'డాన్, నేను ఏ తప్పూ చేయలేదు' | Don is Innocent, Have Tapes to Prove it, Says Somnath Bharti | Sakshi

'డాన్, నేను ఏ తప్పూ చేయలేదు'

Published Fri, Sep 18 2015 8:42 AM | Last Updated on Mon, Oct 22 2018 8:54 PM

'డాన్, నేను ఏ తప్పూ చేయలేదు' - Sakshi

'డాన్, నేను ఏ తప్పూ చేయలేదు'

'డాన్కు ఏమి తెలియదు. డాన్ ఏ నేరం చేయలేదు. ఇంట్లో వాళ్లను ఎక్కడైనా పెంపుడు జంతువులు హత్య చేస్తాయా' అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: 'డాన్కు ఏమి తెలియదు. డాన్ ఏ నేరం చేయలేదు. ఇంట్లో వాళ్లను ఎక్కడైనా పెంపుడు జంతువులు హత్య చేస్తాయా' అని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ప్రశ్నించారు. ఇంతకీ డాన్ అంటే ఏమిటని అనుకుంటున్నారా..? అది సోమనాథ భారతి పెంపుడు కుక్క పేరు. ప్రస్తుతం సోమనాథ భారతిపై ఆయన భార్య లిపికా మిత్రా తనపై హత్యా ప్రయత్నం చేశారని, గృహహింసకు పాల్పడ్డారని కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక దర్యాప్తు ప్రస్తుతం ఈ డాన్ చుట్టే తిరుగుతుంది.

ఎందుకంటే లిపికా మిత్రా ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో తన బాస్(సోమనాథ భారతి) ఆదేశాలను పాటించి డాన్ దాడి చేసిందని, మీదపడి కరిచిందని, ముఖ్యంగా తన కడుపుపై తీవ్రగాయాలు చేసిందని, మరికొన్ని చోట్ల కూడా దారుణంగా దాడి చేసి చంపేయత్నం చేసిందని పోలీసులకు వివరించింది. దీనికి సంబంధించిన వీడియో టేపులు కూడా ఉన్నట్లు ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసును భిన్న కోణాల్లో విచారిస్తున్నారు. అయితే, ఆ వీడియో టేపులను కావాలనే సోమనాథ భారతి మాయం చేసినట్లు కూడా ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ కోర్టులో అరెస్టు నుంచి ఉపశమనం పొందిన ఆయన విచారణ కోసం ఇటీవల తరచూ పోలీస్ స్టేషన్కు వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన పెంపుడు కుక్కను గురించి పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో తన జీపులోని వెనుక సీట్లో డాన్ను తీసుకొచ్చిన ఆయన దానిని మీడియాకు చూపిస్తూ 'పెంపుడు జంతువులు ఎక్కడైనా ఇంట్లో వాళ్లను హత్య చేస్తాయా.. డాన్ కరుస్తాడా? చూడండి అంటూ ప్రశ్నించారు. డాన్గానీ, తాను గానీ ఏ తప్పూ చేయలేదని నిజంగా కావాలంటే తన వద్ద టేపుల ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. బెయిల్ పిటిషన్ కోసం ఆ ఆడియో టేపులను కూడా జత చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement