
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ తనుజారాణి కోరారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తోంది. సోమవారం లోక్‌సభలో ఎంపీ తనుజారాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలి అని గత పది సంవత్సరాలుగా మా వైయస్ఆర్ సీపీ డిమాండ్ చేస్తూనే ఉంది.
-గుమ్మ తనూజా రాణి, వైయస్ఆర్ సీపీ ఎంపీ pic.twitter.com/pwE9xTfMqS— YSR Congress Party (@YSRCParty) July 1, 2024
‘‘టీపీపీ బలంపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా ఆ పార్టీ అడగడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, పార్టీ ఆఫీసులపై టీడీపీ దాడులు మానుకోవాలి. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో విద్యాబోధనకు గిరిజనేతర టీచర్లు రావడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని గత పదేళ్లుగా వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తునే ఉంది. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి ’’ అని ఆమె అన్నారు.
ఇదిలా ఉంటే.. ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉన్న నితీశ్ కుమార్ జేడీయూ(12), బీహార్ ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం సైతం పాస్ చేసింది. కానీ, 16 సీట్లతో రెండో స్థానంలో టీడీపీ మాత్రం ఇప్పటివరకైతే టీడీపీ ఏ ఊసు ఎత్తడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment