Former Delhi law minister
-
విచారణలో సోమనాథ్ భారతి కన్నీళ్లు
న్యూఢిల్లీ: పోలీసుల విచారణలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సోమనాథ్ భారతి కన్నీరు పెట్టుకున్నారు. కేసు విచారణ నిమిత్తం పోలీసుల వేసిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఏడ్చేశారు. తనపై గృహహింసకు పాల్పడ్డారని, హత్చేసేందుకు కూడా ప్రయత్నించారని సోమనాథ్ భారతి భార్య లిపికా మిత్ర కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చాలాసార్లు తప్పించుకోవాలని ప్రయత్నించి చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలీసులకు లొంగిపోయారు. విచారిస్తున్న సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని విచారణ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆయనపై ఐపీసీ సెక్షన్ 212 (అపరాధికి ఆశ్రయం ఇవ్వడం) కింద కూడా కేసు నమోదు చేశామని, మరో ఐదుగురిని కూడా నిందితులుగా చేర్చామని చెప్పారు. ఇన్ని రోజులు ఎక్కడెక్కడకు వెళ్లారో, ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారో అనే వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఆయన ఏయే ప్రాంతాల్లో ఆశ్రయం పొందారో ఆ ప్రాంతాలకు తీసుకెళ్లి విచారణ జరపాల్సి ఉందని చెప్పారు. -
మళ్లీ బెయిల్ దాఖలు చేయనున్న తోమర్
న్యూఢిల్లీ: నకిలీ సర్టిఫికెట్ల కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించారు. కాగా తోమర్ నాలుగు రోజుల రిమాండ్ ముగియడంతో మళ్ళీ తాజాగా బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు సెషన్స్ కోర్టు జడ్జి అంగీకరించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తనను అరెస్టు చేయడంపై సెషన్స్ కోర్టులో సవాల్ చేసిన ఆయన, తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని వాదిస్తూ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు.అయితే బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను రద్దు చేసిన కోర్టు, తదుపరి విచారణను జూన్ 16 కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తోమర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఫేక్ డిగ్రీ కలిగి ఉన్నారనే ఆరోపణలను మంత్రి అంగీకరించినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఇద్దరు ఏ జెంట్ల ద్వారా బీఎస్సీ, లా డిగ్రీ సర్టిఫికెట్లను కొనుగోలు చేసానని తోమర్ అంగీకరించినట్టు సమాచారం. -
ఆప్ మాజీ మంత్రి తోమర్ కు బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్టయిన ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ కి నిరాశే మిగిలింది. తోమర్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ కోర్టు గురువారం తిరస్కరించింది. తన అరెస్టు అక్రమమని ఆరోపిస్తూ, బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను రద్దు చేసిన కోర్టు, తదుపరి విచారణను జూన్ 16 కి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా తనను అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తనను అరెస్టు చేయడంపై ఆయన సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. అయితే, దానిని బుధవారం పరిశీలించేందుకు నిరాకరించిన సెషన్స్ జడ్జి ఇవాళ్టకు వాయిదా వేశారు. తప్పుడు సర్టిఫికెట్లతో నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారని పోలీసులు తోమర్ ను మంగళవారం అదుపులోకి తీసుకోగా, మేజిస్ట్రేట్ కోర్టు నాలుగురోజుల కస్టడీ కూడా విధించిన విషయం తెలిసిందే. -
'నా అరెస్టు చట్ట విరుద్ధం'
న్యూఢిల్లీ: ఫేక్ డిగ్రీ కలిగి ఉన్నారని పోలీసులు తనను అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తనను అరెస్టు చేయడంపై సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. అయితే, దానిని బుధవారం పరిశీలించేందుకు నిరాకరించిన సెషన్స్ జడ్జి గురువారానికి వాయిదా వేశారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని, అరెస్టుకు ముందు కనీస పద్ధతులు కూడా పోలీసులు పాటించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతోపాటు ఈ కేసుకు సంబంధించి బెయిల్ కూడా కోరారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఫేక్ డిగ్రీ కలిగి ఉన్నారని పోలీసులు తోమర్ ను మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మేజిస్ట్రేట్ కోర్టు నాలుగురోజుల కస్టడీ కూడా విధించింది.