'మా ఆయనపై చర్యలు తీసుకోండి' | I want action against my husband, expected Kejriwal to act: Somnath Bharti's wife | Sakshi
Sakshi News home page

'మా ఆయనపై చర్యలు తీసుకోండి'

Published Mon, Jun 15 2015 6:02 PM | Last Updated on Mon, Oct 22 2018 8:54 PM

'మా ఆయనపై చర్యలు తీసుకోండి' - Sakshi

'మా ఆయనపై చర్యలు తీసుకోండి'

న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమనాథ్ భారతిపై చర్యలు తీసుకోవాలని ఆయన భార్య మిత్ర కోరారు. సోమ్నాథ్ తనను హింసించినట్టు వీడియో ఆధారాలున్నాయని మిత్ర వెల్లడించారు.

సోమనాథ్ భారతిపై ఆయన భార్య గృహహింస కేసు పెట్టిన సంగతి తెలిసిందే.  ఢిల్లీ మహిళా కమిషన్ను మిత్ర ఆశ్రయించడంతో, సోమనాథ్ భారతికి సమన్లు జారీ చేశారు. సోమవారం మిత్ర మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి తన భర్తపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా, ఐదేళ్లుగా తన భార్యకు దూరంగా నివసిస్తున్నానని సోమనాథ్ భారతి చెప్పారు. కాగా సోమనాథ్ రాత్రి పూట మాత్రమే తన ఇంటికి వచ్చేవారని, ఈ విషయం ఇరుగుపొరుగు వారికి తెలుసని మిత్ర వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement