Source: Airbus

వాహన రంగంలో దాదాపు అన్ని సంస్థలు అప్డేట్ వెహికల్స్ ప్రవేశపెడుతున్నాయి. అయితే విమానాయాన రంగంలోని ఎయిర్‌బస్ మాత్రం దశాబ్దాలుగా చెప్పుకోదగ్గ రీతిలో పెద్ద మార్పులు చేయలేదు. అయితే ఇప్పుడు ఈ సంస్థ రేపటి కోసం (భవిష్యత్తు కోసం) సరికొత్త విమానాలను రూపొందిస్తోంది. టౌలౌస్‌లో జరిగిన ఎయిర్‌బస్ సమ్మిట్ 2025లో కొత్త టెక్నాలజీతో రూపొందించనున్న విమానాలను ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎయిర్‌బస్ విమానాలు చాలా ఏళ్లుగా చెప్పుకోదగ్గ మార్పులకు గురి కాలేదు. అయితే రాబోయే రోజుల్లో విమానయాన సంస్థలు కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకెళ్లనున్నాయి. కాబట్టి ఎయిర్‌బస్ తన వేగాన్ని పెంచింది. తదుపరి తరం ఎయిర్‌బస్ విమానాలలో పక్షుల రెక్కలను అనుకరించే రెక్కలు ఉంటాయి. ఇవి తేలికగా, సన్నగా, పొడవుగా ఉంటాయి.
వింగ్ ఆఫ్ టుమారో (WoT) పరిశోధన అండ్ టెక్నాలజీ కార్యక్రమానికి నిలయంగా ఉన్న ఇంగ్లాండ్‌లోని ఫిల్టన్‌లోని ఎయిర్‌బస్ వింగ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌లో జరిగిన పని ఆధారంగా, కొత్త రెక్కలు తక్కువ డ్రాగ్ కోసం ఎక్కువ లిఫ్ట్‌ను ఉత్పత్తి చేస్తాయి. పొడవైన రెక్కలను ఆఫ్‌సెట్ చేయడానికి ఉపయోగపడతాయికి. ఇవి ఫోల్డ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి.
ఎయిర్‌బస్ కొత్త జెట్ ఇంజిన్‌ను కూడా ఆవిష్కరించనుంది. ఇది ఇప్పుడున్న వాటికంటే పెద్దవిగా ఉండటమే కాకుండా.. ఇంధన వినియోగాన్ని కూడా 20 శాతం తగ్గిస్తాయి. కొత్త ఇంజిన్లతో పాటు, ఎయిర్‌బస్ హైబ్రిడైజేషన్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. మరోవైపు కార్బన్-ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్స్ (CFRP) స్థానంలో కార్బన్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ థర్మోప్లాస్టిక్ పాలిమర్ కాంపోజిట్స్ (CFRTP) ఉపయోగించాలని అనుకుంటోంది.