ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎంపికైతే తాను శిరోముండనం చేయించుకుంటానని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి ఇప్పుడు తన నిర్ణయంపై యూ టర్న్ తీసుకున్నారు. అంతేకాదు దీనివెనుకగల కారణాన్ని కూడా వివరించారు.
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ఆప్ నేత సోమనాథ్ భారతి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన రోజున ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ మూడోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపధ్యంలో పలువురు సోమనాథ్ భారతిని శిరోముండనం ఎప్పుడు చేయించుకుంటారని అడుగుతున్నారు.
ఈ నేపధ్యంలో సోమనాథ్ భారతి దీనికి సమాధానమిస్తూ, తాను శిరోముండనం చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ప్రధాని మోదీ తన సొంత సత్తాతో విజయం సాధించలేదని, ఇది ఎన్డీఏ మిత్రపక్షాల ఏకీకృత విజయమేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సమయంలో ఢిల్లీ లోక్‌సభ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ప్రకటించారు.
జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలిపోతుందని సోమనాథ్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏడు స్థానాల్లో భారత కూటమి విజయం సాధిస్తుందని కూడా సోమనాథ్ భారతి చెప్పారు. కాగా న్యూఢిల్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ చేతిలో సోమనాథ్ భారతి ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment