విచారణలో సోమనాథ్ భారతి కన్నీళ్లు | Former Delhi law minister Somnath Bharti broke down during questioning | Sakshi
Sakshi News home page

విచారణలో సోమనాథ్ భారతి కన్నీళ్లు

Published Thu, Oct 1 2015 1:40 PM | Last Updated on Sun, Sep 3 2017 10:18 AM

విచారణలో సోమనాథ్ భారతి కన్నీళ్లు

విచారణలో సోమనాథ్ భారతి కన్నీళ్లు

న్యూఢిల్లీ: పోలీసుల విచారణలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సోమనాథ్ భారతి కన్నీరు పెట్టుకున్నారు. కేసు విచారణ నిమిత్తం పోలీసుల వేసిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఏడ్చేశారు. తనపై గృహహింసకు పాల్పడ్డారని, హత్చేసేందుకు కూడా ప్రయత్నించారని సోమనాథ్ భారతి భార్య లిపికా మిత్ర కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చాలాసార్లు తప్పించుకోవాలని ప్రయత్నించి చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసులకు లొంగిపోయారు.

విచారిస్తున్న సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని విచారణ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయనపై ఐపీసీ సెక్షన్ 212 (అపరాధికి  ఆశ్రయం ఇవ్వడం)  కింద కూడా కేసు నమోదు చేశామని, మరో ఐదుగురిని కూడా నిందితులుగా చేర్చామని చెప్పారు. ఇన్ని రోజులు ఎక్కడెక్కడకు వెళ్లారో, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారో అనే వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఆయన ఏయే ప్రాంతాల్లో ఆశ్రయం పొందారో ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి విచారణ జరపాల్సి ఉందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement