'ఆ మంత్రి భార్యను రెండుసార్లు చంపాలనుకున్నాడు' | AAP MLA Somnath Bharti tried to kill his wife twice, police tells Delhi HC | Sakshi
Sakshi News home page

'ఆ మంత్రి భార్యను రెండుసార్లు చంపాలనుకున్నాడు'

Published Fri, Sep 18 2015 10:00 AM | Last Updated on Mon, Oct 22 2018 8:54 PM

'ఆ మంత్రి భార్యను రెండుసార్లు చంపాలనుకున్నాడు' - Sakshi

'ఆ మంత్రి భార్యను రెండుసార్లు చంపాలనుకున్నాడు'

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమనాథ భారతి మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయన తన భార్యను రెండు సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే గృహహింసతోపాటు, హత్య చేసేందుకు కూడా తన భర్త ప్రయత్నించారని పోలీసులకు సోమనాథ భారతిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు పురోగతిని  కోర్టుకు వివరించారు.

మొట్టమొదటి హత్య యత్నం ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిందని, రెండోసారి ఆమె మణికట్టును చీల్చి చంపేయత్నం చేశారని కోర్టుకు పోలీసులు తెలిపారు. అయితే కోర్టు మాత్రం గురువారం కూడా సోమనాథను అరెస్టు చేసేందుకు పోలీసులకు అనుమతి ఇవ్వలేదు. మరోపక్క, ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని కూడా వెలువరించలేదు. ఇక కోర్టుకు హాజరైన భార్య లిపిక ఆయన తన కుక్క డాన్తో దాడి చేయించాడని తెలిపింది. తన నగలు ఆయన వద్దే ఉన్నాయని వాటిని తనకు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement