో ర్యాగిం గ్ అవకాశాలు తక్కువేనని, ప్రొఫెషనల్ కళాశాలల్లో ర్యాగింగ్ భూతం ఎక్కువగా ఉంటుందన్నారు. ర్యాగిం గ్ పేరిట సీనియర్లు, జూనియర్లను హింసకు గురిచేయవద్దన్నారు. ర్యాగింగ్ బారిన పడిన వారిలో సున్నిత మనస్కులు చదువు మానేయడం, ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి చేస్తారని ఈ విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. ర్యాగింగ్ నిరోధానికి అమలు చేస్తున్న చట్టాలు, ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి విధిం చే శిక్షలపై అవగాహన కల్పించారు. ఒకసారి ర్యాగింగ్ కేసులో చిక్కుకుంటే భవిష్యత్తు నాశనమైనట్లేనని స్పష్టం చేశారు. విద్యార్థులు తమకు సంబంధం లేని విషయాలు, వేర్పాటు వాదాలకు దూరంగా ఉండి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. యూనివర్సిటీ గౌరవాన్ని విద్యార్థులే కాపాడాలన్నా రు. సామాజిక వెబ్సైట్ల ద్వారా కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని, ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటి పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తమకు వెంటనే ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సోదరభావంతో ఉండాలి.. సీనియర్లు, జూనియర్ల పట్ల సోదరభావంతో మెలిగి, వారు బాగా చదువుకునేలా ప్రోత్సాహం అం దించాలని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి సూచించారు. ర్యాగింగ్‌కు గురైన వారు అవమానంగా ఫీలై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. ర్యాగింగ్ వల్ల చదువు మానుకున్నవారు ఉన్నారని అన్నారు. ఇందుకు ఇదే జిల్లాకు చెందిన ఒక డాక్టర్ కొడుకు ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిన తర్వాత ర్యాగింగ్ బారిన పడి చదువు మానివేసిన ఘటనను ఉదాహరణగా తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో ర్యాగింగ్ పరిస్థితులు లేవన్నారు. అనంతరం ఎస్పీని, రిజిస్ట్రార్ ఘనంగా సన్మానించారు.