
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు మంగళవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు అధికారులు. విచారణలో శ్రద్ధను తానే చంపానని అఫ్తాబ్ అంగీకరించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) అధికారులు వెల్లడించారు. అయితే తాను ఇలా చేసినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అతను చెప్పాడని పేర్కొన్నారు.
అంతేకాదు తాను చాలా మంది అమ్మాయిలలో డేటింగ్ చేసినట్లు పాలిగ్రాఫ్ టెస్టులో అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. శ్రద్ధను హత్య చేసిన అనంతరం శవాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసినట్లు వివరించాడు. పాలిగ్రాఫ్ టెస్టు సమయంలో అఫ్తాబ్ సాధారణంగానే ప్రవర్తించాడని ఫోరెన్సిక్ అధికారులు చెప్పారు.
పాలిగ్రాఫ్ టెస్టుకు ముందు రోజు అఫ్తాబ్‌పై కొందరు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అతడ్ని వాహనంలో తీసుకెళ్తుండగా.. వెంబడించారు. దీంతో పటిష్ఠ భద్రత నడుమ అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు.
చాలా కాలంగా సహజీవనం చేస్తున్న శ్రద్ధను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె శవాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత రోజూ కొన్ని శరీర భాగాలు తీసుకెళ్లి అడవిలో పడేశాడు. మే 18న జరిగిన ఈ హత్యోదంతం ఆరు నెలల తర్వాత వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసులో నవంబర్ 12న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి నవంబర్ 22న ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అనంతరం కస్టడీని మరో 13 రోజులు పొడిగించింది. నార్కో టెస్టు కూడా నిర్వహించేందుకు అనుమతించింది. డిసెంబర్ 1న ఈ పరీక్ష జరగనుంది.
చదవండి: లిక్కర్ స్కాం కేసు.. సిసోడియా సన్నిహితుడు అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment