రెండో రోజు పాదయాత్రలో ఆప్ నేతలు
ముషీరాబాద్ (హైదరాబాద్): ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పని చేస్తోందని దక్షిణ భారత ఇన్‌చార్జి సోమ్‌నాథ్ భార్తి అన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వ విధా నాలు అన్నివర్గాల వారిని ఆకర్షిస్తున్నందునే దేశం మొత్తం ఆప్ వైపు చూస్తోందని అభిప్రాయపడ్డారు. ఆప్ తెలంగాణ విభాగం చేపట్టిన పాదయాత్ర రెండో రోజు శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఉదయం 11 గంటలకు ముషీరాబాద్‌లోని అశోక్‌నగర్ క్రాస్‌రోడ్ నుంచి మొదలైన యాత్ర 10 కి.మీ. సాగినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇందిరాశోభన్ తెలిపారు. రూ.200 కోట్లతో జీహెచ్‌ఎంసీ నిర్మించిన టాయిలెట్స్ కొరగాకుండా పోయాయని, స్థానిక సమస్యలను పట్టించుకునే నాథుడేలేడని ఆరోపించారు. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్న ప్రభుత్వం ఆ తర్వాత ప్రజలను గాలికొదిలేసిందని విమర్శించారు. భవిష్యత్‌లో ప్రజల పక్షాన పోరాటం చేయటానికి ఆప్ సిద్ధంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment