
అత్యాచారంపై స్పందించలేదేం: బిన్నీ
అనుకున్నంతా అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీలో అప్పుడే తిరుగుబాటు మొదలైపోయింది. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ బహిరంగంగా పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అరవింద్ కేజ్రీవాల్ చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటని ఆయన అన్నారు.
కొద్దిమంది వ్యక్తులను ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడలేదని, అవినీతిపై పోరాటమే లక్ష్యంగా ఏర్పడిందని గుర్తుచేశారు. ఢిల్లీ ప్రజల విద్యుత్, తాగునీటి అవసరాలు ఇంతవరకు ఇంకా తీరనే లేదన్నారు. డెన్మార్క్ మహిళపై ఢిల్లీ నడిబొడ్డున అత్యాచారం జరిగితే ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని బిన్నీ నిలదీశారు.