specail status
-
అవకాశం ఉన్నా ప్రత్యేక హోదా ఎందుకు అడగరు?: వైఎస్సార్సీపీ ఎంపీ తనుజారాణి
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ తనుజారాణి కోరారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. సోమవారం లోక్‌సభలో ఎంపీ తనుజారాణి మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలి అని గత పది సంవత్సరాలుగా మా వైయస్ఆర్ సీపీ డిమాండ్ చేస్తూనే ఉంది.-గుమ్మ తనూజా రాణి, వైయస్ఆర్ సీపీ ఎంపీ pic.twitter.com/pwE9xTfMqS— YSR Congress Party (@YSRCParty) July 1, 2024 ‘‘టీపీపీ బలంపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నా ప్రత్యేక హోదా ఆ పార్టీ అడగడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, పార్టీ ఆఫీసులపై టీడీపీ దాడులు మానుకోవాలి. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో విద్యాబోధనకు గిరిజనేతర టీచర్లు రావడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని గత పదేళ్లుగా వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తునే ఉంది. ఇప్పటికైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి ’’ అని ఆమె అన్నారు.ఇదిలా ఉంటే.. ఎన్డీయే కూటమిలో మూడో స్థానంలో ఉన్న నితీశ్ కుమార్ జేడీయూ(12), బీహార్ ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో తీర్మానం సైతం పాస్ చేసింది. కానీ, 16 సీట్లతో రెండో స్థానంలో టీడీపీ మాత్రం ఇప్పటివరకైతే టీడీపీ ఏ ఊసు ఎత్తడం లేదు. -
ఏపీ ప్రత్యేక హోదాపై చర్చించాలని రూల్ 267 నోటీసు ఇచ్చిన విజయసాయి రెడ్డి
-
బస్సుయాత్రలు చేపడితే రాళ్లతో కొడతారు
ఆలూరు : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజీనే కావాలంటూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ బస్సుయాత్రలు చేపడితే ప్రజలు రాళ్లతో దాడి చేయడం తప్పదని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక బస్టాండు ఆవరణలో చేపట్టిన రిలే నిరాహార నిదీక్షలు బుధవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. మండలంలోని మొలగవల్లి గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి, బంకా రామాంజనేయులు, నాగభూషణం, హరేరాం, కంది గాదిలింగ, తిక్కన్న, కిష్టప్ప, వెంకటేశు దీక్షలో కూర్చున్నారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను అమలు చేసి, ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోనంకి జనార్ధన్ నాయుడు, యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు విక్రాంత్ రెడ్డి, ఆలూరు, హాలహర్వి, హొళగుంద, మండలాల కన్వీనర్లు చిన్న ఈరన్న, షఫివుల్లా, భీమప్ప చౌదరి, హాలహర్వి ఎంపీపీ బసప్ప, ఎంపీటీసీలు లక్ష్మన్న, నాగేంద్ర, నాగరాజు, చౌడమ్మ, సుమతి, నాయకులు అరికెర వీరేశ్, అరికెర వెంకటేశ్, శివ, తిక్కన్న, గోవిందు, సోమేశ్వర్‌రెడ్డి, హనుమయ్య, ప్రభాకర్‌నాయుడు, దేవనకొండ నారాయణరెడ్డి, కిట్టు తదితరులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ప్రజా సంఘాల మద్దతు.. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్సీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఏపీ బీసీ సంఘం నాయకులు లోకేశ్, లింగన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రచార కార్యదర్శి గాదిలింగ, రామాంజనేయులు, మారెప్ప, బాబు, రాయలసీమ దళిత సమాఖ్య నియోజకవర్గ అధ్యక్షుడు బూర్లకృష్ణ, సీపీఎం నియోజకవర్గ కమిటీ కన్వీనర్ నారాయణస్వామి, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు షాకీర్, మైనా తదితరులు మద్దతు తెలిపారు. -
హోదాపై పార్టీలకతీతంగా పోరాడాలి
నెల్లూరు(టౌన్) : ప్రత్యేకహోదాపై జెండాలు, అజెండాలు పక్కన బెట్టి పార్టీలకతీతంగా పోరాడాలలని ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య అన్నారు. నగరంలోని సర్వోదయ కళాశాలలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హోదా రాకుంటే రాష్ట్రానికి భవిష్యత్ ఉండదన్నారు. బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను మిగిలిన రాష్ట్రాలతో పోల్చి, అవి ఒప్పుకోవడం లేదని సాకులు చెప్పడం తగదన్నారు. ప్రధానంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హోదా కోసం ముందుకురావాలని కోరారు. సమావేశంలో లాయర్స్ అసోసియేషన్ నాయకులు చంద్రశేఖరరెడ్డి, పీఆర్టీయూ నాయకులు నాగేంద్రకుమార్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కొప్పులు చంద్రశేఖర్, బీటీఏ జిల్లా అధ్యక్షడు శేఖర్, మనోహర్, మనోజ్‌బాబు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాపై చంద్రబాబు తడబాటు
న్యూఢిల్లీ: ఎన్నో వినతులు, మరెన్నో ఆశలతో హస్తినలో అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ తర్వాత చాలా బేలగా కనిపించారు. ప్రత్యేక హోదా, జల వివాదాలు, తెలంగాణ ప్రాజెక్టులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయనకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ విషయాల్లో ఏం బదులివ్వలేక, సైలెంట్‌గా ఉండలేక మింగలేక, కక్కలేని పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. పైపెచ్చు పాజిటివ్ ప్రశ్నలు అడగాలంటూ మీడియా ప్రతినిధులను కోరటం గమనార్హం. ప్రధాని మోదీని ప్రత్యేకంగా నిధులు అడగలేదన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదన్న కోణంలో వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చి నిధులు ఇవ్వలేకపోతే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. హోదా ఇచ్చాం కదా! ఇక ఏమీ ఇవ్వబోమని కేంద్రం అంటే అప్పుడు ఏం చేస్తారు? అని ఆయన ఎదురు ప్రశ్నలు వేశారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రత్యేక హోదా అడుగుతున్నారు? 14వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత ఎవరు అడిగారు? అని ఆయన విలేకరులకు ప్రశ్నలు సంధించారు.