'నన్ను క్షమించు అక్కా..!' | 'Sorry Behenji, but you sell tickets': Dayashankar | Sakshi
Sakshi News home page

'నన్ను క్షమించు అక్కా..!'

Published Sun, Jul 24 2016 3:28 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

'నన్ను క్షమించు అక్కా..!' - Sakshi

'నన్ను క్షమించు అక్కా..!'

లక్నో: మరోసారి బీఎస్పీ అధినేత్రి మాయావతికి క్షమాపణలు చెబుతున్నట్లు బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ చెప్పారు. అయితే, తన ఆరోపణలు మాత్రం వాస్తవం అని అన్నారు. ఆమె ముమ్మాటికి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే టిక్కెట్లు అమ్ముకున్నారని చెప్తానని అన్నారు. ఎందుకంటే అదే నిజం అని చెప్పారు. ఆదివారం ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన 'మాయావతి సోదరిలాంటిది.

ఆమె విషయంలో నేను అన్నమాటలు ముమ్మాటికి చాలా తప్పుడుమాటలే. అయితే, అన్ని వేళలా నేను అలా మాట్లాడను. కానీ, ఆరోజు అన్న మాటల్ని మొత్తానికి ఆపాధించి తప్పుగా మీడియా వ్యాఖ్యానించింది. ఆమెను అలా అన్నందుకు ఆ వెంటనే క్షమాపణలు చెప్పాను. ఇప్పుడు కూడా చెబుతున్నాను. కానీ, ఆమె ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లను ఇచ్చిందనేది వాస్తవం' అని ఆమె అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement