ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ సైకిళ్లపై బంపరాఫర్ ప్రకటించింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్‌ను కంట్రోల్ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు దారులకు సబ్సీడీ అందించనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం వచ్చే వారమే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..గత ఏప్రిల్ నెలలో అరవింద్ కేజ్రివాల్ ఎలక్ట్రిక్ సైకిళ్లపై సబ్సీడీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వం ఢిల్లీలో నివాసం ఉండే కొనుగోలు దారులకు ఎలక్ట్రిక్ సైకిల్ పై రూ.15వేల వరకు సబ్సీడీ ఇవ్వనుంది.
తొలి 10వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు దారులకు రూ.5,500 వరకు ప్రోత్సాహాకాల్ని (ఇన్‌సెన్‌టీవ్స్) అందిస్తుంది. తొలి వెయ‍్యిలోపు వెహికల్స్‌కు రూ.2వేలు, తొలి 5వేల లోపు ఈ కార్గో సైకిల్ కొనుగోలు దారులకు రూ.15వేల లోపు ప్రోత్సాహాకాల్ని అందించనుంది. ఈకార్గో సైకిల్‌తో ఫుడ్ డెలివరీతో పాటు ఇతర కమర్షియల్ వర్క్స్ కోసం ఉపయోగించుకోవచ్చు.
ఈ సైకిల్స్ ఎలా ఉంటాయంటే!
ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను తొక్కేందుకు పెడల్ సౌకర్య ఉంటుంది. ఛార్జింగ్ అయిపోతే పెట్టుకునేందుకు బ్యాటరీలు ఉంటాయి. అంతేకాదు ఈ సైకిల్స్‌తో ఎంటర్ టైన్మెంట్‌తో పాటు కమ్యూనికేటింగ్ సదుపాయం కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment