కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇవ్వాల్సిందే: బిన్నీ | Congress BJP should support Aam Aadmi Party over public issues Vinod Kumar Binny | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇవ్వాల్సిందే: బిన్నీ

Published Wed, Jan 1 2014 10:46 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Congress BJP should support Aam Aadmi Party over public issues Vinod Kumar Binny

ఘజియాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రభుత్వానికి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వాల్సిందేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలకు సంబంధించి అనేక పథకాలను ఇంకా అమలు చేయాల్సి ఉంది. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ, కాంగ్రె స్ పార్టీలను కోరాం. వారు తమకు సహకరి స్తే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలుగుతాం’ అని అన్నారు. ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారని, విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారన్నారు. 
 
 ఏం జరుగుతుందో చెప్పలేం
 18 అంశాలను దృష్టిలో పెట్టుకునే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆప్ నాయకుడు సంజయ్‌సింగ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విశ్వాసతీర్మానంలో విజయం సాధిస్తే ఆ అంశాలకోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. విధానసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఏమి జరుగుతుందనే విషయంపై తామేమీ చెప్పలేమన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement