ఆప్ మాజీ మంత్రిపై కేసు నమోదు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమ్నాధ్ భారతీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భార్యపట్ల ఆయన గృహహింసకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆప్ కొత్త ప్రభుత్వంలో న్యాయశాఖమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సోమ్ నాథ్పై ఆయన భార్య లిపికా అనతి కాలంలోనే గృహహింస ఆరోపణలు చేశారు.
దీంతో అప్పటి నుంచి పోలీసులు ఇరువురిని కూర్చొబెట్టే మాట్లాడే ప్రయత్నం చేశారు. మధ్యవర్తిత్వం నిర్వర్తించినా ఫలితం లేకపోవడంతో చివరికి ఆయనపై కేసునమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు సెక్షన్లను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పలు సెఈ విషయంలో ఆయన గతంలో ముందస్తు బెయిల్కోసం కోర్టుకు వెళ్లినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదుకానిదే బెయిల్ కోరడం, బెయిలివ్వడం తొందరపాటు చర్య అవుతుందని కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.