
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. 19 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి బలవంతంగా కారులోకి లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అయినా యువతి భయపడకుండా కారు ఎక్కేందుకు నిరాకరించింది.
దీంతో అతడు ఆమెను కారు దగ్గరకు ఈడ్చుకెళ్లాడు. వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో యువతికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీలో వరుసగా దారుణాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. జనవరి 1న అంజలి అనే యువతి స్కూటీని ఢీకొట్టి ఆమెను కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
జనవరి 2న ఆదర్శ్ నగర్‌లో జరిగిన మరో దారుణ ఘటనలో శివకుమార్ అనే 20 ఏళ్ల యువకుడు 21 ఏళ్ల యవతిని కత్తితో పలుమార్లు పొడిచాడు. ఇద్దరూ స్నేహితులే అయినప్పటీకీ ఏదో విషయంలో గొడవపడి అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
చదవండి: అయ్యో అంజలి.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు
Comments
Please login to add a commentAdd a comment