ఢిల్లీ: ఆప్ పార్టీ ఆఫీసు ఖాళీ చేసే గడువును సుప్రీం కోర్టు పొడిగించింది. సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ఖాళీ చేసే గడువును అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 10 వరకు పొడగిస్తున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ పార్టీ ఆఫీసు జూన్ 15 లోగా ఖాళీ చేయాల్సి ఉండగా.. ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
కాగా.. ఆప్ కార్యాలయం ఉన్న భూమిని ఢిల్లీ హైకోర్టుకు కేటాయించినట్లు మార్చిలో సుప్రీం కోర్టు పేర్కొంది. మరోవైపు అన్ని రాజకీయ పార్టీ మాదిరిగా దేశ రాజధాని ఢిల్లీలో ఆప్‌కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆశించింది. ఈ విషయంపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్రానికి హైకోర్టు సూచించింది.
జూన్ 15న ఆప్ ప్రస్తుత ఆఫీసును ఖాళీ చేయాల్సి ఉండగా వీలైనంత త్వరగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్క్‌లోని మంత్రిత్వ శాఖల వద్ద కొంత భాగాన్ని తాత్కాలిక ఆఫీసు కోసం కేటాయించాలని ఆప్ హైకోర్టును కోరింది.
Comments
Please login to add a commentAdd a comment