'ఆమ్ ఆద్మీ పార్టీని తక్కువగా అంచనా వేశాం'
న్యూఢిల్లీ: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని తక్కువగా అంచనా వేశామని మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. 2013 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీని తక్కువగా అంచనా వేయడం వల్లే తాము ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని షీలా స్పష్టం చేశారు.
గత ఏడు నెలలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మతతత్వ వాతావరణం సృష్టించిందని ఆ పార్టీపై ఆమె మండిపడ్డారు. 'ఘర్ వాపసి' లాంటి
కార్యక్రమాలు చేపట్టి బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. దీంతో మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇలా అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో 'మంచి రోజలు' వస్తాయా? అని ఆమె ప్రశ్నించారు. దేశ రాజధానిలో భయానక వాతావరణాన్ని సృష్టించిన బీజేపీకి కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.