somnath bharti
-
‘శిరోముండనం’ ప్రకటన వెనక్కి తీసుకున్న ఆప్ నేత
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎంపికైతే తాను శిరోముండనం చేయించుకుంటానని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి ఇప్పుడు తన నిర్ణయంపై యూ టర్న్ తీసుకున్నారు. అంతేకాదు దీనివెనుకగల కారణాన్ని కూడా వివరించారు.నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ఆప్ నేత సోమనాథ్ భారతి ఎగ్జిట్ పోల్స్ వెలువడిన రోజున ప్రకటించారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ మూడోమారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపధ్యంలో పలువురు సోమనాథ్ భారతిని శిరోముండనం ఎప్పుడు చేయించుకుంటారని అడుగుతున్నారు.ఈ నేపధ్యంలో సోమనాథ్ భారతి దీనికి సమాధానమిస్తూ, తాను శిరోముండనం చేయించుకోవాల్సిన అవసరం లేదని, ఎందుకంటే ప్రధాని మోదీ తన సొంత సత్తాతో విజయం సాధించలేదని, ఇది ఎన్డీఏ మిత్రపక్షాల ఏకీకృత విజయమేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సమయంలో ఢిల్లీ లోక్‌సభ ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతి మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు కొట్టించుకుంటానని ప్రకటించారు.జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలిపోతుందని సోమనాథ్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏడు స్థానాల్లో భారత కూటమి విజయం సాధిస్తుందని కూడా సోమనాథ్ భారతి చెప్పారు. కాగా న్యూఢిల్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ చేతిలో సోమనాథ్ భారతి ఓటమి పాలయ్యారు. -
మోదీ మూడోసారి ప్రధాని కాలేడు : సోమనాథ్ భారతీ
ఢిల్లీ: పలు పర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో బీజేపీ, ఎన్డీయే కూటిమి సుమారు 350 స్థానాలు గెలుస్తాయని అంచనా వేశాయి. బీజేపీ, ఎన్డీయే కూటమికి అధిక సీట్లు వస్తాయిని పేర్కొన్న సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతీ తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం కౌంటింగ్ రోజున అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని తేలిపోతాయని అన్నారు. బీజేపీ అధిక సీట్లు గెలుచుకొని మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేయించుకుంటానని ఛాలెంజ్ చేశారు.‘‘నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు (శిరోముండనం) చేసుకుంటా. నా మాటలు రాసిపెట్టుకోండి. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పు అని జూన్ 4న తెలిసిసోతుంది. నరేంద్రమోదీ మూడోసారి పీఎం కాలేడు. ఢిల్లీ మొత్తం ఏడు స్థానాల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి గెలుస్తుంది. మోదీపై ఉన్న భయంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆయన ఓడిపోతారని వెల్లడించవు. మేము జూన్ 4న విడుదల అయ్యే నిజమైన ఫలితాల కోసం ఎదురు చుస్తున్నాం. ప్రజలు ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ భారీగా ఓట్లు వేశారు’’ అని సోమనాథ్ భారతీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.I will shave off my head if Mr Modi becomes PM for the third time.Mark my word!All exit polls will be proven wrong on 4th June and Modi ji will not become prime minister for the third time.In Delhi, all seven seats will go to India ALLIANCE.Fear of Mr Modi does not allow…— Adv. Somnath Bharti: इंसानियत से बड़ा कुछ नहीं! (@attorneybharti) June 1, 2024 ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన బీజేపీ.. తాము సులభంగా అధిక సీట్లు గెలుస్తామని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. దేశ ప్రజలు మోదీ మూడుసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. కానీ, సోమనాథ్ భారతీలానే చాలా మంది ప్రతిపక్ష నేతలు ఎగ్జిట్ పోల్స్‌ను తప్పని అంటున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.2019లో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ మొత్తం ఏడు సీట్లకు 6 సీట్లు కౌవసం చేసుకుంటుందని పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తే.. ఏకంగా ఏడు సీట్లలో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈసారి ప్రతిపక్షాల ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేసింది. ఈసారి ఏడు సీట్లలోను తామే గెలుస్తామని ఆ రెండు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
సాక్షి ఎక్స్‌క్లూజివ్: ‘సుష్మా స్వరాజ్ కూతురికి టికెట్ ఇవ్వొచ్చా?’
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత సోమనాథ్ భారతి. వారసత్వ రాజకీయాలను బీజేపీ కూడా పోత్సహిస్తోందని సోమనాథ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ సాక్షి ప్రతినిధితో సోమనాథ్ భారతి ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. అన్యాయంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. స్వాతి మలివాల్ ఘటనను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేయండి. అబ్ కీ బాత్ బీజేపీ తడి పార్. బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదు. కేంద్రంలో ఇండియా కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులే గెలుస్తారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని బీజేపీ నేతలు చెప్పుకుంటారు. మరి సుష్మా స్వరాజ్ కూతురు టికెట్ ఎలా ఇచ్చారు?. దీన్ని రాజకీయ వారసత్వం అనరా?. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ప్రజల సంక్షేమం కోసమే ‘ఆప్’
ముషీరాబాద్ (హైదరాబాద్): ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పని చేస్తోందని దక్షిణ భారత ఇన్చార్జి సోమ్‌నాథ్ భార్తి అన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వ విధా నాలు అన్నివర్గాల వారిని ఆకర్షిస్తున్నందునే దేశం మొత్తం ఆప్ వైపు చూస్తోందని అభిప్రాయపడ్డారు. ఆప్ తెలంగాణ విభాగం చేపట్టిన పాదయాత్ర రెండో రోజు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ముషీరాబాద్‌లోని అశోక్‌నగర్ క్రాస్‌రోడ్ నుంచి మొదలైన యాత్ర 10 కి.మీ. సాగినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇందిరాశోభన్ తెలిపారు. రూ.200 కోట్లతో జీహెచ్ఎంసీ నిర్మించిన టాయిలెట్స్ కొరగాకుండా పోయాయని, స్థానిక సమస్యలను పట్టించుకునే నాథుడేలేడని ఆరోపించారు. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్న ప్రభుత్వం ఆ తర్వాత ప్రజలను గాలికొదిలేసిందని విమర్శించారు. భవిష్యత్‌లో ప్రజల పక్షాన పోరాటం చేయటానికి ఆప్ సిద్ధంగా ఉందన్నారు. -
తెలంగాణ రాష్ట్రంలో విస్తరణకు ఆప్ తహతహ
సాక్షి, హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో హ్యాట్రిక్ కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇటీవల పంజాబ్‌లోనూ పాగా వేసి దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. గోవా, తదితర రాష్ట్రాల్లో ఖాతా తెరిచిన ఆప్ ఇప్పుడు తెలంగాణలో ఆరంగేట్రం చేసేందుకు తహతహ లాడుతోంది. పార్టీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జి సోమనాథ్ భారతి ఇప్పటికే వారంలో రెండురోజులు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతలతో తరుచూ సమావేశమవుతూ పార్టీ విస్తరణకు ప్రయత్నిస్తున్నారు. చార్మినార్ నుంచి పాదయాత్ర.. కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ నెల 14న హైదరాబాద్‌కు రానున్నట్టు తెలిసింది. తమ పార్టీ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తోందని పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పదే పదే చెప్పింది. తాజాగా అంబేడ్కర్ జయంతి పురస్కరించు కుని 14న నగరంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ పాదయాత్రను కేజ్రీవాల్ జెండా ఊపి ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ కన్వీనర్ ఇందిరాశోభన్ తెలిపారు. హైదరాబాద్‌లోని చార్మినార్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానున్నట్టు ఆమె తెలిపారు. ఓ మాజీ ఐఏఎస్, మాజీ ఎంపీకి ఆహ్వానం! రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు దీటుగా ఉండాలంటే భారీ స్థాయిలో కార్యాచరణ చేపట్టాల్సి ఉంటుందని ఆప్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో బలమైన నేతల చేరిక, క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరింపజేసే వ్యూహాత్మక కార్యాచరణ, ఆర్థికంగా బలమైన నేతల కోసం ఆప్ కేంద్ర కమిటీ అన్వేషణ సాగిస్తోందని విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో భాగంగా ఇటీవల ఉద్యోగానికి రాజీనా మా చేసి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఓ మాజీ ఐఏఎస్‌ను పార్టీలోకి ఆహ్వా నిస్తున్నారని తెలిసింది. పలు నియోజకవర్గాల్లో సుదీర్ఘ కాలం శాసనసభ్యులుగా పనిచేసిన వారి కుటుంబీకులను కూడా పార్టీలోకి ఆహ్వానించేం దుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్–బీజేపీ కాకుండా మరో ప్రత్యామ్నాయ వేదికలోకి వెళ్లాలని ఆలోచనలో ఉన్న ఓ మాజీ ఎంపీతో కూడా కేజ్రీవాల్ కోర్ టీం ఇటీవల ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 41 స్థానాల్లోనూ డిపాజిట్లు గల్లంతు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లకు గాను 41 స్థానాల్లో ఆప్ తరఫున అభ్యర్థులు పోటీ చేసినా డిపాజిట్లు దక్కలేదు. మొత్తంగా 13,134 ఓట్లు (0.06 శాతం)మాత్రమే వచ్చాయి. ఈ స్థితిలో ఉన్న పార్టీ ఎప్పుడు పుంజుకుంటుందనే విషయాన్ని పక్కనబెడితే.. ఢిల్లీలో చేసిన అభివృద్ది, పంజాబ్‌లో ఇటీవలి విజయం ఆసరాగా ప్రజల్లోకి వెళ్లేందుకు కేంద్ర కమిటీ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది. ముందుగా సభ్యత్వ నమోదు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. -
కేసీఆర్ తెచ్చే కూటమిలో చేరబోం!
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ ఏర్పాటు చేయనున్న కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చేరబోదని ఆ పార్టీ తెలంగాణ ఎన్నికల ఇన్చార్జి సోమ్‌నాథ్ భారతి స్పష్టం చేశారు. బీజేపీని ఓడించాలన్న ఏకైక ఎజెండాతో వచ్చే కూటములు విజయవంతం కావని, అలాంటి కూటముల్లో ప్రజాసమస్యలే ఎజెండాగా ఉంటే అప్పుడు ఆలోచిస్తామన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీ, ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ విజయాలు సృష్టించిన తర్వాత తమ పార్టీ దేశవ్యాప్త విస్తరణపై దృష్టి సారించిందన్నారు. సీఎం కేసీఆర్ అవినీతి గురించి రాష్ట్రంలోని చిన్న పిల్లలను అడిగినా చెప్తారన్నారు. సీఎం కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ గెలుస్తుందన్న భయంతో ఎన్నికలను వాయిదా వేయించారని సోమ్‌నాథ్ ఆరోపించారు. 14న న్యాయ పాదయాత్ర తెలంగాణలో వచ్చే నెల 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని చేపట్టనున్న న్యాయ పాదయాత్రను విజయవంతం చేయాలని సోమ్‌నాథ్ భారతి పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన హన్మకొండ, నర్సంపేట నియోజకవర్గాల్లో ఆప్ కార్యాలయాలను ప్రారంభించి, జెండాలను ఆవిష్కరించారు. హన్మకొండలో తాళ్లపల్లి సురేష్‌గౌడ్, నర్సంపేటలో నవీన్‌రెడ్డి ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ తరహాలో పాలన అందించడానికి మీ బిడ్డగా తెలంగాణలో అడుగుపెడుతున్న కేజ్రీవాల్‌ను అక్కున చేర్చుకొని, ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరాశోభన్, సెర్చ్ కమిటీ సభ్యులు రామ్‌గౌడ్, సయ్యద్ గఫ్ఫర్, తాళ్లపల్లి సురేష్‌గౌడ్ పాల్గొన్నారు. -
నీళ్లు, నిధులు, నియామకాలెక్కడ?
సాక్షి, మేడ్చల్ జిల్లా: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే, సౌత్ ఇండియా ఇన్చార్జీ సోమనాథ్ భారతి అన్నారు. తెలంగాణ లోని ప్రతి గడపకు వెళ్లి, ప్రజలకు పూర్తి భరోసా కల్పిస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆప్ తెలంగాణ నిర్వహించిన పంజాబ్ విజయోత్సవ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనికి ముందు శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరాశోభన్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం గన్‌పార్క్ వరకు ర్యాలీ గా వచ్చి, అమరవీరుల స్థూపానికి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా సోమనాథ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలు లేవని, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు, ఉద్యమ లక్ష్యాలు పక్కకు నెట్టివేశారని సోమనాథ్ ఆరోపించారు. ఈ పరిస్థితి మారాలంటే సామాన్యుడికే అధికారం అనే నినాదంతో మీ ముం దుకు వస్తున్న ఆప్‌ను అక్కున చేర్చుకోవాలని కోరా రు. అందరి తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు పోరాడితే.. రాష్ట్రం ఏర్పడ్డాక అది కొందరి తెలంగాణగా మారిందని ఇందిరాశోభన్ ఆరోపించారు. -
దక్షిణాదిపై ‘ఆప్’ నజర్
న్యూఢిల్లీ: పంజాబ్‌లో అఖండ విజయం తాలూకు ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌లో భారీ స్థాయిలో సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు పార్టీ సీనియర్ నేత సోమనాథ్ భారతి చెప్పారు. పంజాబ్‌లో గెలుపు తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆప్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక నేతల ఆధ్వర్యంలోనే సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు. మార్పు కోరేవారంతా ఆప్‌లో చేరాలని పిలుపునిచ్చారు. దక్షిణ భారతదేశంలో దశల వారీగా పాదయాత్రలు సైతం చేపట్టాలని నిర్ణయించినట్లు సోమనాథ్ భారతి పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 నుంచి పాదయాత్రలకు శ్రీకారం చుడతామని వివరించారు. పాదయాత్రలో తొలి అడుగు తెలంగాణలోనే వేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. -
ఆ ఎమ్మెల్యే.. భార్యను కొట్టి వేధించేవారు!
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ ప్రభుత్వ మాజీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి తరచు తన భార్యను వేధిస్తూ, కొట్టేవాడని పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. గృహహింస కేసులో ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఆయన భార్య లిపికా మిత్రా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ ఐఎస్ మెహతాకు పోలీసులు పైవిధంగా చెప్పారు. ఎమ్మెల్యే అయిన తన భర్తకు బెయిల్ ఇచ్చేముందు దిగువ కోర్టు తగిన విధంగా వ్యవహరించలేదని లిపికా మిత్రా కోర్టుకు విన్నవించారు. కోర్టు సూచనల మేరకు పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. లిపికా మిత్రా శరీరం మీద ఉన్న మచ్చలన్నీ కుక్క కాట్లు, కాలిన గాయాల వల్లేనని ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచే సోమ్‌నాథ్ భారతి తన భార్యను వేధించి, కొట్టి, తిట్టేవాడని, ఆమె ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా ఏమాత్రం ఊరుకోలేదని.. అలాగే కొనసాగించారని తెలిపారు. గర్భవతిగా ఉన్న సమయంలో లిపికా మిత్రా మధుమేహం, హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నట్లు వైద్య నివేదికలు స్పష్టం చేశాయన్నారు. అయితే తనపై తన భార్య చేస్తున్న ఆరోపణలను సోమ్‌నాథ్ భారతి ఖండించారు. -
ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్నాథ్భారతిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) సరిహద్దు వివాదం కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిమ్స్ చీఫ్ సెక్యురిటీ అధికారి ఇచ్చిన ఫిర్యాదుతో సెప్టెంబర్ 9న హోజ్ కాస్ పోలీస్ స్టేషన్లో సోమ్నాథ్భారతిపై కేసు నమోదైంది. సోమ్‌నాథ్ భారతి తమ సెక్యురిటీ గార్డుతో అనుచితంగా ప్రవర్తించినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ప్రభుత్వాలు దోపిడీదారులవైపే: సోమ్‌నాథ్ భారతి
ప్రభుత్వాలు దోపిడిదారులవైపే ఉన్నాయి తప్ప అణగారిన వర్గాల ప్రజలవైపు లేవని ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇంచార్జీ సోమనాధ్ భారతి అన్నారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శ్రామిక విభాగం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సోమనాధ్ భారతి మాట్లాడుతూ ఢిల్లీలో పాలన పేదల వైపే ఉందని అన్నారు. ఢిల్లీ కార్మికమంత్రి గోపాలరావు కార్మికులకు గుర్తింపు కార్డులను ఇచ్చి వారి సమస్యలను దగ్గరుండి పరిస్కరిస్తున్నారని అన్నారు.ప్రజలకు కావల్సింది ముఖ్యంగా విద్య, వైద్య సౌకర్యాలని, తెలంగాణ ప్రభుత్వం ఈ రెండింటికి తక్కువ ప్రాధన్యత ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు 25 శాతం నిధులను కెటాయించిందని అన్నారు. దీని వల్ల ప్రై వేట్ విద్యాసంస్థలకంటే ప్రభుత్వ విద్యా సంస్థలే మెరుగుపడుతాయని అన్నారు. మోదీ ప్రభుత్వం రాహుల్‌నే ప్రత్యర్ధిగా భావిస్తుందని,ఐతే దేశ ప్రజలు మాత్రం కేజ్రివాల్‌నే ప్రత్యర్ధిగా భావిస్తున్నారని అన్నారు. పీడిత ప్రజలవైపు ఉండటమే ప్రభుత్వం లక్ష్యంగా ఉండాలని, అయితే పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్లకు పెద్ద పీట వేస్తుందని విమర్శించారు. పేదలకు సేవ చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. పేదలు లేని సమాజాన్ని నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆప్ శ్రామిక విభాగం జాతీయ ముఖ్య నాయకులు సరోజ్ సినా, రాజు ఘోషన్, తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు, అడ్వయిజర్ ఆర్.వెంకట్ రెడ్డి, కార్యదర్శి ఎస్.శ్రీశైలం, నాయకులు హైదర్ అబ్బాస్, ఎస్.మధుసూదన్ రావు, నమ్రితా జైశ్వాల్, బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ హైకోర్టులో సోమనాథ్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: రాష్ట్ర పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆప్ నేత, న్యాయ శాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. 2014లో అప్పటి మంత్రిగా ఓ లాడ్జిపై దాడి చేసినప్పుడు ఓ ఆఫ్రికన్ మహిళా వేసిన వేధింపుల కేసుపై ట్రయల్ కోర్టు వేసిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం ఇవ్వలేదని, దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని సోమ్‌నాథ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్‌లతో కూడా ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఇది అనవసరమైన పిటిషన్ అని ధర్మాసనం పేర్కొంది. సోమ్‌నాథ్ తరఫున్ సీనియర్ న్యాయవాది రామ్ జఠ్మలాని వాదించారు. -
మాజీ మంత్రిపై జనవరి 28న ఛార్జ్ షీట్
న్యూఢిల్లీ : ఆఫ్రికా మహిళపై దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు జనవరి 28వరకు గడువు ఇస్తున్నట్లుగా ఢిల్లీ న్యాయస్థానం పేర్కొంది. గత ఏడాది ఓ అర్ధరాత్రి ఆఫ్రికా మహిళపై సోమనాథ్ భారతి దాడి చేశాడన్న కేసుపై మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అంకితా లాల్ విచారణ చేయాల్సి ఉంది. అయితే, మేజిస్ట్రేట్ గైర్హాజరీ కారణంగా ఈ మాజీ మంత్రిపై ఛార్జీషీట్ దాఖలుకు జనవరి 28కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళల ఆత్మగౌరవాన్ని భంగపరచడం, మరికొన్ని అభియోగాలపై సోమనాథ్ భారతితో పాటు మరికొంతమందిపై గతేడాది సెప్టెంబర్ 29న 16 సెక్షన్ల కింద కేసు నమోదయిన విషయం తెలిసిందే. 100 పేజీల ఛార్జీషీట్ తయారు చేసిన ఈ కేసుకు సంబంధించి 41 మంది సాక్షులు ఉన్నట్లు సమాచారం. జనవరి 19, 2014న పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అయితే ఆ సమయంలో నిందితులు ఎవరన్న సమాచారం పోలీసుల వద్ద లేదు. డ్రగ్ రాకెట్, వ్యభిచారం లాంటి ఫిర్యాదులు వస్తున్న ఖిర్కి ఏరియాలోని ఇంటికి మాజీ మంత్రి వెళ్లారని మరిన్ని వివరాలను పోలీసులు పొందుపరిచారు. -
'నాపై కేసు పెడతానని బెదిరించారు'
న్యూఢిల్లీ: తనపై కేసు పెడతానని ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బెదిరించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ఆరోపించారు. నర్సరీ స్కూల్ కు కేటాయించిన స్థలాన్ని బీజేపీ కార్యాలయానికి కేటాయించిన విషయాన్ని లేవనెత్తడంతో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తానని జంగ్ హెచ్చరించారని వెల్లడించారు. శుక్రవారం జరిగిన ఢిల్లీ డెవలప్ మెంట్ ఆథారిటీ సమావేశంలో భారతి పాల్గొన్నారు. 'స్కూల్స్, ఆస్పత్రులకు స్థలం కేటాయించాలని ఢిల్లీ ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. కానీ రాజకీయ కారణాలతో బీజేపీకి స్థలం కేటాయించారు. ఈ భూమిని గతంలో నర్సరీ పాఠశాలకు ఇచ్చార'ని భారతి గుర్తు చేశారు. తాను ఈ అంశాన్ని లేవనెత్తడంతో తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తానని జంగ్ బెదిరించారని సోమనాథ్ తెలిపారు. అయితే ఈ ఆరోపణలను లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తోసిపుచ్చింది. -
సుప్రీంలో సోమ్‌నాథ్ భారతికి నిరాశ
న్యూఢిల్లీ: గృహ హింస, హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతికి సుప్రీం కోర్టులో నిరాశ ఎదురైంది. సోమ్‌నాథ్ భారతికి బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. సోమ్‌నాథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించవలసిందిగా ఆయనకు సూచించింది. ఈ కేసులో అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరిగిన సోమ్‌నాథ్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసింది. -
విచారణలో సోమనాథ్ భారతి కన్నీళ్లు
న్యూఢిల్లీ: పోలీసుల విచారణలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సోమనాథ్ భారతి కన్నీరు పెట్టుకున్నారు. కేసు విచారణ నిమిత్తం పోలీసుల వేసిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఏడ్చేశారు. తనపై గృహహింసకు పాల్పడ్డారని, హత్చేసేందుకు కూడా ప్రయత్నించారని సోమనాథ్ భారతి భార్య లిపికా మిత్ర కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చాలాసార్లు తప్పించుకోవాలని ప్రయత్నించి చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసులకు లొంగిపోయారు. విచారిస్తున్న సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని విచారణ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయనపై ఐపీసీ సెక్షన్ 212 (అపరాధికి ఆశ్రయం ఇవ్వడం) కింద కూడా కేసు నమోదు చేశామని, మరో ఐదుగురిని కూడా నిందితులుగా చేర్చామని చెప్పారు. ఇన్ని రోజులు ఎక్కడెక్కడకు వెళ్లారో, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారో అనే వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఆయన ఏయే ప్రాంతాల్లో ఆశ్రయం పొందారో ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి విచారణ జరపాల్సి ఉందని చెప్పారు. -
సోమ్‌నాథ్‌కు రెండు రోజుల పోలీస్ కస్టడీ
న్యూఢిల్లీ: గృహహింస, హత్యాయత్నం కేసులో ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించారు. మంగళవారం ఢిల్లీ కోర్టు ఈ మేరకు ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం సోమ్‌నాథ్ భారతి ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయన్ను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ నిమిత్తం సోమ్‌నాథ్‌ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా పోలీసులు కోరగా.. సోమ్‌నాథ్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం సోమ్‌నాథ్‌ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. -
'గంటగంటకు ఆయన ఫోన్లు మారుస్తున్నారు'
న్యూఢిల్లీ: భార్యపై గృహహింసకు పాల్పడటమే కాకుండా హత్యయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమనాథ భారతీ గంటగంటకు తాను ఉండే చోటును, ఫోన్లను మారుస్తున్నట్లు తెలిసింది. ఒక కరడుగట్టిన నేరస్తుడిలా సోమనాథ ప్రవర్తిస్తున్నాడని పోలీసులు అన్నారు. ఎంత తప్పించుకు తిరుగుతున్నా ప్రస్తుతం ఆయన ఉన్న చోటు విషయంలో తమకు ఒక అవగాహన ఉందని, ఆగ్రా ప్రాంతంలో సోమనాథ ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు. 'సోమనాథ ఎక్కడ దాక్కున్నారో మాకు ఒక అవగాహన ఉంది. మేం త్వరలోనే ఆయనను చేరుకుంటాం. విచారణంలో భాగస్వామ్యం చేస్తాం' అని సీనియర్ పోలీసు అధికారి దీపేందర్ పాఠక్ చెప్పారు. తనను చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారని సోమనాథ భారతీపై ఆయన భార్య లిపికా మిత్రా కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని ఆయన స్ధానిక, హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు. -
కేజ్రీవాల్‌కు లిపిక కృతజ్ఞతలు
న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమనాథ్ భారతిని పోలీసులకు లొంగిపొమ్మని సూచించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సోమనాథ్ భార్య లిపికా మిత్ర కృతజ్ఞతలు తెలిపారు. సోమనాథ్ తనపై హత్యాయత్నం, గృహహింసకు పాల్పడ్డాడని లిపిక కేసుపెట్టిన విషయం విదితమే. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో సోమనాథ్ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడటానికి ముఖ్యమంత్రి సుదీర్ఘ సమయం తీసుకున్నప్పటికీ ఇప్పటికైనా లొంగిపొమ్మని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కేజ్రీవాల్ వైఖరిపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేజ్రీవాల్ ముందుగా ఒక ముఖ్యమంత్రిలా వ్యవహరించారని, స్నేహానికి తరువాతి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సోమనాధ్ లాంటి వ్యక్తి ఆగస్టులో జరిగిన ఒకరోజు అసెంబ్లీ సమావేశాల్లో మహిళా సాధికారతపై మాట్లాడటం తనకు ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. -
అరెస్టు ఆపేయాలంటూ సుప్రీం కోర్టుకు..
న్యూఢిల్లీ: అక్కడా ఇక్కడా తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ భారతీ చివరకు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తనను అరెస్టు చేయకుండా రక్షించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తనను చిత్ర హింసలకు గురిచేశారని, హత్య చేసేందుకు రెండు సార్లు ప్రయత్నించారని సోమనాథపై ఆయన భార్య లిపికా మిత్రా కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, తొలుత వారిమధ్య సయోద్య కుదిర్చేందుకు ప్రయత్నించినా విఫలం అవడంతో చివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆయన ఢిల్లీలో కిందిస్థాయి కోర్టు ఆ తర్వాత హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్లగా ఆ కోర్టులు నిరాకరించాయి. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు కదిలినా ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కాలేదు. తాజాగా ఆయన తరుపు న్యాయవాది మాత్రం సోమనాథ తరుపున సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశామని, ఆ బెయిల్ వ్యవహారం ఉన్నత న్యాయస్థానంలో తేలేంత వరకు పోలీసులు ఆయన బంధువులను, స్నేహితులను సోమనాథ అరెస్టు కోసం ఇబ్బందులు పెట్టవద్దని న్యాయవాది విజయ్ అగర్వాల్ కోరారు. -
అజ్ఞాతంలోకి సోమ్నాథ్భారతీ
-
మా ఎమ్మెల్యే లొంగిపోవాల్సిందే
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి పోలీసులకు లొంగిపోవాల్సిందేనని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన ఎందుకు పారిపోతున్నారని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. జైలుకు వెళ్లడానికి ఆయన ఎందుకంత భయపడిపోతున్నారని అడిగారు. ఇప్పుడు సోమనాథ్ భారతి ఇటు పార్టీతో పాటు అటు ఆయన కుటుంబానికి కూడా తలనొప్పిగా మారారంటూ చిరాకు పడ్డారు. పోలీసులతో ఆయన సహకరించాలని కేజ్రీవాల్ తెలిపారు. నకిలీ న్యాయపట్టాతో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన జితేందర్ సింగ్ తోమర్ వ్యవహారంతోనే సగం తలనొప్పి వచ్చిన కేజ్రీవాల్‌కు.. తాజాగా సోమనాథ్ భారతి విషయం మరింత చిరాగ్గా మారింది. ఆయన తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ సోమనాథ్ భార్య లిపికా మిత్రా ఆరోపించడం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. Somnath shud surrender.Why is he running away?Why is he so scared of gng to jail? Now he is becoming embarasment for party n his family(1/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) September 23, 2015 He shud cooperate wid police(2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) September 23, 2015 -
'మాజీ మంత్రి అరెస్టు కోసం పోలీసుల హంటింగ్ '
న్యూఢిల్లీ: భార్యను హింసించిన కేసు నుంచి బయటపడేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతీ ముప్పుతిప్పలు పడుతున్నారు. ఓ పక్క ఎక్కడ కనిపిస్తే అక్కడే ఆయనను అరెస్టు చేసి కోర్టుకు తరలించాలని పోలీసులు చూస్తుండగా వారికి మాత్రం ఆయన జాడ ఏ మాత్రం దొరకడం లేదు. తనను అరెస్టు చేయకుండా ఉండేలా పోలీసులను ఆదేశించాలంటూ సోమనాథ పెట్టుకున్న పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి ఒక బృందం ఆయన నివాసానికి, మరో బృందం ఆయన కార్యాలయానికి వెళ్లాయి. కానీ ఆ రెండు చోట్ల ఆయన లేకపోవడంతో పోలీసులు ఇప్పుడు ఆయనకోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సౌత్ వెస్ట్ జాయింట్ కమిషనర్ దీపేంద్ర పాఠక్ మీడియాతో మాట్లాడుతూ సోమనాథ భారతీ అరెస్టు నుంచి తప్పించుకుంటున్నారని చెప్పారు. తమ వద్ద ఆయన భార్య లిపికా మిత్రా చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలకు లిఖిత పూర్వక ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. పోలీసులు ప్రస్తుతం ఆయనకోసం గాలింపులు మొదలుపెట్టారని వివరించారు. -
ఢిల్లీ ఎమ్మెల్యే అరెస్టు ఖాయం?
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే, ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి అరెస్టు దాదాపు ఖాయమైనట్టే. గృహ హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ సురేష్ కైత్ ఈ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏక్షణంలోనైనా సోమ్‌నాథ్ ని అదుపులోకి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సోమనాథ్ భారతిపై ఆయన భార్య లిపికా ఈ ఏడాది జూలై 10న మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా వేధిస్తూ, హింసిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు తన పెంపుడు కుక్క లాబ్రడార్ ను ఉసికొల్పి హత్య చేయడానికి ప్రయత్నించారని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆప్ మాజీ మంత్రిపై గృహ హింస, హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. మరోవైపు సోమనాథ్ భారతి విచారణకు సహకరించడం లేదని ఆరోపిస్తూ పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొంటూ, అరెస్టు వారెంట్ ను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ పెట్టుకున్నారు. -
'ఆ మంత్రి భార్యను రెండుసార్లు చంపాలనుకున్నాడు'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతి మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన తన భార్యను రెండు సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే గృహహింసతోపాటు, హత్య చేసేందుకు కూడా తన భర్త ప్రయత్నించారని పోలీసులకు సోమనాథ భారతిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు పురోగతిని కోర్టుకు వివరించారు. మొట్టమొదటి హత్య యత్నం ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిందని, రెండోసారి ఆమె మణికట్టును చీల్చి చంపేయత్నం చేశారని కోర్టుకు పోలీసులు తెలిపారు. అయితే కోర్టు మాత్రం గురువారం కూడా సోమనాథను అరెస్టు చేసేందుకు పోలీసులకు అనుమతి ఇవ్వలేదు. మరోపక్క, ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని కూడా వెలువరించలేదు. ఇక కోర్టుకు హాజరైన భార్య లిపిక ఆయన తన కుక్క డాన్‌తో దాడి చేయించాడని తెలిపింది. తన నగలు ఆయన వద్దే ఉన్నాయని వాటిని తనకు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించింది. -
'డాన్, నేను ఏ తప్పూ చేయలేదు'
న్యూఢిల్లీ: 'డాన్‌కు ఏమి తెలియదు. డాన్ ఏ నేరం చేయలేదు. ఇంట్లో వాళ్లను ఎక్కడైనా పెంపుడు జంతువులు హత్య చేస్తాయా' అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ప్రశ్నించారు. ఇంతకీ డాన్ అంటే ఏమిటని అనుకుంటున్నారా..? అది సోమనాథ భారతి పెంపుడు కుక్క పేరు. ప్రస్తుతం సోమనాథ భారతిపై ఆయన భార్య లిపికా మిత్రా తనపై హత్యా ప్రయత్నం చేశారని, గృహహింసకు పాల్పడ్డారని కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక దర్యాప్తు ప్రస్తుతం ఈ డాన్ చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే లిపికా మిత్రా ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో తన బాస్(సోమనాథ భారతి) ఆదేశాలను పాటించి డాన్ దాడి చేసిందని, మీదపడి కరిచిందని, ముఖ్యంగా తన కడుపుపై తీవ్రగాయాలు చేసిందని, మరికొన్ని చోట్ల కూడా దారుణంగా దాడి చేసి చంపేయత్నం చేసిందని పోలీసులకు వివరించింది. దీనికి సంబంధించిన వీడియో టేపులు కూడా ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసును భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. అయితే, ఆ వీడియో టేపులను కావాలనే సోమనాథ భారతి మాయం చేసినట్లు కూడా ఆరోపిస్తున్నారు. ఢిల్లీ కోర్టులో అరెస్టు నుంచి ఉపశమనం పొందిన ఆయన విచారణ కోసం ఇటీవల తరచూ పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన పెంపుడు కుక్కను గురించి పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన జీపులోని వెనుక సీట్లో డాన్‌ను తీసుకొచ్చిన ఆయన దానిని మీడియాకు చూపిస్తూ 'పెంపుడు జంతువులు ఎక్కడైనా ఇంట్లో వాళ్లను హత్య చేస్తాయా.. డాన్ కరుస్తాడా? చూడండి అంటూ ప్రశ్నించారు. డాన్గానీ, తాను గానీ ఏ తప్పూ చేయలేదని నిజంగా కావాలంటే తన వద్ద టేపుల ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. బెయిల్ పిటిషన్ కోసం ఆ ఆడియో టేపులను కూడా జత చేసినట్లు చెప్పారు. -
లొంగిపోయిన సోమనాథ భారతి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతి బుధవారం పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయనపై భార్య పెట్టిన గృహహింస, హత్యాయత్నం కేసులో పోలీసుల విచారణకు ఆయన పూర్తి స్థాయిలో సహకరించాలని నిర్ణయించుకొని నేరుగా పోలీసుల ముందుకు వెళ్లినట్లు తెలిసింది. మంగళవారం ఈ కేసుకు సంబంధించి ఆయన ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. కోర్టు కూడా ఆయనను గురువారం వరకు అరెస్టు చేయొద్దని చెప్పింది. అయితే, అరెస్టుకు మరో రోజు గడువు ఉండగానే అంతకంటే ముందే సోమనాథ్ భారతి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం చర్చనీయాంశమైంది. గత రాత్రి తన పార్టీ నేతలతో ఈ విషయం సుధీర్ఘంగా చర్చించగా నేరుగా పోలీసుల ముందుకు వెళ్లి విచారణకు హాజరుకావడం మంచిదని సూచించిన నేపథ్యంలో ఆయన స్వయంగా పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. ఒక వేళ పోలీసులు సోమనాథ్ ను అరెస్టు చేస్తే గడిచిన నెలలో ఇది ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో నాలుగో అరెస్టుగా నిలుస్తుంది. అంతకుముందు ఆప్ ఎమ్మెల్యేలు జితేంద్ర సింగ్ తోమర్, మనోజ్ కుమార్, సురేందర్ సింగ్ పలు కేసుల్లో అరెస్టయ్యారు. -
'నాపై కక్షతో నా భార్యను ఉపయోగిస్తున్నారు'
న్యూఢిల్లీ: తన కేసు విషయంలో ఢిల్లీ పోలీసులు గాలి, శబ్ధంకంటే వేగంగా(సూపర్ సోనిక్ స్పీడ్) దూసుకెళుతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతి ఆరోపించారు. వారు ప్రతి కేసులోనూ ఇదే వేగంతో పనిచేస్తే ఢిల్లీ మొత్తం నేర రహిత మహానగరంగా అనతి కాలంలోనే సాధ్యమవుతుందని అన్నారు. తనపై కేసు నమోదైనప్పటి నుంచి వారు మితిమీరిన అత్యుత్సాహంతో పనిచేస్తున్నారని దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. తనపై రాజకీయంగా కక్ష తీర్చుకోవాలని తన భార్యను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. తనను గృహహింసకు గురిచేయడంతోపాటు హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడని సోమనాథ్ భారతిపై ఆయన భార్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసును పోలీసులు గత ఐదు రోజుల కిందే నమోదు చేశారు. జూలైలోనే ఆమె ఫిర్యాదు చేసినా తొలుత వారిద్దరి మధ్య సంప్రదింపులు జరిపిన పోలీసులు ఫలితం లేకపోవడంతో చివరకు సోమనాథ్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోర్టులు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వని కారణంగా పోలీసులు అరెస్టు చేయడానికి అడ్డంగి తొలిగినట్లయింది. -
'మాజీ మంత్రికి బెయిల్ నిరాకరణ'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సోమనాథ్ భారతికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఆయనపై భార్య గృహ హింస కేసు పెట్టడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు తప్పక ఆయనను అరెస్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలని కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను కొట్టివేయడంతో భంగపాటు కలిగింది. అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో న్యాయశాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సోమనాథ్ భారతీపై అనతి కాలంలోనే ఆయన భార్య తనను చిత్ర హింసలు పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దాదాపు మూడు నెలలపాటు పరిశీలనలు జరిపిన పోలీసులు భార్యాభర్తలను ఓచోట చేర్చి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ, వారిద్దరి మధ్య ఈసమస్య కొలిక్కి రాకపోవడంతో గత వారమే ఆయనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఏ క్షణమైనా పోలీసులు సోమనాథ్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. -
ఆప్ మాజీ మంత్రిపై కేసు నమోదు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమ్నాధ్ భారతీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భార్యపట్ల ఆయన గృహహింసకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆప్ కొత్త ప్రభుత్వంలో న్యాయశాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సోమ్ నాథ్‌పై ఆయన భార్య లిపికా అనతి కాలంలోనే గృహహింస ఆరోపణలు చేశారు. దీంతో అప్పటి నుంచి పోలీసులు ఇరువురిని కూర్చొబెట్టే మాట్లాడే ప్రయత్నం చేశారు. మధ్యవర్తిత్వం నిర్వర్తించినా ఫలితం లేకపోవడంతో చివరికి ఆయనపై కేసునమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు సెక్షన్లను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పలు సెఈ విషయంలో ఆయన గతంలో ముందస్తు బెయిల్‌కోసం కోర్టుకు వెళ్లినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదుకానిదే బెయిల్ కోరడం, బెయిలివ్వడం తొందరపాటు చర్య అవుతుందని కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. -
'మా ఆయనకు అందమైన ఆడాళ్లే ఇష్టం'
ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి వ్యాఖ్యల మీద తీవ్రస్థాయిలో దుమారం రేగింది. పోలీసు వ్యవస్థను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగిస్తే.. అందమైన మహిళలు కూడా అర్ధరాత్రి సురక్షితంగా తిరిగేలా చూడగలమన్న ఆయన వ్యాఖ్యలపై ఒకప్పటి ఆయన భార్య లిపికా మిత్ర కూడా మండిపడ్డారు. తన భర్తకు కేవలం అందమైన మహిళలంటేనే ఇష్టమని, తనలా సాధారణంగా ఉండేవాళ్లను ఆయన పట్టించుకోరని.. అందుకే తనను కూడా పట్టించుకోకుండా వదిలేశారని ఆమె అన్నారు. ఆయన పట్ల తాను చాలా ప్రేమ చూపించేదాన్నని, కానీ ఆయన మాత్రం తనను పట్టించుకోకుండా అందమైన అమ్మాయిలనే పట్టించుకునేవారని అన్నారు. ఇప్పుడు ఆయన చేసిన ప్రకటన కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తోందన్నారు. బహుశా అందుకే ఆయన తనను కూడా వేధించి ఉంటారని ఇప్పుడు అర్థమవుతోందన్నారు. తాను సాధారణ మహిళను మాత్రమేనని, తనలా సాధారణంగా ఉండేవాళ్లను ఎవరు మాత్రం చూస్తారని.. తమకు ఈ సమాజంలో స్థానం లేదని లిపిక ఆవేదన వ్యక్తం చేశారు. -
'అందమైన ఆడవాళ్లు అర్థరాత్రులూ తిరగాలంటే..'
న్యూఢిల్లీ: అర్థరాత్రి ఆడవాళ్లు ఒంటరిగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లన్న మహాత్ముడి ప్రవచనానికి వక్రభాష్యమిచ్చి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు ఘనత వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి. ' ఢిల్లీ నగరంలో అందమైన మహిళలు అర్థరాత్రి స్వేచ్చగా తిరగాలంటే.. పోలీస్ వ్యవస్థ మొత్తం ఆప్ సర్కారు ఆధీనంలోకి రావాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది' అని అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన కామెంట్లపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. ఈ మాజీ మంత్రి కామెంట్లపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ఠ ముఖర్జీ.. ' సోమనాథ్ మాటలు వికారం తెప్పిస్తున్నాయి. ప్రతి అక్షరం మహిళలను కించపర్చేలా ఉంది. న్యాయమంత్రిగా ఉంటూ చట్టవ్యతిరేక కార్యమాలు చేసి అడ్డంగా దొరికిపోయన ఆయన ఇంతకంటే మంచిగా మాట్లాడతారని అనుకోవడం తప్పే అవుతుంది' అని వ్యాఖ్యానించారు. అటు బీజేపీ కూడా సోమనాథ్ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమర్శలకు స్పందించిన సోమనాథ్.. 'ఒంటినిండా నగలు ధరించిన ఓ అందమైన వనిత నడిరాత్రి స్వేచ్ఛగా బయట తిరగడం.. మహిళల రక్షణకు సంబంధించినంతవరకు గొప్ప విషయం కాదా. పోలీసులు మా చేతుల్లో ఉంటే అలాంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పడమే నా ఉద్దేశం' అని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వివాదాల్లో ఇరుక్కొని జైళ్లదాకా వెళ్లొచ్చారు. సోమ్ నాథ్ తెచ్చిపెట్టిన కొత్త తలనొప్పిని పార్టీ ఎలా భరిస్తుందో వేచిచూడాలి. -
సోమ్‌నాథ్ ముందస్తు బెయిల్‌కు కోర్టు నో
న్యూఢిల్లీ: గృహహింస కేసులో ఆప్ నేత, ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఎఫ్ఐఆరే దాఖలు కాలేదని, అలాంటప్పుడు అరెస్టుకు అవకాశం లేదని అదనపు సెషన్స్ న్యాయమూర్తి పరంజిత్ సింగ్ స్పష్టంచేశారు. తర్వాత సోమ్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు చిన్నారులతో ముడిపడిన వ్యవహారం కాబట్టి మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాల్సిందిగా కోర్టు సూచిస్తుందని భావించా’ అని పేర్కొన్నారు. గత ఐదేళ్ల నుంచి సోమ్‌నాథ్ తనను శారీరక, మానసిక హింసకు గురిచేస్తున్నారంటూ ఆయన భార్య లిపికా భారతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
ఎఫ్ఐఆరే నమోదు కాలేదు.. బెయిలేంటి?
న్యూఢిల్లీ: గృహహింస చట్టం కింద నమోదైన కేసు విషయంలో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు విషయంలో నిందితుడు అలా కోరడం అనుభవరాహిత్యం అని పేర్కొంది. బెయిల్ పిటిషన్‌ను విచారించిన అడిషనల్ సెషన్స్ జడ్జి పరమ్ జీత్ సింగ్ అసలు ఇంతవరకు ఈ కేసు విషయంలో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, ఎలాంటి అరెస్టులు జరగలేదని, దరఖాస్తు కూడా పూర్తిస్థాయిలో లేదని పేర్కొన్నారు. గత జూన్‌లో సోమ్‌నాథ్ భారతి భార్య లిపికా భారతి 2010 నుంచి ఆయన గృహహింసకు పాల్పడుతున్నారని, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ కేసు పెట్టిన విషం తెలిసిందే. -
చంద్రబాబును వదలొద్దు: ఆప్
తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబును వదిలి పెట్టొద్దని ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణ భారత విభాగం ఇన్చార్జి, ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. ఈ కేసులో ఎవరినీ ఉపేక్షించొద్దని ఆయన చెప్పారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సోమనాథ్ భారతి మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే ఏసీబీకి చిక్కినా... కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పట్ల చొరవ చూపకపోవడం విచారకరమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ మాట మాత్రం కూడా దీనిపై మాట్లాడడం లేదన్నారు. తెలంగాణలో కుటుంబపాలన నడుస్తోందని ఆరోపించారు. ఒక కుటుంబానికి చెందిన నలుగురి చేతుల్లో పాలన కేంద్రీకృతమై ఉందన్నారు. కేంద్రంలో కూతురుకు పదవి కోసం సీఎం కేసీఆర్ రాయబారం చేస్తున్నారని, దీంతో కేంద్రం ఏం చేసినా విమర్శించడం లేదని ఆయన దుయ్యబట్టారు. -
'మా ఆయనపై చర్యలు తీసుకోండి'
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై చర్యలు తీసుకోవాలని ఆయన భార్య మిత్ర కోరారు. సోమ్‌నాథ్ తనను హింసించినట్టు వీడియో ఆధారాలున్నాయని మిత్ర వెల్లడించారు. సోమనాథ్ భారతిపై ఆయన భార్య గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మహిళా కమిషన్‌ను మిత్ర ఆశ్రయించడంతో, సోమనాథ్ భారతికి సమన్లు జారీ చేశారు. సోమవారం మిత్ర మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి తన భర్తపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా, ఐదేళ్లుగా తన భార్యకు దూరంగా నివసిస్తున్నానని సోమనాథ్ భారతి చెప్పారు. కాగా సోమనాథ్ రాత్రి పూట మాత్రమే తన ఇంటికి వచ్చేవారని, ఈ విషయం ఇరుగుపొరుగు వారికి తెలుసని మిత్ర వెల్లడించారు. -
బాబు రాజకీయాలు భ్రష్టు పట్టించారు
విజయవాడ: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజాయితీని నిరూపించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమ్ నాథ్ భారతి అన్నారు. రాజకీయాలను భ్రష్టుపట్టించి కలుషితం చేసింది చంద్రబాబేనని ఘాటుగా విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ సర్కార్ కక్ష సాధిస్తుందని ఆరోపించారు. స్మృతి ఇరానీ సహా ముగ్గురు కేంద్ర మంత్రులు నకలీ సర్టిఫికెట్లు ఇచ్చారని.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నా మీదకు కుక్కల్ని వదిలేవాడు..
సోమ్‌నాథ్ భారతిపై భార్య తీవ్ర ఆరోపణలు న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతిపై ఆయన భార్య లిపిక తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీ మహిళా కమిషన్‌కు బుధవారం చేసిన 26 పేజీల ఫిర్యాదులో ఆమె పలు ఆరోపణలు చేశారు. తాను గర్భవతిగా ఉన్న సమయంలో తన భర్త తనపైకి కుక్కల్ని వదిలేవాడని.. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడని ఆమె ఆరోపించారు. తాను మూడోసారి గర్భవతి అయినప్పుడు ఏడో నెలలో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడని, ఈ బాధ భరించలేక తాను తన మణికట్టును కోసుకోవటానికి ప్రయత్నించినట్లు ఆమె ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. షాదీ డాట్ కామ్ ద్వారా ఈ ఇద్దరూ కలుసుకున్నారని.. తనకు అంతర్జాతీయ న్యాయ సంస్థ ఉన్నట్లు సోమ్‌నాథ్ భారతి లిపికకు అబద్ధం చెప్పారని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్ఖాసింగ్ చెప్పారు. కాగా, లిపిక శుక్రవారం తన భర్తపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే సోమ్‌నాథ్.. భార్య ఆరోపణలను ఖండించారు. ఇవన్నీ అబద్ధాలని, తాను తన భార్యను, పిల్లలను అమితంగా ప్రేమిస్తున్నానని తెలిపారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో భారతి భేటీ అయి తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. -
ఎమ్మెల్యేపై గృహహింస కేసు, సమన్లు
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కష్టాలు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఆప్ మంత్రి నకిలీ డిగ్రీ పట్టా కేసులో జైలుకు వెళితే.. తాజాగా మరో ఆప్ ఎమ్మెల్యే చిక్కుల్లో పడ్డారు. ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిపై ఆయన భార్య గృహహింస కేసు పెట్టారు. సోమనాథ్ భారతి తనను వేధిస్తున్నారంటూ ఆమె ఢిల్లీ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. దాంతో మహిళా కమిషన్ బుధవారం సోమనాథ్ భారతికి సమన్లు జారీ చేసింది. కాగా గతంలోనూ సోమనాథ్పై ఆఫ్రికన్ మహిళలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సోమనాథ్ భారతి తన మద్దతుదారులతో కలిసి దాడి చేశారంటూ ఉగాండా మహిళ ఫిర్యాదు చేయటంతో ఆయనపై జనవరి 19న ఎఫ్ఐఆర్ నమోదైంది. -
ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సిసోడియా!
ఏడుగురు మంత్రులతో ఢిల్లీ కే బినెట్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు జాబితా పంపిన ఆప్ మంత్రివర్గంలో నాలుగు కొత్త ముఖాలు అసెంబ్లీ స్పీకర్‌గా రాం నివాస్ గోయల్ న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏడుగురు మంత్రులతో ఆప్ సర్కారు కొలువుదీరబోతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు మనీష్ సిసోడియా డిప్యూటీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారు. 2013లో ఆప్ సర్కారులో మంత్రులుగా పనిచేసిన రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, సోమనాథ్ భారతి, గిరీశ్ సోనీ స్థానాల్లో నలుగురు కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. వీరిలో జితేంత్ర తొమార్(త్రినగర్), సందీప్ కుమార్(సుల్తాన్‌పురి మజ్రా), ఆసిమ్ అహ్మద్ ఖాన్(మతియా మహల్), గోపాల్‌రాయ్(బాబర్పూర్) ఉన్నారు. వీరంతా తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారే కావడం గమనార్హం. గత కేబినెట్లో పనిచేసిన సత్యేంద్ర జైన్‌కు ఈసారి కూడా మంత్రిగా అవకాశం దక్కింది. ఏడుగురి పేర్లతో కూడిన మంత్రుల జాబితాను పార్టీ గురువారం ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు అందజేసింది. శనివారం రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్‌తోపాటు వీరంతా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. కొత్త కేబినెట్లో అహ్మద్ ఖాన్ ఒక్కరే మైనారిటీ వర్గానికి చెందిన నేత కాగా, మహిళలకు ఈసారి ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. అలాగే అసెంబ్లీ స్పీకర్‌గా రాం నివాస్ గోయల్, డిప్యూటీ స్పీకర్‌గా బాందన కుమారిలను నియమించనున్నారు. ఆప్ మహిళా విభాగానికి కుమారి నేతృత్వం వహిస్తున్నారు. కౌశాంబిలోని కేజ్రీవాల్ నివాసంలో బుధవారం రాత్రి సమావేశమైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ).. ఎవరెవరినీ మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న అంశంపై చర్చించి ఏడుగురి పేర్లను ఖరారు చేసింది. ఇక కేజ్రీవాల్ ‘జాతీయ’ దృష్టి.. సిసోడియాకు డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగించి, కేజ్రీవాల్... ఆప్‌ను జాతీయస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే సిసోడియా పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించి నూతన జవసత్వాలు అందించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం వెనుక ఆయన పాత్ర అత్యంత కీలకం. అందుకే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కేజ్రీవాల్ భావించారు. 2013నాటి కేబినెట్లో ఈయన ముఖ్యమైన విద్య, ప్రజా పనులు, భూమి, భవనాలు, పట్టణాభివృద్ధి శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా అవే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. -
సోమ్‌నాథ్ భారతికి మొండిచెయ్యి!
న్యూఢిల్లీ: ఈనెల 14న ప్రమాణ స్వీకారం చేయబోతున్న అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ కూర్పు ఎలా ఉండనుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2013లో కేజ్రీవాల్ మంత్రివర్గంలో పనిచేసిన ముగ్గురిని ఈసారి పక్కనపెట్టనున్నట్లు పార్టీలోని విశ్వసనీయవర్గాల సమాచారం. వివాదాస్పదుడిగా ముద్రపడిన సోమ్‌నాథ్ భారతిని ఈసారి కేబినెట్‌కు దూరం గా ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు రాఖీ బిర్లా, గిరీష్ సోనీకి కూడా ఈసారి కేబినెట్లో చోటు దక్కకపోవచ్చు. పార్టీలో నంబర్ టూగా వెలుగొందుతున్న మనీష్ సిసోడియాకు ఈసారి మరింత కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు వినికి డి. 2013లో కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్‌లకు ఈసారీ చోటు దక్కవచ్చు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ సీనియర్ల సమావేశం గురువారం జరుగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించి ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలు (మొత్తం 70లో) గెలుచుకున్న విషయం తెలిసిందే. సీట్ల సంఖ్యను బట్టి సీఎంతో సహా 11 మంది కేబినెట్లో ఉండొచ్చు. పలువురు విద్యాధికులు గెలిచి నందువల్ల మంత్రివర్గ కూర్పుపై కేజ్రీవాల్ సుదీర్ఘ కసరత్తే చేయా ల్సి రావొచ్చు. లాల్ బహదూర్‌శాస్త్రి మనవడు ఆదర్శ్ శాస్త్రి, చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కాలాంబా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. -
మాలవీయనగర్ దాడి కేసు సోమ్నాథ్పై చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ: మాలవీయనగర్‌లో అర్థరాత్రి సోదాల కేసుకు సంబంధించి ఆప్ నేత, న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతిపై స్థానిక న్యాయస్థానంలో చార్జీషీట్ దాఖలైంది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు. మాలవీయనగర్లోని ఖిర్కీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఆఫ్రికా మహిళలు నివసించే ఓ ఇంట్లోకి అర్ధరాత్రివేళ చొరబడడం, తనిఖీలు నిర్వహించడం, ఆపై అత్యాచారానికి పాల్పడడం తదితర నేరాలకు పాల్పడ్డాడనే ఆరోపణల కింద సోమ్నాథ్పై చార్జిషీట్‌ను దాఖలు చేశామని ఢిల్లీ పోలీసులు తెలియజేశారు. అత్యాచారం, ఆపై దాడి,ఓ మహిళ గౌరవానికి భంగం కలిగించడం తదితరాలతో దర్యాప్తు అధికారి విజయ్ చందేల్ మేట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చేతనా సింగ్ ఎదుట చార్జిషీట్‌ను గత నెల 29వ తేదీన దాఖలు చేశారు. కాగా ఈ ఘటన ఈ ఏడాది జనవరి 16వ తేదీన జరిగింది. సోమ్‌నాథ్ భార తి తమ నివాసాల్లోకి చొరబడి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పలువురు ఆఫ్రికన్ మహిళలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. బహిరంగంగా యూరిన్ శాంపిల్స్ ఇవ్వాల్సిందిగా సోమ్‌నాథ్ తమను ఆదేశించారని, తమకు కేవిటీ పరీక్ష చేయించారని బాధితురాళ్లు తమ వాంగ్మూలంలో పేర్కొన్నారు.ఇదిలాఉండగా వంద పేజీల అభియోగపత్రంలో సాక్షుల వాంగ్మూలాలు, వైద్య పరీక్షల నివేదికలు, సీసీటీవీ నమోదు చేసిన దృశ్యాలతోపాటు మీడియా సిబ్బంది తీసిన వీడియో దృశ్యాలను పోలీసులు పొందుపరిచారు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత న్యాయస్థానం సోమ్‌నాథ్‌ను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించే అవకాశముంది. పోలీసులు దాఖలు చేసిన చార్జీషీటులో పేర్కొన్న ఆరోపణలలో మహిళలపై ఆరోపణలు కూడా ఉన్నాయి. సోమ్నాథ్తోపాటు మరో 18 మందిపై భారతీయ శిక్షాస్మృతిలోని 6 సెక్షన్ల కింద నేరారోపణలు చేశారు. తొమ్మిదిమంది ఉగాండా మహిళలతో పాటు 40 మంది సాక్షులుగా అందులో పోలీసులు పేర్కొన్నారు. కాగా ఈ కేసుపై గత నెల 10వ తేదీన విచారణ జరిగిన సంగతి విదితమే. వచ్చే నెల ఒకటో తేదీలోగా ఈ కేసు తాజా స్థితిగతులకు సంబంధించిన నివేదికను వచ్చే నెల ఒకటో తేదీలోగా తమకు సమర్పించాలని అప్పట్లో కోర్టు ఆదే శించింది. దీంతో పోలీసులు అదే నెల 29వ తేదీన చార్జిషీట్‌ను దాఖలుచేశారు. అయితే ఈ దాడి కేసుకు సంబంధించి ప్రత్యేక ఎఫ్ఐఆర్ దాఖలుకు అనుమతించాల్సిందిగా ఓ బాధిత ఆఫ్రికన్ మహిళ చేసిన విన్నపాన్ని కోర్టు అప్పట్లో తిరస్కరించింది. అయితే ఈ కేసులో ఉగాండా మహిళకూడా బాధితురాలైనందువల్ల ఆమెను సహ ఫిర్యాదుదారుగా చేర్చుకునేందుకు మాత్రం అనుమతించింది. -
సోమనాథ్ భారతి కేసులోపోలీసులకు కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఆఫ్రికన్ మహిళలపై దాడి చేసిన కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై విచారణకు సంబంధించిన తుది నివేదికను అందజేయాలని ఢిల్లీ పోలీసులకు కోర్టు నోటీసులు జారీచేసింది. తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టాలని ఆఫ్రికన్ మహిళ ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దాంతో ఈ అంశంపై నివేదిక ఇవ్వాలంటూ జనవరి 29 మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చేతనా సింగ్ ఢిల్లీ పోలీసు విచారణాధికారిని ఆదేశించారు. అయినా ఇంతవరకు నివేదిక ఇవ్వకపోవడంతో గ్రహించిన కోర్టు ఆగస్టు రెండు కల్లా తుది నివేదికివ్వాలని ఆదేశించింది. సోమనాథ్ భారతి తన మద్దతుదారులతో కలిసి దాడి చేసిన కేసులో మరో బాధితురాలైన ఉగాండా మహిళ ఫిర్యాదు చేసిన తరువాత జనవరి 19న వారిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. -
భారతిపై చర్యలు తీసుకోవాలని చెప్పలేదు
న్యూఢిల్లీ: రాష్ట్ర న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతిపై చర్యలు తీసుకోవాలని తాము ఢిల్లీ పోలీసులకు నిర్దిష్టంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. దక్షిణ ఢిల్లీలోని ఖిడ్కీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో అర్థరాత్రి జరిగిన ఘటనపై అవసరమైన చర్యలు తీసుకోవాలని మాత్రమే సూచించామని తెలిపింది. ఖిడ్కీ ఘటనకు సంబంధించి సోమ్‌నాథ్ భారతిపై చర్యలు తీసుకోవాలని తాము ఢిల్లీ పోలీసులను ఆదేశించినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయని పేర్కొంది. అయితే తాము అటువంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. నాటి ఘటనపై తాము స్వయంగా విచారణ చేపట్టామని తెలిపింది. సంబంధిత అధికారుల నుంచి నివేదికల కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సామాజిక కార్యకర్త షెహజాద్ పూనావాలా నుంచి తమకు ఫిర్యాదు అందిందని, దానిని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు పంపామని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. ఆ ఫిర్యాదుపై ఎనిమిది వారాల్లోగా సరైన చర్య తీసుకోవాలని మాత్రమే కోరామని వివరించింది. ఆ ఫిర్యాదుపై ఎటువంటి చర్య తీసుకోవాలో పోలీసులు నిర్ణయిస్తారని ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధి అన్నారు. ఎవరిపై, ఏ చర్య తీసుకోవాలో తాము మాత్రం సూచించలేదని స్పష్టం చేశారు. మానవ హక్కుల కమిషన్ ఆదేశాలపై ఆప్ నాయకుడు సోమ్‌నాథ్ భారతి స్పందిస్తూ, ఈ కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొన్నారు. తాను చట్టాలను గౌరవిస్తానని, ఎన్హెచ్ఆర్సీ ఏమి రాసినప్పటికీ, ఎఫ్ఐఆర్ను అధిగమించి ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారమే దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. ‘‘వారు నా నియోజకవర్గానికి వెళ్లి అక్కడి ప్రజలను ప్రశ్నించవచ్చు’’ అన్నారు. ‘‘ఎన్హెచ్ఆర్సీ తన అధికారులను నా నియోజకవర్గానికి పంపి, ఆ రోజు జరిగింది సరైందో కాదో అక్కడి వారిని అడిగి తెలుసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించడం జరిగిందో లేదో తెలుసుకోవాలి. కనీసం నిజానిజాలను తెలుసుకొనేందుకు ప్రయత్నించాలి. ఉగాండా మహిళలు సైతం నా వద్దకే భద్రత కోసం వస్తారు’’ అని చెప్పుకున్నారు. విదేశీయులు వ్యభిచారం, మాదక పదార్థాల రాకెట్లను నడుపుతున్నారని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులో న్యాయశాఖ మంత్రిగా ఉన్న సోమ్‌నాథ్ భారతీ, తమ మద్దతుదారులతో కలిసి జనవరి 15న అర్థరాత్రి సమయంలో ఖిడ్కీ ఎక్స్టెన్షన్ చేరుకుని, విదేశీ మహిళల నివాసాలపై సోదాలు జరపాలని, వారిని అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. కానీ మంత్రి ఆదేశాలను పాటించడానికి పోలీసులు నిరాకరించారు. మంత్రి చర్య ఆ తరవాత వివాదానికి దారితీసింది. ఈ ఘటన అనంతరం తమను వేధించారని ఆరోపిస్తూ కొంతమంది ఆఫ్రికన్ మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలపై మాలవీయనగర్ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎయిమ్స్‌లో తమపై వైద్య పరీక్షలు నిర్వహించిన తీరు అవమానకరంగా ఉందని ఓ మహిళ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మూత్రపరీక్ష కోసం శాంపిల్ ఇవ్వవలసిం దిగా మంత్రి, ఆయన వెంటనున్నవారు అందరి ఎదుట కోరారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ నియమించిన దర్యాప్తు సంఘం సోమ్‌నాథ్ భారతిని తప్పుపట్టింది. ఖిడ్కీ ఎక్స్టెన్షన్లో సోమ్‌నాథ్ భారతి పాత్రను ఢిల్లీ మహిళా కమిషన్ కూడా ప్రశ్నించింది. అయితే మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ మాత్రం సోమ్‌నాథ్ భారతి చర్యను గట్టిగా సమర్థించారు. విదేశీ మహిళలను అరెస్టు చేయాలన్న మంత్రి ఆదేశాలను పాటించేందుకు నిరాకరించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆయన ధర్నా జరిపి సంచలనం సృష్టించారు. -
మాజీ మంత్రిపై కేసు?
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ నేత, మాజీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిపై క్రిమినల్ కేసు నమోదు కానుంది. ఈమేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నివేదికను పంపారు. అప్పట్లో ఖిర్కీ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో కొందరు నైజీరియా మహిళలు నివసిస్తున్న అపార్టుమెంట్‌పై అర్ధరాత్రి పూట మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఆధ్వర్యంలో అతడి అనుచరులు కొందరు దాడిచేసిన విషయం తెలిసిందే. నైజీరియన్లు అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని, మాదకద్రవ్యాల వ్యాపారానికి ఆ ప్రాంతం అడ్డాగా మారిపోయిందని స్థానికులు కొందరు తనకు ఫిర్యాదు చేశారని, అందుకే అర్ధరాత్రిపూట తాను తనిఖీలు చేసినట్లు సోమ్‌నాథ్ అప్పట్లో తన చర్యను సమర్థించుకున్నారు. మొదట ఆ అపార్టుమెంట్లో ఉన్న మహిళలను వెంటనే అరెస్టు చేయాలని మంత్రి హోదాలో స్థానిక పోలీసులను సోమ్‌నాథ్ ఆజ్ఞాపించగా వారు తిరస్కరించారు. చట్టప్రకారం ఆ సమయంలో మహిళలను అరెస్టు చేసే అధికారం తమకు లేదని వారు సమాధానమివ్వడంతో సోమ్‌నాథ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన పోలీస్, ఆప్ ప్రభుత్వం మధ్య వివాదానికి కారణమైంది. ఆ సమయంలో మంత్రి అనుచరులు సృష్టించిన వీరంగం పలు విమర్శలకు తావు తీసింది. న్యాయశాఖ మంత్రిగా సోమ్‌నాథ్ చర్యలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమర్ధిస్తూ సదరు పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎల్జీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన చిలికిచిలికి గాలివానగా మారి చివరకు ఆప్ ప్రభుత్వానికి, పోలీసులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా..అన్నంతవరకు వెళ్లింది. ఈ ఘటన తర్వాత ఢిల్లీ పోలీసులపై ఆప్ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు దిగింది. వారు రాష్ర్ట ప్రభుత్వ పరిధిలో లేకపోవడం వల్లే మంత్రుల మాట సైతం వినడంలేదని, వారు విధి నిర్వహణలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారని ఆప్ సర్కార్ ఆరోపించింది. అప్పట్లో ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ రైల్ భవన్ వద్ద ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. మంత్రి ఆజ్ఞ పాటించని పోలీస్ అధికారులను సస్పెండ్ చేయా లని కేజ్రీవాల్ డిమాండ్ చేయగా, వారిని సెలవుపై పంపించేందుకు ఎల్జీ అంగీకరించడంతో, ఆప్ సర్కార్ ఆందోళన విరమించింది. కాగా, ఈ ఘటనపై అప్పట్లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ న్యాయవిచారణకు ఆదేశించారు. ఈ మేరకు రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి బి.ఎల్.గార్జ్ నియమించారు. దీనికి సంబంధించిన నివేదికను గత నెలలో ఎల్జీకి గార్గ్ అందజేశారు. సదరు ఘటనలో పోలీసులది ఏమాత్రం తప్పు లేదని, మంత్రి అతడి అనుచరులు హైడ్రామా సృష్టించారని అందులో పేర్కొన్నారు. కాగా, విశ్వసనీయ సమాచారం ప్రకారం సదరు నివేదికపై తదుపరి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన హోం, న్యాయ, చట్ట శాఖలకు ఎల్జీ పంపించారు. మాజీ న్యాయమంత్రిపై క్రిమినల్ కేసు పెట్టాలని హోం శాఖ ప్రతిపాదించగా, ఈ ఘటనపై పలువురు గుర్తుతెలియని వ్యక్తులపై ఇప్పటికే నమోదైన కేసులో భారతి పేరును చేర్చవచ్చా లేదా కొత్తగా కేసు పెట్టాలా అని న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరారు. ఈ విషయమై హోం శాఖ నివేదికను పరిశీలించిన తర్వాత మాజీ మంత్రిపై కేసు నమోదుకు రాష్ట్రపతి అనుమతి కోరారు. -
మరో రెండువారాల గడువు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల వ్యయంపై దాఖలైన కేసులో కేజ్రీవాల్, సోమ్‌నాథ్ భారతికి మరింత వెసులుబాటు లభించింది. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పరిమితి మించి ఖర్చు చేశారని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఇరువురిపై వేర్వేరుగా దాఖలైన పిటిషన్లపై ప్రతిస్పందించడానికి ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్, సోమ్‌నాథ్ భారతికి మరో రెండువారాల గడువు ఇచ్చింది. తమ ఎన్నికను ఎందుకు రద్దు చేయకూడదో తెలుపుతూ రెండు వారాల్లోగా సంజాయిషీ ఇవ్వాలని న్యాయస్థానం కేజ్రీవాల్, భారతికి గతంలోనే నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ గడువును మంగళవారం మరో రెండు వారాలు పొడిగించింది. కేజ్రీవాల్, సోమ్‌నాథ్ భారతి ఎన్నికల ప్రచారం కోసం పరిమితికి మించి ఖర్చు చేశారని, వారి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా, మాజీ మేయర్ ఆర్తీ మెహ్రా పిటిషన్లను దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయం 14 లక్షల రూపాయలను మించకూడదు. అయితే కేజ్రీవాల్, భారతి ఎన్నికల వ్యయం రూ. 17లక్షలకు పైగా ఉందని, వారి ఎన్నిక చెల్లదని ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌తో తలపడిన విజేందర్ గప్తా, మాలవీయ నగర్ నియోజకవర్గంలో సోమ్‌నాథ్ భారతికి వ్యతిరేకంగా పోటీచేసిన ఆర్తీ మెహ్రా ఈ పిటిషన్లను దాఖలు చేశారు. గుప్తా పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి విపిన్ గుప్తా మరో రెండువారాల్లో సంజాయిషీ ఇవ్వాలని కేజ్రీవాల్‌ను ఆదేశిస్తూ కేసును మార్చ్ 17కి వాయిదావేశారు. ఆర్తీ మెహ్రా పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జి.ఎన్.సిస్తానీ కూడా సోమ్‌నాథ్ భారతికి రెండు వారాల గుడువు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీ నామా ప్రభావం ఈ పిటిషన్‌పై ఉంటుందా? అని న్యాయమూర్తి సిస్తానీ ఆరా తీశారు. దానికి బీజేపీ తరపు న్యాయవాది జవాబిస్తూ ఇది ఎన్నికలకు సంబంధించి పిటిషన్ అని, ముఖ్యమంత్రిగా రాజీనామా ప్రభావం కేసుపై ఉండబోదని చెప్పారు. రాజీనామా తరువాత కూడా కేసు కొనసాగుతుందని, తాము కేసు గెలిచినట్లయితే కేజ్రీవాల్, భారతి ఆరేళ్ల వరకు ఎన్నికలలో పోటీచేసే అవకాశాన్ని కోల్పోతారని ఆర్తీ మెహ్రా తరఫు న్యాయయవాది కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్, భారతి ఎన్నికల ప్రచారంలో నియమాలను ఉల్లంఘించారని, ఎన్నికల తేదీని ప్రకటించిన తరువాత జీత్ కీ గూంజ్, ఓట్ ఫర్ చేంజ్ పేరిట నిర్వహించిన రాక్ షోకు లక్షల రూపాయలు ఖర్చు చేశారని, ఈ ఖర్చును తమ ఎన్నికల వ్యయంలో పేర్కొనలేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ గాయకులు, ప్రముఖులు పాల్గొన్నారని, వారికి ఒక్కొక్కరికి రూ.3.10 లక్షలు చెల్లించారని పిటిషనర్లు ఆరోపించారు. భారీ ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం వార్తాపత్రికలలో ప్రటకనలు ఇచ్చారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. -
న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ వ్యవహారంపై సభలో రగడ
సాక్షి, న్యూఢిల్లీ: సోమ్‌నాథ్ భారతి వ్యవహారంపై లోపలా, బయటా వెల్లువెత్తిన నిరసనలతో శాసనసభ ప్రాంగణం అట్టుడికిపోయింది. న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ , బీజేపీ పి సభ్యులు వెల్‌లోకి దూసుకుపోయి నివాదాలు చేయడంతో తొలిరోజు గందరగోళం చెలరేగింది. ఈ కారణంగా కార్యకలాపాలు కొనసాగలేదు. మూడుసార్లు వాయిదావేసిన స్పీకర్... సభా కార్యక్రమాలు సజావుగా నిర్వహించడం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది. చివరికి సభను శుక్రవారానికి వాయిదా వేవారు. అర్థరాత్రి సమయంలో విదేశీ మహిళల ఆవాసాల్లో సోదాలు జరిపించి నగరవాసులకు తలవంపులు తెచ్చిన న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ వ్యవహారాన్ని సభలో లేవనెత్తేందుకు బీజేపీ సావధాన తీర్మాన నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా ఇందుకు మద్దతు పలికింది. స్పీకర్ ఎం.ఎస్. ధీర్ ఈ నోటీసును సభలో చదవి వినిపించి దానిపై సోమ్‌నాథ్ ప్రతిస్పందన కోరారు. సోమ్‌నాథ్ ప్రతిస్పందించిన అనంతరం బీజేపీ నోటీసుపై రూలింగ్ ఇస్తానని స్పీకర్ ప్రకటించారు. అయితే ఈ నోటీసును స్వీకరించి చర్చ చేపట్టాలంటూ సభ్యులు పట్టుపట్టారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు స్పీకర్ ముందుకొచ్చి సోమ్‌నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతటితో ఆగకుండా సోమ్‌నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు రాసిన ప్లకార్డులను సభలో ప్రదర్శించారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ సభను మూడుసార్లు వాయిదావేసినా ఫలితం లేకపోయింది. దీంతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి సభ సజావుగా సాగడానికి సహకరించాలంటూ కాంగ్రెస్, బీజేపీలను కోరారు. సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. ఓఖ్లా శాసన సభ్యుడు ఆసిఫ్ మహ్మద్‌ఖాన్ స్పీకర్ ముందున్న మైకు లాక్కొని దానిలోనుంచే సోమ్‌నాథ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ముందున్న కాగితాలను చింపివేశారు. కేజ్రీవాల్ ముందున్న మైకును కూడా ఆయన విరగ్గొట్టారని అంటున్నారు. ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే బీజేపీ ఇచ్చిన నోటీసును స్వీకరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. స్పీకర్ ఆరంభ ప్రసంగంతోనే లొల్లి మొదలు కాగా గురువారం మధ్యాహ్నం విధానసభ సమావేశాలను ప్రారంభిస్తూ స్పీకర్ చేసిన ఆరంభ ప్రసంగంతోనే లొల్లి మొదలైంది. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేక సమావేశాలుగా పేర్కొనడాన్ని బీజేపీ సభ్యులు తప్పుపట్టారు. ఈ సమావేశాలను బడ్జెట్ సమావేశాలుగా పేర్కొనాలని వారు డిమాండ్ చేశారు. ఆ త ర్వాత విధానసభలో బీజేపీ నేత హర్షవర్ధన్ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి వ్యవహారాన్ని సభలో లేవనెత్తేందుకు సావధాన తీర్మాన నోటీసు ఇచ్చారు. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ కూడా ఇందుకు మద్దతు పలికారు. ఇంతలోనే బీజేపీ సభ్యులు సోమ్‌నాథ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. రాజేందర్‌నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఆర్ .పి. కాగితాలు చింపి సోమ్‌నాథ్ వైపు విసిరారు. కాంగ్రెస్ సభ్యులు కూడా సోమ్‌నాథ్ వ్యతిరేక నినాదాలకు గొంతు కలిపారు. కాంగ్రెస్ సభ్యుడు జైకిషన్ అల్లం, నిమ్మకాయలు తదితర వస్తువులను స్పీకర్ ఎదుట పెట్టగానే ‘బందర్ క్యా జానే అద్రక్ స్వాద్ (కోతికి ఏమి తెలుసు అల్లం రుచి) అంటూ ప్రతిపక్ష సభ్యులు కేజ్రీవాల్ సర్కారును ఎగతాళి చేయడం, సోమ్‌నాథ్ భారతి హాయ హాయ్ అనే సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ సభను వాయిదావేశారు. 20 నిమిషాల తరువాత తిరిగి సమావేశ ం ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు సభ మధ్యలోకి దూసుకువచ్చారు. సోమ్‌నాథ్ భారతి నగరంలో జాతి వివక్షను ప్రోత్సహిస్తున్నారనే ప్లకార్డులను ధరించిన సభ్యులు సోమ్‌నాథ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ మరోసారి సభను 20 నిమిషాలపాటు వాయిదా వేశారు. ఆ తరువాత తిరిగి సభ సమావేశమైనప్పుడు కూడా వాతావరణంలో ఎటువంటి మార్పూ కనిపించలేదు. దీంతో స్పీకర్ మూడోసారిసభను వాయిదావేసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ఆప్ నుంచి బహిష్కృతుడైన వినోద్‌కుమార్ బిన్నీ అధికార పార్టీ సభ్యులతోపాటు కూర్చోవడం కూడా కొంతసేపు వివాదానికి దారితీసింది. బీజేపీ సభ్యులు ఈ విషయమై బిన్నీని ప్రశ్నించగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తానుకూడా ప్రభుత్వ విప్ ప్రకారం ఓటు వేయవలసిందేనంటూ స్పీకర్ ఆదేశించారని, అందువల్ల తాను అధికార పార్టీ సభ్యుల పక్కనే కూర్చున్నానని చెప్పారు. సభ బయటా నిరసన జ్వాలలు శాసనసభలోనే కాకుండా బయటకూడా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మార్మోగాయి. కాం ట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ చార్జీల మాఫీని అందరికీ వర్తింపజేయాలని, సోమ్‌నాథ్ భారతిని మంత్రిపదవి నుంచి తప్పించాలని డిమాండ్ చే యడమే కాకుండా కేజ్రీవాల్‌కే వ్యతిరేకంగా నినదించారు. అంతటితో ఆగకుండా ధర్నా చేశారు. భద్రతా సిబ్బంది వారిలో కొందరిని బస్సులో ఎక్కించి దూరంగా తీసుకెళ్లారు. -
భారతి రాజీనామా చేస్తేనే బిల్లుకు మద్దతు: లవ్లీ
న్యూఢిల్లీ: న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి తన పదవికి రాజీనామా చేసేదాకా జన్‌లోక్‌పాల్ బిల్లుకు తాము మద్దతు ఇచ్చేదిలేదని కాంగ్రెస్ పార్టీ మరోమారు స్పష్టం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ ఈ విషయమై మాట్లాడుతూ... ‘జన్‌లోక్‌పాల్ బిల్లు విషయంలో కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అబద్ధాల విషయంలో కేజ్రీవాల్ పేరును గిన్నిస్ బుక్కులోకి ఎక్కించాలి. ఆయన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారు. శని, ఆదివారాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం, అదీ బహిరంగ అసెంబ్లీ నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటివి చేస్తూ ప్రచారం పొందాలని కేజ్రీవాల్ చూస్తున్నారు. ఇది లేనిపోని గందరగోళానికి దారితీస్తుంద’న్నారు. -
సోమ్‌నాథ్‌ను తప్పించండి
న్యూఢిల్లీ: న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిని పదవి నుంచి తప్పించాలని రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీని బీజేపీ కోరింది. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు హర్షవర్ధన్ రాష్ర్టపతి భవన్లో సోమవారం ప్రణబ్‌ను కలసి ఓ వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఈ బృందం రాష్ట్రపతి దృష్టికి 15 అంశాలను తీసుకె ళ్లింది. అనంతరం హర్షవర్ధన్ మీడయాతో మాట్లాడుతూ ‘సోమ్‌నాథ్ రాజీనామా కోరాం. ఆఫ్రికా సంతతికి చెందిన మహిళల ఆవాసాల్లోకి అనుమతి లేకుండానే సోమ్‌నాథ్ లోపలికి వెళ్లారు. తనిఖీలు చేశారు. అసభ్యంగా ప్రవర్తించారు. మంత్రి చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధం’అని అన్నారు. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం శాసనసభ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ఆప్ నిర్ణయించిన విషయాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి పొందకుండానే నేరుగా జన్‌లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం యత్నిస్తోందని ఆరోపించారు. ఆప్‌కు అందిన విరాళాలపై విచారణ జరిపించాలని కూడా రాష్ట్రపతిని కోరినట్టు తెలిపారు. -
ఆప్ సర్కార్ నన్ను వేధిస్తోంది: బర్ఖాసింగ్
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం తనపై కక్షసాధింపులకు పాల్పడుతోందని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ బర్ఖాసింగ్ ఆరోపించారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న సోమ్‌నాథ్ భారతికి సమన్లు జారీచేసినందుకే తనను వేధిస్తున్నారన్నారు. డీసీడబ్ల్యూ చైర్మన్ పదవి నుంచి తనను తప్పించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆప్ తనను వేధిస్తోందని, సోమ్‌నాథ్ భారతికి సమన్లు జారీ చేసినందుకే ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనను తప్పించడం ఆప్ సర్కార్ వల్ల కాదన్నారు. తనను తప్పించాలంటే లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఆదేశాలు జారీ చేయాలని, తన పదవీకాలం ఇంకా 16 నెలలు ఉన్నందున ఆయన తనకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయరని భావిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెదిగినందున ఆ ప్రభుత్వం నియమించిన బర్ఖాసింగ్ కూడా తన పదవిలోనుంచి దిగిపోవాలని ఆప్ నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సింగ్ స్పందిస్తూ... ఆప్ కోరినంతమాత్రాన తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించినందున సోమ్‌నాథ్ భారతికి సమన్లు జారీ చేసిన తాను డీసీడబ్ల్యూ పదవికి వందశాతం న్యాయం చేశానని, ఇది నచ్చకే వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు. కాగా షీలాదీక్షిత్ ప్రభుత్వం అధికారానికి దూరమైన తర్వాత డీపీసీసీ అధ్యక్షుడు లవ్లీ మాట్లాడుతూ... పార్టీ నేతలెవరైనా వివిధ బోర్డుల, కమిషన్లలో ముఖ్యమైన పదవుల్లో ఉంటే వాటికి రాజీనామా చేయాలని సూచించారు. బర్ఖాసింగ్ వ్యవహారంలో మీడియా అడిగిన ప్రశ్నకు లవ్లీ సమాధానమిస్తూ తన సూచనలను తాను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని బర్ఖాసింగ్ ప్రస్తావిస్తూ.. రాజ్యాంగబద్ధమైన పదవి అయినందునే లవ్లీ కూడా తనకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. -
సోమ్‌నాథ్‌కు వ్యతిరేకంగా బీజేపీ మార్చ్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న సోమ్‌నాథ్ భారతికి వ్యతిరేకంగా బీజేపీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. ఖిడ్కా ఎక్స్టెన్షన్లో అర్ధరాత్రి సోదాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తడం, ఉగాండాకు చెందిన బాధితురాలు కూడా సోమ్‌నాథ్‌ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఇప్పటికే తమ ఆందోళనను అంచెలంచెలుగా పెద్దదిగా చేస్తోంది. తన కేబినెట్లో వివాదాస్పద మంత్రిగా మారిన సోమ్‌నాథ్ నుంచి రాజీనామా కోరాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను బీజేపీ నేతలు ఇప్పటికే కలిశారు. సీఎం కార్యాలయంలో దాదాపు రెండు గంటలపాటు ధర్నాకు దిగారు. తమ డిమాండ్లపై స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చెప్పినట్లుగానే బుధవారం విధానసభ నుంచి రాజ్‌నివాస్ వరకు మార్చ్ నిర్వహించారు. సోమ్‌నాథ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందేనని నినాదాలు చేశారు. విధానసభలో ప్రతిపక్ష నేత డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ మార్చ్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. సోమ్‌నాథ్ భారతి విదేశీ మహిళలను, ఢిల్లీ మహిళా కమిషన్‌ను, ఢిల్లీ పోలీసులను, ప్రముఖ నేతలను అవమానించారని హర్షవర్ధన్ ఆరోపించారు. సోమ్‌నాథ్ భారతిని మంత్రి పదవి నుంచి తొలగించేంతవరకు తాము ప్రదర్శనలు నిర్వహిస్తూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. -
కేజ్రీవాల్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం పరిమితికి మించి ఖర్చు చేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఎన్నిక చెల్లబోదని ప్రకటించాలని బీజేపీ దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లపై మంగళవారం స్పందించిన ఢిల్లీ హైకోర్టు వీళ్లిద్దరికీ నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్, సోమ్‌నాథ్ భార తి ఎన్నికల వ్యయం 14 లక్షల రూపాయల వ్యయపరిమితిని మించిపోయిందని పిటిషనర్లు ఆరోపించారు. ఈ ఇరువురు నేతలు లేదా ఆమ్ఆద్మీ పార్టీ ఫిబ్రవరి 25లోగా ఈ పిటిషన్లపై సంజాయిషీ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ చేతిలో ఓడిపోయిన రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా ఆయన ఎన్నికల వ్యయంపై కేసు దాఖలుచేశారు. మాలవీయనగర్ స్థానంలో భారతి చేతిలో ఓడిన బీజేపీ నేత ఆర్తీమెహ్రా మంత్రికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. గుప్తా ఫిర్యాదుపై న్యాయమూర్తి విపుల్ సింఘ్వీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేయగా, మెహ్రా పిటిషన్‌పై న్యాయమూర్తి జీఎస్ సిస్థానీ న్యాయశాఖ మంత్రికి నోటీసు జారీ చేశారు. కేజ్రీవాల్, భార తి ఎన్నికల ప్రవర్తనా నియమావళితోపాటు ప్రజాప్రాతినిథ్య చట్టం నిబంధనలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పిటిషనర్లు ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సంగీత విభావరి కోసం ఆప్ రూ.39 లక్షలు ఖర్చు చేసిందని పిటిషనర్లు ఆరోపించారు. గాయకుడు విశాల్ దడ్లానీతోపాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కేజ్రీవాల్, సోమ్‌నాథ్ భారతి, ఆర్కేపురం అభ్యర్థి షాజియా ఇల్మీ హాజరయ్యారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ఈ విభావరికి చెల్లించిన 39 లక్షల రూపాయలను ముగ్గురు అభ్యర్థులు సమంగా భరించారని పేర్కొన్నారు. అంటే కేవలం ఈ ఒక్క కార్యక్రమం కోసమే ముగ్గురూ రూ.13 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తేలుతోందని బీజేపీ వివరించింది. ఈ విభావరిలో పాల్గొన్న గాయకులు తమ నుంచి డబ్బు తీసుకోలేదని, బీజేపీ ఆరోపణలు నిరాధారమైనవ ని ఆప్ వర్గాలు అంటున్నాయి. -
సోమ్‌నాథ్‌ను తప్పించాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: ధర్నాల రాజకీయాలకు సోమవారం రాజధాని నగరం వేదికైంది. సంచలనాల ప్రభుత్వంగా ముద్ర వేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌ను ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత వినోద్‌కుమార్ బిన్నీ ఓ పక్క ఇబ్బంది పెడుతుండగా మరోవైపు నుంచి ప్రతిపక్ష బీజేపీ అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిని మంత్రిపదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. దాదాపు రెండు గంటలపాటు సీఎం కార్యాలయాన్ని నినాదాలతో హోరెత్తించారు. ఖిడ్కీ ఎక్స్టెన్షన్లో అర్ధరాత్రి సోదాల వ్యవహారంలో సోమ్‌నాథ్ భారతి ప్రవర్తించిన తీరును మొదటినుంచి తప్పుపడుతోన్న బీజేపీ ఆయనను మంత్రిపదవి నుంచి తొలగించాలంటూడిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. భారతిని తొలగించాలనే డిమాండ్‌తో హర్షవర్ధన్ నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు, అకాలీదళ్‌కు చెందిన ఎమ్మెల్యే ఈ ధర్నాలో పాల్గొన్నారు. సోమ్‌నాథ్‌కు, కేజ్రీవాల్‌కు, ఆప్ సర్కారుకు వ్యతిరేకంగా రాసిన నినాదాలున్న ప్లకార్డులను ప్రదర్శించారు. ముందుగానే హెచ్చరించాం... మంత్రి సోమ్‌నాథ్ భారతి మహిళలతో అమర్యాదగా వ్యవహరించారని, చట్టాన్ని అతిక్రమించారని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హర్షవర్ధన్ ఆరోపించారు. ఆయనను మంత్రిపదవి నుంచి తొలగించేందుకు 26వ తేదీ వరకు గడువిచ్చామని, లేనట్లయితే 27న ధర్నాకు దిగుతామని ముందుగానే హెచ్చరించామన్నారు. ఈ విషయమై కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ కూడా రాశామన్నారు. కేజ్రీవాల్ మెతకవైఖరి... బీజేపీ ధర్నాపై కేజ్రీవాల్ స్పందన కూడా అంతే కఠినంగా ఉంటుందని భావించినా పరిస్థితి అందుకు భిన్నంగా కనిపించింది. హర్షవర్ధన్ తదితరులతో వాగ్వాదానికి దిగుతారని ఊహించినప్పటికీ కేజ్రీవాల్ మెతకవైఖరి అవలంబించారు. తన కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన బీజేపీ నేతలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా వచ్చి కలుసుకున్నారు. వారి భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు. వారి మధ్యే కూర్చుండి మాట్లాడారు. అనంతరం బీజేపీ నేతలు తాము రాసిన బహిరంగ లేఖను కేజ్రీవాల్‌కు అందించారు. సోమ్‌నాథ్ భారతిని తప్పించాలని డిమాండ్ చేశారు. విలువలు తెలిస్తే రాజీనామా కోరాలి.. ముఖ్యమంత్రిని కలిసిన తరువాత హర్షవర్ధన్ విలేకరులతో మాట్లాడుతూ... కేజ్రీవాల్‌కు విలువల గురించి తెలిసినట్లయితే భారతి నుంచి రాజీనామా కోరాలన్నారు. దేశవాసుల ఎదుట రాజ్యాంగాన్ని, కార్యనిర్వాహకవర్గాన్ని, న్యాయవ్యవస్థను, మీడియాను అవమానించిన సోమ్‌నాథ్ భారతిని పదవిలో కొనసాగించడాన్ని సహించబోమనే విషయాన్ని కేజ్రీవాల్‌తో చెప్పామన్నారు. సోమ్‌నాథ్ తొలగింపును డిమాండ్ చేస్తూ తాము కేవలం సూచనప్రాయంగానే ఈ ధర్నా చేపట్టామని, రానున్న రోజుల్లో తమ ఆందోళనను మరింత తీవ్రం చేయడంతోపాటు అంశాన్ని రాష్ట్రపతి వద్దకు తీసుకువెళ్తామని హెచ్చరించారు. -
మోడీ నుంచి ఎంత తీసుకున్నారు?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారులో వివాదాస్పద మంత్రిగా పేరు తెచ్చుకున్న సోమనాథ్ భారతి.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నుంచి మీడియా డబ్బులు తీసుకుంటోందని ఆరోపించారు. ఇటీవల దక్షిణ ఢిల్లీలో అర్ధరాత్రి వేళ ఆఫ్రికా మహిళలపై మంత్రి తన అనుచరులతో కలసి దాడి చేశారంటూ ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమనాథ్ భారతి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని పలు డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ అంశంపై శనివారం కొందరు విలేకరులు ఆయన్ను పదేపదే ప్రశ్నించారు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి.. గుజరాత్ సీఎం మోడీ నుంచి ఎంత డబ్బు తీసుకున్నారంటూ విలేకరులపై విరుచుకుపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై సర్వత్రా దుమారం రేగింది. కేజ్రీవాల్ కూడా సోమనాథ్‌ను తప్పుబడుతూ.. ఆయన వ్యాఖ్యలు సరికాదని స్పష్టంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారతి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఒకవేళ అవి ఎవరినైనా బాధించి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. కాగా, అర్ధరాత్రి దాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) సమన్లు జారీచేసినా సోమనాథ్ హాజరుకాకుండా, ఆ సమయంలో గాలిపటాల పండుగకు వెళ్లారు. ఈ అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. మహిళా కమిషన్ రాజకీయమయం అని ఆరోపించారు. డీసీడబ్ల్యూ చీఫ్ బర్ఖా సింగ్ కాంగ్రెస్ సభ్యురాలని, ఆమె ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత తన పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలని స్పష్టంచేశారు. -
అది రాజకీయ సంస్థే
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ రాజకీయ సంస్థ అని మంత్రి సోమ్‌నాథ్ భారతి ఆరోపిం చారు. గతంలో కమిషన్ ఇంత వేగంగా ప్రతిస్పం దించ డం చూడలేదని, తన విషయంలో కమిషన్ ఆగమేఘాలపై వ్యవహరిస్తోందన్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్ఖాసింగ్ కాంగ్రెస్ సభ్యురాలని, తన ప్రభుత్వం గద్దె దిగిన వెంటనే ఆమె రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. బర్ఖాసింగ్ దీనిపై ప్రతిస్పందిస్తూ తనను రాజీనామా చేయమనడానికి సోమ్‌నాథ్ భారతి ఎవరని ప్రశ్నించారు. తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నానని , మహిళలతో అనుచితంగా ప్రవర్తించిన సోమ్‌నాథ్ భారతీయే రాజీనామా చేయాలని ఆమె అన్నారు. ఇదిలావుండగా ఢిల్లీ మహిళా కమిషన్‌పై భారతి చేసిన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఖండించింది. మహిళా కమిషన్‌ను అనవసర రాజకీయాల్లోకి లాగొద్దని ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు నిర్మల సమంత్ ప్రభావకర్ అన్నారు. డీసీడబ్ల్యూ చైర్మన్‌ను మార్చే యోచనలో ఆప్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అయిన ప్రస్తుత ఢిల్లీ మహిళ కమిషన్ (డీసీడబ్ల్యూ) ఛైర్మన్ బర్ఖా సింగ్‌ను తప్పించి మరొకరిని ఆ స్థానంలో నియమించాలని ఆప్ భావిస్తోంది. కావాలనే న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతీని బదనాం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని, దీనివెనుక రాజకీయ గూడుపుఠాణి ఉందని అభిప్రాయపడుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ ఘోర పరాజయం చెందిన తర్వాత బర్ఖాసింగ్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసి ఉండాల్సిందని ఆప్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ప్రభుత్వ బోర్డులు, కమిషన్లలో వివిధ పదవులను అంటిపెట్టుకొని ఉన్న కాంగ్రెస్ సభ్యులను తప్పించి ఆయా స్థానాల్లో కొత్తవారిని నియమించాలని పార్టీ భావిస్తున్నట్టు వెల్లడించాయి. ఇటీవల నగరంలో వ్యభిచారం జరుగుతున్న ఓ గృహంపై దాడి చేసిన సమయంలో ఉగాండా మహిళ పట్ల అసభ్యంగా మంత్రి సోమనాథ్ భారతీ వ్యవహరించారని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు డీసీడబ్ల్యూ చైర్మన్ బర్ఖాసింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. మంత్రి సోమనాథ్‌ను తప్పించాలి: హర్షవర్ధన్ తనను ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఓ మీడియా ప్రతినిధిని మోడీ నుంచి డబ్బులు ఎంత ముట్టాయని న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి చేసిన తీవ్ర వ్యాఖ్యను బీజేపీ నేత హర్షవర్ధన్ తప్పుబట్టారు. మంత్రిగా సోమ్‌నాథ్ భారతి వ్యాఖ్యలు పరాకాష్టకు చేరాయని, ముఖ్యమంత్రి ఆయనను మంత్రిమండలి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. సోమనాథ్ ఆరోపణలని బ్రాడ్కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ (బీఈఏ) జనరల్ సెక్రటరీ ఎన్‌కె సింగ్ కూడా ఖండించారు. ఇది నిరాధారమైన అనవసరమైన ఆరోపణ అన్నారు. ఒక వ్యక్తి నిస్పృహతో చేసిన ఆరోపణ గా అభివర్ణించారు. -
ఆకాశంలో హరివిల్లు
న్యూఢిల్లీ: రాష్ట్ర పర్యాటక అభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న ఢిల్లీ అంతర్జాతీయ పతంగుల ఉత్సవాన్ని రాష్ట్ర పర్యాటక, న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఢిల్లీహాట్లో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్వహించే ఉత్సవంలో రంగురంగుల భారీ పతంగులు కనువిందు చేస్తున్నాయి. ఈ సందర్భంగా మంత్రి భారతి స్వయంగా పతంగులు ఎగురవేశారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా మంది స్థానికులు త్రివర్ణ పతంగులను నింగిలోకి పంపించారు. ఢిల్లీవాలాలు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజధానిలో చాలా ఏళ్లుగా పతంగుల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా దేశవిదేశాల నుంచి పతంగుల నిపుణులు (కైట్ ఫ్లయర్స్) ఈ ఉత్సవానికి హాజరయ్యారు. అమెరికాకు చెందిన బార్బరా మీయర్, ఇంగ్లండ్‌కు చెందిన బాబ్, బీరట్‌కు చెందిన సమీ సాహెగ్స్, ఇండోనేషియావాసులు టింటన్, సారీ, దక్షిణ కొరియా నుంచి చో, ఫ్రాన్స్ నుంచి ఆంటోనియా వంటి కైట్ ఫ్లయర్లు ఈ ఉత్సవంలో భారీ పతంగులను ప్రదర్శిస్తున్నారు. వీటి హెక్సాజెన్, స్లెడ్, డెల్టా, బారొంగి వంటి పలు రకాల పతంగులు ఆకాశంలో విహరించనున్నాయి. కేరళ, చెన్నయ్, రాజ్‌కోట్, చండీగఢ్, అహ్మదాబాద్, మంగళూరు, త్రివేండ్రంతోపాటు ఢిల్లీకి చెం దిన కైట్ ఫ్లయర్లు కూడా ఈ ఉత్సవానికి వచ్చారు. సాధారణ గాలిపటాలతోపాటు రాత్రిపూట ప్రదర్శించే నైట్కైట్ ఫ్లయింగ్ మరో ఆకర్షణ. భారీ పతంగులకు ఎల్ఈడీ విద్యుత్ దీపాలను అమర్చి ఎగురవేస్తారు. ఒక్కో భారీ గాలిపటంలో 100 వరకు చిన్న పతంగులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పురాతన కళ గురించి వీక్షకులకు తెలియజేసేందుకు వేదిక వద్ద ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. టిష్యూ పేపర్, ఎలాస్టిక్ పేపర్, వెదురు, వస్త్రం తదితర వ స్తువులతో తయారు చేసిన భారీ పతంగుల వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. మూడు రోజులపాటు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలూ ఉంటాయి. సాహిత్య కళాపరిషత్ కళాకారులు జానపద నృత్యాలు మరో ఆకర్షణ. మ్యాజిక్, పప్పెట్ షోలు, బయోస్కోప్, లాం గ్మన్ వంటివి కూడా వినోదం పంచనున్నాయి. పతంగుల తయారీ విధానం గురించి చిన్నారులకు ఇక్కడి నిపుణులు శిక్షణ కూడా ఇస్తున్నారు. దీనికితోడు బాలలకు శనివారం మధ్యాహ్నం పెయిం టింగ్ పోటీలు నిర్వహిస్తారు. -
మంత్రిగారా... మజాకా!
న్యూఢిల్లీ: అర్ధరాత్రి సమయంలో విదేశీ మహిళలతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతీ శుక్రవారం కూడా ఢిల్లీ మహిళా కమిషన్ ఎదుట హాజరుకాలేదు. తన న్యాయవాదిని ఢిల్లీ మహిళా కమిషన్‌కు పంపారు. కమిషన్ ముందు హాజరు కావాల్సిన సమయంలో ఆయన మాత్రం జల్సాగా గాలిపటాలు ఎగరేసుకుంటూ కనిపించడం, ఎందుకు హాజరు కాలేదని విలేకరులు అడిగినా నవ్వుతూ వెళ్లిపోవ డం వంటి చర్యలతో మరోమారు వార్తల్లోకెక్కారు. సంజాయిషీ వినడానికి ససేమిరా... మంత్రి స్వయంగా రాకుండా న్యాయవాదిని పంపడంతో ఆగ్రహించిన మహిళా కమిషన్ మంత్రి తరపున వచ్చిన న్యాయవాది సంజాయిషీ వినడానికి నిరాకరించింది. దీనితో మహిళా కమిషన్ సభ్యులకు, న్యాయవాదికి మధ్య తీవ్రవాగ్వివాదం జరి గింది. ఉగాండా మహిళల ఫిర్యాదుపై ఢిల్లీ మహిళల కమిషన్ సోమ్‌నాథ్ భారతీకి సమన్లు జారీ చేసి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలలోగా తన ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కానీ మహిళా కమిషన్ ఆదేశాల ప్రకారం సోమ్‌నాథ్ భారతీ స్వయంగా రాకుండా తన తరుఫున న్యాయవాదిని పంపారు. సోమ్‌నాథ్ భారతీ తరపున ఆయన న్యాయవాది ఇచ్చే సంజాయిషీ వినడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్ఖాసింగ్ నిరాకరించారు. సోమ్‌నాథ్ భారతీ సంతకం చేసిన ఆథరైజేషన్ లెటర్ చూసిన తరువాతే అతని సంజాయిషీ వింటానని చెప్పారు. సోమ్‌నాథ్ భారతీకి తప్పు చిరునామాకు సమన్లు పంపారని, సకాలంలో సమసన్లు అందనందువల్ల ఆయన స్వయంగారాలేకపోయారని అందువల్ల ఆయన శుక్రవారం రాలేకపోయారని, సోమవారం హాజరువుతారని సోమ్‌నాథ్ తరపున వచ్చి న న్యాయవాది రిషికేష్ కుమార్ చెప్పారు. దీనిపై కాసేపు వాగ్వావాదం జరిగింది. బర్ఖాసింగ్ గుస్సా.. రెండోసారి సమన్లు జారీ చేసిన తరువాత కూడా సోమ్‌నాథ్ భారతీ రాకపోవడం ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఆగ్రహం తెప్పించింది. సోమ్‌నాథ్ భారతి ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారని బర్ఖాసింగ్ అభిప్రాయపడ్డారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థను అవమానించడమేనని బర్ఖాసింగ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి సోమ్‌నాథ్ భారతి కొంతమందితో వచ్చి అర్ధరాత్రి సమయంలో తమతో అనుచితంగా ప్రవర్తించారని ఉగాండా మహిళలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. దీనిపై మహి ళా కమిషన్ సోమ్‌నాథ్ భారతీకి సమన్లు జారీ చేసి మంగళవారం తన ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కానీ ఆసమయంలో ధర్నాలో ఉన్న సోమ్‌నాథ్ భారతీ మహిళా కమిషన్ ఎదుట హాజ రుకాలేదు. తనకు సమన్లు అందలేదని ఆయన చెప్పారు. దీంతో మహిళా కమిషన్ మరోమారు ఆయనకు సమన్లు జారీ చేసి శుక్రవారం తన ముందుండాలని పేర్కొంది. ఈ సారి కూడా హాజరుకానట్లయితే లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తానని మహిళా కమిషన్ ముందుగానే హెచ్చరించింది. అయినప్పటికీ మంత్రి హాజరు కాలేదు. కాగా దీనిపై బర్ఖాసింగ్ తదుపురి ఎలా స్పందిస్తారో చూడాలి..! -
సోమనాథ్ మంత్రి పదవి నుంచి దిగాల్సిందే
ఉగాండ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన న్యూఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి వెంటనే మంత్రి పదవి నుంచి దిగిపోవాలని ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ డిమాండ్ చేశారు. భారతీని వెంటనే అరెస్ట్ చేయాలని బిన్నీ శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ కమిషనర్ బి.ఎస్. బస్సీని కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిన్నీ మాట్లాడుతూ... విదేశీ మహిళలతో భారతీ వ్యవహరించిన తీరు సిగ్గు మాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. మంత్రి అని కోణంలో కాకుండా భారతి విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు కమిషనర్ బస్సీ తెలిపారని బిన్నీ వెల్లడించారు.మంత్రి వర్గం నుంచి భారతిని వెంటనే తొలగించాలని ఆయన న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ 36 గంటల ఆందోళన సందర్భంగా ఆప్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో సామాన్యులు సమిధులయ్యారని అన్నారు. ఆ ఘటనపై అరవింద్ కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
‘రొటీన్’ కామెంట్!
సాక్షి, న్యూఢిల్లీ:డామిట్... కథ అడ్డం తిరిగిందా? అందుకే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిశారా? నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఎల్జీ-సీఎం సమావేశం జరిగిందా? గురువారంనాటి పరిణామాలపై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చలివి. మంత్రులు చెప్పినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలతో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులు నగరంలో హల్చల్ చేసిన ముఖ్యమంత్రి ఎల్జీ అభ్యర్థన మేరకు వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అదే ఎల్జీతో తాను సమావేశం కావడంపై కేజ్రీవాల్ స్పష్టమైన వివరణ ఇచ్చినా రాజకీయ వర్గాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. నజీబ్ జంగ్‌తో దాదాపు 20 నిమిషాలపాటు సమావేశమైన కేజ్రీవాల్ అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ‘రొటీన్’గానే గవర్నర్‌తో సమావేశమయ్యానని, సోమ్‌నాథ్ భారతి వ్యవహారం తమ మధ్య చర్చకు రాలేదని తెలిపారు. అయితే ఆయన ప్రత్యర్థులు మాత్రం న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ తప్పించాల్సిందిగా వెల్లువెత్తుతున్న డిమాండ్లపై చర్చించి ఉంటారని చెబుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా స్పందించాయి. ప్రతి బుధవారం గవర్నర్‌తో కేజ్రీవాల్ సమావేశమై ప్రభుత్వ వ్యవహారాల గురించి చర్చిస్తారని, అయితే ధర్నా అనంతరం ఆయన ఆరోగ్యం దెబ్బతినడంతో బుధవారం సమావేశం కాలేదని, ఆరోగ్యం కాస్త మెరుగుపడడంతో గురువారం సమావేశమయ్యారని చెప్పారు. అయితే ముఖ్యమంత్రితోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌సింగ్ కూడా ఎల్జీని కలవడం వల్ల వారి సమావేశంలో సోమ్‌నాథ్ భారతి వ్యవహారం చర్చకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు కోర్టు చీవాట్లు ఢిల్లీ రాష్ట్ర న్యాయ మంత్రి సోమనాథ్ భారతి నేతృత్వంలో తమ ఇంటిపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఉగాండా మహిళ చేసిన ఫిర్యాదుపై స్పందించని రాష్ట్ర పోలీసులకు స్థానిక కోర్టు గట్టిగా చీవాట్లు పెట్టింది. బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్య తీసుకోలేదని మండిపడింది. ఈ ఉదంతంపై దక్షిణ డీసీపీ కార్యాలయానికి ఫిర్యాదు అందిందో, లేదో, అంది ఉంటే ఏ చర్యలు తీసుకున్నారో ఈ నెల 25లోగా తమకు వివరణ ఇవ్వాలని సదరు డీసీపీని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చేతానా సింగ్ గురువారం ఆదేశించించారు. ‘మాకందిన పిటిషన్లో చాలా ఆరోపణలు ఉన్నాయి. మాలవీయ నగర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు స్వీకరించింది. అయినా వారు చర్యలు తీసుకోలేదు. దర్యాప్తు పెండింగ్‌లో ఉందని చెప్పారు. పిటిషన్‌పై మేం ఆదేశాలిచ్చేముందు డీసీసీ నుంచి సమాధానం కావాలి’ అని పేర్కొన్నారు.ఈ నెల 15న అర్ధరాత్రి సోమనాథ్ భారతి నేతృత్వంలో తమ ఫ్లాట్‌పై దాడి చేసి, అనుచితంగా ప్రవర్తించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చే యాలని ఉగాండా మహిళ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. కాగా, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మరో అఫ్రికన్ మహిళతోపాటు మరొకరు వేసిన పిటిషన్లపై స్పందించిన కోర్టు ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. -
చట్టప్రకారం చర్యలకు కాంగ్రెస్ డిమాండ్
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసిన కొన్ని గంటల తరువాత కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను కలిశారు. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ నేతృత్వంలోని బృందం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిసి..సోమ్‌నాథ్ భారతి వ్యవహారంలో జోక్యం కలిగించుకొని చట్టప్రకారం చర్యలు చేపట్టవలసిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయటం లేదని, ఈ కేసులో చట్టప్రకారం దర్యాప్తు జరపాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని తాము లెప్టినెంట్ గవర్నర్‌ను కోరామని లవ్లీ తెలిపారు. న్యాయశాఖ మంత్రి చట్టానికి అతీతుడు కాడని, ఆయనపై తీసుకోవలసిన చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని తాము కోరామన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చూస్తానని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా తమకు హామీ ఇచ్చారని సమావేశం తరువాత విలేఖరులతో మాట్లాడిన లవ్లీ చెప్పారు. తాము ఆప్ ప్రభుత్వానికి 18 అంశాలపై మద్దతు ఇస్తున్నామని, వారు ఈ అంశాలలో దేని నుంచైనా పక్కకు తప్పుకున్నట్లయితే తమ మద్దతును ఉపసంహరించడం గురించి ఆలోచిస్తామని లవ్లీ హెచ్చరించారు. సోమ్‌నాథ్ భారతీని మంత్రిమండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘ఈ కేసులో చట్టప్రకారం వ్యవహరించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని మాత్రమే తాము లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరామ’ని చెప్పారు. -
సోమనాథ్‌ను సాగనంపాల్సిందే!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్న సోమ్‌నాథ్ భారతీని మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఆ కుర్చీలో ఒక్క క్షణం కూడా కూర్చొనే రాజ్యాంగపరమైన హక్కు ఆయనకు లేదని పేర్కొంది. తమపైన దాడిచేసినవారికి నేతృత్వం వహించింది సోమ్‌నాథ్ భారతేనని ఉగాండా మహిళ గుర్తించడంతోపాటు ఆమె వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు కూడా చేసిన విషయం తెలిసిందే. పలు మహిళాసంఘాలు ఇదే డిమాండ్ చేయడం, ఢిల్లీ మహిళా కమిషన్ కూడా సోమ్‌నాథ్‌కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. దీంతో దీంతో సోమ్నాథ్పై చర్యలు తీసుకోవాలని తాము చేస్తున్న డిమాండ్‌ను తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ మరింత బలంగా వినిపించింది. వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించాలని ఆ పార్టీ నేత రవిశంకర్ ప్రసాద్ గురువారం డిమాండ్ చేశారు. నరేంద్రమోడీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. త్వరలోనే ఆప్ బుడగ పగులుతుందని ఆయన జోస్యం చెప్పారు. కమిషనర్ బస్సీని కలిసిన గోయల్ బృందం న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ విజయ్ గోయల్, విజేందర్ గుప్తా నేతృత్వంలోని కమలదళం గురువారం ఢిల్లీ కమిషనర్ బీఎస్ బస్సీని కలిసింది. అనంతరం గోయల్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఉగాండా బాధితురాలు స్పష్టంగా గుర్తించి, మెజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని ఇచ్చిన తర్వాత కూడా సోమ్‌నాథ్ భారతిని ఎందుకు అరెస్టు చేయరాదని ప్రశ్నిస్తూ కమిషనర్‌కు ఓ లేఖను సమర్పించామ’ని చెప్పారు. -
భారతి మెడకు బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: వ్యభిచారం, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలపై ఆఫ్రికన్ మహిళలపై మద్దతుదారులతో కలసి గత బుధవారం అర్ధరాత్రి దాడి చేయించిన ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా మరో ఉగాండా మహిళ కోర్టును ఆశ్రయించింది. తమపై దాడి చేసిన మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోర్టులో పిటిషన్ చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించింది. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఉదయం కలిశారు. మంత్రి సోమనాథ్ భారతిపై ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి పదవి నుంచి సోమనాథ్ భారతిని వెంటనే తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. -
భారతి వివాదం: లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసిన కేజ్రీవాల్
న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి చుట్టూ అలముకున్న వివాదం నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిశారు. రాత్రిపూట ఢిల్లీవీధుల్లో దాడులు చేస్తున్న ఓ బృందాన్ని వెనకేసుకు వస్తున్నారన్న ఆరోపణలు భారతిపై వచ్చని విషయం తెలిసిందే. ఢిల్లీ మహిళా కమిషన్‌తో పాటు, మహిళా హక్కుల కార్యకర్తలు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను తొలగించాలా లేదా అన్న విషయమై అరవింద్ కేజ్రీవాల్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో ఆయన సమావేశం అయినట్లు తెలుస్తోంది. ఆయన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నరనేది కూడా కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశముంది. -
సోమ్నాధ్ రాజీనామాకు విపక్షాల పట్టు
-
అదుపు తప్పుతున్న ఆప్ సర్కారు
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారం చేపట్టి నెల్లాళ్లయినా కాకుండానే ‘ఆప్’ సర్కారు అదుపు తప్పుతోంది. పార్టీ నేతలు రేకెత్తిస్తున్న వరుస వివాదాలు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)సర్కారు తలకు చుట్టుకుంటున్నాయి. వ్యభిచారం, మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం సాగిస్తున్నారనే ఆరోపణలపై ఆఫ్రికన్ మహిళలపై మద్దతుదారులతో కలసి గత బుధవారం అర్ధరాత్రి దాడి చేయించిన మంత్రి సోమనాథ్ భారతికి ఉద్వాసన పలకాలంటూ పలు వర్గాల నుంచి సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు, కేరళ నర్సులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ‘ఆప్’ నేత కుమార్ విశా్వ స చివరకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఆఫ్రికన్ మహిళలపై దాడికి సంబంధించి రికార్డయిన సీడీ దృశ్యాల్లో మంత్రి సోమనాథ్ భారతిని బాధితుల్లో ఒకరైన ఉగాండా మహిళ గుర్తిం చింది. ఆమెతో పాటు మరో ఉగాండా మహిళ, ముగ్గురు నైజీరి యన్ మహిళలు మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చారు. ఈ పరి ణామంతో సర్కారుపై విమర్శలు ఉధృతమయ్యాయి. వాంగ్మూలంలో ఆఫ్రికన్ మహిళల ఆరోపణలు, వాటిపై స్పందనలు... సోమనాథ్ భారతి ఆధ్వర్యంలో కొందరు పెద్దపెద్ద కర్రలతో తమ ఇళ్లపై దాడిచేసి, తమను కొట్టారని, అసభ్యంతగా తమ శరీరాలను తడిమారని సీడీ దృశ్యాల్లో ఆయనను గుర్తించిన ఉగాండా మహిళ ఆరోపించింది. దేశం విడిచి వెళ్లాలని, లేకుంటే ఒకరి తర్వాత ఒకరుగా అందరినీ చంపేస్తామని బెదిరించారని, ఢిల్లీ పోలీసులు సకాలంలో చేరుకుని తమను రక్షించారని ఆఫ్రికన్ మహిళలు తెలిపారు. సోమనాథ్ భారతిని మంగళవారం హాజరు కావాల్సిందిగా ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశించినా, ఆయన హాజరు కాలేదు. ఆయనకు పోలీసుల ద్వారా గురువారం మళ్లీ సమన్లు పంపనున్నట్లు ఢిల్లీ మహిళా కమిషన్ ప్రకటించింది. ఆఫ్రికన్ మహిళలను వెంటాడి, పట్టుకోవాల్సిందిగా సోమనాథ్ మనుషులను ఉసిగొల్పడం ఏమాత్రం సమంజసం కాదని మహిళా నాయకురాలు కవితా కృష్ణన్ దుయ్యబట్టారు. ఆయన తనంతట తానే రాజీనామా చేయాలని, లేకుంటే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మాదకద్రవ్యాలు తీసుకున్నారో లేదో నిర్ధారించేందుకు ఏ ఆధారంతో ఆఫ్రికన్ మహిళలపై పరీక్షలు జరిపించారని మహిళా కమిషన్ చైర్పర్సన్ మమతా శర్మ మండిపడ్డారు. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ కూడా ‘ఆప్’ సర్కారు తీరును తప్పుపట్టారు. సోమనాథ్‌కు ఉద్వాసన పలకాలంటూ ‘ఆప్’ రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీ సచివాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంత్రి భారతిని పదవి నుంచి తొలగించి, ఆయనను అరెస్టు చేయాలని గవర్నర్‌ను కోరనున్నట్లు ‘ఆప్’ సర్కారుకు మద్దతిస్తున్న కాంగ్రెస్ ప్రకటించింది. కేరళ నర్సులకు కుమార్ విశ్వాస్ క్షమాపణలు రాంచీలో 2008లో జరిగిన ఒక కార్యక్రమంలో కేరళ నేతలపై ‘ఆప్’ నేత కుమార్ విశ్వాస్ అనుచిత వ్యాఖ్యలు చేసిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో కనిపించడంతో కలకలం మొదలైంది. దీంతో తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని విశ్వాస్ ప్రకటించారు. కేజ్రీవాల్‌కు అస్వస్థత: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యూరు. బుధవారం విధులకు గైర్హాజరయ్యూరు. విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. రెండురోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కేజ్రీవాల్ పిచ్చి సీఎం: షిండే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ‘పిచ్చి సీఎం’గా అభివర్ణించారు. కేజ్రీవాల్ పేరును ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా, ఆయనను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మహారాష్ట్రలోని హింగోలీలో బుధవారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను పోలీసుగా పనిచేసిన సమయంలో శివసేన అల్లర్లకు దిగిన కారణంగా అప్పట్లో తనకు సెలవు దక్కలేదని చెప్పారు. ‘నిన్న కూడా ఢిల్లీలో ఆ పిచ్చి సీఎం ధర్నాకు దిగడంతో నేను పోలీసులకు సెలవులు రద్దు చేయాల్సి వచ్చింది’ అన్నారు. -
వివాదాల భారతి!
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌లోని న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారుతోంది. తన నియోజకవర్గం లోని ఉగాండ మహిళలపట్ల ఆయన దూకు డు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సోమ్‌నాథ్ రాజీనామా చేయడంతోపాటు లాయర్‌గా ఆయన లెసైన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీలు చేస్తున్న ఆందోళనలకు ఇప్పుడు కొన్ని స్వచ్ఛంధ సంస్థలు, మహిళా సంఘాలు గొంతు కలిపాయి. మహిళలను అవమానపరిచేలా ప్రవర్తించడంపై వారు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తున్న మంత్రి సోమ్‌నాథ్ వ్యవహారంపై ఇప్పుడు అంతర్మథనం మొదలైంది. గత బుధవారం ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి తన నియోజకవర్గం మాలవీయ్‌నగర్ పరిధిలోని ఓ భవనంపై దాడి చేయడం, అక్కడ నివసిస్తున్న ఇద్దరు ఉగాండా యువతులు సెక్స్, డ్రగ్ రాకెట్ నడుపుతున్నారంటూ ఆయన అనుచరులు హంగామా చేయడం తెలిసిందే. అనంతరం వారికి బలవంతంగా వైద్య పరీక్షలు చేయించినప్పుడు సైతం సోమ్‌నాథ్ ఆసుపత్రిలో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డు కావడం దుమారానికి కారణమవుతోంది. అయితే పోలీసులపై ఎదురుదాడికి దిగుతూ సీఎం కేజ్రీవాల్ రైలు భవన్ వద్ద అనూహ్యంగా ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. విమర్శలు వెల్లువెత్తడడంతో కేజ్రీవాల్ సైతం ఎల్జీ హామీ ఇచ్చారంటూ వెనక్కి తగ్గారు. వాస్తవానికి కే జ్రీవాల్ ధర్నాతో సోమ్‌నాథ్ వ్యవహారం సద్దుమణుగుతుందని ఆప్ నాయకులు భావించారు. అస్త్రంగా మార్చుకున్న ప్రతిపక్షాలు.. ఎన్నికల హామీలను వరుసగా నెరవేరుస్తూ వెళ్తున్న ఆప్ సర్కార్‌ను ఇరికించేందుకు ప్రయత్నించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సరైన సమయంలో సోమ్‌నాథ్ వ్యవహారం అస్త్రంగా దొరికింది. మహిళల భద్రతపై, గత ప్రభుత్వాల తీరుపై వరుస నిరసనలు తెలియజేయడంతోపాటు మహిళా రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామంటూ ప్రకటించిన ఆప్ సర్కార్‌లో ఓ మంత్రి మహిళలపై అడ్డగోలు దాడులకు దిగడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఆప్ మంత్రి తీరును దుయ్యబడుతూ బీజేపీ పలు ఆందోళనలు చేపట్టింది. న్యాయశాఖ మంత్రిని వెంటనే తప్పించడంతోపాటు అతడి లెసైన్స్ క్యాన్సల్ చేయాలని పట్టుబట్టాయి. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. కే జ్రీవాల్ ధర్నా విరమించడంతో ఇప్పుడు ఢిల్లీ సీఎం, మంత్రులపై రెండు పార్టీలు మూకుమ్మడి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులను రాష్ట్రప్రభుత్వ పరిధిలోకి తేవాలంటూ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నా కేవలం మంత్రులను కాపాడుకునే ప్రయత్నంగా చూపేందుకు వారు యత్నిస్తున్నారు. మరోవైపు సోమ్నాథ్పై కేసు నమోదు, మహిళా సంఘాల నుంచి నిరసనలు ఆప్‌ను మరింత ఇరుకునపెడుతున్నాయి. దీనిపై ఎటూ తేల్చుకోలేక పోతున్న ఆ పార్టీ సోమ్‌నాథ్‌ను కొనసాగించాలా.. తప్పించాలా అన్నదానిపై తర్జనభర్జనలు పడుతోంది. -
కేజ్రీవాల్, సోమనాథ్ భారతీలపై కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్, న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతీల ఎన్నికను సవాలు చేస్తూ ఇద్దరు బీజేపీ నేతలు హైకోర్టులో మంగళవారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నియమాలకు విరుద్ధంగా వారిద్దరి ఎన్నికల ఖర్చు రూ.14 లక్షల పరిమితిని దాటిందని, వారి ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షడు విజేందర్ గుప్తా, ఆర్పీ మెహ్రా ఈ పిటిషన్లు దాఖలు చేసినట్లు ఆ పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇదిలాఉండగా ఊహించని రీతిలో తన సహచర మంత్రులు, మద్దతుదారులతో కలిసి ధర్నాకు దిగిన ందున ఈ ఇద్దరిపైనే సుప్రీం కోర్టులోనూ రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్లు) దాఖలయ్యాయి. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ముఖ్యంత్రి, మంత్రులు వాటికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ న్యాయమూర్తి ఎంఎల్ శర్మ, మరో న్యాయవాది ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని ప్రధాన న్యాయమూర్తి సదాశివం నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం విచారణకు స్వీకరించింది. -
విషాదం వీడని ఆఫ్రికా యువత
తాము మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యభిచారం చేస్తున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో తీవ్ర మానసిక క్షోభకు లోనైన స్థానిక ఆఫ్రికా యువత ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా ఇష్టపడడం లేదు. మంత్రి సోమ్‌నాథ్ భారతి తన అనుచరులతో కలిసి ఇటీవల ఖిర్కీలో అర్ధరాత్రి దాడులు నిర్వహించడం సంచలనం సృష్టించడం తెలిసిందే. న్యూఢిల్లీ: న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఆధ్వర్యంలో ఐదు రోజుల క్రితం ఖిర్కీ మురికివాడలో నిర్వహించిన మెరుపుదాడులను తీవ్ర అవమానంగా భావిస్తున్న ఇక్కడి ఆఫ్రికా యువత ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటికి రాలేకపోతోంది. అయితే దక్షిణఢిల్లీలోని ఈ మురికివాడ మాదకద్రవ్యాలు, వ్యభిచార రాకెట్లకు కేంద్రంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. దాడుల సందర్భంగా మంత్రి ఆఫ్రికన్ యువతులపై అనుచితంగా ప్రవర్తించారని, వారి నుంచి బలవంతంగా మూత్రం సేకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఈ విదేశీయులు ఇప్పటికీ ఇళ్లకే పరిమితమవుతున్నారు. బయటికి వచ్చినా అపరిచితులతో మాట్లాడడానికి వెనుకంజ వేస్తున్నారు. కూలీనాలీ చేసుకునే వారికి నిలయమైన ఖిర్కీలో నైజీరియా, ఉగాండా దేశాలకు చెందిన యువతీ యువకులు అధికంగా కనిపిస్తారు. అయితే మంగళవారం మధ్యాహ్నం ఇక్కడికి వెళ్లిన విలేకరులకు అక్కడ నిర్మానుష్య వాతావరణం కనిపించింది. కొంతమంది వీధుల్లోకి వచ్చినా వారి ముఖాల్లో ఇప్పటికీ విషాదఛాయలు కనిపించాయి. మీడియాతో మాట్లాడడానికి వాళ్లు ఎంతమాత్రమూ సుముఖత చూపలేదు. ఒకరిద్దరు మాట కలిపే ప్రయత్నం చేసినా మిగతావాళ్లు వద్దని వారించారు. మహిళలైతే అపరిచితుల ముఖాలు కూడా చూడడం లేదు. రోడ్డుపై కూరగాయాలు కొంటున్న ఆఫ్రికన్ యువతి వద్దకు విలేకరులు వెళ్లగానే ఆమె స్నేహితులు వెంటనే అక్కడికి చేరుకొని చేయిపట్టి లాక్కువెళ్లారు. భారతి అనుచరుల దాడుల్లో దొరికిన ఆఫ్రికన్ల ఫొటోలు, వీడియోలు దేశవిదేశీ మీడియాలో ప్రముఖంగా రావడంతో వీరు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. తాను 2010 నుంచి భారత్‌కు వస్తూ పోతున్నానని, అయితే ఇప్పటికీ ఆఫ్రికన్లను భారతీయులు గౌరవించడం లేదని ఎగ్బుల్లా కేనిస్ అనే నైజీరియన్ అన్నాడు. భారత్ విద్యాసంస్థలు భారీగా ఉపకారవేతనాలు ఇస్తుండడంతో ఆఫ్రికన్ యువత ఇక్కడే చదువు కోవడానికి ఆసక్తి చూపుతోంది. అద్దెలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఖిర్కీలో నివాసముంటారు. చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేస్తుంటారు. ఇక్కడి వీధుల్లో మురికిగా, ఇరుగ్గా కనిపిస్తాయి. చాలా ఇళ్లలో సూర్యకాంతి కనిపించదు. దేశవ్యాప్తంగా సుమారు 15 వేల మంది ఆఫ్రికన్లు ఉంటారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ‘మాపై వేధింపులు నానాటికీ అధికమవుతున్నాయి. ఆఫ్రికన్ దేశాల్లో ఎందరో భారతీయులు నివసిస్తున్నా అక్కడి వారికి ఎలాంటి సమస్యలూ ఉండవు. వాళ్లకు ప్రత్యేక హక్కులూ ఉంటాయి’ అని కేనిస్ వివరించాడు. ఇక్కడి భారీ ఎత్తున మాదకద్రవ్యాల రవాణా, వ్యభిచారం జరుగుతోందని తెలియడంతో దాడులు చేశామని మంత్రి సోమ్‌నాథ్ భారతి వివరణ ఇచ్చారు. ఖిర్కీలోని స్థానికులు కూడా మంత్రి ఆరోపణలను సమర్థిస్తున్నారు. ఆఫ్రికన్ల అక్రమాలను పోలీసులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలోకి ఆఫ్రికన్ల తాకిడి ఎక్కువయ్యాక పరిస్థితులు అధ్వానంగా మారాయని రాజేశ్ కుమార్ అనే స్థానికుడు అన్నాడు. అందరూ మాదకద్రవ్యాల రవాణా, వ్యభిచారం చేయకున్నా కొందరి వల్ల మిగతా వాళ్లందరికీ ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపాడు. ‘ఖిర్కీ రాత్రిపూట బైకర్లు హల్చల్ చేస్తారు. మాకు ఇక్కడ రక్షణ లేదు అనిపిస్తోంది. రాత్రిపూట మా మహిళలు రోడ్లపైకి రావడానికే జంకుతున్నారు’ అని ధీరేన్ అనే మరో స్థానికుడు ఆన్నాడు. -
సోమ్‌నాథ్‌ను తొలగించాలి: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతీని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది. సోమ్‌నాథ్ భారతితోపాటు పలువురు ఆప్ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.‘ఆప్ తరహా ప్రభుత్వ పాలనకు సోమ్‌నాథ్ ఓ ఉదాహరణ. త్వరలోనే ఢిల్లీవాసులు ఆప్ సర్కార్ నుంచి విముక్తి పొందుతారు’అని పేర్కొన్నారు. ఎన్నో విలువల గురించి చెప్పే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు. ప్రజా సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించేందుకే ఆప్ ప్రభుత్వం, మంత్రులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీల రాజకీయ విలువల గురించి మాట్లాడే ముందు తన ఇల్లు చక్కబెట్టుకుంటే సరిపోతుందని కే జ్రీవాల్కి సూచించారు. ‘నేను ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమ్‌నాథ్ భారతి అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేసే ప్రొఫెషనల్ లెసైన్స్ రద్దవుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నార’ని గోయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రాక్టీసు లా లెసైన్స్ ఇచ్చేస్తా
న్యూఢిల్లీ: ప్రాక్టీసు లా లెసైన్స్‌ను ఢిల్లీ బార్ కౌన్సిల్ (బీసీడీ)కు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి సమర్పించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సోమనాథ్ నుంచి తమకు సమాచారం శుక్రవారం సాయంత్రం అందిందని, ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్‌ను ఇచ్చేయాలని కౌన్సిల్ కోరిందని బీసీడీ కార్యదర్శి మురారీ తివారి తెలిపారు. ఆ సర్టిఫికెట్‌ను సోమనాథ్ సమర్పించినప్పుడు, ప్రక్రియ మొత్తం పూర్తవుతుందన్నారు. ఈ సర్టిఫికెట్ సాధ్యమైనంత తొందరగా వస్తే లెసైన్స్‌ను సస్పెండ్ స్థాయిలో ఉంచుతామని తెలిపారు. న్యాయశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు పూర్తి చేసుకొని మళ్లీ న్యాయ వృత్తిలోకి రావాలనుకుంటే అప్పుడు లెసైన్స్‌ను మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పారు. బీజేపీ నేత గోయల్ ఫిర్యాదుపై ఈ నెల 20న భారతిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయంలో బీసీడీ సమావేశం కానున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది భారతి వాదించిన ఓ అవినీతి కేసులో సాక్ష్యాలు లేకుండా చేశారని ప్రత్యేక సీబీఐ కోర్టు వ్యాఖ్యలు చేసిందని, దీన్ని పరిగణనలోకి తీసుకొని భారతిపై చర్య తీసుకోవాలని కౌన్సిల్‌కు ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ గురువారం ఫిర్యాదు చేశారని తెలిపారు. బీసీడీలో పేర్లు నమోదుచేసుకున్న న్యాయవాదులు ఏమైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని తివారి అన్నారు. అలాగే లెసైన్స్ సరెండర్ చేయడంలో ఆలస్యం చేస్తున్న భారతిపై చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన తెలిపారు. కాగా, గతేడాది ఆగస్టులో ఓ అవినీతి కేసులో బ్యాంక్ అధికారి తరఫున వాదించిన సోమనాథ్ భారతి సాక్ష్యం లేకుండా చేశారని ప్రత్యేక సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీ సర్కారు పరిధిలో పోలీస్
న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ శాఖను రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఆయన శుక్రవారం సాయంత్రం హోంమంత్రితో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రాజధానిలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఢిల్లీ పోలీస్ శాఖ రాష్ట్ర పరిధిలో లేకపోవడంతో నేరాల నియంత్రణలో జవాబుదారీతనం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారిని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తే నగరంలో జరిగే ప్రతి నేరానికి వారు బాధ్యత వహించేలా చర్యలు తీసుకోగలమన్నారు. షిండేతో భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.‘అవసరమనుకుంటే ఎన్డీఎంసీ ప్రాంతం,లూటియన్స్ జోన్లను కేంద్ర నియంత్రణలో ఉంచుకుని, మిగిలిన నగర శాంతి భద్రతల పర్యవేక్షణ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని షిండేను కోరామన్నారు. అలాగే నగరంలో డెన్మార్క్ మహిళపై సామూహిక అత్యాచారం, మాలవీయనగర్‌లో డ్రగ్ రాకెట్‌పై దాడులు, పశ్చిమ ఢిల్లీలో మహిళ అనుమానాస్పద మృతి కేసులకు సంబంధించి నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశామన్నారు. కాగా వీరి డిమాండ్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే సమాచారమిస్తానని షిండే తమకు హామీ ఇచ్చారని కేజ్రీవాల్ తెలిపారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు మనీష్ సిసోడియా, సోమ్‌నాథ్ భారతి, రాఖీ బిర్లా ఉన్నారు. -
అమీ తుమీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ సర్కారు, ఢిల్లీ పోలీసుల మధ్య వివాదం మరింత ముదిరింది. ఢిల్లీ పోలీసులు తమకు సహకరించడం లేదన్న ఫిర్యాదుతో పాటు నలుగురు పోలీ సు అధికారులను సస్పెండ్ చేయాలన్న డిమాండ్‌తో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలుసుకున్నారు. ఢిల్లీ పోలీసులు కూడా ఢిల్లీ సర్కారుపై లెప్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రులు తమ పనితీరులో జోక్యం కల్పించుకున్న వైనంపై లెఫ్ట్టినెంట్ గవర్నర్‌కు ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ నివేదిక సమర్పించారు. కేజ్రీవాల్ కోరినట్లుగా పోలీసు అధికారులను సస్పెండ్ చేయడానికి బస్సీ నిరాకరించారు. మాలవీయనగర్‌లో న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి చట్టాన్ని ఉల్లంఘిం చినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. పరస్పర ఆరోపణలతో మంత్రివర్గ సభ్యులు మనీష్ సిసోడియా, సోమ్‌నాథ్ భారతి, రాఖీ బిర్లా తో కలిసి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ సర్కార్ ఆగ్రహాన్ని ఎదుర్కొంటున్న నలుగురు పోలీసు అధికారులతో కలిసి కమిషనర్ బీఎస్ బస్సీ శుక్రవారం లెప్టినెంట్ గవర్నర్‌ను కలిశారు. గంటసేపు జరిగిన సమావేశంలో ఇరుపక్షాల ఆరోపణలు విన్న లెఫ్ట్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. అయితే గవర్నర్ హామీ తర్వాత కూడా కేజ్రీవాల్ సంతృప్తి చెందక హోమ్ మంత్రి షిండేను కలవాలని నిర్ణయించారు. డెన్మార్క్ మహిళపై గ్యాంగ్ రేప్ ఘటన జరిగిన పహాడ్‌గంజ్ ప్రాం తపు పోలీసు అధికారితో పాటు తన మంత్రుల ఆదేశాలను ఖాతరు చేయని మాలవీయనగర్, సాగర్‌పుర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి అరవింద్కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. అయితే మంత్రుల జోక్యాన్ని గురించి బస్సీ కూడా లెఫ్ట్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం ఇప్పట్లో వీలుకాదని కేజ్రీవాల్‌కు బస్సీ స్పష్టం చేశారు. మాల వీయనగర్లో మంత్రి చట్టాన్ని ఉల్లంఘించారని, పోలీసు అధికారి నిబంధనల ప్రకారం ప్రవర్తించారని ముఖ్యమంత్రికి బస్సీ వివరించినట్లు సమాచా రం. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశం గురిం చిన వివరాలను విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా మిడియా ముందుంచారు. మూడు అంశాలతో తాము లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిశామని మొదటి డానిష్మహిళపై అత్యాచారం కేసు కాగా రెండవది సాగర్పుర్లో మహిళను అత్తిం టివారు కాల్చిన కేసు అని మూడవది ఖిడ్కీ ఎక్స్టెన్షన్లో మంత్రి సోమ్‌నాథ్ భారతీ సూచనమేరకు పోలీసు లు దాడి జరపడానికి నిరాకరించిన విషయమని ఆయన చెప్పారు. ముగ్గురు ఎస్హెచ్ఓలతో పాటు ఏసీపీని సస్పెండ్ చేయాలని తాము లెప్టినెంట్ గవర్నర్‌ను డిమాండ్ చేసినట్లు ఆయన చెప్పారు. దీనిపై లెప్టినెంట్ గవర్నర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారని ఆయన చెప్పారు. అయితే పోలీస్ కమిషనర్ స్సీ పోలీసు అధికారులను సస్పెండ్ చేయడం కుదరదని చెప్పారని సిసోడియా చెప్పారు. దర్యాప్తు ముగి సేంతవరకు పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని ఆయనడిమాండ్ చేశారు. మం త్రులు కోరిన వెంటనే ఘటనాస్థలం లో నింది తులుగా పేర్కొంటున్న వారిని అరెస్టు చేయ డం వీలుకాదని, అందుకు సెర్చ్ వారంట్ కావాలని ఢిల్లీ పోలీసులు చేసిన వాదనను ఆయనను తోసిపుచ్చారు. ఆ తర్వాత 48 గంటల్లో కూడా పోలీ సులు ఏ చర్య చేపట్టలేదని ఆయన ఆరోపించా రు. తమది ‘విజిలెంటజమ్’ అని ఆరోపిస్తున్నారని కానీతమది విభిన్నమైన ప్రభుత్వమని ఆయన మంత్రుల చర్యలను సమర్థించుకున్నారు. పోలీసులు తమకింద ఉన్నా లేకపోయినా ఏదైనా తప్పు జరిగితే తాము చూస్తూ కూర్చోబోమని ఆయన చెప్పారు. ‘ఇది షీలాదీక్షిత్ ప్రభుత్వం కాదు.. పోలీ సులు మాకు రిపో ర్టు చేయనట్లయితే మేము నిస్సహాయులం అని చెప్పబోము.. ఢిల్లీ వాసులకు ఏం కావాలో అది చేసితీరుతాం.. పోలీసు లు దారికి రానట్లయితే మేము వారిని చక్కదిద్దుతామని..’ సిసోడియా తెలిపారు. పోలీసు ప్రతి నిధుల్లా ప్రవర్తించరాదని ఆయన మీడియాను కోరారు. ఈ వ్యాఖ్యపై మీడి యా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశంలో గందరగోళం నెల కొంది. ఉన్నతస్థాయి విచారణకు ఎల్జీ ఆదేశం రెండు రోజులుగా ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, పోలీస్ శాఖ మధ్య రగులుతున్న వివాదంపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ శుక్రవారం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. న్యాయశాఖ మంత్రిని బర్తరఫ్చేయాలి: బీజేపీ న్యూఢిల్లీ: రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను బీజేపీ నేత హర్షవర్ధన్ శుక్రవారం డిమాండ్ చేశారు. సామూహిక అత్యాచారానికి గురైన డానిష్ యువతి పేరును మంత్రి భారతి బయటపెట్టడం అనుచితచర్య అని విమర్శించారు. -
సోమనాథ్ రాజీనామా చెయ్యాలి
న్యూఢిల్లీ: న్యాయ శాఖ మంత్రి సోమనాథ్ భారతి రాజీనామా చెయ్యాలని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) డిమాండ్ చేసింది. గతేడాది భారతి వాదించిన ఓ కేసులో సాక్ష్యాన్ని లేకుండా చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపించింది. బీజేపీ నాయకుడు అర్తి మెహ్రా ఆధ్వర్యంలో అనేక మంది బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ సెక్రటేరియట్ ముందు బుధవారం ఆందోళనకు దిగారు. భారతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సాక్ష్యాన్ని లేకుండా చేశారని ఆరోపణలు వచ్చాయి. కోర్టే ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు అలాంటి వ్యక్తి న్యాయశాఖ మంత్రిలో కొనసాగాల్సిన అవసరం లేద’ని మాజీ మేయర్ మెహ్రా అన్నారు. ఇది చాలా పెద్ద విషయమని, భారతిని తప్పించాలంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి కోరతామని తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పవన్ కుమార్ అనే వ్యక్తి తరఫున గతేడాది ఆగస్టులో వాదించిన భారతిని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ మందలించిందని మీడియాలో మంగళవారం కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.కేజ్రీవాల్‌పై విమర్శలు న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతిని సమర్థించిన సీఎం కేజ్రీవాల్‌పై ఢిల్లీ బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ విమర్శలు దాడి పెంచారు. అవినీతి కేసులో సోమనాథ్ భారతి సాక్ష్యాన్ని లేకుండా చేశారని సంకేతాలు ఇచ్చిన ప్రత్యేక సీబీఐ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తాననడంపై మండిపడ్డారు. భారతిని కేజ్రీవాల్ వెనకేసుకరావడం షాక్‌కు గురి చేసింది. వెంటనే అయన్ని మంత్రి పదవి నుంచి తప్పించాలని గోయల్ డిమాండ్ చేశారు. భారతిని వెనుకేసుకొచ్చి కేజ్రీవాల్ తమ పార్టీ నాయకులు చట్టాన్ని కన్నా ఎక్కువ అనే ప్రాధాన్యతను ఇస్తున్నట్టు కనబడుతోందని మండిపడ్డారు. ఒకవేళ కోర్టు తీర్పుతో అంగీకరించకపోతే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నారు. అయితే భారతిని వెనకేసుక రావడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు. అవినీతిని నిర్మూలిస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆరోపణలు వచ్చిన మంత్రిపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్, ఆప్‌ల మధ్య అంతర్గత మైత్రి ఉందని ఎన్నోసార్లు చెప్పామని, అది ఎన్నికల తర్వాత రుజువైందన్నారు. ఇప్పటికీ అవినీతి చేసిన కాంగ్రెస్ నాయకులెవ్వరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే వారి లోపాయికారి ఒప్పందాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు. ఆప్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. -
రెండు నెలల్లో మార్పు తెస్తాం
న్యూఢిల్లీ: రెండేరెండు నెలల కాలంలో పూర్తిగా పాలనా వ్యవస్థనే మరమ్మతు చేస్తామని ఆప్ పార్టీ నేత సోమనాథ్భారతి ప్రకటించారు. ఆప్ పార్టీ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఈయన ఒకరు. విద్యుత్ చార్జీలను సగానికి సగం తగ్గిస్తాం. ఇది ఆప్ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాల్లో ముఖ్యమైనదని ప్రకటించారు. ‘‘మొత్తం పాలన వ్యవస్థనే మరమ్మతు చేయాల్సి ఉంది. పాలనాధికారం చేపట్టిన రెండు నెలల్లోనే ప్రజలు ఈ మార్పును స్పష్టంగా చూస్తారు’’ అని ఒకనాటి న్యాయవాది నేటి శాసనసభ్యుడు వక్కానించారు. మాలవ్యానగర్ శాసనసభ స్థానం నుంచి గెలుపొందిన సోమనాథ్ భారతి బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడం మా పార్టీ నాయకుల ఎజెండాలో ప్రథమ ప్రాధాన్యంగా ఉంటుంది. నగరంలో ఉన్న మూడు విద్యుత్ పంపిణీ సంస్థ కార్యకలాపాలను మదింపు చేయాలని కాగ్‌కు సిఫార్సు చేయనున్నాం’’ అని స్పష్టం చేశారు. ‘‘నగరంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రతి రోజూ 700 లీటర్ల ఉచిత మంచినీరు పంపిణీ చేస్తాం. ఇది మేము ప్రజలకిచ్చిన మరో ముఖ్యమైన హామీ. నగరానికి రోజుకు 1,100 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం. అధికారికంగా 50 మిలియన్ గ్యాలన్ల లోటు ఉంది. 2011 జనభాగణన ప్రకారం నగరంలో 17 నుంచి 18 మిలియన్ల మంది ప్రజలకు శుద్ధి చేసిన నీరు లభించడం లేదు. మరిన్ని జలవనరులను సృష్టిస్తాము. దీని ద్వారా నీటి కొరత తీరుస్తాం’’ అన్నారు. మేము చేసిన 18 వాగ్ధానాల అమలులో సాధకబాధకాలను అధ్యయనం చేస్తున్నాము. వీటిని వీలయినంత త్వరలో అమలు చేస్తాం. ప్రభుత్వ పథకాల అమలులో కాంగ్రెస్ హయంలో చోటు చేసుకున్న లొసుగులు, లోటుపాట్లను పరిశీలిస్తున్నాం. తొలి రెండువారాలు కాంగ్రెస్ పని విధానం ఎలా సాగిందో అర్థం చేసుకోవాడానికి కేటాయిస్తాం. వ్యవస్థలో కలుపు మొక్కల్లా వెళ్లూనుకున్న అవినీతిని ఏరి పారేయాల్సి ఉంది. నియమబద్ధంగా పనిచేసే నీతిమంతులైన అధికారులను ప్రొత్సహిస్తాం’’ అని వివరించిన భారతి ఈ సందర్బంగా హర్యానాకు చెందిన అశోక్ కెమ్కా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన దుర్గాశక్తి నాగ్‌పాల్‌లను గుర్తుచేశారు. ‘‘ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పథకాల రూపశిల్పులు. వాటిని మేము అమలు చేస్తాం, సంరక్షిస్తాం. ప్రతి అధికారిని కనిపెట్టి ఉంటాం. అవినీతికి పాల్పడేవారు ఏస్థాయిలో ఉన్నా వారిని తొలిగించి ప్రక్షాళన చేస్తాం.అవినీతి పరులైన మంత్రుల ఒత్తిడికి నీతినిజాయితీతో పనిచేసే అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చేస్తాం’’ అని స్పష్టం చేశారు బీహార్‌లో పుట్టి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకొని 1992 నుంచి ఢిల్లీలో నివాసం ఉంటున్న సోమనాథ్ భారతి. మేము అవినీతిపై పోరు ప్రకటించి ఎన్నికల్లో గెలిచాం. మా నిజాయితిని నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పుడు మేము అవినీతిని నిర్మూలించకపోతే ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుంది’’ అని ముగించాడి ఐఐటీ సైన్స్ గ్రాడ్యుయేట్