సోమనాథ్ మంత్రి పదవి నుంచి దిగాల్సిందే | Somnath Bharti must step down: Vinod Kumar Binny | Sakshi
Sakshi News home page

సోమనాథ్ మంత్రి పదవి నుంచి దిగాల్సిందే

Published Fri, Jan 24 2014 1:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM

సోమనాథ్ భారతి (ఫైల్ ఫోటో)

సోమనాథ్ భారతి (ఫైల్ ఫోటో)

ఉగాండ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన న్యూఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి వెంటనే మంత్రి పదవి నుంచి దిగిపోవాలని ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ డిమాండ్ చేశారు. భారతీని వెంటనే అరెస్ట్ చేయాలని బిన్నీ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ కమిషనర్ బి.ఎస్. బస్సీని కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిన్నీ మాట్లాడుతూ... విదేశీ మహిళలతో భారతీ వ్యవహరించిన తీరు సిగ్గు మాలిన చర్యగా ఆయన అభివర్ణించారు.

 

మంత్రి అని కోణంలో కాకుండా భారతి విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ బస్సీ తెలిపారని బిన్నీ వెల్లడించారు.మంత్రి వర్గం నుంచి భారతిని వెంటనే తొలగించాలని ఆయన న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.  అరవింద్ కేజ్రీవాల్ 36 గంటల ఆందోళన సందర్భంగా ఆప్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో సామాన్యులు సమిధులయ్యారని అన్నారు. ఆ ఘటనపై అరవింద్ కేజ్రీవాల్పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement