సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత సోమనాథ్ భారతి. వారసత్వ రాజకీయాలను బీజేపీ కూడా పోత్సహిస్తోందని సోమనాథ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ సాక్షి ప్రతినిధితో సోమనాథ్ భారతి ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ..
దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. అన్యాయంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. స్వాతి మలివాల్ ఘటనను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేయండి. అబ్ కీ బాత్ బీజేపీ తడి పార్. బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదు.
కేంద్రంలో ఇండియా కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులే గెలుస్తారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని బీజేపీ నేతలు చెప్పుకుంటారు. మరి సుష్మా స్వరాజ్ కూతురు టికెట్ ఎలా ఇచ్చారు?. దీన్ని రాజకీయ వారసత్వం అనరా?. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment