varra ravindra reddy
-
వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి అరెస్ట్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సంబంధం లేని వ్యక్తులను కూడా నిందితులుగా చేరుస్తూ అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా పులివెందుల(Pulivendula)లో కడప ఎంపీ వైఎ అవినాష్‌రెడ్డి(YS Avinash Reddy) పీఏ రాఘవరెడ్డి(PA Raghava Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్రా రవీంద్రారెడ్డి కేసులో తనకు సంబంధం లేదంటున్నా రాఘవరెడ్డిని నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేశారు.వర్రా రవీంద్రారెడ్డి కేసులో నిందుతుల జాబితాకు అంతే లేకుండా పోయింది. ఇప్పటికే 112 మందికి పైగా నిందితులను చేర్చగా.. తాజాగా ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పులివెందుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బండి రాఘవరెడ్డిని నిందితునిగా చేర్చారు.దీంతో రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టు ఆయనకు నేడు బెయిల్ నిరాకరించడంతో పోలీసులు వెంటనే అతని ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకుని పులివెందుల అర్బన్ పీఎస్‌కు తరలించారు. ఇప్పటికే పలు దఫాలుగా రాఘవరెడ్డిని పులివెందుల డిఎస్పీ విచారణ చేశారు.ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. సర్వం లాస్!ముందస్తు బెయిల్ అంశం కోర్టులో పెండింగులో ఉన్నప్పుడు ఆయన పోలీసులు పిలిచినప్పుడల్లా విచారణకు హాజరయ్యారు. కోర్టు చెప్పిన మేరకు విచారణకు సహకరించారు. అయినా పోలీసులు బెయిల్ పిటిషన్ రద్దు కాగానే వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వాస్తవంగా వర్రా రవీంద్రారెడ్డి కేసుకు తనకు సబంధం లేదని రాఘవరెడ్డి పలుమార్లు చెప్తున్నారు. అయితే వర్రా రవీంద్రారెడ్డి పెట్టే పోస్టులకు కంటెంట్ రాఘవరెడ్డే ఇస్తున్నాడంటూ కేసు నమోదు చేశారు.వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన వాగ్మూలంలో ఈ వివరాలు చెప్పారని పోలీసులు అంటుండగా.. వర్రా రవీంద్రారెడ్డి తనను చిత్రహింసలకు గురిచేసి తనతో తప్పుడు వాగ్మూలం రాయించుకున్నారని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి అరెస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో వైపు ఈ కేసులో నిందితుల జాబితా ఎంతవరకూ పెంచుకుంటూ పోతారో అర్థం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. -
వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులకు చుక్కెదురు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులపై కడప కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 రోజులు కస్టడీ కోరితే రెండు రోజులు మాత్రమే కోర్టు సమయం ఇచ్చింది. దీంతో రెండు రోజులు చాలవంటూ, తీర్పు మార్చాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. పోలీసులపై సీరియస్ అయిన జడ్జి.. తీర్పు మార్చేది లేదన్నారు. కావాలంటే హైకోర్టుకు వెళ్లండంటూ సీరియస్ అయ్యారు. కాగా.. రేపు, ఎల్లుండి మాత్రమే పోలీసులకు సమయం ఉంది. వర్రాను విశాఖ జైలు నుంచి తీసుకువచ్చి, తిరిగి దింపేందుకే రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి.. ఆయన కుటుంబాన్ని సైతం నడిరోడ్డుకు లాగింది. అదుపులోకి తీసుకోవడం దగ్గరి నుంచి జడ్జి ముందు హాజరపర్చడం దాకా అంతా గోప్యత, హైడ్రామాను నడిపించారు పోలీసులు. గత నెలలో అర్ధరాత్రి దాటాక వర్రా రవీంద్రారెడ్డిని కడప 2వ ఏడీజేఏం ఎదుట హాజరుపరిచిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొన్నారు. -
వర్రా రవీంద్రారెడ్డిపై కొనసాగుతున్న వేధింపులు
-
‘మూడో వ్యక్తి కంప్లయింట్ చేస్తే కేసు పెడతారా?’
అమరావతి, సాక్షి: ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది అసలు విచారణ అర్హత లేని కేసంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన.ఈ కేసులకు అసలు విచారణ అర్హత లేదు. ఎవరు పైన అయితే పోస్ట్ పెట్టారో వాళ్లు కంప్లైంట్ చేయలేదు. ఎవరో మూడో వ్యక్తి కంప్లైంట్ చేస్తే కేసు నమోదు చేశారు. ఈ పోస్టులపై ఐటీ సెక్షన్స్ బదులుగా.. పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. ఇది ఆర్గనైజర్ క్రైమ్ అని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముమ్మాటికి ఇది అలాంటి నేరమేం కాదు అని పొన్నవోలు వాదించారు.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. తదుపరి విచారణను వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిదాకా అప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దన్న ఆదేశాలను పొడిగిస్తున్నట్లు తెలిపింది.ఇక.. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై విచారణను వచ్చే నెల మూడో తేదీకి వాయిదా వేసింది కోర్టు. మరోవైపు.. బాపట్ల కోర్టులో వర్రా రవీందర్ రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. ‘ఏ కేసులో మిమ్మల్ని అరెస్టు చేశారో తెలుసా?’’ అని రవీందర్ రెడ్డిని మేజిస్ట్రేట్ ప్రశ్నించారు. అయితే.. కేసుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు తనకు ఇవ్వలేదని రవీందర్‌రెడ్డి చెప్పారు. దీంతో.. పోలీసులను న్యాయమూర్తి మందలించారు. అలాగే.. వర్రాకు వచ్చే నెల 13వ తేదీదాకా రిమాండ్ విధించారు.