మా ఎమ్మెల్యే లొంగిపోవాల్సిందే | Somnath should surrender, says arvind kejriwal | Sakshi
Sakshi News home page

మా ఎమ్మెల్యే లొంగిపోవాల్సిందే

Published Wed, Sep 23 2015 8:48 AM | Last Updated on Wed, Apr 4 2018 7:02 PM

మా ఎమ్మెల్యే లొంగిపోవాల్సిందే - Sakshi

మా ఎమ్మెల్యే లొంగిపోవాల్సిందే

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి పోలీసులకు లొంగిపోవాల్సిందేనని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన ఎందుకు పారిపోతున్నారని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. జైలుకు వెళ్లడానికి ఆయన ఎందుకంత భయపడిపోతున్నారని అడిగారు. ఇప్పుడు సోమనాథ్ భారతి ఇటు పార్టీతో పాటు అటు ఆయన కుటుంబానికి కూడా తలనొప్పిగా మారారంటూ చిరాకు పడ్డారు. పోలీసులతో ఆయన సహకరించాలని కేజ్రీవాల్ తెలిపారు.

నకిలీ న్యాయపట్టాతో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన జితేందర్ సింగ్ తోమర్ వ్యవహారంతోనే సగం తలనొప్పి వచ్చిన కేజ్రీవాల్కు.. తాజాగా సోమనాథ్ భారతి విషయం మరింత చిరాగ్గా మారింది. ఆయన తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ సోమనాథ్ భార్య లిపికా మిత్రా ఆరోపించడం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement