టీ కప్పులో తుపాను | Arvind Kejriwal denies rift within Aam Aadmi Party, says MLA Vinod kumar Binny | Sakshi
Sakshi News home page

టీ కప్పులో తుపాను

Published Wed, Dec 25 2013 11:18 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

Arvind Kejriwal denies rift within Aam Aadmi Party, says MLA Vinod kumar Binny

సాక్షి, న్యూఢిలీ:మంత్రి పదవి రాలేదన్న ఆగ్రహంతో రగిలిపోయిన లక్ష్మీనగర్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ అలక వీడడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడింది. తిరుగుబాటు వ్యవహారమంతా టీ కప్పులా తుపానులా సద్దుమణగడంతో ఊపిరి పీల్చుకున్న ఆప్‌నేతలు మంత్రిపదవుల విషయంలో తమ పార్టీలో అసలు గొడవే లేదంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్,  యోగేంద్ర యాదవ్‌లే కాకుండా వినోద్‌కుమార్ బిన్నీ కూడా అలక ఆరోపణలను ఖండించారు. కాబోయే మంత్రుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆగ్రహించి సమావేశం నుంచి వెళ్లిపోయిన బిన్నీకి..  కుమార్ బిశ్వాస్, సంజయ్ సింగ్‌లు మంగళవారం పొద్దుపోయాక నచ్చజెప్పినట్టు తెలియవచ్చింది.కాగా విందుకు వెళ్లాల్సి ఉండడంతో సమావేశం నుంచి త్వరగా వెళ్లిపోయానని బిన్నీ పేర్కొన్నారు.
 
  తాను  ఆగ్రహించానని ఎవరు  చెప్పారంటూ మండిపడ్డారు. ప్రజలకు  సేవ చేయడానికి మాత్రమే ఉన్నానని, మంత్రి పదవిని కోరడం లేదని ఆయన బుధవారం చెప్పారు. బుధవారం ఉదయం  పార్టీ కార్యాలయంలో జరిగే జనతా దర్బార్‌కు బయలుదేరే ముందు అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి అలకలు, కోపతాపాలు లేవన్నారు. బిన్నీ ఆగ్రహించలేదని,  ఆయన మంత్రిపదవి కోరలేదని వివరణ ఇచ్చారు. బిన్నీ అలిగాడ నే వార్తలు రావడంతో అతనితో మాట్లాడడానికి కుమార్  బిశ్వాస్, సంజయ్ సింగ్ లు బిన్నీ ఇంటికి వెళ్లారని, కానీ తనకేమీ కోపం లేదని బిన్నీ వారికి చెప్పాడని కేజ్రీవాల్ వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement