'గంటగంటకు ఆయన ఫోన్లు మారుస్తున్నారు' | somanath bharti in agra? | Sakshi
Sakshi News home page

'గంటగంటకు ఆయన ఫోన్లు మారుస్తున్నారు'

Published Thu, Sep 24 2015 5:38 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM

'గంటగంటకు ఆయన ఫోన్లు మారుస్తున్నారు' - Sakshi

'గంటగంటకు ఆయన ఫోన్లు మారుస్తున్నారు'

న్యూఢిల్లీ: భార్యపై గృహహింసకు పాల్పడటమే కాకుండా హత్యయత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమనాథ భారతీ గంటగంటకు తాను ఉండే చోటును, ఫోన్లను మారుస్తున్నట్లు తెలిసింది. ఒక కరడుగట్టిన నేరస్తుడిలా సోమనాథ ప్రవర్తిస్తున్నాడని పోలీసులు అన్నారు. ఎంత తప్పించుకు తిరుగుతున్నా ప్రస్తుతం ఆయన ఉన్న చోటు విషయంలో తమకు ఒక అవగాహన ఉందని, ఆగ్రా ప్రాంతంలో సోమనాథ ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు.

'సోమనాథ ఎక్కడ దాక్కున్నారో మాకు ఒక అవగాహన ఉంది. మేం త్వరలోనే ఆయనను చేరుకుంటాం. విచారణంలో భాగస్వామ్యం చేస్తాం' అని సీనియర్ పోలీసు అధికారి దీపేందర్ పాఠక్ చెప్పారు. తనను చిత్ర హింసలకు గురిచేయడమే కాకుండా హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారని సోమనాథ భారతీపై ఆయన భార్య లిపికా మిత్రా కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా పోలీసులను ఆదేశించాలని ఆయన స్ధానిక, హైకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement