మళ్లీ బెయిల్ దాఖలు చేయనున్న తోమర్
న్యూఢిల్లీ: నకిలీ సర్టిఫికెట్ల కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించారు. కాగా తోమర్ నాలుగు రోజుల రిమాండ్ ముగియడంతో మళ్ళీ తాజాగా బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు సెషన్స్ కోర్టు జడ్జి అంగీకరించారు.
ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తనను అరెస్టు చేయడంపై సెషన్స్ కోర్టులో సవాల్ చేసిన ఆయన, తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని వాదిస్తూ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు.అయితే బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను రద్దు చేసిన కోర్టు, తదుపరి విచారణను జూన్ 16 కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తోమర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఫేక్ డిగ్రీ కలిగి ఉన్నారనే ఆరోపణలను మంత్రి అంగీకరించినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఇద్దరు ఏ జెంట్ల ద్వారా బీఎస్సీ, లా డిగ్రీ సర్టిఫికెట్లను కొనుగోలు చేసానని తోమర్ అంగీకరించినట్టు సమాచారం.