ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు
Published Tue, Sep 3 2013 2:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ :ర్యాగింగ్ పేరిట ఇతరుల జీవితాలతో ఆటలాడుకోవద్దని, ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం కఠిన శిక్షలు పడే అవకాశాలున్నాయని జిల్లా ఎస్పీ మోహన్‌రావు అన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యూనివర్సిటీ లో ర్యాగిం గ్ అవకాశాలు తక్కువేనని, ప్రొఫెషనల్ కళాశాలల్లో ర్యాగింగ్ భూతం ఎక్కువగా ఉంటుందన్నారు. ర్యాగిం గ్ పేరిట సీనియర్లు, జూనియర్లను హింసకు గురిచేయవద్దన్నారు.
ర్యాగింగ్ బారిన పడిన వారిలో సున్నిత మనస్కులు చదువు మానేయడం, ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి చేస్తారని ఈ విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. ర్యాగింగ్ నిరోధానికి అమలు చేస్తున్న చట్టాలు, ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి విధిం చే శిక్షలపై అవగాహన కల్పించారు. ఒకసారి ర్యాగింగ్ కేసులో చిక్కుకుంటే భవిష్యత్తు నాశనమైనట్లేనని స్పష్టం చేశారు. విద్యార్థులు తమకు సంబంధం లేని విషయాలు, వేర్పాటు వాదాలకు దూరంగా ఉండి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. యూనివర్సిటీ గౌరవాన్ని విద్యార్థులే కాపాడాలన్నా రు. సామాజిక వెబ్‌సైట్ల ద్వారా కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని, ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటి పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తమకు వెంటనే ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
సోదరభావంతో ఉండాలి..
సీనియర్‌లు, జూనియర్‌ల పట్ల సోదరభావంతో మెలిగి, వారు బాగా చదువుకునేలా ప్రోత్సాహం అం దించాలని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి సూచించారు. ర్యాగింగ్‌కు గురైన వారు అవమానంగా ఫీలై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. ర్యాగింగ్ వల్ల చదువు మానుకున్నవారు ఉన్నారని అన్నారు. ఇందుకు ఇదే జిల్లాకు చెందిన ఒక డాక్టర్ కొడుకు ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిన తర్వాత ర్యాగింగ్ బారిన పడి చదువు మానివేసిన ఘటనను ఉదాహరణగా తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో ర్యాగింగ్ పరిస్థితులు లేవన్నారు. అనంతరం ఎస్పీని, రిజిస్ట్రార్ ఘనంగా సన్మానించారు.
Advertisement