vinod kumar binny
-
బిజెపిలో చేరిన ఆప్ రెబల్ ఎమ్మెల్యే బిన్ని!
-
అరవింద్ ప్రత్యర్థిగా బిన్నీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఒకనాటి సహచరుడే వచ్చే ఎన్నికల్లో ఆయనకు ప్రత్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. ఆప్ బహిష్కృత నేత, లక్ష్మీనగర్ శాసనసభ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ వచ్చే ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ విషయాన్ని బిన్నీ మీడియాకు వెల్లడించారు. ‘ బిన్నీ బండారం బయటపెట్టడమే నా లక్ష్యం. ఇందులోభాగంగా ఆప్‌కు చెందిన అనేకమంది నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నా. ఢిల్లీవాసులను కేజ్రీవాల్ వంచించాడు. విద్యుత్ చార్జీలను తగ్గించలేదు. ప్రజలకు మంచినీరు ఉచితంగా అందలేదు. జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో ఆ పార్టీ చేసిందేమీ లేదు’అని అన్నారు. బీజేపీలోకి బిన్నీ ఇదిలాఉండగా ఆప్ బహిష్కృత నేత, లక్ష్మీనగర్ శాసనసభ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ... బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు, ఉచిత మంచినీరు, జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో బీజేపీ వైఖరేమిటనేది తెలుసుకున్నాకే ఓ నిర్ణయానికొస్తానన్నారు. వచ్చేవారం తన భావి కార్యాచరణను మీడియాకు వెల్లడిస్తానన్నారు. -
బీజేపీ వెనకడుగు..!
న్యూఢిల్లీ: జాతీయ రాజధానిలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం వేచిచూసే ధోరణిని అవలంబిస్తోంది. ఎంతమాత్రం తొందరపాటు ధోరణిని కనబరచడం లేదు. ఇందుకు కారణం ఢిల్లీ విధానసభలో తగినంత సంఖ్యాబలం లేకపోవడం, మంగళవారం వెలువడిన ఉప ఎన్నికల్లో వచ్చిన నిరాశాపూరిత ఫలితాలు తదితరాలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై అధిష్టాన పెద్దల్లో ఉత్సాహం కొరవడిందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎంతమాత్రం ఆసక్తి కనబరచడం లేదు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు.అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేం దుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజుల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నాం: కేజ్రీవాల్
ఘజియాబాద్: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు పావులు కదుపుతున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఆచితూచి అడుగేస్తోంది. అవసరమైతే కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని భావిస్తోంది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ సహా ఇతర ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నామని 'ఆప్' అధినేత అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. 'అన్ని పార్టీలతో టచ్ లో ఉన్నాం. అడ్డదారుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు వినోద్ కుమార్ బిన్నీ, షోయబ్ ఇక్బాల్, రంబీర్ షకీన్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నాం' అని కేజ్రీవాల్ తెలిపారు. షకీన్ స్వతంత్ర ఎమ్మెల్యే కాగా, ఇక్బాల్ జేడీ(యు) ఎమ్మెల్యే. బిన్నీ 'ఆప్' తరపున గెలిచినప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. -
‘జన్‌లోక్‌పాల్’ నచ్చితేనే మద్దతు
న్యూఢిల్లీ: అన్నాహజారే ఉద్యమస్ఫూర్తితో ఏర్పడిన జన్‌లోక్‌పాల్ బిల్లుకే తాను అసెంబ్లీలో మద్దతు ఇస్తానని.. లేకుంటే బిల్లుకు మద్దతు ఇవ్వడంలో పునరాలోచన చేస్తానని ఆప్ బహిష్కృత ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ స్పష్టం చేశారు. మద్దతు విషయంలో తనను ఏ పార్టీ విప్ ఆపలేదని తేల్చిచెప్పారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో శుక్రవారం చర్చకు రానున్న జన్‌లోక్‌పాల్ బిల్లుపై తన ఓటు హక్కు గురించి స్పీకర్ ఎంఎస్ ధిర్‌తో సంప్రదించానని చెప్పారు. కాగా, 1996 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ పార్టీ నుంచి బహిష్కృతులైన ఎమ్మెల్యేలైనా.. అసెంబ్లీలో ఆ పార్టీ విప్‌కు కట్టుబడి ఉండాలని స్పీకర్ సమాధానమిచ్చారన్నారు. అయితే ఇదే విషయమై 2010లో సుప్రీం కోర్డు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏ ఎమ్మెల్యే కూడా తాను బహిష్కృతమైన పార్టీకే అసెంబ్లీలో మద్దతు ఇవ్వాలని లేదని స్పష్టంగా ఉందన్నారు. తనకు ఆ విషయాన్ని స్పీకర్ తెలియజేయలేదని ఆయన చెప్పారు. దాంతో 2010 సుప్రీం ఆర్డర్ గురించి తనకు ఎందుకు సమాచారమివ్వలేదో 24 గంటల్లోగా సమాధానమివ్వాలని స్పీకర్‌కు లేఖ రాశానన్నారు. అప్పటికీ స్పీకర్ స్పందించకపోతే కోర్టుకు వెళతానని ఆయన స్పష్టం చేశారు. కాగా, జన్‌లోక్‌పాల్ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు ఇస్తున్నారా లేదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తాను ఇంతవరకు ఆ బిల్లు ప్రతిని చూడలేదన్నారు. అయితే అది అన్నాహజారే పోరాట స్ఫూర్తికి అనుగుణంగా ఉంటేనే మద్దతు ఇస్తానన్నారు. ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేయాలని తనను ఎవరూ బలవంతపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. -
'ఆప్'కు బిన్నీ మద్దతు ఉపసంహరణ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఆ పార్టీ బహిష్కృత నేత వినోద్ కుమార్ బిన్నీ ప్రకటించారు. బుధవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజిబ్ జంగ్‌ను కలసి బిన్నీ ఆ విషయాన్ని వెల్లడించారు. అనంతరం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిన్నీ మాట్లాడుతూ... తాను డిమాండ్లు చేసి 48 గంటలు గడిచిన ఆప్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు సరైన స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వానికి 'గంట' కొట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. హస్తిన వాసులకు విద్యుత్ ఛార్జీలపై 68 శాతం సర్ ఛార్జీ తగ్గించాలని, ఎటువంటి కండిషన్ లేకుండా ఒకొక్క కుటుంబానికి ప్రతిరోజు 7 గంటల నీరు అందించాలి అలాగే ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా 'ఆప్'లో అవినీతికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బిన్నీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే బిన్నీ డిమాండ్ల పట్ల 'ఆప్' నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించింది. దీంతో ఆప్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. గతేడాది చివరలో న్యూఢిల్లీ శాసన సభకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 70 సీట్లలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 28 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ 32 సీట్లలో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ మాత్రం 7 సీట్లు మాత్రమే గెలిచింది. దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని న్యూఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బీజేపీని ఆహ్వానించారు. తాము ప్రతిపక్షానికి పరిమితం అవుతామని నజీబ్‌కు విన్నవించింది. దాంతో ప్రభుత్వ ఏర్పాటు చేయాలని నజీబ్ జంగ్ 'ఆప్'ను కోరారు. దాంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
బిన్నీ నిరాహార దీక్ష...సాయంత్రానికే ముగింపు
ఆప్ అక్రమాలకు పాల్పడుతోందని, ఎన్నికల హామీలు నిలబెట్టుకోవడం లేదని పేర్కొంటూ ఉదయం నిరాహార దీక్షకు దిగిన బహిష్కృత ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ కేవలం సాయంత్రం 3.30 గంటలకే దీక్ష విరమించారు. లెఫ్టినెంట్ గవర్నర్, అన్నా హజారే సలహా మేరకు తన నిరశనను ముగించినట్లు వివరణ ఇచ్చారు. సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం ఎలాగైనా పడిపోవాలని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కోరుకుంటోందని ఆ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ ఆరోపించారు. ఆప్ సర్కారుకు వ్యతిరేకంగా సోమవారం ఆయన జంతర్‌మంతర్‌లో కొద్దిసేపు నిరాహార దీక్ష చేశారు. తాను దీక్ష జరపడానికి కేజ్రీవాలే కారణమని ఆయన ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరచ్చడం లేదని ఆరోపించారు. లక్ష్మీనగర్ ఎమ్మెల్యే అయిన బిన్నీ నాలుగు గంటలపాటు మాత్రమే దీక్ష చేసి విరమించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఆప్ సర్కారుకు పది రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించి ఈ నిర్ణయం వెలువరించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్భాటంగా నిరాహార దీక్ష ప్రారంభించిన ఆయన 3.30 గంటలకు దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘హామీలను నెరవేర్చడానికి కేజ్రీవాల్ సర్కారుకు 10 రోజులు గడువు ఇస్తున్నా. పది రోజుల్లో హామీలు నెరవేర్చకుంటే దేశవ్యాప్త ఆందోళన ఆరంభిస్తాను’ అని హెచ్చరించారు. లెఫ్టినెంట్ గవర్నర్, అన్నాహజారే సలహా మేరకు తన నిరసన ప్రదర్శనను ముగించినట్లు బిన్నీ చెప్పారు. ‘నాలుగైదు రోజులు నిరాహార దీక్ష జరపడం వల్ల ప్రయోజనం లేదని అన్నా చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని సూచించారు’ అని బిన్నీ తెలిపారు. నిరాహార దీక్ష ప్రారంభించడానికి ముందుగా ఆయన లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిపై చర్య తీసుకోవాలని కోరారు. రాజ్‌ఘట్‌ను సందర్శించి మహాత్ముని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి నిరాహార దీక్ష మొదలుపెట్టారు. పార్టీలోని అసంతృప్త ఎమ్మెల్యేలను బెదిరించడానికే ఆప్ తనను బహిష్కరించిందని ఆయన ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేల్లో పలువురు అసంతృప్తితో ఉన్నారని, వారు తనకు మద్దతు ఇస్తున్నారని బిన్నీ చెప్పారు. తనను పార్టీ నుంచి తొల గించ డానికి ముందు కేజ్రీవాల్ ప్రజాభిప్రాయసేకరణ జరిపించి ఉండాల్సిందన్నారు. ‘తాము చేసిన శుష్కహామీలను నెరవేర్చలేం కాబట్టి ఆప్ నాయకులు ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటున్నారు. నేను వారిని అలా తప్పించుకోనివ్వను. పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ నేను అంశాల వారీగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను’ అని అన్నారు. బీన్నీ వ్యాఖ్యలపై స్పందించిన కేజ్రీవాల్ సర్కారు నడపడం నుంచి తప్పించుకోవాలని ఆప్ ప్రయత్నిస్తోందంటూ బిన్నీ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిస్పందిస్తూ ‘ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేం ఇక్కడ లేం. ప్రజలకు సేవచేయడానికి వచ్చాం’ అని వ్యాఖ్యానించారు. నెల రోజులలో తాము చేసినంత పని ఏ సర్కారూ చేయలేదని ఆయన చెప్పారు. తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఎమ్మేల్యే వినోద్‌కుమార్ బిన్నీని ఆప్ క్రమశిక్షణా కమిటీ పార్టీ నుంచి తొల గిస్తున్నట్టు ఆప్ ఆదివారం ప్రకటించింది. బిన్నీని తొలగించడం తమకు అత్యంత బాధాకరంగా ఉందని, అయితే వేరే ప్రత్యామ్నాయం మిగలలేదని పార్టీ నేత యోగేంద్ర యాదవ్ ట్వీట్ చేశారు. బిన్నీ జరిపిన నిరాహారదీక్షలో ఆయన మద్దతుదారులు ‘అంజాన్ ఆద్మీ’ అని రాసి ఉన్న నల్లటోపీలు ధరించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వీరంతా ‘ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్’ టోపీలు, జాతీయ జెండాలు ధరించి కనిపించారు. ఇటీవలే బీజేపీని ఆప్‌లో చేరిన టీనాశర్మ కూడా వేదికపై కూర్చున్నారు. ఆప్‌లో ప్రజాస్వామ్యం లేదని టీనా శర్మ ఆరోపించారు. ‘ఆప్ ఒక్కరికీ ఒక్కోరకం ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పార్టీ ఢిల్లీ ప్రజలను మోసగించింది. నగరవాసులు ఈ విషయాన్ని గుర్తించాలని మేం కోరుతున్నాం’ అని ఆమె చెప్పారు. ఆప్‌లో కొనసాగాలంటే నోరు మూసుకుని ఉండాలని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. బిన్నీ ఆప్ సర్కారును విమర్శిస్తూ ‘ప్రభుత్వం ఢిల్లీ మహిళా కమిషన్ వంటి సంస్థలను అవమానిస్తోం ది. దాదాపు 50 మంది బిన్నీ దీక్షలో పాల్గొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, అవినీతిపరులుగా పేర్కొన్న షీలాదీక్షిత్, ఇతర నేతలపై ఇంతవరకు ఎలాంటి చర్యా చేపట్టలేదు’ అని ఆయన విమర్శించారు. ‘ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మహిళా కమెండో బలగాన్ని ఇంతవరకు ఏర్పాటుచేయకుండా మహిళల భద్రతతో చెలగాటమాడుతోందని అన్నారు. విద్యుత్తు, నీరు, జన్‌లోక్‌పాల్ బిల్లుల విషయంలో కూడా హామీలను నిలబెట్టుకోలేదు’ అని వినోద్‌కుమార్ బిన్నీ ఆరోపించారు. -
దీక్షను విరమించిన బహిష్కృత ఎమ్మెల్యే కుమార్ బిన్నీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరాహారదీక్షను విరమించుకుంటున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే కుమార్ బిన్నీ తెలిపారు. దీక్షకు దిగిన కొద్ది గంటల్లోనే బిన్నీ దీక్షకు విరామం ఇచ్చారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలను ఆమ్ ఆద్మీ పార్టీ అమలు పరచడంలేదంటూ బిన్నీ విమర్శించి దీక్షకు పూనుకున్నారు. తాము చేస్తున్న డిమాండ్ ల పై 10 రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సమాధానం చెప్పలేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తానని కుమార్ బిన్నీ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదివారం నాడు బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ గురించి, పార్టీ నాయకత్వం గురించి బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఆయన్ను బహిష్కరించారు. దీంతో ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసిన తర్వాత, దేశ రాజధాని నడిబొడ్డునున్న జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి, బాపూజీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. -
జంతర్‌మంతర్ వద్ద బిన్నీ నిరాహార దీక్ష
ఢిల్లీలో కొత్తగా ఏర్పాటైన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తి పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఢిల్లీ సర్కారు అమలు చేయట్లేదంటూ ఆయన ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదివారం నాడు బిన్నీని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ గురించి, పార్టీ నాయకత్వం గురించి బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఆయన్ను బహిష్కరించారు. దీంతో ముందుగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసిన తర్వాత, దేశ రాజధాని నడిబొడ్డునున్న జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. అంతకుముందు ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి, బాపూజీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ''నన్ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు మీడియా ద్వారా మాత్రమే తెలిసింది. నాకు మాత్రం ఇంతవరకు ఈ మెయిల్ ద్వారా గానీ, లేఖ ద్వారా గానీ ఎలాంటి సమాచారం అందలేదు'' అని బిన్నీ విలేకరులతో అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో షీలా దీక్షిత్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఏకే వాలియాను తూర్పు ఢిల్లీలోని లక్ష్మీనగర్ నియోజకవర్గంలో ఓడించిన వినోద్ కుమార్ బిన్నీ.. ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ అనుభవం ఉన్న ఏకైక నాయకుడు. గతంలో ఆయన ఢిల్లీలో కార్పొరేటర్‌గా పనిచేశారు. అయితే.. ఆయనకు మంత్రి పదవిని మాత్రం కేజ్రీవాల్ ఇవ్వలేదు. అప్పుడే అలిగిన బిన్నీ, సంచలనాత్మక విషయాలు బయటపెడతానని బెదిరించడంతో పార్టీలో మంచి పదవి ఇస్తామని చెప్పి అప్పట్లో బుజ్జగించారు. దాంతో ప్రమాణ స్వీకారం నాటికి మాత్రం ఎలాగోలా నెమ్మదించారు. కానీ ఇన్ని రోజులు గడిచినా ఎలాంటి పదవి రాకపోవడంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదంటూ బిన్నీ మండిపడ్డారు. విద్యుత్ బిల్లులు తగ్గించడంలేదని, మహిళలకు భద్రత కల్పించడంలేదని, డెన్మార్క్ మహిళ అత్యాచారానికి గురైనప్పుడు సరిగా స్పందించలేదని ఆయన అన్నారు. దాంతో పాటు.. కేజ్రీవాల్ మీద కూడా ఆయన పలు ఆరోపణలు గుప్పించారు. పదేపదే ఇలాగే చేస్తుండటంతో ఆగ్రహానికి గురైన పార్టీ అగ్రనాయకత్వం, బిన్నీని నేరుగా పార్టీ నుంచి బహిష్కరించింది. -
బిన్నీ తిరుగుబాటు బావుటా!
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్నికల వాగ్దానాలను గడువులోపే నెరవేర్చాలనే డిమాండ్ నేటి నుంచి తాను నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ఈ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ ప్రకటించారు. ఆప్ ప్రజలను పట్టించుకోవడం లేదని, లోక్‌సభ ఎన్నికలపైనే కేజ్రీవాల్ దృష్టి సారించారని ఆరోపించారు.న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదని భావిస్తున్న తిరుగుబాటు ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ సొంతపార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చడం లేదని, అందుకే తాను సోమవారం నుంచి నిరాహార దీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. ‘ఎన్నికల హామీల్లో ఏ ఒక్క దానినీ నెరవేర్చడానికి ఆప్ సిద్ధంగా లేదు. ఫలానా గడువులోపు వాగ్దానాలను నెరవేర్చుతామని హామీ ఇచ్చాం కాబట్టి ఆ పని చేసి చూపించాలి. నా డిమాండ్లు నెరవేరే దాకా నిరాహార దీక్షను కొనసాగిస్తాను’ అని బిన్నీ అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు ఫిర్యాదు చేసిన తరువాతే దీక్ష ప్రారంభిస్తానని ప్రకటించారు. తన పోరాటానికి మద్దతు కూడగట్టుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణప్రాంతాల్లో పర్యటిస్తానని కూడా అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే మంత్రి సోమ్‌నాథ్ భారతి ఆఫ్రికా యువతపై దాడి చేయడం, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రైల్‌భవన్ ఎదుట ధర్నా చేయడం వంటి గిమ్మక్కులకు పాల్పడుతున్నారని లక్ష్మీనగర్ ఎమ్మెల్యే అయిన బిన్నీ ఆరోపించారు. ‘వాళ్లు ప్రజల కోసం పనిచేయడం లేదు. లోక్‌సభ ఎన్నికలపైనే ఆప్ దృష్టంతా. ఎన్నికల ప్రవర్తన నియమావళి అందుబాటులోకి వస్తే పనులన్నింటినీ నిలిపివేద్దామని అనుకుంటున్నారు’ అని విమర్శించారు. పార్టీ నాయకత్వంపై ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ ఆప్‌కు రాజీనామా చేయబోనని బిన్నీ స్పష్టం చేశారు. ‘ఆప్ ఒక వ్యక్తి పార్టీ కాదు. అది ఈ స్థాయికి రావడానికి నేను ఎంతగానో శ్రమించాను. నేనెందుకు రాజీనామా చేయాలి ?’ అని ప్రశ్నించారు. ఇంతకుముందు కాంగ్రెస్‌లో పనిచేసిన బిన్నీ.. గత ఏడాదిలో ఆప్‌లో చేరి లక్ష్మీనగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం తాను చేస్తున్న ఆరోపణలను పార్టీలో చాలా మంది సమర్థిస్తున్నా.. ఏ ఒక్క నాయకుడూ బహిరంగంగా తనకు మద్దతు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమ్‌నాథ్ భారతి వివాదం, ఆప్ పోలీసులపై తీవ్రవిమర్శలు చేయడంపై మాట్లాడుతూ ‘మా నాయకుల ప్రకటనలు, చర్యల్లో అనుభవరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందరినీ ఒకే దృష్టితో చూడకూడదు. భారతి రాజీనామా చేసి ఉండాల్సింది. మంత్రిస్థాయి వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదు’ అని విమర్శించారు. ఖిడ్కీ ప్రాంతంలోని ఆఫ్రికా యువతపై మంత్రి, ఆయన అనుచరులు ఇటీవల దాడి చేశారు. ఉగాండా మహిళల నుంచి వీళ్లు మూత్రం నమూనాలను సేకరించినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. ఉచిత మంచినీరు, కరెంటు సరఫరాపై విధించిన ఆంక్షలను రద్దు చేయడం, ఆప్ ఉద్యమాలకు మద్దతుగా లేఖలు ఇచ్చిన వారి బిల్లులను మాఫీ చేయడం వంటి డిమాండ్లతో దీక్షకు దిగుతున్నానని బిన్నీ చెబుతున్నారు. -
సోమనాథ్ మంత్రి పదవి నుంచి దిగాల్సిందే
ఉగాండ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన న్యూఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి వెంటనే మంత్రి పదవి నుంచి దిగిపోవాలని ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ డిమాండ్ చేశారు. భారతీని వెంటనే అరెస్ట్ చేయాలని బిన్నీ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ కమిషనర్ బి.ఎస్. బస్సీని కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిన్నీ మాట్లాడుతూ... విదేశీ మహిళలతో భారతీ వ్యవహరించిన తీరు సిగ్గు మాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. మంత్రి అని కోణంలో కాకుండా భారతి విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ బస్సీ తెలిపారని బిన్నీ వెల్లడించారు.మంత్రి వర్గం నుంచి భారతిని వెంటనే తొలగించాలని ఆయన న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ 36 గంటల ఆందోళన సందర్భంగా ఆప్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో సామాన్యులు సమిధులయ్యారని అన్నారు. ఆ ఘటనపై అరవింద్ కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ కనుసన్నల్లో కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తిరుగుబాటు ప్రకటించిన లక్ష్మీనగర్ ‘ఆప్’ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ గురువారం ‘ఆప్’ సర్కారుపైన, కేజ్రీవాల్‌పైన మరిన్ని తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఆప్’ సర్కారు పూర్తిగా కాంగ్రెస్ కనుసన్నల్లో నడుస్తోందని, కేజ్రీవాల్ అహంకారి, నియంత అని ఆరోపించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు, మంచినీరు, విద్యుత్ చార్జీలు, మహిళల భద్రత తదితర అంశాలపై ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ‘ఆప్’ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను దగా చేస్తోందని దుయ్యబట్టారు. బిన్నీ ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం నిర్వహించారు. ‘ఆప్’ నలుగురు మిత్రుల పార్టీగా మారిపోయిందని ఆరోపించారు. అయితే, తాను పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన ఆరోపణలు అసత్యమని తేలితే పార్టీ నుంచి తప్పుకుంటానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం కేజ్రీవాల్ నెరవేర్చకుంటే, ఈ నెల 27 నుంచి నిరశన దీక్ష ప్రారంభిస్తానని హెచ్చరించారు. అయితే, బిన్నీ ఆరోపణలను ‘ఆప్’ ఖండించింది. లోక్‌సభ టికెట్టు దక్కకపోవడంతోనే ఆయన ఆరోపణలకు దిగుతున్నారని దుయ్యబట్టింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ ఆదేశిస్తోంది... కేజ్రీవాల్ పాటిస్తున్నారు: బిన్నీ ‘ఆప్’ ప్రభుత్వం కాంగ్రెస్‌తో కుమ్మక్కయింది. అందుకే మాజీ సీఎం షీలా దీక్షిత్, ఆమె హయాంలో పనిచేసిన మంత్రుల అవినీతిపై దర్యాప్తు చేపట్టలేదు. ఎవరికీ మద్దతు ఇవ్వబోము, తీసుకోబోము అని ప్రకటించిన ‘ఆప్’... కాంగ్రెస్ మద్దతుతో ఎందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయి. ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థుల విషయంలోనూ పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్, కేజ్రీవాల్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ జారీ చేస్తున్న ఆదేశాలను కేజ్రీవాల్ అమలు చేస్తున్నారు. కేజ్రీవాల్ ఎవరి మాటా వినిపించుకోరు. తన నిర్ణయాలను వ్యతిరేకించే వారిని తొలుత నచ్చజెబుతారు. అయినా వినకుంటే మండిపడతారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్‌లు బాల్యమిత్రులు. పార్టీలో వారి మాటే చలామణి అవుతోంది. అన్నా హజారే, కిరణ్ బేడీ సహా ఎందరినో అవసరానికి వాడుకుని విడిచిపెట్టేసిన పార్టీ ‘యూజ్ అండ్ త్రో’ విధానాన్ని పాటిస్తోంది. అధికారంలోకి వచ్చాక కేజ్రీవాల్‌కు అధికార కాంక్ష పెరిగింది. నేనెన్నడూ కేజ్రీవాల్‌ను లోక్‌సభ టికెట్టు అడగలేదు. ఆయన అబద్ధమాడుతున్నారు. ఆరోపణలు దిగ్భ్రాంతికరం: ‘ఆప్’ నేతలు ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ ఆరోపణలను ‘ఆప్’ ఖండించింది. బిన్నీ ఆరోపణలపై ‘ఆప్’ నేత యోగేంద్ర యాదవ్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు... బిన్నీ ఆరోపణలు మాకు తీవ్ర దిగ్భ్రాంతిని, క్షోభను కలిగించాయి. లోక్‌సభ టికెట్టు దక్కనందునే ఆయన పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. బిన్నీ ఆరోపణలన్నీ బీజేపీ ప్రసంగాన్ని చదివినట్లే ఉన్నాయి. పార్టీ సమావేశాల్లో ఒక్కసారైనా ప్రస్తావించని అంశాలను నేరుగా మీడియా ముందుంచడం ఏ మేరకు సమంజసం? {Mమశిక్షణారాహిత్యాన్ని పార్టీ సహించబోదు. బిన్నీకి షోకాజ్ నోటీసు పంపి, సంజాయిషీ కోరతాం. ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపడతాం. ఆదర్శవాదం పోయింది: అరుణ్ జైట్లీ (బీజేపీ) ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన మూడు వారాల్లోనే ‘ఆప్’లో ఆదర్శవాదం కనుమరుగై, పదవీకాంక్ష మొదలైంది. ప్రత్యామ్నాయ రాజకీయాల హామీతో ‘ఆప్’ ఆవిర్భవించినప్పుడు, అది సమాజంపై గట్టి ప్రభావం చూపగలదని నేను ఆశించా. అయితే, అది జిమ్మిక్కులను ప్రదర్శిస్తూ అరాచకవాదం వైపు మళ్లుతోంది. -
కేజ్రివాల్ కు 'ఆమ్ ఆద్మీ' ఎమ్మెల్యే డెడ్ లైన్!
-
కేజ్రివాల్ కు 'ఆమ్ ఆద్మీ' ఎమ్మెల్యే డెడ్ లైన్!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై ఆమీతుమీ తేల్చుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ సిద్ధమవుతున్నారు. తాజాగా ఎన్నికల చేసిన వాగ్గానాలను నెరవేర్చడానికి బిన్నీ డెడ్ లైన్ విదించారు. ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తాను జనవరి 27 తేది నుంచి నిరవధిక దీక్ష చేపడుతానని బిన్నీ హెచ్చరించారు. ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలను తుంగలో తొక్కుతున్నారని పార్టీ నేతలపై, ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో విఫలమవుతున్న కేజ్రివాల్ ప్రభుత్వ తీరుకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జనవరి 27 తేదిన దీక్షను చేపడుతానని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. అన్నా హజారే జన లోక్ పాల్ బిల్లును జనవరి 25 లేదా 26 తేదిల్లో ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల రక్షణకు మహిళా కమాండో ఫోర్స్ రూపొందించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన కేజ్రివాల్ ఆ రెండు పార్టీలకు ఎలా భిన్నమో ప్రజలు తెలుపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ కు విధానాలను వ్యతిరేకించిన కేజ్రివాల్.. ప్రస్తుతం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ కిషన్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. లోకసభ సీటు కేటాయించనందుకే తనతో విభేధిస్తున్నారని కేజ్రివాల్ చేసిన ఆరోపణలు బిన్ని ఖండించారు. -
అత్యాచారంపై స్పందించలేదేం: బిన్నీ
అనుకున్నంతా అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీలో అప్పుడే తిరుగుబాటు మొదలైపోయింది. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ బహిరంగంగా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అరవింద్ కేజ్రీవాల్ చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటని ఆయన అన్నారు. కొద్దిమంది వ్యక్తులను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడలేదని, అవినీతిపై పోరాటమే లక్ష్యంగా ఏర్పడిందని గుర్తుచేశారు. ఢిల్లీ ప్రజల విద్యుత్, తాగునీటి అవసరాలు ఇంతవరకు ఇంకా తీరనే లేదన్నారు. డెన్మార్క్ మహిళపై ఢిల్లీ నడిబొడ్డున అత్యాచారం జరిగితే ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని బిన్నీ నిలదీశారు. -
'కేజ్రివాల్, ఆమ్ ఆద్మీపార్టీతో విబేధాలు లేవు'
ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో ఎలాంటి విభేదాలు లేవని ఆపార్టీ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్ని మీడియాకు వెల్లడించారు. తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కేబినెట్ జాబితా నుంచి తప్పించడాన్ని తాను అంతగా సీరియస్ గా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించిన జాబితానుంచి తనను తొలగించాలని తానే కోరానని బిన్నీ తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్గానాల్ని అమలు చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమవుతోంది అని ఓ ఇంటర్వ్యూలో బిన్ని తెలిపడంతో కేజ్రివాల్ బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం మంగళవారం జరిగింది. అయితే పార్టీ సమావేశంలో సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తకుండా..మీడియాలో పార్టీ నియమాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడాన్ని కేజ్రివాల్ తప్పుపట్టారు. -
కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇవ్వాల్సిందే: బిన్నీ
ఘజియాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రభుత్వానికి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వాల్సిందేనని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలకు సంబంధించి అనేక పథకాలను ఇంకా అమలు చేయాల్సి ఉంది. తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ, కాంగ్రె స్ పార్టీలను కోరాం. వారు తమకు సహకరి స్తే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలుగుతాం’ అని అన్నారు. ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారని, విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారన్నారు. ఏం జరుగుతుందో చెప్పలేం 18 అంశాలను దృష్టిలో పెట్టుకునే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆప్ నాయకుడు సంజయ్‌సింగ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విశ్వాసతీర్మానంలో విజయం సాధిస్తే ఆ అంశాలకోసమే తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. విధానసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఏమి జరుగుతుందనే విషయంపై తామేమీ చెప్పలేమన్నారు. -
టీ కప్పులో తుపాను
సాక్షి, న్యూఢిలీ:మంత్రి పదవి రాలేదన్న ఆగ్రహంతో రగిలిపోయిన లక్ష్మీనగర్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ అలక వీడడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడింది. తిరుగుబాటు వ్యవహారమంతా టీ కప్పులా తుపానులా సద్దుమణగడంతో ఊపిరి పీల్చుకున్న ఆప్నేతలు మంత్రిపదవుల విషయంలో తమ పార్టీలో అసలు గొడవే లేదంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్‌లే కాకుండా వినోద్‌కుమార్ బిన్నీ కూడా అలక ఆరోపణలను ఖండించారు. కాబోయే మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆగ్రహించి సమావేశం నుంచి వెళ్లిపోయిన బిన్నీకి.. కుమార్ బిశ్వాస్, సంజయ్ సింగ్‌లు మంగళవారం పొద్దుపోయాక నచ్చజెప్పినట్టు తెలియవచ్చింది.కాగా విందుకు వెళ్లాల్సి ఉండడంతో సమావేశం నుంచి త్వరగా వెళ్లిపోయానని బిన్నీ పేర్కొన్నారు. తాను ఆగ్రహించానని ఎవరు చెప్పారంటూ మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నానని, మంత్రి పదవిని కోరడం లేదని ఆయన బుధవారం చెప్పారు. బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో జరిగే జనతా దర్బార్‌కు బయలుదేరే ముందు అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి అలకలు, కోపతాపాలు లేవన్నారు. బిన్నీ ఆగ్రహించలేదని, ఆయన మంత్రిపదవి కోరలేదని వివరణ ఇచ్చారు. బిన్నీ అలిగాడ నే వార్తలు రావడంతో అతనితో మాట్లాడడానికి కుమార్ బిశ్వాస్, సంజయ్ సింగ్ లు బిన్నీ ఇంటికి వెళ్లారని, కానీ తనకేమీ కోపం లేదని బిన్నీ వారికి చెప్పాడని కేజ్రీవాల్ వివరించారు. -
ఆప్‌లో చల్లబడిన వివాదం.. బిన్నీ ఓకే!
ఆమ్ ఆద్మీపార్టీ తమ అంతర్గత వివాదాన్ని పరిష్కరించుకుంది. మంత్రిపదవి దక్కలేదన్న ఆగ్రహంతో బుధవారం నాడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేస్తానని, అది పార్టీకి ఇబ్బందికరంగా ఉండబోతోందని ప్రకటించిన లక్ష్మీనగర్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీని ఎట్టకేలకు పార్టీ సీనియర్ నేతలు చల్లబరిచారు. సీనియర్ నాయకులు సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్ కలిసి బిన్నీ ఇంటికి మంగళవారం రాత్రి దాటిన తర్వాత వెళ్లారు. చాలాసేపు ఆయనతో చర్చలు జరిపి, నచ్చజెప్పారు. అనంతరం బిన్నీ విలేకరులతో మాట్లాడారు. పార్టీలో గొడవలు ఏమీ లేవని, తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి ఏమీ లేదని అన్నారు. పార్టీలో అసంతృప్తి అనే వివాదాన్ని మీడియా మాత్రమే సృష్టించిందని, ఇప్పుడు కూడా తాము బిన్నీని సాధారణంగా కలిశామే తప్ప ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్ అన్నారు. ఆరుగురు సభ్యులతో మంత్రివర్గాన్ని అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయనకు అత్యంత సన్నిహితుడైన మాజీ పాత్రికేయుడు మనీష్ సిసోదియా, జెయింట్ కిల్లర్ రాఖీ బిర్లా, సోమ్‌నాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్, గిరీష్ సోనీ, సతేంద్ర జైన్ ఉన్నారు. తన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన బిన్నీ.. మంగళవారం రాత్రి కేజ్రీవాల్ ఇంటినుంచి ఆగ్రహంగా బయటకు రావడం, ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరగడం తెలిసిందే.