
సోమ్‌నాథ్ ముందస్తు బెయిల్‌కు కోర్టు నో
న్యూఢిల్లీ: గృహహింస కేసులో ఆప్ నేత, ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఎఫ్‌ఐఆరే దాఖలు కాలేదని, అలాంటప్పుడు అరెస్టుకు అవకాశం లేదని అదనపు సెషన్స్ న్యాయమూర్తి పరంజిత్ సింగ్ స్పష్టంచేశారు.
తర్వాత సోమ్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇద్దరు చిన్నారులతో ముడిపడిన వ్యవహారం కాబట్టి మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాల్సిందిగా కోర్టు సూచిస్తుందని భావించా’ అని పేర్కొన్నారు. గత ఐదేళ్ల నుంచి సోమ్‌నాథ్ తనను శారీరక, మానసిక హింసకు గురిచేస్తున్నారంటూ ఆయన భార్య లిపికా భారతి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.