బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్ | Dayashankar Singh uses derogatory language against Mayawati | Sakshi
Sakshi News home page

బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్

Published Wed, Jul 20 2016 2:07 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్

బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకుల విమర్శలు శృతి మించుతున్నాయి. వ్యక్తిగత దూషణలు హద్దులు దాటుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. మాయావతిని వేశ్యతో పోల్చారు. మాయావతి వేశ్య కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని కెమెరా సాక్షిగా నోరు పారేసుకున్నారు.

ఈ వీడియో బయటకు రావడంతో దయాశంకర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిగ్గుమాలిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు రోజురోజుకు దిగజారిపోతున్నారని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ, అమిత్ షా తమ నేతలకు ఇటువంటి మాటలు నేర్పుతున్నారా అని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుండడంతో ఓడిపోతామన్న భయంతో బీజేపీ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మాయవతి అన్నారు. గతంలో గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్.. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ను తీవ్రవాది హఫీజ్ సయీద్ తో పోల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement