అమ్ ఆద్మీ పార్టీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిండ్ కేజ్రీవాల్, రాష్ట్రం ప్రభుత్వం ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని నిర్ణయం తీసుకుంటే.. బీజేపీకి ఆప్ మధ్య తేడా ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ రెండు పార్టీల మధ్య ఏమాత్రం తేడా ఉండదని అన్నారు.
ఢిల్లీలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించడానికి రానున్న రోజుల్లో సుమారు 2,600 ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యపై స్పందించిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సదరు మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ తమను తాము గొప్పగా ఊహించుకుంటోందని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న హిందుత్వ రాగాన్ని ఆప్ అమలు చేస్తోందని మండిడ్డారు.
ఆప్‌లో కొంత మంది నేతలు తాము సరయు నదికి వెళ్లుతామని అంటారు. మరికొందరు సుందరకాండ పఠనం పాఠశాలల్లో, ఆస్పత్రిలో అమలు చేయాలని వ్యాఖ్యాస్తారు. ఇలా చేస్తూ ఆప్ పార్టీ నరేంద్రమోదీ అడుగుజాడల్లో నడుస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఏదైతే చేయాలనుకుంటారో మీరు (ఆప్) అదే చేస్తారని అన్నారు. ఇలా చేస్తూ వెళ్లితే.. మీకు(ఆప్), బీజేపీకి తేడా ఏం ఉందని ఓవైసీ సూటిగా నిలదీశారు.
చదవండి: ‘ఇండియా కూటమి చరిత్రక గెలుపు నమోదు చేస్తుంది’
Comments
Please login to add a commentAdd a comment