derogatory language
-
బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకుల విమర్శలు శృతి మించుతున్నాయి. వ్యక్తిగత దూషణలు హద్దులు దాటుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. మాయావతిని వేశ్యతో పోల్చారు. మాయావతి వేశ్య కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారని కెమెరా సాక్షిగా నోరు పారేసుకున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో దయాశంకర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిగ్గుమాలిన వ్యాఖ్యలతో బీజేపీ నేతలు రోజురోజుకు దిగజారిపోతున్నారని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ, అమిత్ షా తమ నేతలకు ఇటువంటి మాటలు నేర్పుతున్నారా అని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుండడంతో ఓడిపోతామన్న భయంతో బీజేపీ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మాయవతి అన్నారు. గతంలో గోరఖ్పూర్ ఎంపీ యోగి ఆదిత్యనాథ్.. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ను తీవ్రవాది హఫీజ్ సయీద్ తో పోల్చారు. -
మర్యాదగా మాట్లాడండి: లవ్లీ
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితుడైన అర్విందర్సింగ్ లవ్లీ మర్యాదగా మాట్లాడాలంటూ ఆప్ నేతలను హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయాలన్న చిత్తశుద్ధి లేదని, అందుకే తమపై అవాకులు చెవాకులు పేలుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపిం చారు. ప్రజల తీర్పును మన్నించి, మరోమారు ఎన్నికలు రాకుండా ఉండడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి తాము బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చామన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, ఆప్ తన మేనిఫెస్టోను అమలుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఆప్ నేతలు భాష విషయంలో మర్యాద దాటి ప్రవర్తిస్తున్నారని, కాంగ్రెస్ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అబద్ధపు హామీల వెనుక ఉన్న నిజాన్ని బట్టబయలు చేయడం కోసమే తమ పార్టీ మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. ఆప్ ప్రజలను తప్పుదారి పట్టించిందని, విద్యుత్తు, నీటి విషయంలో అమలు చేయలేని హామీలను ఇచ్చిం దని, దానిని నిరూపించేందుకే మద్దతిస్తున్నట్లు చెప్పారు.