ప్రజల ఇక్కట్ల పరిష్కారానికి వర్కింగ్ గ్రూపు | 'Police-public working group needed to address people's grievances' | Sakshi
Sakshi News home page

ప్రజల ఇక్కట్ల పరిష్కారానికి వర్కింగ్ గ్రూపు

Published Wed, Aug 27 2014 10:15 PM | Last Updated on Tue, Aug 21 2018 8:06 PM

'Police-public working group needed to address people's grievances'

 న్యూఢిల్లీ: ప్రజల ఇక్కట్ల పరిష్కారం కోసం అత్యున్నతస్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాలని నగర పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సికి భారతీయ జనతా పార్టీ విన్నవించింది. తమ తమ స్టేషన్‌ల పరిధిలో తీవ్రస్థాయి నేరాలు జరిగితే అందుకు ఆయా స్టేషన్ హౌస్ అధికారుల (ఎస్‌హెచ్‌ఓ)లను కచ్చితంగా బాధ్యులను చేయాలని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కోరింది. ఈ మేరకు కమిషనర్‌కు ఓ వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సతీశ్ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రజల ఈతిబాధల పరిష్కారం కోసం తక్షణమే ఓ అత్యున్నతస్థాయి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
 
 ఇందులో ఆయా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఎస్)లకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులను సభ్యులుగా తీసుకోవాలి. దీంతోపాటు ఆయా వర్తక సంఘాలకు చెం ది న  ప్రతినిధులను కూడా అందులో సభ్యులుగా చేర్చుకోవాలి. ఈ వర్కి ంగ్ గ్రూపు కనీసం నెలకొకసారి కచ్చితంగా సమావేశం కావా లి. ఆయా పోలీస్ స్టేషన్‌లలో కొలి క్కిరాని కేసులను ఈ గ్రూపు ... పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి’ అని అన్నారు. దీంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్‌లలో ఠాణా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement