
అమరావతి: సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టైన వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు వర్రా రవీంద్రారెడ్డి శనివారం బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. మడకశిరలో వర్రా రవీంద్రా రెడ్డిపై నమోదైన కేసులో బెయిల్ వచ్చింది. దీంతో వర్రాపై నమోదైన 26 కేసుల్లోనూ వర్రాకు బెయిల్ మంజూరైనట్లయ్యింది. దీంతో వర్రా రవీంద్రా రెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు.
సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్‌సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసింది. వర్రా రవీంద్రారెడ్డిని గత నవంబర్ లో అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. ఇలా రవీంద్రారెడ్డిపై 26 కేసులు నమోదు చేశారు. మొత్తం అన్ని కేసుల్లో ఇప్పటికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు వర్రా రవీంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment