ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితుడైన అర్విందర్‌సింగ్ లవ్లీ మర్యాదగా మాట్లాడాలంటూ ఆప్ నేతలను హెచ్చరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుచేయాలన్న చిత్తశుద్ధి లేదని, అందుకే తమపై అవాకులు చెవాకులు పేలుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే బాధ్యత నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపిం చారు. ప్రజల తీర్పును మన్నించి, మరోమారు ఎన్నికలు రాకుండా ఉండడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి తాము బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చామన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, ఆప్ తన మేనిఫెస్టోను అమలుచేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఆప్ నేతలు భాష విషయంలో మర్యాద దాటి ప్రవర్తిస్తున్నారని, కాంగ్రెస్ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అబద్ధపు హామీల వెనుక ఉన్న నిజాన్ని బట్టబయలు చేయడం కోసమే తమ పార్టీ మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిందన్నారు. ఆప్ ప్రజలను తప్పుదారి పట్టించిందని, విద్యుత్తు, నీటి విషయంలో అమలు చేయలేని హామీలను ఇచ్చిం దని, దానిని నిరూపించేందుకే మద్దతిస్తున్నట్లు చెప్పారు.
మర్యాదగా మాట్లాడండి: లవ్లీ
Published Sat, Dec 21 2013 12:33 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement