సాక్షి, వైఎస్సార్ జిల్లా: వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులపై కడప కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 రోజులు కస్టడీ కోరితే రెండు రోజులు మాత్రమే కోర్టు సమయం ఇచ్చింది. దీంతో రెండు రోజులు చాలవంటూ, తీర్పు మార్చాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. పోలీసులపై సీరియస్ అయిన జడ్జి.. తీర్పు మార్చేది లేదన్నారు. కావాలంటే హైకోర్టుకు వెళ్లండంటూ సీరియస్ అయ్యారు. కాగా.. రేపు, ఎల్లుండి మాత్రమే పోలీసులకు సమయం ఉంది. వర్రాను విశాఖ జైలు నుంచి తీసుకువచ్చి, తిరిగి దింపేందుకే రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.
సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్‌సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి.. ఆయన కుటుంబాన్ని సైతం నడిరోడ్డుకు లాగింది. అదుపులోకి తీసుకోవడం దగ్గరి నుంచి జడ్జి ముందు హాజరపర్చడం దాకా అంతా గోప్యత, హైడ్రామాను నడిపించారు పోలీసులు. గత నెలలో అర్ధరాత్రి దాటాక వర్రా రవీంద్రారెడ్డిని కడప 2వ ఏడీజేఏం ఎదుట హాజరుపరిచిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment