B.S. Bassi
-
'రికార్డు టైమ్ లో సెన్సేషనల్ కేసుల పరిష్కారం'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గతేడాది నేరాలు 17 శాతం పెరిగాయి. 2015లో 182,644 కేసులు నమోదయినట్టు ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొన్నారు. మొత్తం కేసుల్లో 27 శాతం(49,903) కేసులను పరిష్కరించారు. గతేడాది తమ పనితీరు పట్ల ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ సంతృప్తి వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం తమ పట్ల ప్రజలకు పెరుగుతున్న విశ్వాసానికి ప్రతీకగా ఆయన వర్ణించారు. 'మేక అపహరణ నుంచి రూ. 20 చోరీ వరకు ప్రతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఢిల్లీ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నందుకు సంతృప్తిగా ఉంది' అని విలేకరుల సమావేశంలో కమిషనర్ అన్నారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం వంటివి బాగా తగ్గాయని చెప్పారు. తీవ్రమైన కేసుల పరిష్కారంలో 2014తో పోలిస్తే మెరుగయ్యామని వెల్లడించారు. సంచలనాత్మక కేసులన్నింటినీ రికార్డు టైమ్ లో పరిష్కరించామని చెప్పారు. -
ప్రజల ఇక్కట్ల పరిష్కారానికి వర్కింగ్ గ్రూపు
న్యూఢిల్లీ: ప్రజల ఇక్కట్ల పరిష్కారం కోసం అత్యున్నతస్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సికి భారతీయ జనతా పార్టీ విన్నవించింది. తమ తమ స్టేషన్ల పరిధిలో తీవ్రస్థాయి నేరాలు జరిగితే అందుకు ఆయా స్టేషన్ హౌస్ అధికారుల (ఎస్హెచ్ఓ)లను కచ్చితంగా బాధ్యులను చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కోరింది. ఈ మేరకు కమిషనర్‌కు ఓ వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సతీశ్ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజల ఈతిబాధల పరిష్కారం కోసం తక్షణమే ఓ అత్యున్నతస్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఆయా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్డబ్ల్యూఎస్)లకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులను సభ్యులుగా తీసుకోవాలి. దీంతోపాటు ఆయా వర్తక సంఘాలకు చెం ది న ప్రతినిధులను కూడా అందులో సభ్యులుగా చేర్చుకోవాలి. ఈ వర్కి ంగ్ గ్రూపు కనీసం నెలకొకసారి కచ్చితంగా సమావేశం కావా లి. ఆయా పోలీస్ స్టేషన్లలో కొలి క్కిరాని కేసులను ఈ గ్రూపు ... పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి’ అని అన్నారు. దీంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్లలో ఠాణా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. -
సోమనాథ్ మంత్రి పదవి నుంచి దిగాల్సిందే
ఉగాండ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన న్యూఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి వెంటనే మంత్రి పదవి నుంచి దిగిపోవాలని ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ డిమాండ్ చేశారు. భారతీని వెంటనే అరెస్ట్ చేయాలని బిన్నీ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ కమిషనర్ బి.ఎస్. బస్సీని కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిన్నీ మాట్లాడుతూ... విదేశీ మహిళలతో భారతీ వ్యవహరించిన తీరు సిగ్గు మాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. మంత్రి అని కోణంలో కాకుండా భారతి విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ బస్సీ తెలిపారని బిన్నీ వెల్లడించారు.మంత్రి వర్గం నుంచి భారతిని వెంటనే తొలగించాలని ఆయన న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ 36 గంటల ఆందోళన సందర్భంగా ఆప్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో సామాన్యులు సమిధులయ్యారని అన్నారు. ఆ ఘటనపై అరవింద్ కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నిర్భయ కేసు పాఠాలు అందరితో పంచుకుంటాం
గతేడాది డిసెంబర్16న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచార ఘటన కేసుకు సంబంధించిన దర్యాప్తు ద్వారా నేర్చుకున్న పాఠాలను మిగతా ఉన్నతాధికారులతో పంచుకుంటామని న్యూఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ వెల్లడించారు. నిర్భయ కేసులో నిందితులకు ఈ రోజు సాకేత్‌లోని న్యాయస్థానంలో నిందితులకు శిక్ష ఖరారు కానుంది. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ఉదయం కోర్టుకు విచ్చేశారు. ఈ సందర్బంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భవిష్యత్తులో ఇటువంటి కేసులపై విచారణకు నిర్భయ దర్యాప్తు చేసిన విధానం ఉపకరిస్తుందన్నారు. నిర్భయ కేసు దర్యాప్తునకు సంబంధించి అన్ని శాస్త్రీయ విధానాలు పాటించామన్నారు. అలాగే తమ శక్తి మేరకు సాక్ష్యాలను సంపాదించామన్నారు. అత్యాచార కేసులో నలుగురు నిందితులను పోలీసులు సాకేత్ కోర్టుకు తీసుకువచ్చారు. అయితే నిందితులను కోర్టు ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విచారించి శిక్ష ఖరారు చేయనుంది.