
సాక్షి, హైదరాబాద్: నేరస్తులకు శిక్షలు పడేలా నేర నిరూపణలో సాంకేతికత వినియోగాన్ని మరింత పెంచాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. ఈ మేరకు సిబ్బందికి అవగాహన పెంచాలని కోరారు.
డీజీపీ కార్యాలయంలో శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో హైకోర్టు అడ్వొకేట్ జనరల్ బి.శివప్రసాద్, ఇతర ప్రభుత్వ ప్లీడర్లతో పలు అంశాలపై చర్చించారు. సమీక్షలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ లీగల్ కె.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడు నెలలకోసారి ఈ తరహా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.