'రేప్ వ్యాఖ్యలకు' సీబీఐ చీఫ్ సారీ
బెట్టింగ్ను అత్యాచారంతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా బుధవారం విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని అన్నారు. తనకు మహిళలలంటే అపార గౌరమని సిన్హా పేర్కొన్నారు. లింగ వివక్షతో మహిళలను కించపరిచాలన్నది తన ఉద్దేశంకాదని వివరణ ఇచ్చారు.
క్రీడల్లో బెట్టింగ్ గురించి సిన్హా మంగళవారం మాట్లాడుతూ.. బెట్టింగ్ను అనుమతించడం వల్ల నష్టమేంటని వ్యాఖ్యానించారు. 'బెట్టింగ్పై నిషేధాన్ని అమలు చేయలేకపోవడమంటే.. అత్యాచారాలను అడ్డుకోలేం ఆస్వాదించండి అని చెప్పడమే' అని సిన్హా అన్నారు. సిన్హా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని పలు మహిళా సంఘాలు, వక్తలు డిమాండ్ చేశారు. దీంతో సీబీఐ చీఫ్ దిద్దుబాటు చర్యలో భాగంగా క్షమాపణలు చెప్పారు.