
కోల్‌కతా: సంచలన ఆర్జీకర్ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కోల్‌కతా హైకోర్టుకు తన నివేదిక సమర్పించింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చెబుతూనే.. సామూహిక హత్యాచారం జరిగిందన్న వాదనను తోసిపుచ్చింది.
పశ్చిమ బెంగాల్‌లోని ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రిలో హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో యువ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి. అయితే అలాంటిదేమీ లేదని తాజాగా సీబీఐ ధృవీకరించింది.