Jitender Singh Tomar
-
నకిలీ డిగ్రీ కేసులో తోమర్‌కు బెయిల్ మంజూరు
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ న్యాయశాఖ మాజీమంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌కు ఢిల్లీ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. నకిలీ డిగ్రీ కేసులో ఆయన గతంలో అరెస్టయిన విషయం తెలిసిందే.రూ. 50 వేల వ్యక్తిగత బాండు, అంతే మొత్తానికి ష్యూరిటీ ఇచ్చే షరతుల మీద అదనపు సెషన్స్ జడ్జి విమల్ కుమార్ యాదవ్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఢిల్లీ వదిలి వెళ్లకూడదని, అలాగే అవసరమైనప్పుడల్లా విచారణకు హాజరు కావాలని కోర్టు తోమర్‌కు సూచించింది. ఫోర్జరీ, మోసం, నేరపూరిత కుట్ర నేరాల కింద తోమర్‌ను జూన్ 9న అరెస్టు చేశారు. ఈనెల 20వ తేదీ వరకు ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. కేసులో విచారణ పూర్తయింది కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా బెయిల్ మంజూరైంది. -
మళ్లీ బెయిల్ దాఖలు చేయనున్న తోమర్
న్యూఢిల్లీ: నకిలీ సర్టిఫికెట్ల కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించారు. కాగా తోమర్ నాలుగు రోజుల రిమాండ్ ముగియడంతో మళ్ళీ తాజాగా బెయిల్ పిటిషన్ వేసుకునేందుకు సెషన్స్ కోర్టు జడ్జి అంగీకరించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తనను అరెస్టు చేయడంపై సెషన్స్ కోర్టులో సవాల్ చేసిన ఆయన, తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని వాదిస్తూ బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు.అయితే బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను రద్దు చేసిన కోర్టు, తదుపరి విచారణను జూన్ 16 కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తోమర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఫేక్ డిగ్రీ కలిగి ఉన్నారనే ఆరోపణలను మంత్రి అంగీకరించినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఇద్దరు ఏ జెంట్ల ద్వారా బీఎస్సీ, లా డిగ్రీ సర్టిఫికెట్లను కొనుగోలు చేసానని తోమర్ అంగీకరించినట్టు సమాచారం. -
జంగ్‌తో కేజ్రీవాల్ భేటీ
అధికారాల విషయంలో పరస్పర సహకారంపై చర్చ * కొత్త న్యాయశాఖ మంత్రిగా కపిల్ మిశ్రా * పోలీస్ కస్టడీలో తోమర్ విచారణ ప్రారంభం న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీ అధికార వ్యవస్థలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో బుధవారం భేటీ అయ్యారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల ఆరోపణలతో అరెస్టయిన జితేందర్‌సింగ్ తోమర్ మంత్రిపదవికి రాజీనామా చేయటంతో ఆయన స్థానంలో ఢిల్లీ జలబోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే కపిల్ మిశ్రాను న్యాయ మంత్రిని చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్‌కు సమాచారమిచ్చారు. ఇద్దరూ పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఉన్న మార్గాలపై ఎల్జీ, కేజ్రీవాల్ చర్చించినట్లు సమాచారం. కేజ్రీవాల్‌తో తాను సమావేశమయ్యానని తనకు న్యాయశాఖ అప్పగించనున్నట్లు తెలిపారని కపిల్ మిశ్రా తెలిపారు. మిశ్రా నియామకానికి సంబంధించి గవర్నర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, కేజ్రీవాల్ బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ భేటీ అయ్యారు. ఢిల్లీ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఫైజాబాద్‌కు తోమర్..: సోమవారం తమ కస్టడీలోకి తీసుకున్న మాజీ మంత్రి తోమర్‌ను నకిలీ సర్టిఫికెట్ విచారణలో భాగంగా పోలీసులు ఫైజాబాద్ తీసుకెళ్లారు. ఇది కేవలం తోమర్ సర్టిఫికెట్ వ్యవహారమే కాదని, దీని వెనుక అతి పెద్ద నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల రాకెట్ ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. ఫైజాబాద్‌లోని అవధ్ వర్సిటీకి తోమర్‌ను అధికారులు తీసుకెళ్లారని, ఆయన సాయంతో అక్కడ కేసు ఆధారాలను సేకరిస్తారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. తోమర్ తమ నుంచి ఎలాంటి డిగ్రీ పొందలేదని అవధ్ వర్సటీ ఓ ఆర్టీఐ దరఖాస్తుకిచ్చిన జవాబులో తెలిపింది. ఒక రాష్ట్రం.. ఇద్దరు హోం సెక్రటరీలు ఒకే కార్యాలయం.. ఒకే పదవి.. అధికారులు మాత్రం ఇద్దరు.. ఇద్దరూ విధులు నిర్వర్తించారు. మరి సిబ్బంది ఎవరి మాట వినాలి? ఒకరేమో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆమోదమున్న అధికారి. మరొకరేమో సాక్షాత్తూ సీఎం నియమించిన అధికారి.. ఢిల్లీలో ఈ సంకటం నెలకొంది. ఢిల్లీ హోం శాఖలో కార్యదర్శి పదవిలో ఇద్దరు అధికారులు ఒకేసారి విధులు నిర్వర్తించారు. అవినీతి నిరోధక శాఖ ఉన్నతాధికారి నియామకం నేపథ్యంలో ఎల్జీ ఆదేశాలను పాటించిన ఢిల్లీ హోం కార్యదర్శి ధరమ్‌పాల్‌ను ఆప్ సర్కారు బదిలీ చేసి మరో అధికారి రాజేంద్ర కుమార్‌ను ఆ పదవిలో నియమించింది. అయితే పాల్ బదిలీ చెల్లదని.. ఎల్జీ చెప్పటంతో.. బుధవారం ఇద్దరు అధికారులూ తానే హోం కార్యదర్శినంటూ విధులు నిర్వర్తించారు -
'తోమర్ కు న్యాయ పట్టా ఇవ్వలేదు'
భాగల్పూర్: ఫోర్జరీ, నకిలీ డిగ్రీ కేసులో అరెస్టైన ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ కు న్యాయ పట్టా ఇవ్వలేదని బిహార్‌లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టుకు అఫిడవిట్ సమర్పించినట్టు తిల్కా మాంఝీ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్ఎస్ దూబే తెలిపారు. తమ వర్సిటీ సిబ్బంది సహకారంతో తోమర్ నకిలీ పట్టా పొందినట్టు ఎక్కడా వెల్లడి కాలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో వివరాలు కోసం ఢిల్లీ పోలీసులు వస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. కోర్టు ఆదేశిస్తే తోమర్ ను తిల్కా మాంఝీ వర్సిటీకి తీసుకెళతామని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపిన నేపథ్యంలో వైస్ ఛాన్సలర్ స్పందించారు. వర్సిటీ ఉద్యోగుల సహయం లేకుండానే తోమర్ నకిలీ పట్టా తయారుచేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
'నా అరెస్టు చట్ట విరుద్ధం'
న్యూఢిల్లీ: ఫేక్ డిగ్రీ కలిగి ఉన్నారని పోలీసులు తనను అరెస్టు చేయడాన్ని తప్పుబడుతూ ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా తనను అరెస్టు చేయడంపై సెషన్స్ కోర్టులో సవాల్ చేశారు. అయితే, దానిని బుధవారం పరిశీలించేందుకు నిరాకరించిన సెషన్స్ జడ్జి గురువారానికి వాయిదా వేశారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని, అరెస్టుకు ముందు కనీస పద్ధతులు కూడా పోలీసులు పాటించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతోపాటు ఈ కేసుకు సంబంధించి బెయిల్ కూడా కోరారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఫేక్ డిగ్రీ కలిగి ఉన్నారని పోలీసులు తోమర్ ను మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మేజిస్ట్రేట్ కోర్టు నాలుగురోజుల కస్టడీ కూడా విధించింది. -
న్యాయశాఖ మంత్రి డిగ్రీ పత్రాలు నకిలీవే
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్రసింగ్ తోమర్ ఇక్కట్లు పెరుగుతున్నాయి. ఆయన డిగ్రీ పత్రాలు నకిలీవని ఢిల్లీ బార్ కౌన్సిల్ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై కేసు నమోదు చేసే విషయాన్ని కూడా బార్ కౌన్సిల్ యోచిస్తోంది. జితే ంద్ర సింగ్ తోమర్ పత్రాలు నకిలీవని దక్షిణ ఢిల్లీ డీసీపీకి ఫిర్యాదుచేసింది. తోమర్ సమర్పించిన డిగ్రీ పత్రాలు నకిలీవని ఢిల్లీ బార్ కౌన్సిల్ కార్యదర్శి జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాంమనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ నుంచి పొందిన డిగ్రీ పట్టా నకిలీదిగా యూనివర్సిటీ తేల్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బిహార్‌లోని తిల్కా మాంఝీ యూనివర్సిటీ నుంచి రిజిష్టర్ నంబర్ 3687 తో పొందినట్లు ఎల్ఎల్బీ పట్టా నకిలీదని సంబంధిత యూనివర్సిటీ తేల్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపించవలసిందిగా బార్ కౌన్సిల్ ఢిల్లీ పోలీసులను కోరింది. తోమర్ 2011లో బార్‌కౌన్సిల్ సభ్యత్వం కోసం ధరఖాస్తు చేసి అదే సంవత్సరం సభ్యత్వం పొందారు. న్యాయమంత్రిని అరెస్టు చేయాలి: బీజేపీ నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంలో న్యాయమంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌ను అరెస్టు చేయాలని బీజేపీ బుధవారం డిమాండ్ చేసింది. ఢిల్లీ బార్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు మంత్రిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు.. ఆప్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గే పోలీసులు ఇంతవరకూ తోమర్‌ను అరెస్టు చేయలేదని విమర్శించారు. గ త 12 రోజులుగా ఈ విషయమై బీజేపీ ప్రశ్నిస్తున్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. పోలీసులు ఎవరి ఒత్తిడికీ తలొగ్గి పని చేయరాదన్నారు. ఢిల్లీని పాలిస్తున్న నకిలీ ప్రభుత్వం, దాని నకిలీ మంత్రుల నిజ స్వరూపాలు బయట పడాల్సి ఉందని ఉపాధ్యాయ అన్నారు. -
ఆప్‌కు ‘నకిలీ’ సంకటం
సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ లా డిగ్రీ ఉపయోగిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ వ్యవహారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఇబ్బందికరంగా మారింది. ఆయనను మంత్రిమండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద బీజేపీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఆప్‌పై వ్యతిరేక నినాదాలు రాసినప్లకార్డులను ధరించి బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ నేతృత్వం వహించారు. తప్పు చేస్తూ పట్టుబడిన ఏ వ్యక్తినైనా పార్టీనుంచి తొలగిస్తామని ప్రకటించిన కేజ్రీవాల్ ఇప్పుడు తోమర్‌ను ఎందుకు తొలగించడం లేదని ఉపాధ్యాయ ప్రశ్నించారు. ఢిల్లీ సర్కార్ ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. నకిలీ డిగ్రీ కలిగిన వ్యక్తి రాష్ట్ర మంత్రి మండలిలో కొనసాగుతున్నందువల్ల తమకు రోడ్లపైకి రావడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయిందన్నారు. తోమర్‌ను తొలగించేంతవరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇలాంటి అరాచకాలను తాము కొనసాగనివ్వబోమని హెచ్చరించారు. తమ పార్టీ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసే అంశాన్ని పరిశీలిస్తోందని వెల్లడించారు. అవినీతి విషయంలో కేజ్రీవాల్ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులను ఆయన అవినీతిపరులుగా చూస్తున్నారని మండిపడ్డారు. దక్షిణ ఎమ్సీడీకి చెందిన ఇంజనీరుపై దాడి చేసి తన విధులు నిర్వహించకుండా అడ్డుపడిన తిలక్‌నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ దాఖలైనపప్పటికీ సీఎం కేజ్రీవాల్ పట్టించుకోవడంలేదన్నారు. -
తోమర్‌ను తొలగించాల్సిందే
ప్రదర్శనలో కాంగ్రెస్ డిమాండ్ భూషన్ చెప్పినప్పటికీ టికెట్ ఇచ్చారు తెలిసి కూడా తోమర్‌ను మంత్రిని చేశారు సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు తనపై కుట్ర జరుగుతోంది: తోమర్ సాక్షి, న్యూఢిల్లీ: నకిలీ ‘లా’ డిగ్రీ పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జితేందర్ సింగ్ తోమర్‌ను మంత్రి మండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రదర్శన నిర్వహించింది. తోమర్ డిగ్రీ నకిలీదని ప్రశాంత్ భూషణ్ తదితర నేతలు కేజ్రీవాల్‌కు తెలిపినప్పటికీ ఆయనకు టికెట్ ఇవ్వడమేకాక మంత్రిని చేశారని డీపీసీసీ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ఆరోపించారు. దీనిపై కేజ్రీవాల్ నైతిక బాధ్యత వహించి గురువారం నాటికి తోమర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే ఢిల్లీ సచివాలయం ఎదుట భారీ ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. తోమర్ శాసనసభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలన్నారు. ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జ్ పీసీ చాకో మాట్లాడుతూ.. ఇది ఢిల్లీ సర్కారు సిగ్గుపడవలసిన విషయమన్నారు. సీఎం కేజ్రీవాల్ వెంటనే తోమర్‌ను మంత్రిపదవి నుంచి తొలగించారలని డిమాండ్ చేశారు. నకిలీ డిగ్రీ ఉపయోగించడం నేరమని తెలిసి కూడా అలాంటి నేరానికి పాల్పడిన తోమర్‌కు జైలు శిక్ష పడుతుందని న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షీ లేఖీ వ్యాఖ్యానించారు. తమది నైతికత కలిగిన పార్టీగా చెప్పుకునే ఆప్ నకిలీ డిగ్రీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని మంత్రి పదవిలో ఎలా కొనసాగిస్తోందని ప్రశ్నించారు. వివాదంపై మంత్రి తోమర్ స్పందిస్తూ.. తనైపై, తమ పార్టీపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అన్ని విషయాలు త్వరలోనే తేటతెల్లమవుతాయని వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సంఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తోమర్‌ను సంజాయిషీ కోరారు. విపక్షాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా కేజ్రీవాల్ మాత్రం తోమర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించే యోచనలో ఉన్నట్లు కనిపించలేదు. -
న్యాయశాఖ మంత్రివి నకిలీ సర్టిఫికెట్లే!
-
న్యాయశాఖ మంత్రివి నకిలీ సర్టిఫికెట్లే!
న్యూఢిల్లీ: ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ విద్యార్హత సర్టిఫికెట్లన్నీ నకిలీవేనని యూనివర్సిటీ స్పష్టం చేసింది. బీహార్‌లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ యూనివర్సిటీలో తాను చదివినట్లు మంత్రి తోమర్ సర్టిఫికెట్ చూపించగా.. అది నకిలీదని పేర్కొంటూ సదరు యూనివర్సిటీ తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇరకాటంలో పడ్డారు. మంత్రి జితేందర్ సింగ్ తోమర్ విద్యార్హతల్ని ప్రశ్నిస్తూ , రికార్డుల్లో ఆయన పేర్కొన్న లా సర్టిఫికెట్ నకిలీదిగా పేర్కొంటూ.. దీనిపై ఆగస్టు 20వ తేదీలోగా దీనిపై సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. తమ యూనివర్సిటీ రికార్డుల్లో ఆయన పేరు లేదని, ఆ సీరియల్ నెంబరుతో వేరే వ్యక్తి పేరు నమోదై ఉందని తేల్చిచెప్పింది. దీంతో ప్రతిపక్షాలకు తాయిలం దొరికినట్టయింది. న్యాయశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఆప్ బహిష్కృత నేతలు కూడా మండిపడుతున్నారు. తక్షణమే న్యాయశాఖ మంత్రిని తొలగించకపోతే ఢిల్లీ సెక్రటేరియట్ ముందు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ప్రశాంత్ భూషణ్ తదితరులు హెచ్చరించారు. అలాంటి వ్యక్తిని న్యాయశాఖమంత్రిగా కొనసాగించడంపై ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ తప్పు బట్టింది. ప్రతిపక్షాల ఆరోపణలపై ఆప్ స్పందించింది. ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిందిగా కేజ్రీవాల్ కూడా మంత్రి తోమర్‌ను ఆదేశించారు. తనపై వచ్చిన ఆరోపణలు తోమర్ తోసిపుచ్చారు. తన సర్టిఫికెట్ వందశాతం నిజమైనదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. కాగా ఆప్ ప్రభుత్వంలో వివాదంలో ఇరుక్కున్న న్యాయశాఖ మంత్రుల్లో జితేంద్ర తోమర్ రెండోవారు. నైజీరియన్ మహిళ వివాదంలో సోమనాథ్ భారతి చిక్కుకున్న సంగతి తెలిసిందే.