hard
-
కొత్త గనులు రాకపోతే కష్టమే
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి మనుగుడపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్త బొగ్గు గనుల ప్రస్తావన లేకపోవడంతో మరో ఇరవై ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటని సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. విలియమ్ కింగ్ అనే శాస్త్రవేత్త 1870 సంవత్సరంలో బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. ఆనాటి లెక్కల ప్రకారం సుమారు 11వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇందులో ఏ సమస్య ఎదురుకాకుండా తీసే బొగ్గు 3వేల మిలియన్ టన్నులు మాత్రమేనని తేల్చారు. ఇప్పటివరకు సింగరేణి సుమారు 1,600 మిలియన్ టన్నులు వెలికి తీయగలిగింది. ప్రస్తుతానికి సింగరేణి సంస్థ జియాలజికల్ విభాగ లెక్కల ప్రకారం మరో 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలే ఉన్నాయి. ఈ బొగ్గు తీసేందుకు ఇంకో ఇరవై ఏళ్ల సమయం పడుతుంది. ఎప్పటికప్పుడు కొత్త గనులు ప్రారంభిస్తూ వెళితే ఈ కాలపరిమితి పెరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తున్నా, రకరకాల కారణాలతో ఈ వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనడం లేదు. దీంతో ఇరవై ఏళ్ల తర్వాత సింగరేణి పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు. వేలంలో పాల్గొంటే మరో 300 మిలియన్ టన్నులు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ విధానంలో భాగంగా ఎవరైనా సరే వేలంలో పాల్గొంటేనే బొగ్గు గనులు దక్కుతాయి. అయితే సింగరేణి యాజమాన్యం రూ.25 లక్షలు వెచ్చించి టెండర్ ఫారాలు ఖరీదు చేసినా వేలంలో పాల్గొనలేదు. దీంతో కోయగూడెం ఓసీ–3, శ్రావణపల్లి ఓసీతో పాటు సత్తుపల్లి ఓసీలు దూరమయ్యాయి. ఒకవేళ ఇవి దక్కించుకుంటే సుమారు 300 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు సింగరేణికి అందుబాటులోకి ఉండేవి. ఈ మూడు గనుల్లో బొగ్గు నిల్వల గుర్తింపు, ఇతర పనులకు సింగరేణి యాజమాన్యం రూ.60 కోట్లు ఖర్చు చేసినా, వేలంలో మాత్రం పాల్గొనలేదు. భూగర్భగనులతో నష్టం వస్తుందని.. భూగర్భ గనుల ఏర్పాటుతో బొగ్గు ఉత్పత్తికి ఎక్కువ ఖర్చువుతుందని చెబుతున్న యాజమాన్యం ఓసీల ఏర్పాటుకు మొగ్గుచూపుతోంది. ఓసీల ద్వారా అత్యధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని, భూగర్భగనుల్లో అలా సాధ్యం కాకపోవడంతో అటువైపు దృష్టి సారించడం లేదని చెబుతున్నారు. కొత్తగూడెం ఏరియాలో 8, 9, 10, 11వ గనుల్లో మిగిలిన సుమారు 60 మిలియన్ టన్నుల బొగ్గును జీకే ఓసీ ద్వారా 1994 నుంచి 30 ఏళ్ల కాలంలో వెలికి తీయడం పూర్తిచేశారు. ఓసీల ద్వారా ఇంత వేగంగా బొగ్గు తీయడం సాధ్యమవుతున్నా, ఓసీల ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిసి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. పదేళ్లలో ఒక్క గనీ లేదు.. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా, కొత్తగా ఒక్క గనిని కూడా ప్రారంభించలేదు. గతంలో బొగ్గు తీసిన భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్(ఓసీ)లుగా మార్చా రే తప్ప కొత్త ఓసీలు, భూగర్భ గనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. రూ.60 కోట్లు వెచ్చించి సర్వే లు, డ్రిల్లింగ్‌లు వేయించడంతో అధికారులు, కార్మికులు శ్రమదోపిడీకి గురయ్యారే తప్ప ఫలితం రాలే దు. తెలంగాణ వస్తే ఓసీలు ఉండవు..భూగర్భగనులే ఉంటాయని తొలినాళ్లలో చెప్పినా, 2018లో వర్చువల్‌గా ప్రారంభించిన రాంపురం గనిలోనూ ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తి మొదలుకాలేదు. -
పద్నాలుగేళ్లకే ఎలన్ మస్క్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా..
నాలుగైదేళ్లొచ్చినా ఇంకా ముద్దు ముద్దుగా మాట్లాడే పిల్లలే మనకు తెలుసు. అలాంటిది రెండేళ్లకే గలగల మాట్లాడుతూ అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడా బుడతడు. అంతేనా? తొమ్మిదో ఏటనే ‘‘నాది స్కూలు సిలబస్ చదివి, హోం వర్క్ చేసే వయసు కాదు’’ అని చెప్పి ఏకంగా కాలేజీ పుస్తకాలు చేతబట్టాడు. నాలుగేళ్లలో చకచకా డిగ్రీ పూర్తి చేసేశాడు. ప్రస్తుతం పద్నాలుగేళ్ల వయసులో ఎలాన్ మస్క్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు కైరాన్ క్వాజీ. నేటి టెక్నాలజీ టీనేజర్స్ కొందరు అది ఇది అనిచెబుతూ ఎంజాయ్ చేస్తూ సమయాన్ని వృథా చేస్తుంటే.. కైరాన్లాంటి కుర్రాళ్లు మాత్రం వయసుకు మించిన ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు. అత్యంత వేగం, కచ్చితత్వంతో కూడిన ప్రతిభా పాటవాలతో ప్రఖ్యాత స్పేస్ ఎక్స్ కంపెనీ రిక్రూట్మెంట్ టెస్ట్ పాసైన కైరాన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఎంపికవడమేగాక, కంపెనీలోనే తొలి అతిపిన్న ఇంజినీర్‌గా నిలిచాడు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన జూలియా, ముస్తాహిద్ క్వాజీ దంపతులకు 2009 జనవరి 27 కైరాన్ పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉత్సాహంగా ఉండే కైరాన్ను గమనించిన తల్లిదండ్రులు.. చక్కగా ప్రోత్సహించేవారు. తెలివిగా చదువుతూ ..ఏడో ఏట యంగ్వాంక్స్ కోడింగ్ అకాడమిలో చేరి పైథాన్ ప్రోగ్రామింగ్‌ను నేర్చుకున్నాడు. దీంతోపాటు మెషిన్ లెర్నింగ్‌ను కూడా వంటబట్టించుకున్నాడు. తొమ్మిదేళ్లకే కాలేజీ.. నాది స్కూల్ హోం వర్క్ చేసే వయసు కాదని తన ప్రతిభతో తొమ్మిదో ఏటనే లాస్పొసిటాస్ కాలేజీలో చేరి ఈ కాలేజీ చరిత్రలో తొలి పిన్న వయసు విద్యార్థిగా చరిత్ర సృష్టించాడు. ఆ తరువాత పదకొండేళ్లకే మ్యాథమేటిక్స్‌లో డిగ్రీ చదువుతూనే శాంత క్లారా యూనివర్శిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ çకూడా చదివాడు. ఇదే యూనివర్శిటీలో ఈ ఏడాది మాస్టర్స్‌ని పూర్తిచేశాడు. ఇటీవల సాంకేతిక ఫన్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌ను అవలీలగా అధిగమించి స్పేస్‌ఎక్స్‌లోని స్టార్‌లింక్ విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. దేన్నైనా ఇట్టే పట్టేసే గుణగణాలే కైరాన్ని స్పేస్ ఎక్స్ ఉద్యోగిగా మార్చాయి. అందుకే చిన్న వయసులో డిగ్రీలేగాదు, ఉద్యోగాన్ని కూడా కొట్టేశాడు. ప్రతిభ, పట్టుదల, కృషి ఎక్కువ ‘‘కైరాన్ చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు. అ చురుకుదదాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించేవాళ్లం. దాంతో వాడు తన ప్రతిభాపాటవాలకు మరింత పదును పెట్టుకుని టీనేజ్లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మారాడు. లాస్పొసిటాస్ కాలేజీలో చదివేటప్పుడు అకడమిక్ సిలబస్‌ను నేర్చుకోవడమేగాక, స్టాఫ్ అసిస్టెంట్‌గా, స్టెమ్ ట్యూటర్‌గాను పనిచేసేవాడు. ఇతర ట్యూటర్లకు సాయం చేస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. వేసవి సెలవుల్లో సైబర్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్‌షిప్ చేశాడు. దీనితోపాటు బ్లాక్‌బర్డ్ ఏఐలో కూడా ఏఐ ఇంటర్న్‌గా చేశాడు. శాంతక్లారా యూనివర్సిటి, ఇంటెల్ మెంటర్స్ కూడా కైరాన్కు మంచి గైడెన్స్‌ను అందించారు. చేతిరాత, స్పెల్లింగ్, నోట్ టేకింగ్, ఇతర భాషలు నేర్చుకోవడం కాస్త కష్టమైనా.. పట్టుదల, కృషితో నేర్చుకున్నాడు. ప్రస్తుతం బెంగాలీ, మాండరిన్ నేర్చుకుంటున్నాడు. ఎప్పుడు కొత్తదాన్ని నేర్చుకోవడానికి కైరాన్ ఆసక్తి కనబరుస్తాడు. ఆ ఆసక్తే వాడి భవిష్యత్తుని ఉజ్వలంగా తీర్చిదిద్దుతోంది’’ అని కైరా తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. ఇక ‘‘ నా నెక్ట్స్ స్టాప్ ‘స్పేస్ఎక్స్’. ఈ గ్రహంలోనే అత్యంత చక్కని కంపెనీలో స్టార్‌లింక్ ఇంజినీరింగ్ టీమ్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరబోతున్నాను. వయసును బట్టి ఉద్యోగాలలో నియమించే కంపెనీలకు భిన్నంగా, నా ప్రతిభ, పరిపక్వతలను దృష్టిలో పెట్టుకుని స్పేస్ఎక్స్ నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది’’ అని తన లింక్డ్ ఇన్ అకౌంట్ ద్వారా కైరాన్ తన కలల జాబ్ గురించి సంతోషంతో చెప్పుకున్నాడు. (చదవండి: రూ. రెండు కోట్ల ఖర్చుతో 20 కోట్ల లబ్ది.. ‘ఏక్ దిన్ కా సుల్తాన్’.. అంతా గాల్లోనే) -
వంటకు ‘పెద్ద’ కష్టం !
- పెద్దనోట్ల రద్దుతో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కష్టాలు - నగదు నిల్వలు ఉన్నా తీసుకోలేని పరిస్థితి - సరుకుల కొనుగోలుకు అప్పులే దిక్కు కర్నూలు సిటీ: నగదు కష్టాలకు అందరూ అతీతులే అన్నట్లుగా మారింది. పెద్ద నోట్ల మార్పిడితో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న ఏజెన్సీలకు కూడా తాకింది. విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్న వంట ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు ఇవ్వక పోవడంతో పాటు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో ఏజెన్సీల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు అవసరమైన సరుకులు కొనుగోలు చేసేందుకు ఖాతాల్లో నగదు ఉన్నా బ్యాంకుల్లో నగదు కొరతతో తీసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలా చోట్ల ఏజెన్సీలు పెట్టిందే తినాలి అన్నట్లు వ్యవహరిస్తుండడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1928, ప్రాథమికోన్నత పాఠశాలలు 481, ఉన్నత పాఠశాలలు 448 ఉన్నాయి. నోట్ల రద్దుతో నిర్వాహకులకు కష్టాలు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం కింద 2847 వంట ఏజెన్సీలో ఉన్నాయి. నెల రోజులు దాటినా నోట్ల రద్దు సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా చోట్ల కూరగాయాలు, నూనె, కోడి గుడ్లు తదితర వస్తువులను అధిక వడ్డీలకు అప్పులు చేసి కొనుగోలు చేస్తున్నారు. సమస్య ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. కొంత మంది నోట్ల రద్దును సాకు చూపి మెనూ కూడా పాటించడం లేదు. మరి కొన్న చోట్ల అసలు కోడి గుడ్లు అందించడం మానేశారు. రోజూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం: మంగమ్మ, కోసిగి జడ్పీ హైస్కూల్ ఏజేన్సీ నిర్వాహకురాలు . మా స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేందుకు రోజుకు రూ. 1000కి పైగా ఖర్చు అవుతుంది. ఇప్పటికే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మా ఖాతాలో ఉన్న డబ్బును డ్రా చేసేందుకు వెళ్తే పెద్ద పెద్ద క్యూలు ఉంటున్నాయి. రోజు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. వంట చేసేందుకు ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు సమస్యను పరిష్కరించాలి. అప్పులు చేయాల్సి వస్తుంది: భూలక్ష్మమ్మ, నగరపాలక సంస్థ హైస్కూల్, కర్నూలు రోజుకు 900 మందికిపైగా విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్నాం. సరుకులు కొనుగోలు చేసేందుకు అప్పులు చేయాల్సి వస్తుంది. నోట్ల రద్దు వల్ల కూరగాయలు, కిరాణం దుకాణాల్లో ఇప్పటికే ఖాతా పెట్టాం. నెల రోజులు కావడంతో పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే సరుకులు ఇస్తామంటున్నారు. కోడి గుడ్లు కొనుగోలు చేసేందుకు అధిక వడ్డికి అప్పులు తెచ్చాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా: కె. రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ వంట ఏజెన్సీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. ఇప్పటికే ప్రాథమిక స్కూళ్లకు బిల్లులు విడుదల కావడంతో వారికి డబ్బులున్నా డ్రా చేసుకోలేక పోతున్నారు. వారానికి రూ. 24 మాత్రమే బ్యాంకుల నుంచి తీసుకునే అవకాశం ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో కష్టాలు పడుతున్నారు. సమస్య త్వరగా పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తాం. -
మైనింగ్‌కు ‘పెద్ద’ కష్టం
బనగానపల్లె: పెద్దనోట్ల రద్దు ప్రభావం జిల్లాలోని మైనింగ్ పరిశ్రమపై పడింది. దీంతో ఉపాధి కోల్పోయి కూలీలు విలవిల్లాడుతున్నారు. బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో మైనింగ్ అధికారుల లెక్కల ప్రకారం అధికారికంగా సుమారు 1660 నాపరాతి మైనింగ్ గనులు ఉన్నాయి. అనధికారికంగా మరో 300 మైనింగ్ గనులు ఉండగా ఇందులో సుమారు 35వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. మైనింగ్ గనుల్లో ఒక్కొక్కరు రోజుకు 8 గంటలు శ్రమిస్తే మగవారు రూ.350–400లు, ఆడవారు రూ.250–300లు సంపాదించే అవకాశం ఉంది. స్థానికులేకాక ఇతర జిల్లాల నుంచి ఎంతో కాలంగా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. తగ్గిన వ్యాపారాలు.. ఈనెల 8వ తేదీన పెద్దనోట్లను రద్దు చేయడంతో మైనింగ్ యజమానులతోపాటు ఇందులో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొత్తనోట్లు ఇవ్వాలని పేచీ పెట్టడంతో వ్యాపారం స్తంభించిపోయింది. గతంతో పోల్చుకుంటే 60–70 శాతం వ్యాపారం కుంటుపడినట్లు మైనింగ్ యజమానులు వాపోతున్నారు. గనుల్లో మైనింగ్ పనులు చేపట్టకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మైనింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే తమ సొంత ప్రాంతాలకు వెళ్లవలసివస్తుందని వారు వాపోయారు. నిలిచిపోయిన పాలిష్ ఫ్యాక్టరీలు : నియోజకవర్గంలో నాపరాతి పాలిష్ ఫ్యాక్టరీలు సుమారు 1000 వరకు ఉన్నాయి. ఇందులో 9–10వేల మంది కార్మికులు పనిచేస్తున్న విషయం విదితమే. ఈ ప్రభావం పాలిష్ ఫ్యాక్టరీ యజమానులపైనను పడడం వల్ల చాలా వరకు ఇప్పటికే ఫ్యాక్టరీలను నిర్వహించలేక మూసివేశారు. అందులో పనిచేయు కార్మికులకు జీవనోపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు మండలం మైనింగ్ గనులు పాలిష్ఫ్యాక్టరీలు మొత్తం కార్మికులు బనగాననపల్లె 820 300 17000 కొలిమిగుంండ్ల 800 400 18000 అవుకు 150 300 4500 నిర్వహణ ఇబ్బందిగా మారింది : శ్రీను, మైనింగ్ యజమాని, పలుకూరు పెద్దనోట్ల రద్దుతో మైనింగ్ నిర్వహణ ఇబ్బందిగా మారింది. గనుల్లో ఉత్పత్తి అయిన నాపరాయి రవాణా జరగనందున మరికొంత ఉత్పత్తి చేయడం భారంగా మారింది. ఇందులో పనిచేసే కార్మికులకు చిల్లర నోట్లు ఇవ్వడం కష్టంగా మారింది. కుటుంబ పోషణ భారంగా మారింది : చంద్రయ్య, మైనింగ్ కార్మికుడు, అంకిరెడ్డిపల్లె కొలిమిగుండ్ల మండలం మా కుటుంబంలో నేను నా భార్యతోపాటు మరో ముగ్గురు ఉన్నారు. వారం రోజులుగా మైనింగ్ పనులు నిలిచిపోవడంతో ఉపాధి పనులు లేక ఇంటి వద్దనే ఉంటున్నాం. అవసరాల కోసం డబ్బులు లభించడం లేదు. -
హార్ట్ వర్కర్
సంస్థ పేరు ‘హార్డ్’.. పేరుకు తగ్గట్టే దీని సారథి హార్డ్ వర్కర్. కానీ, ఆయన చేసే సేవా కార్యక్రమాలు హార్ట్ టచ్ చేస్తాయి. ఆదిరాజు కృష్ణమోహన్.. చిన్న వయసులోనే 22 దేశాలను చుట్టొచ్చారు. పబ్లిక్కు దగ్గరగా, పబ్లిసిటీకి దూరంగా ఉండే ఆయన.. ఆదరణకు నోచుకోని వృద్ధుల పాలిట పెద్దబిడ్డ. సోషల్ వర్క్ విషయంలో ఆయన పలు దేశాల యువతకు రోల్‌మోడల్. ఆయన బోధించే సామాజిక సేవా పాఠాలు గుండెలకు హత్తుకుంటాయి. కృష్ణమోహన్ నాన్న ఆదిరాజు జగన్నాథరావు హ్యూమన్ యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (హార్డ్) ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు. చిన్నప్పటి నుంచి అవి చూసి సోషల్వర్క్పై కృష్ణమోహన్‌కి ఇంట్రెస్ట్ ఏర్పడింది. చదువుకునే రోజుల్లోనే తనకు తోచిన విధంగా సాయం చేసేవారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషల్‌వర్క్‌లో యూజీ, పీజీ చేశారు. ఇలా మొదలైంది కోటి మొక్కలు నాటినందుకు నోబెల్ బహుమతి అందుకున్న వంగరిమాథై కెన్యాలో స్థాపించిన ‘గ్లోబల్ యంగ్ గ్రీన్’(2007) సంస్థకు భారత్ నుంచి కృష్ణమోహన్ ఫౌండర్ మెంబర్. 2007లో ఆక్స్‌ఫామ్ ఆస్ట్రేలియా ఫెలోషిప్‌కు భారత్ నుంచి కృష్ణమోహన్‌కు అవకాశం వచ్చింది. వివిధ దేశాల్లోని సోషల్ వర్కర్ల పనితీరు, కమ్యూనిటీ ప్రాంతాల్లో ఎలాంటి సర్వీసు చేయవచ్చు.. ఇలా పలు అంశాల్లో మూడేళ్లు శిక్షణ పొందారు. ఈ ట్రైనింగ్ తర్వాత ఆక్స్‌ఫామ్ ఆస్ట్రేలియా ఫెలోషిప్‌కు ఎంపిక చేసిన 20 మందిలో కృష్ణమోహన్ ఒకరు. దేశదేశాల్లో.. సేవా భావనలు.. సామాజిక దృక్పథం నిండిన కృష్ణమోహన్ తర్వాత కాలంలో పలు దేశాల్లో ‘జెండర్ జస్టిస్’పై క్లాసులు తీసుకున్నారు. కమ్యూనిటీ లీడర్షిప్ గురించి సౌత్ అమెరికాలో జాగృతి కల్పించారు. యువత ఎన్జీవోలతో కలసి ఎలా పని చేయవచ్చనే అంశంపై డెన్మార్క్, దక్షిణకొరియా, స్వీడన్ దేశాల్లో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. 2011లో జర్మనీలో జరిగిన పర్యావరణ సదస్సుకు హాజరయ్యారు. అదే ఏడాది తైవాన్ వందేళ్ల ఉత్సవం సందర్భంగా సోషల్ వర్క్‌పై ఆన్లైన్లో ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన ముగ్గురిలో కృష్ణమోహన్ ఒకరు. తైవాన్వాసుల సంస్కృతిపై అధ్యయనం చేసి అక్కడి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించారు. 2012లో మహిళలు-సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్స్ నిర్వహణపై సెనెగల్ దేశంలోట్రైనింగ్ ఇచ్చారు. ఓల్డ్ ఏజ్ హోంల సందర్శన.. ఇంగ్లండ్‌లో ఉన్న మామూలు సీనియర్ సిటిజన్ల కోసం లాంగ్ స్టే హోం, అనారోగ్యంగా ఉన్న వారి కోసం ట్రీట్మెంట్ హోం, అమెరికాలోని అసిస్టెంట్ లివింగ్ హోంలను కృష్ణమోహన్ సందర్శించి వృద్ధాశ్రమాల పనితీరు తెలుసుకున్నారు. అదే అనుభవంతో ఇప్పుడు కొంపల్లి సమీపంలోని దేవర యాంజాల దగ్గర కృష్ణసదన్ ఓల్డ్ ఏజ్ హోం ప్రారంభించారు. వృద్ధులకు బాసట.. ‘కృష్ణసదన్’ వృద్ధులపై శారీరక, మానసిక దాడిలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. వృద్ధాప్యంలో ఉన్న వీరికి ప్రశాంత వాతావరణం కల్పించడానికే కృష్ణసదన్ ఓల్డ్ ఏజ్ హోం ఏర్పాటు చేశాను. పేదరికంలో మగ్గుతున్న ముసలివారు, అన్నీ ఉండి ఆలనాపాలన కరువైన వృద్ధులకుఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నాను. ప్రస్తుతం పూర్తి సమయం దీనికే కేటాయిస్తున్నాను. ఆదరణ లేని వృద్ధులు కనిపిస్తే 8333005264, 8096000008 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చు. - ఆదిరాజు కృష్ణమోహన్, సోషల్ వర్కర్ - వాంకె శ్రీనివాస్ -
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ :ర్యాగింగ్ పేరిట ఇతరుల జీవితాలతో ఆటలాడుకోవద్దని, ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం కఠిన శిక్షలు పడే అవకాశాలున్నాయని జిల్లా ఎస్పీ మోహన్‌రావు అన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యూనివర్సిటీ లో ర్యాగిం గ్ అవకాశాలు తక్కువేనని, ప్రొఫెషనల్ కళాశాలల్లో ర్యాగింగ్ భూతం ఎక్కువగా ఉంటుందన్నారు. ర్యాగిం గ్ పేరిట సీనియర్లు, జూనియర్లను హింసకు గురిచేయవద్దన్నారు. ర్యాగింగ్ బారిన పడిన వారిలో సున్నిత మనస్కులు చదువు మానేయడం, ఆత్మహత్యలకు పాల్పడటం వంటివి చేస్తారని ఈ విషయాలను గుర్తుంచుకోవాలన్నారు. ర్యాగింగ్ నిరోధానికి అమలు చేస్తున్న చట్టాలు, ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి విధిం చే శిక్షలపై అవగాహన కల్పించారు. ఒకసారి ర్యాగింగ్ కేసులో చిక్కుకుంటే భవిష్యత్తు నాశనమైనట్లేనని స్పష్టం చేశారు. విద్యార్థులు తమకు సంబంధం లేని విషయాలు, వేర్పాటు వాదాలకు దూరంగా ఉండి భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని సూచించారు. యూనివర్సిటీ గౌరవాన్ని విద్యార్థులే కాపాడాలన్నా రు. సామాజిక వెబ్సైట్ల ద్వారా కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారని, ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటి పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ర్యాగింగ్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తమకు వెంటనే ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సోదరభావంతో ఉండాలి.. సీనియర్లు, జూనియర్ల పట్ల సోదరభావంతో మెలిగి, వారు బాగా చదువుకునేలా ప్రోత్సాహం అం దించాలని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి సూచించారు. ర్యాగింగ్‌కు గురైన వారు అవమానంగా ఫీలై ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. ర్యాగింగ్ వల్ల చదువు మానుకున్నవారు ఉన్నారని అన్నారు. ఇందుకు ఇదే జిల్లాకు చెందిన ఒక డాక్టర్ కొడుకు ఎంబీబీఎస్‌లో సీటు వచ్చిన తర్వాత ర్యాగింగ్ బారిన పడి చదువు మానివేసిన ఘటనను ఉదాహరణగా తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో ర్యాగింగ్ పరిస్థితులు లేవన్నారు. అనంతరం ఎస్పీని, రిజిస్ట్రార్ ఘనంగా సన్మానించారు.