regret
-
పశ్చాత్తాపంలో దొంగ.. చోరీ విగ్రహాలను తిరిగి ఇచ్చేసి..
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విచిత్రమైన చోరీ ఉదంతం వెలుగు చూసింది. ఇటీవల ప్రయాగ్‌రాజ్ పరిధిలోని శృంగవేర్పూర్ ధామ్‌లోని గోఘాట్ ఆశ్రమం వద్దనున్న శ్రీరామ జానకి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయ తాళం పగులగొట్టి అష్టధాతువులతో తయారు చేసిన 100 ఏళ్ల రాధాకృష్ణుల విగ్రహాన్ని చోరీ చేశారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. అయితే ఈ చోరీకి పాల్పడ్డ దొంగ వారం రోజుల తరువాత ఆలయానికి కొద్దిదూరంలో రోడ్డుపై రాధాకృష్ణుల విగ్రహాలను, ఒక లేఖను ఉంచి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు ఆ విగ్రహాల గురించి ఆలయ సిబ్బందికి తెలియజేశారు. అక్కడ లభ్యమైన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో సదరు దొంగ క్షమాపణలు చెబుతూ.. రాధాకృష్ణుల విగ్రహాలను దొంగిలించాక తన కుమారుడు అనారోగ్యానికి గురయ్యాడని, పీడకలలతో బాధపడుతున్నాడని’ రాశాడు. తాను అప్పగించిన విగ్రహాలను ఆలయంలో తిరిగి అదోచోట ఉంచాలని ఆ దొంగ వినయపూర్వకంగా కోరాడు.ఇది కూడా చదవండి: ఆర్జేడీ నేతపై కాల్పులు.. పరిస్థితి విషమం -
Ukraine-Russia war: నాటో నాటో.. ఎప్పుడో ఎప్పుడో!
ఎస్.రాజమహేంద్రారెడ్డి: నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశాల సమావేశం ఉక్రెయిన్ ఆశలపై నీళ్లు చల్లింది. నాటో.. నాటో అంటూ కలవరించిన ఉక్రెయిన్ ఇప్పుడు నాటు.. నాటు అనక తప్పడం లేదు. గతేడాది మాడ్రిడ్‌లో జరిగిన సమావేశం అనంతరం స్వీడన్, ఫిన్లండ్లను కూటమిలో చేర్చుకుంటున్నట్టు నాటో ప్రకటించింది. ఆ రెండు దేశాలు జూలై 11, 12 తేదీల్లో లిథువేనియాలో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యాయి. ఇదే బాటలో నాటో కూటమి తమను కూడా అక్కున చేర్చుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆశించారు. కానీ ఆయన అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి! ఉక్రెయిన్ భవిష్యత్తు తమతోనే ముడిపడి ఉంటుందని సమావేశం చివరి రోజు నాటో పేరుకు ఒక ప్రకటన చేసినా, ఆ భవిష్యత్తు ఎప్పుడు ఆరంభమవుతుందో మాత్రం స్పష్టం చేయలేదు. దాదాపు 500 రోజులకు పైగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు పశి్చమ దేశాలు ఆయుధ సామగ్రితో పాటు యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లను సమకూరుస్తూ అండగా ఉన్నప్పటికీ, ఆ సాయం వెనక ఆయా దేశాల ఊగిసలాట ధోరణి జెలెన్స్కీని కలవరపరుస్తూనే వస్తోంది. ప్రతిదానికీ చేతులు జోడించి ఎదురు చూడాల్సి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు. నాటో కూటమిలోకి ప్రవేశం దక్కితే ఈ అవస్థ ఉండదన్నది జెలెన్స్కీ ఆలోచన. నిజానికి నాటోలో చేరితే ఉక్రెయిన్ రక్షణ బాధ్యతను కూటమి దేశాలన్నీ సంయుక్తంగా మోయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ భవితవ్యాన్ని, రష్యాతో జరుగుతున్న యుద్ధ గమనాన్ని శాసించే నాటో సభ్యత్వ వ్యవహారంలో నిజానికి ఏం జరిగింది? ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చేందుకు ఎందుకు నాటో పచ్చజెండా ఊపలేదు? అసలు జెలెన్స్కీ ఆశించిందేమిటి? వివరాల్లోకి వెళ్దాం... అనుకున్నదొక్కటి... జెలెన్స్కీ ఏం ఆశిస్తున్నదీ సుస్పష్టం. గత సెపె్టంబరుకు ముందు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కావాలన్న తన అభ్యర్థనను 2023 జూలైలో లిథువేనియాలో జరిగే కూటమి సమావేశంలో వ్యక్తం చేస్తానని అన్నారు. కానీ ఈ వ్యాఖ్యల్లో మొక్కుబడితనమే తప్ప గాఢమైన కోరికేమీ ధ్వనించలేదు. ఉక్రెయిన్ ప్రాంతాలైన లుహాన్స్్క, డొనెట్స్్క, ఖెర్సన్, జపోరిజియాలను తమ భూభాగాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత సెపె్టంబరులో ప్రకటించగానే జెలెన్స్కీ స్వరం మారిపోయింది. నాటోలో తమకు పూర్తి సభ్యత్వమిచ్చే అంశాన్ని ఆగమేఘాల మీద పరిశీలించాల్సిందిగా జెలెన్స్కీ అభ్యరి్థంచడం మొదలెట్టారు. అంటే నాటో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ సీరియస్‌గా ఆశిస్తున్నది కేవలం ఏడాది క్రితం నుంచేనని సుస్పష్టం. నాటో మార్గదర్శకాల ప్రకారం యూరప్‌లోని ఏ దేశమైనా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పన్నెండు దేశాల కూటమిగా మొదలైన నాటో సభ్య దేశాల సంఖ్య ఇప్పుడు 32కు పెరిగింది. లిథువేనియాలోని విలి్నయస్లో జరిగిన నాటో భేటీకి హాజరైన జెలెన్స్కీ పనిలో పనిగా లుకిస్కస్ స్క్వేర్‌లో జరిగిన ఓ సభలో తమ అభీష్టాన్ని అక్కడి జనాలతో పంచుకున్నారు. సభా వేదికపై ‘ఉక్రెయిన్–నాటో 33’ నినాదాన్ని కూడా ప్రదర్శించడం విశేషం. నాటో నేతలకే ఇష్టం లేదు...! లుకిస్కస్ స్క్వేర్ సభా వేదికపై ప్రదర్శితమైన ‘ఉక్రెయిన్–నాటో 33’ బ్యానర్ అక్కడివారి మది దోచినా, ఉక్రెయిన్ మెడలో ఇప్పటికిప్పుడే ‘నాటో–33’ గుర్తింపు కార్డు పడటం మాత్రం నాటో నేతల్లోనే చాలామందికి అసలు ఇష్టం లేదు. అందుకే ‘అప్పుడే కాదం’టూ ఉక్రెయిన్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు ఉక్రెయిన్‌కు సభ్యత్వాన్ని మంజూరు చేస్తే నాటో దేశాలన్నీ రష్యాపై ప్రత్యక్షంగా యుద్ధ బరిలోకి దిగాల్సి వస్తుంది. నాటో నిబంధనల ప్రకారం ఏ సభ్య దేశంపై దాడి జరిగినా కూటమిలోని దేశాలన్నీ సంయుక్తంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. నాటో నిబంధనల్లోని ఆరి్టకల్–5 ఈ విషయాన్ని స్పష్టంగా నిర్దేశించింది. నాటో చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి, అమెరికాపై 9/11 ఉగ్ర దాడులు జరిగినప్పుడు ఈ నిబంధన అమలైంది. ఒకవేళ ఇప్పుడు గనక ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తే కూటమిలోని మిగతా 32 దేశాలూ రష్యాపై యుద్ధానికి దిగాల్సి వస్తుంది. ‘నాటో దేశాల భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. ఇప్పుడు యుద్ధం నడిమధ్యలో ఉంటే తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఆ మాటకొస్తే ఇప్పుడు మేమంతా రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాటో కూటమి తమ సభ్య దేశాల పట్ల ఎంతటి అంకితభావంతో ఉంటుందో బైడెన్ ఈ వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటారు. అయితే బైడెన్ వ్యాఖ్య వెనక అసలు ఉద్దేశాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జెన్ వాలెస్ కుండబద్దలు కొట్టారు. ‘ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్న దేశాన్ని ఇప్పటికిప్పుడు కూటమిలోకి ఆహా్వనించలేం. అలా చేయడం మొత్తం కూటమినీ యుద్ధభూమిలోకి లాగడమే అవుతుంది’’ అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పారు. యుద్ధం ముగిశాక గెలుపోటములతో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరగా ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సభ్యత్వానికి నాటో ఇలా సూత్రప్రాయంగా అంగీకరించినా అధికార ముద్ర ఎప్పుడు పడుతుందో చెప్పలేం. యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్‌కు నాటో మోక్షం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నా, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది మాత్రం అస్పష్టం! జెలెన్స్కీకీ ముందే తెలుసు...! యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం రావడం కల్లేనని జెలెన్స్కీకీ తెలుసు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఆయన పదేపదే నాటో సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం మాటే ఉండదు. మాకది ఇష్టం లేక కాదు, కానీ అసాధ్యం’ అని జెలెన్స్కీ ఐదారు నెలల క్రితం కీవ్‌లో తన మనసులో మాటను సుస్పష్టంగా చెప్పారు. అయితే యుద్ధం ముగిసిన వెంటనే నాటో సభ్యత్వం లభించేలా ఓ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసుకోవడానికే పదేపదే ఇలా సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సభ్యత్వంపై ఎటూ తేల్చని నాటో కనీసం ఆ దిశగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించకపోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడిని నిరాశకు గురి చేసింది. ఇది ఒకరకంగా ఉక్రెయిన్ను ఆగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టిందనే భావించాలి. ఉక్రెయిన్ ఉక్రెయిన్‌గా నిలవాలంటే యుద్ధాన్ని గెలవాలి, లేదా రష్యాతో సంధి కుదుర్చుకోవాలి. ఈ రెండు పరిస్థితుల్లోనే ఉక్రెయిన్ నాటోలో చేరగలుగుతుంది. ఓడిపోతే ఉక్రెయిన్ రష్యాలో అంతర్భాగంగా మారిపోతుంది. అప్పుడిక దానికి నాటో ప్రస్తావన అవసరమే లేకుండా పోతుంది. గెలుపోటములను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటిదాకా ‘అయితే గియితే’లో ఉన్న నాటో సభ్యత్వ అంశం ‘ఆ సుదినం ఎప్పుడు’ అనేదాకా అయితే వచి్చంది. ప్రస్తుతానికి ఉక్రెయిన్‌కు ఊరటనిచ్చే విషయం ఇదొక్కటే. యుద్ధం త్వరలో ఓ కొలిక్కి వచ్చి ఉక్రెయిన్‌కు నాటో తలుపులు తెరుకోవాలని కోరుకుందాం! తెరుచుకుంటాయనే ఆశిద్దాం!! -
'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా'
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు మంగళవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు అధికారులు. విచారణలో శ్రద్ధను తానే చంపానని అఫ్తాబ్ అంగీకరించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) అధికారులు వెల్లడించారు. అయితే తాను ఇలా చేసినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అతను చెప్పాడని పేర్కొన్నారు. అంతేకాదు తాను చాలా మంది అమ్మాయిలలో డేటింగ్ చేసినట్లు పాలిగ్రాఫ్ టెస్టులో అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. శ్రద్ధను హత్య చేసిన అనంతరం శవాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసినట్లు వివరించాడు. పాలిగ్రాఫ్ టెస్టు సమయంలో అఫ్తాబ్ సాధారణంగానే ప్రవర్తించాడని ఫోరెన్సిక్ అధికారులు చెప్పారు. పాలిగ్రాఫ్ టెస్టుకు ముందు రోజు అఫ్తాబ్‌పై కొందరు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అతడ్ని వాహనంలో తీసుకెళ్తుండగా.. వెంబడించారు. దీంతో పటిష్ఠ భద్రత నడుమ అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. చాలా కాలంగా సహజీవనం చేస్తున్న శ్రద్ధను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె శవాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచాడు. ఆ తర్వాత రోజూ కొన్ని శరీర భాగాలు తీసుకెళ్లి అడవిలో పడేశాడు. మే 18న జరిగిన ఈ హత్యోదంతం ఆరు నెలల తర్వాత వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నవంబర్ 12న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి నవంబర్ 22న ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అనంతరం కస్టడీని మరో 13 రోజులు పొడిగించింది. నార్కో టెస్టు కూడా నిర్వహించేందుకు అనుమతించింది. డిసెంబర్ 1న ఈ పరీక్ష జరగనుంది. చదవండి: లిక్కర్ స్కాం కేసు.. సిసోడియా సన్నిహితుడు అరెస్ట్ -
సంక్రాంతికి సొంతూరెళ్లాలంటే కష్టాలే!
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండగకు సొంతూరు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్న నగరవాసులకు వెయిటింగ్ లిస్ట్ నిరాశకు గురి చేస్తోంది. సాధారణంగా రైళ్లలో మూడు నెలల ముందే రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. కానీ.. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లల్లో జనవరి నెలాఖరు వరకు ఇప్పటికే రిజర్వేషన్లు బుక్ అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో 150 నుంచి 250 వరకు వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తుండగా, కొన్ని రైళ్లు ‘రిగ్రేట్’ అంటూ చేతులెత్తేస్తున్నాయి. దీంతో సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లేందుకు ఈసారి ఇబ్బందులు తప్పేలాలేవు!. మరోవైపు జనవరి నెలలోనే ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు శబరికి వెళ్లనున్నారు. దీంతో రైళ్ల కొరత సవాల్‌గా మారింది. డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు, ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. భారీగా పెరిగిన ప్రయాణాలు.. కోవిడ్ అనంతరం ప్రయాణాలు భారీగా పెరిగాయి. అన్ని రైళ్లలో పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరిగింది. రెండు, మూడేళ్ల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకున్న నగరవాసులు ఈ ఏడాది విరివిగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో సహజంగానే రైళ్లకు డిమాండ్ పెరిగింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి సాధారణ రోజుల్లో సుమారు 2.2 లక్షల మంది రాకపోకలు సాగిస్తే వరుస సెలవులు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో 2.5 లక్షల మందికిపైగా బయలుదేరుతున్నారు. ఏపీతో పాటు ఉత్తరాది రైళ్లకు సైతం డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రతి రోజు 85కుపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో 100 ప్యాసింజర్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్ట్ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ప్రయాణం కష్టమే... సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో జనవరి వరకు అన్ని బెర్తులు బుక్ అయ్యాయి. థర్డ్ ఏసీలో బుకింగ్‌కు అవకాశం కూడా లేకుండా రిగ్రేట్ దర్శనమిస్తోంది. ఈస్ట్‌కోస్ట్, విశాఖ, గోదావరి, కోణార్క్, తదితర అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ 150పైనే కనిపించడం గమనార్హం. ఉత్తరాది వైపు వెళ్లే దానాపూర్, పట్నా ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ నిరీక్షణ జాబితా వందల్లోకి చేరింది. ఇదీ చదవండి: మునుగోడు.. 10 వేలకు పైగా ఓటరు దరఖాస్తుల తిరస్కరణ -
బైడెన్ కాలికి గాయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన(ప్రెసిడెంట్ ఎలెక్ట్) జోబైడెన్ కుక్కతో ఆడుకుంటూ జారిపడడంతో కాలికి గాయమైంది. ఆయన పాదంలో వెంట్రుకవాసి ఫ్రాక్చర్‌ను వైద్యులు గుర్తించారు. ఇది నయమయ్యేవరకు కొన్ని వారాల పాటు ఆయన వాకింగ్ బూట్ ధరించాల్సిఉంటుంది. బైడెన్ పెంచుకునే రెండేళ్ల వయసున్న జర్మన్ షెపర్డ్ కుక్క మేజర్‌తో ఆయన శనివారం ఆడుకుంటుండగా పాదం మెలికపడి జారిపడ్డారు. ఇటీవలే ఆయన 78వ పుట్టినరోజు జరుçపుకున్నారు. బైడెన్ జారిపడడంపై ట్రంప్ విచారం వ్యక్తం చేస్తూ ‘‘గెట్ వెల్ సూన్’’ అని ట్వీట్ చేశారు. నీరా టాండన్‌కు కీలక పదవి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై, త్వరలో బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ తన పరిపాలనా బృందాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. కీలకమైన ఆఫీస్ ఆఫ్ ద మేనేజ్మెంట్, బడ్జెట్ డైరెక్టర్‌గా ఇండియన్–అమెరికన్ నీరా టాండన్(50), ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్(74) పేర్లను సోమవారం ఖరారు చేశారు. వీరు బైడెన్ ఆర్థిక బృందంలో సేవలందించనున్నారు. ఈ నియామకాలకు అమెరికా సెనేట్ ఆమోద ముద్ర వేస్తే జానెట్ యెల్లెన్ కొత్త చరిత్ర సృష్టిస్తారు. 231 సంవత్సరాల అమెరికా చరిత్రలో ఆర్థిక విభాగాన్ని ముందుకు నడిపించే తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందుతారు. అలాగే నీరా టాండన్ కూడా మరో ఘనత దక్కించుకుంటారు. ఆఫీస్ ఆఫ్ ద మేనేజ్మెంట్, బడ్జెట్ డైరెక్టర్‌గా నియమితులైన తొలి శ్వేత జాతేతర మహిళగా, తొలి ఇండియన్–అమెరికన్‌గా రికార్డుకెక్కుతారు. నీరా టాండన్‌కు కేబినెట్ స్థాయి పదవి దక్కుతుండడం భారతీయ అమెరికన్లకు గర్వకారణమని వెంచర్ క్యాపిటలిస్టు ఎంఆర్ రంగస్వామి చెప్పారు. ఆర్థికశాఖ సహాయ మంత్రిగా వాలీ అడెయెమో, కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ చీఫ్‌గా సెసీలియా రౌస్‌ను బైడెన్ ఖరారు చేశారు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా జెన్‌సాకీ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా జెన్సాకీని నియమిస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు. దీంతోపాటు తన ప్రభుత్వంలో కమ్యూనికేషన్ టీమ్‌లో మొత్తం మహిళలే ఉంటారని తెలిపారు. ఈ బృందంలో భాగంగా కేట్ బెడింగ్ఫీల్డ్ను వైట్‌హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా, కరేన్జీన్పియర్ను ప్రిన్సిపిల్ డిప్యుటీ ప్రెస్ సెక్రటరీగా, సైమోన్ సాండర్స్‌ను సీనియర్ అడ్వైజర్‌గా, ఎలిజబెత్ ఈ అలెగ్జాండర్‌ను ప్రథమ మహిళకు కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా, పిలి టోబర్ను డిప్యూటీ వైట్‌హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా, ఆష్లే ఎట్నిని ఉపాధ్యక్షురాలి కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా నియమించారు. బాధ్యతల స్వీకార కార్యక్రమ కమిటీ అధ్యక్షుడిగా వచ్చే జనవరి 20న జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్ల కమిటీని బైడెన్ వెల్లడించారు. కమిటీ సీఈవోగా డెలావర్ స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ టోనీ అల్లెన్ను, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన మజు వర్గీస్‌ను ప్రకటించారు. -
అమితాబ్‌పై అమర్‌సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం పట్ల ప్రవర్తించిన తీరుకు సమాజ్‌వాదీ పార్టీ మాజీ నాయకుడు అమర్‌సింగ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘బిగ్ బి’ పట్ల అతిగా ప్రవర్తించానని ఒప్పుకున్నారు. ‘ఈరోజు నా తండ్రి వర్ధంతి సందర్భంగా అమితాబ్ బచ్చన్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. ఒకానొక సమయంలో మృత్యువు అంచుల వరకు వెళ్లొచ్చాను. చావుతో పోరాడి ఇప్పుడిలా ఉన్నాను. అమితాబ్‌బచ్చన్, ఆయన కుటుంబం పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నాను. వారిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను’ అని అమర్‌సింగ్ ట్వీట్ చేశారు. మూత్రపిండం పాడవడంతో కొన్నేళ్ల క్రితం ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఒకప్పుడు అమితాబ్‌కు ఆప్తుడిగా మెలిగారు. అయితే అమితాబే తమ స్నేహానికి ముగింపు పలికారని గతంలో అమర్ సింగ్ వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. 2017లో ఓ ఇంటర్వ్యూలో అమర్‌సింగ్ మాట్లాడుతూ.. అమితాబ్, జయబచ్చన్ వివాహ సంబంధం సవ్యంగా సాగడం లేదని, వారిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని వ్యాఖ్యానించి కలకలం రేపారు. జయబచ్చన్ సమాజ్‌వాదీ పార్టీ సభ్యత్వాన్ని అంగీకరించొద్దని తనను అమితాబ్ హెచ్చరించారని అప్పట్లో అమర్‌సింగ్ తెలిపారు. అంతేకాదు అమితాబ్ అప్పుల్లో ఉన్నప్పుడు తాను ఎంతో సహాయం చేశానని, తాను జైలులో ఉన్నప్పడు కనీసం చూడటానికి కూడా రాలేదని వాపోయారు. తనకు బెయిల్ వచ్చిన తర్వాతే చూడటానికి వచ్చారని, అప్పుటికే తన మనసు విరిగిపోయిందని.. అమితాబ్‌తో మాట్లాడటానికి మనసు రాలేదన్నారు. మనుషులు ఇంత అవకాశవాదులుగా ఉంటారా అని అమర్ సింగ్ వాపోయారు. అయితే అమితాబ్, ఆయన కుటుంబం పట్ల తానే అత్యుత్సాహం ప్రదర్శించానని తాజాగా అమర్‌సింగ్ విచారం వ్యక్తం చేశారు. (రిక్షా కార్మికుడికి ప్రధాని మోదీ సర్ప్రైజ్) -
తుది మెట్టుపై బోల్తా
న్యూఢిల్లీ: స్వదేశంలో వరుసగా రెండో ఏడాది ఇండియా ఓపెన్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్‌తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 18–21, 21–11, 20–22తో పరాజయం పాలైంది. 69 నిమిషాలపాటు సాగిన ఈ తుది పోరులో సింధు నిర్ణాయక మూడో గేమ్‌లో మ్యాచ్ పాయింట్‌ను చేజార్చుకోవడం గమనార్హం. తన కెరీర్లో సింధుపై జాంగ్‌కిది వరుసగా రెండో విజయం. గతేడాది ఇండోనేసియా ఓపెన్‌లోనూ సింధును జాంగ్ ఓడించింది. వీరిద్దరు ముఖాముఖిగా ఐదుసార్లు తలపడగా... సింధు మూడుసార్లు, జాంగ్ రెండుసార్లు గెలిచారు. ఐదు మ్యాచ్‌లు కూడా మూడు గేమ్‌లపాటు జరగడం విశేషం. విజేతగా నిలిచిన జాంగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 83 వేలు), 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 53 వేలు), 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చైనాలో జన్మించిన 27 ఏళ్ల బీవెన్ జాంగ్ 2007 నుంచి 2013 వరకు సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2013 నుంచి అమెరికా తరఫున ఆడుతోంది. క్వార్టర్ ఫైనల్ మినహా మిగతా మ్యాచ్‌ల్లో అలవోక విజయాలు సాధించిన సింధుకు ఫైనల్లో గట్టిపోటీనే ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ సైనా నెహ్వాల్‌ను... సెమీస్‌లో ఆరో సీడ్ చెయుంగ్ ఎన్గాన్ (హాంకాంగ్)ను ఓడించిన బీవెన్ జాంగ్ అదే జోరును ఫైనల్లోనూ కొనసాగించింది. తొలి గేమ్‌లో కీలక దశలో పైచేయి సాధించిన జాంగ్ రెండో గేమ్‌లో మాత్రం సింధు ధాటికి తడబడింది. రెండుసార్లు వరుసగా ఆరు పాయింట్లు చొప్పున కోల్పోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం పోరాడారు. చివర్లో సింధు 20–19తో మ్యాచ్ పాయింట్‌ను సంపాదించింది. కానీ ఒత్తిడికి లోనుకాకుండా ఆడిన జాంగ్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ షి యుకి (చైనా) 21–18, 21–14తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)పై గెలిచి విజేతగా నిలిచాడు. -
తప్పుడు సమాచారం వ్యాపిస్తోంది
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తూ ఆ వేదికలను దుర్వినియోగపరుస్తున్నారంటూ సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. కొందరు వ్యక్తులు ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యానాలు చేస్తున్నారనీ, ఇలాంటి వాటిపై నియంత్రణ అవసరమంది. కోర్టు కార్యకలాపాలు, న్యాయమూర్తులు, తీర్పులను కూడా ఒక్కోసారి సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేస్తున్నారని ధర్మాసనం గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది జూలైలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ వద్ద దారి దోపిడీ దొంగలు కారులో వెళ్తున్న ఓ కుటుంబంపై దాడి చేసి, తల్లీ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన కేసును విచారిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పై వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం అవుతుండటంపై ధర్మాసనం అభిప్రాయంతో సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారీమన్, హరీశ్ సాల్వే కూడా ఏకీభవించారు. పదవు ల్లో ఉన్నవారు ఏం మాట్లాడినా అది ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తుందనీ, కాబట్టి సున్నితమైన, విచారణలో ఉన్న అంశాలపై ప్రజాప్రతినిధులు సొంత అభిప్రాయాలను వెల్లడించలేరని హరీశ్ సాల్వే వాదించారు. ప్రభుత్వాన్నీ వదలట్లేదు పలువురు జడ్జీలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అవసరమైనప్పుడు ప్రభుత్వానికీ చివాట్లు పెడుతూనే ఉన్నామంది. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో దవే అలా పేర్కొనడం తమను బాధించిందని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. జడ్జీలు, న్యాయ వ్యవస్థపై కొందరు బాధ్యతారాహిత్యంగా సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ‘సుప్రీంకోర్టులో ప్రభుత్వ అనుకూల జడ్జీలేఎక్కువ ఉన్నారని బార్ సభ్యుడొకరు అన్నారు. పౌర హక్కుల పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వా న్ని కూడా ఎలా ఇరకాటంలో పెడుతున్నామో వారు కోర్టుకొచ్చి చూడాలి’ అని పేర్కొంది. -
అప్పుడు మావాళ్ల మాట వినాల్సింది
ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్’ చైర్మన్ పదవి నుంచి వైదొలగడంపై ఆ కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్.ఆర్.నారాయణ మూర్తి ఇప్పుడు విచారం వ్యక్తంచేశారు. అప్పుడు కంపెనీ ఇతర సహవ్యవస్థాపకులు తనను పదవిలో కొనసాగాల్సిందిగా కోరారని, వారి మాట విని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా ఇన్ఫోసిస్ చైర్మన్ పదవి నుంచి మూర్తి 2014లో తప్పుకున్నారు. ‘నా రాజీనామా నిర్ణయాన్ని కంపెనీ ఇతర సహ వ్యవస్థాపకులు వ్యతిరేకించారు. కంపెనీ నుంచి వెళ్లిపోవద్దని, మరికొన్నేళ్లు కంపెనీకి సేవలు అందించాలని కోరారు. కానీ నేను వారి మాట వినలేదు’ అని వ్యాఖ్యానించారు. ‘నాకు సాధారణంగా భావోద్వేగాలు ఎక్కువ. నా నిర్ణయాలు ఎక్కువగా ఐడియలిజంపై ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ బహుశా నేను వారి మాట వినాల్సింది’ అని సీఎన్‌బీసీ టీవీ 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా కార్పొరేట్ గవర్నెన్స్, సిక్కా వేతన ప్యాకేజ్, మాజీ ఉద్యోగులకు చెల్లింపులు వంటి అంశాలకు సంబంధించి ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్ నిర్ణయాలపై మూర్తి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. -
గైక్వాడ్‌కు మళ్లీ విమానయోగం
నిషేధం ఎత్తివేసిన ఎయిర్ ఇండియా ► పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలతో నిర్ణయం న్యూఢిల్లీ: శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమాన ప్రయాణంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఎయిర్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందని సంస్థ ప్రతినిధి చెప్పారు. ప్రైవేటు విమానయాన సంస్థలు దీనికి అనుగుణంగా నిర్ణయం తీసుకొంటాయని భావిస్తున్నామన్నారు. ఘటనపై గైక్వాడ్ పశ్చాత్తాపం వ్యక్తం చేసి, ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చారు. గత నెల 23న ఎయిర్ ఇండియా సీనియర్ అధికారిని గైక్వాడ్ చెప్పుతో 25సార్లు కొట్టారు. దీనికి నిరసనగా ఎయిర్ ఇండియాతో పాటు ప్రైవేటు విమాన సంస్థలు విమానంలో ఆయన ప్రయాణించడాన్ని గతంలో నిషేధించాయి. బేషరతు క్షమాపణ చెబితేనే... మరోవైపు... విమాన అధికారిపై చేయిచేసుకున్న ఎంపీ గైక్వాడ్ బేషరుతుగా క్షమాపణ చెప్పే వరకూ ఆయన్ని విమానంలో ప్రయాణించబోనివ్వమని ఎయిర్ ఇండియా కేబిన్ క్రూ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్వనికి సంఘం లేఖ రాసింది. క్షమాపణ చెప్పకుండా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేస్తే అది సంస్థ ఉద్యోగులతో పాటు భారతీయుల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని సంఘం లేఖలో పేర్కొంది. దీంతోపాటు ఏఐకి చెందిన ‘ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్ గైక్వాడ్ బేషరతుగా క్షమాపణ చెప్పేవరకూ ఆయన్ను విమానాల్లో తిరగనివ్వమని హెచ్చరించింది. ఉపసంహరించుకోండి... గైక్వాడ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని మంత్రిత్వ శాఖ ప్రైవేటు విమాన సంస్థలను కోరింది. అయితే దీనిపై ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్’ (ఎఫ్ఐఏ) అధికారికంగా ఇంకా ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదు. ఎఫ్ఐఏ నుంచి ఎలాంటి సమాచారం అందనంతవరకూ ఎంపీపై నిషేధం కొనసాగుతుందని ఎయిర్ ఏషియా ఇండియా ప్రతినిధి చెప్పారు. ఎయిరిండియా నిషేధాన్ని ఎత్తేసినప్పటికీ గైక్వాడ్ శుక్రవారం రైలులో ముంబైకి పయనమయ్యారు. నిషేధానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు గైక్వాడ్‌కు చేరకపోవటంతో రైల్లో వెళ్తున్నారని ఎంపీ సన్నిహితులు తెలిపారు. -
ఎంపీ గైక్వాడ్‌పై నిషేధం ఎత్తేసిన ఎయిరిండియా
-
పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ గైక్వాడ్ లేఖ
న్యూఢిల్లీ: ఎయిరిండియా మేనేజర్‌పై దాడి చేసి.. విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఎయిరిండియా సిబ్బందిపై అనుచితంగా దాడి చేసిన ఘటనలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ గురువారం కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్ గజపతిరాజుకు లేఖ రాశారు. దీంతో పాటు పార్లమెంట్ లో దాడి ఘటనపై కూడా తన లేఖలో ప్రస్తావించారు. కాగా ఎయిరిండియా సిబ్బందిపై దాడి వ్యవహారంపై ఆయన ఇవాళ పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. తాను ఎయిరిండియాకు కాదని, పార్లమెంట్‌కు క్షమాపణ చెబుతానని అన్నారు. మరోవైపు ఆయనకు మద్దతుగా శివసేన ఎంపీలు లోక్‌సభలో హల్చల్ చేసి విమానాయాన మంత్రి అశోక్ గజపతిరాజును ఘెరావ్ చేసిన విషయం తెలిసిందే. కాగా గత నెల పుణె నుంచి ఢిల్లీ ప్రయాణించిన సందర్భంలో 60 ఏళ్ల ఎయిరిండియా ఉద్యోగిని ఎంపీ గైక్వాడ్ 25సార్లు చెప్పుతో కొట్టడం తీవ్ర దుమారం రేపింది. దీంతో విమానాయాన సంస్థలు ఆయన తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాయి. ఆయన పలుసార్లు టికెట్ బుక్ చేసుకున్నా.. వాటిని రద్దు చేసిన ఎయిర్‌లైన్స్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అలాగే దాడిపై పశ్చాత్తపం వ్యక్తం చేస్తూ గైక్వాడ్ లేఖ రాయడంతో దాడి వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలనే ఉద్దేశంతో కేంద్రం ఉంది. దీంతో ఆయనపై ఎయిర్‌లైన్స్ విధించిన నిషేధం ఎత్తివేయవచ్చని సమాచారం. మరోవైపు ఏప్రిల్ 10లోగా గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలని, లేదంటే ఎన్డీయే సమావేశాలను తాము బహిష్కరిస్తామని శివసేన హెచ్చరించింది. -
'నన్ను క్షమించు అక్కా..!'
లక్నో: మరోసారి బీఎస్పీ అధినేత్రి మాయావతికి క్షమాపణలు చెబుతున్నట్లు బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ చెప్పారు. అయితే, తన ఆరోపణలు మాత్రం వాస్తవం అని అన్నారు. ఆమె ముమ్మాటికి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్లు అమ్ముకున్నారని చెప్తానని అన్నారు. ఎందుకంటే అదే నిజం అని చెప్పారు. ఆదివారం ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన 'మాయావతి సోదరిలాంటిది. ఆమె విషయంలో నేను అన్నమాటలు ముమ్మాటికి చాలా తప్పుడుమాటలే. అయితే, అన్ని వేళలా నేను అలా మాట్లాడను. కానీ, ఆరోజు అన్న మాటల్ని మొత్తానికి ఆపాధించి తప్పుగా మీడియా వ్యాఖ్యానించింది. ఆమెను అలా అన్నందుకు ఆ వెంటనే క్షమాపణలు చెప్పాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను. కానీ, ఆమె ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లను ఇచ్చిందనేది వాస్తవం' అని ఆమె అన్నారు. -
తప్పుచేశానని ఒప్పుకున్న హిల్లరీ
వాషింగ్టన్: సెనేటర్‌గా ఉన్న సమయంలో ఇరాక్‌పై యుద్ధానికి అనుకూలంగా ఓటు వేసి పెద్ద తప్పుచేశానని డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ చెప్పారు. 2002లో అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ ప్రభుత్వానికి ఇరాక్ పై దాడి చేసే అవకాశమిచ్చినందుకు పశ్చాత్తాప పడుతున్నానన్నారు. ప్రథమ మహిళగా ఉన్న సమయంలో వైద్యరంగంలో మెరుగైన సంస్కరణలు చేపట్టలేకపోయినందుకు మూడు నెలల క్రితం హిల్లరీ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాగా, అమెరికా అధ్యక్షురాలిగా హిల్లరీ క్లింటన్ ఎన్నికైతే ఉపాధ్యక్ష పదవి కూడా మహిళకే దక్కుతుందని హిల్లరీ ప్రచార కమిటీకి సారధ్యం వహిస్తున్న జాన్ పొడెస్టా చెప్పారు. -
ఆవేశంతోనే తమ్మినేనిపై ఆరోపణలు
ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా: నారాయణ వాటిని వెనక్కి తీసుకుంటున్నానంటూ రాఘవులుకు లేఖ సాక్షి, హైదరాబాద్: తనను ఓడించేందుకు డబ్బు తీసుకున్నారంటూ.. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంపై చేసిన వ్యాఖ్యల పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విచారం వ్యక్తం చేశారు. తాను ఆవేశంతో ఆ వ్యాఖ్యలు చేశానని, వాటిని ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు. ఈ మేరకు నారాయణ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులుకు సోమవారం లేఖ రాశారు. లేఖలో పేర్కొన్న ప్రకారం.. ‘‘నా వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ మీరు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి గారికి ఉత్తరం రాశారు. దాని ప్రతి నాకు పంపారు. అయితే సమస్యను కేంద్రానికి నివేదించినందున నేను సకాలంలో బదులివ్వలేదు. కేంద్ర పార్టీ ఆదేశం మేరకు మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీరు వైఎస్సార్సీపీతో రాష్ట్రవ్యాప్తంగా లేదా తెలంగాణ ప్రాంతమంతా ఎన్నికల అవగాహన పెట్టుకుని ఉంటే మేం తప్పుబట్టే వాళ్లం కాదు. నేను పోటీ చేసిన ఖమ్మం లోక్‌సభ స్థానం వరకే మీరు వైఎస్సార్సీపీతో అవగాహన పెట్టుకున్నారు. దీంతో అపోహలు ఏర్పడ్డాయి. మీ పార్టీ ఎన్నికల ప్రచారం వరకు పరిమితం కాకుండా అంతకు మించి వ్యవహరించిందని భావించాం. కాబట్టి ఆవేశంతో వీరభద్రంపై అలాంటి వ్యాఖ్యలు (వైఎస్సార్సీపీ అభ్యర్థి పి.శ్రీనివాసరెడ్డి నుంచి 15 కోట్లు తీసుకున్నట్టుగా ప్రజలు చెప్పుకుంటున్నారని) చేశాను. అయితే ఇలాంటి ఆరోపణలకు, ప్రత్యారోపణలకు నిరూపణలు ఉండవు. బాధ్యత కలిగిన నేను అలా నిరూపించలేని అంశాలతో కామెంట్ చేసినందుకు విచారిస్తున్నాను. వాటిని ఉపసంహరించుకుంటున్నాను. నా మూలంగా వామపక్ష ఐక్యతకు ఎలాంటి నష్టం జరగకూడదని అభిప్రాయపడుతున్నాను..’’ అని నారాయణ లేఖలో పేర్కొన్నాను. -
'రేప్ వ్యాఖ్యలకు' సీబీఐ చీఫ్ సారీ
బెట్టింగ్‌ను అత్యాచారంతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా బుధవారం విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని అన్నారు. తనకు మహిళలలంటే అపార గౌరమని సిన్హా పేర్కొన్నారు. లింగ వివక్షతో మహిళలను కించపరిచాలన్నది తన ఉద్దేశంకాదని వివరణ ఇచ్చారు. క్రీడల్లో బెట్టింగ్ గురించి సిన్హా మంగళవారం మాట్లాడుతూ.. బెట్టింగ్‌ను అనుమతించడం వల్ల నష్టమేంటని వ్యాఖ్యానించారు. 'బెట్టింగ్‌పై నిషేధాన్ని అమలు చేయలేకపోవడమంటే.. అత్యాచారాలను అడ్డుకోలేం ఆస్వాదించండి అని చెప్పడమే' అని సిన్హా అన్నారు. సిన్హా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలు మహిళా సంఘాలు, వక్తలు డిమాండ్ చేశారు. దీంతో సీబీఐ చీఫ్ దిద్దుబాటు చర్యలో భాగంగా క్షమాపణలు చెప్పారు.